భాషపై పట్టు.. భవిష్యత్తుకు మెట్టు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతోపాటు పలు భాషలపై పట్టు ఉండటం అవసరం. ఏదైనా భాష (ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్, జపనీస్ మొదలైనవి)లో అనర్గళంగా మాట్లాడటం అంత సులువైన పనేమీ కాదు. అందుకోసం భాషపై పట్టు సాధించేందుకు నిపుణ సూచనలు..
రీడింగ్
-చాలామంది విద్యార్థులు భాషను నేర్చుకునే క్రమంలో కొద్దిరోజులకే పరిమితమవుతారు. రీడింగ్ హ్యాబిట్ నిరంతరం కొనసాగినప్పుడే భాషను సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ప్రతిరోజు గంట సమయం కేటాయించుకుని చదువుతుండాలి. లాంగ్వేజ్‌లోని ఏదైనా ఒక టాపిక్‌ను తీసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చదవకుండా అదే టాపిక్‌ను పదే పదే చదువుతుండాలి.
-రీడింగ్‌లో లౌడ్ (బయటకు పెద్దగా) రీడింగ్ అనేది చాలా ముఖ్యం. లౌడ్ రీడింగ్ చేయడం వల్ల చదివిన అంశాలు కూడా బాగా గుర్తుంటాయి. పలు సర్వే సంస్థలు రిసెర్చ్ చేసి మరి ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
-న్యూస్‌పేపర్, టెక్ట్స్‌బుక్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఏదైనా సరే అర్థం చేసుకుంటూ చదవాలి. తెలియని పదాలను అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించాలి.
-ఏదైనా భాషలోని ఓ టాపిక్‌ను చదివినప్పుడు, దాన్ని ఇతరులకు వివరించాలి. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా సొంత పదాలతో వివరించాలి.
-రీడింగ్‌లో భాగంగా ఉచ్ఛారణను సాధన చేయాలి. వొకాబులరీతో పాటు సంబంధిత సబ్జెక్టు గ్రామర్‌ను తెలుసుకుంటూ చదువుతుండాలి. స్పీడ్ రీడింగ్ చేయకుండా నెమ్మదిగా చదువుతూ పదాలపై దృష్టి సారించాలి.
-చదువుతున్న క్రమంలో లోతుగా వెళ్లాలనే నియమం లేదు. కాకపోతే తెలియని పదాలను షార్ట్ వేలో అర్థం చేసుకోవాలి. దీంతోపాటు స్పెల్లింగ్‌పై ఫోకస్ చేయాలి.
-లాంగ్వేజ్‌లో మీకు ఇష్టమైన టాపిక్‌ను ఎంచుకొని చదవడం వల్ల త్వరగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
స్పీకింగ్
-కొత్త భాష మాట్లాడే క్రమంలో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి. అలా అని మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే భాషపై ఎప్పటికీ పట్టు సాధించలేరు. మాట్లాడుతున్నప్పటికీ చేసిన తప్పులు చేయకుండా ఉండాలి. స్పీకింగ్‌లో పర్ఫెక్షన్ కంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ముఖ్యం.
-సమయం కుదిరినప్పుడల్లా, వీలైనంతవరకు ఎక్కువగా లాంగ్వేజ్‌లోనే ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల భాష క్రమంగా మెరుగుపడుతూ సులువుగా మాట్లాడగలుగుతారు.
-చాలామంది విద్యార్థులకు గ్రామర్‌పై పట్టున్నా మాట్లాడలేరు. దీనికి కారణం ఇతరులతో కమ్యూనికేట్ కాకపోవడమే.
-భాష నేర్చుకునే క్రమంలో బెస్ట్ స్పీకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి.
-ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఉచ్ఛరిస్తున్నాడో పరిశీలిస్తుండాలి.
-ఒక్కమాటలో చెప్పాలంటే బెస్ట్ స్పీకర్స్‌ను ఇమిటేట్ చేయడం వల్ల సులువుగా భాషపై పట్టు సాధించవచ్చు.
-అయితే మాట్లాడాలని ఉత్సాహం ఉన్నా సరైన సపోర్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మీకు సరైన పార్ట్నర్ను వెతికి పట్టుకొని రెగ్యులర్‌గా వారితో మాట్లాడుతుండాలి.
-స్పీకింగ్‌లో భాగంగా కన్వర్జేషన్ రికార్డ్ చేసుకుని వింటుండాలి. దీనివల్ల మనం చేసిన తప్పులేంటో తెలుస్తాయి.
-ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో ఆ లాంగ్వేజ్‌లోనే సినిమాలు చూడటం ద్వారా కూడా సులువుగా భాష నేర్చుకోగలుగుతారు.
లిజనింగ్
-మాట్లాడటం, రాయడంతోనే భాషపై పట్టు సాధించలేం. వినడం ద్వారా కూడా ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువగా వింటే అంత ఎఫెక్టివ్‌గా మాట్లాడగలం.
-ఎంచుకున్న లాంగ్వేజ్‌ను ఆసక్తిగా వినాలి. దీనికోసం ప్రతిరోజు గంట సమయం కేటాయించుకోవాలి.
-లాంగ్వేజ్‌లో ఇష్టమైన టాపిక్స్‌ను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో వింటుండాలి. ఒక్కోసారి నిర్ణీత సమయంలో వినడానికి కుదరకపోవచ్చు. సబ్జెక్టును డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి సమయం కుదిరినప్పుడల్లా వినడానికి ప్రయత్నించాలి. విన్న తర్వాత అదే టాపిక్‌ను బయటకు చదువుతూ ఇమిటేట్ చేస్తుండాలి.
-లిజనింగ్ ప్రక్రియలో భాగంగా సినిమాలు, టీవీ సిరీస్‌లు బాగా ఉపయోగపడతాయి. కమ్యూనికేట్ కావడానికి బెస్ట్ సోర్స్ ఇవి. ఏ లాంగ్వేజ్‌ను ఇష్టపడుతున్నారో, ఆ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్‌ను చూసి, వినడం వల్ల పర్ఫెక్షన్ వస్తుంది.
-ఎంచుకున్న లాంగ్వేజ్‌ను కొన్ని అకడమిక్ బుక్స్ కూడా బట్టి ఆడియో రూపంలో లభిస్తుంటాయి. ఇవి వినడం వల్ల కూడా భాషపై పట్టు సాధించవచ్చు.
-ఏదైనా సమావేశాలకు, సెమినార్లకు హాజరైనప్పుడు ప్రముఖుల ప్రసంగాలను నిశితంగా వినాలి. వారు ఏవిధంగా మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండాలి.
-మొక్కుబడిగా వినకుండా రిలాక్స్‌గా వింటూ లాంగ్వేజ్‌పై ఫోకస్ చేయాలి.
రైటింగ్
-భాషపై పట్టు సాధించడానికి మరో ముఖ్యమైన స్టెప్ రైటింగ్. అయితే చాలామంది విద్యార్థులు రైటింగ్ కంటే రీడింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. రైటింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కఠిన పదాలు తెలుసుకోవడంతోపాటు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి.
-చదువుతున్న క్రమంలో తెలియని పదాలు ఉన్నప్పుడు వాటిని నోట్ చేసుకొని చదవాలి. డిక్షనరీ సహాయంతో అర్థాలు తెలుసుకోవాలి.
-చదవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో, రాయడానికీ అంతే సమయం కేటాయిస్తూ ఉండాలి.
-ముందుగా నచ్చిన అంశాల (good Sentences)ను నోట్ చేసుకోవాలి. దీంతో గుడ్ రైటింగ్ స్కిల్స్ అలవడుతాయి.
-ఇతరులతో చర్చించిన అంశాలను రాయడానికి ప్రయత్నించాలి.
-చదివిన అంశాలను యథావిధిగా రాయకుండా మీ సొంత మాటల్లో, వాక్యాల్లో రాస్తే బాగుంటుంది.
-ఏదైనా టాపిక్‌ను రాయాలనుకున్నప్పుడు బేసిక్ పాయింట్స్‌పై దృష్టి సారించాలి.
-రాయడానికి ఇబ్బందులు పడుతున్నట్లు అనిపిస్తే రైటింగ్ వర్క్‌షాప్‌లో జాయిన్ కావచ్చు. దీంతో రైటింగ్‌పై ఆసక్తి కలిగి ఎక్కువగా రాయగలుగుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు