Sacred Rivers Punjab | పవిత్ర నదుల పంజాబ్
భారతదేశ ధాన్యాగారం పంజాబ్. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు అని అర్థం. సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తుండటంతో దానికి పంజాబ్ అని పేరువచ్చింది. అయితే దేశ విభజనతో భారత్‌లోని పంజాబ్‌లో బియాస్, సట్లేజ్ నదులు, పాక్షికంగా రావి నది (భారత్-పాక్ సరిహద్దులో) ప్రవహిస్తున్నాయి. మిగిలినవి పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ సింధూనదిలో కలుస్తున్నాయి. పాకిస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ర్టాలు సరిహద్దులుగా ఉన్నాయి.
రాజధాని: చండీగఢ్
రాష్ట్ర అవతరణ: 1966, నవంబర్ 1
విస్తీర్ణం: 50,362 చ.కి.మీ.
విస్తీర్ణం పరంగా దేశంలో: 20వ స్థానం
జనాభా: 2,77,43,338
దేశ జనాభాలో పంజాబ్ స్థానం: 16
జిల్లాలు: 22
అక్షరాస్యత: 76.7 శాతం (1,89,88,611 మంది)
ప్రధాన వృత్తి: వ్యవసాయం
అధికార భాష: పంజాబీ
అతిపెద్ద పట్టణం: లూథియానా
గవర్నర్: వీపీ సింగ్ బడ్నోర్
ముఖ్యమంత్రి: ప్రకాశ్‌సింగ్ బాదల్
పార్లమెంట్ స్థానాలు: 13
అసెంబ్లీస్థానాలు: 117
హైకోర్టు: పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చండీగఢ్‌లో ఉంది.
అంతర్జాతీయ సరిహద్దు: వాఘా సరిహద్దు (పాకిస్థాన్)
ప్రత్యేకతలు
-హరితవిప్లవం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందింది.
-గోధుమ ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఉంది.
-మౌలికవసతుల కల్పనలో మొదటి స్థానంలో ఉంది.
-దేశంలోని స్టీల్ రోలింగ్ మిల్లులు ఎక్కువగా పంజాబ్‌లోనే ఉన్నాయి.
-దేశ విభజనతో పంజాబ్ ప్రావిన్స్ రెండు దేశాల్లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే మనదేశంలోని పంజాబ్‌ను భాష ఆధారంగా 1966లో మూడు భాగాలుగా విభజించారు. హర్యానీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాగా, పర్వత ప్రాంతాలు, పహరీ మాట్లాడే ప్రాంతాలను కలిపి హిమాచల్‌ప్రదేశ్‌గా, పంజాబీ మాట్లాడే ప్రాంతాన్ని పంజాబ్‌గా ఏర్పాటు చేశారు. ఇక్కడ సిక్కు మతస్తులు ఎక్కువగా ఉంటారు. రాష్ట్రం మొత్తం జనాభాలో వారు 57.69 శాతం ఉన్నారు.
జాతీయపార్కులు
-హరికె పఠాన్ వెట్‌ల్యాండ్ అండ్ బర్డ్ సాంక్చురి: ఇది ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద చిత్తడి నేలల్లో ఒకటి. దేశంలో అతిపెద్ద మంచినీటి చేపల మార్కెట్.
-ఝాజ్జర్ బచౌలీ వైల్డ్‌లైఫ్ సాంక్చురి: ఇది ఆనంద్‌పూర్ సాహిబ్‌కు సమీపంలో ఉంది. చిరుత, జాకాల్ వంటి జంతువులకు నిలయం.
-టాఖ్నీ-రెహ్మాపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురి: శివాలిక్ పర్వత శ్రేణుల్లో 382 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇది అలుగు, బార్కింగ్ డీర్, హాగ్ డీర్, ముంగీస వంటి జంతువులకు ప్రధాన నిలయం.
ముఖ్యమైన నదులు
సట్లేజ్: ఇది టిబెట్‌లోని కైలాస్ పర్వతాలకు సమీపంలోఉన్న రాక్షస్‌తాల్ సరస్సులో జన్మించింది. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో మొత్తం 1,500 కి.మీ. ప్రవహిస్తుంది.
బియాస్: హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో 470 కి.మీ. ప్రవహించి సట్లేజ్ నదిలో కలుస్తుంది.
రావి: ఇది భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రవహిస్తుంది. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో 720 కి.మీ. ప్రవహించి చీనాబ్ నదిలో కలుస్తుంది.
బరాజ్‌లు
రంజిత్ సాగర్ డ్యాం: ఇది పఠాన్‌కోట్ సమీపంలో రావి నదిపై ఉంది. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి దీని ప్రధాన ఉద్దేశం.
సిస్వాన్ డ్యాం: సిస్వాన్ ఖాద్ నదిపై ఖరార్ సమీపంలో ఉంది.
సరస్సులు: సుఖ్నా సరస్సు (చండీగఢ్), హరికే సరస్సు (ఫిరోజ్‌పూర్), కంజ్లీ సరస్సు (కపుర్తలా)
జానపద నృత్యాలు: భాంగ్రా, గిద్దా డ్యాన్స్, ఝుమ్మర్, ధంకారా డ్యాన్స్
ఆదిమ జాతులు: సిక్కు జాట్లు, ఖత్రి క్లాన్స్, అరోరా క్లాన్స్, రాజ్‌పుత్ క్లాన్స్
ప్రాంతీయ పండుగలు: లోహ్రీ (శీతాకాలం చివర్లో జరుపుకుంటారు), హోలా మొహల్లా (హోలీ పండుగ తరువాత రోజు దీన్ని నిర్వహిస్తారు), జోర్ మేళా (గురు గోవింద్ సింగ్ ఇద్దరు కుమారులకు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు).
పురాతన కట్టడాలు/దేవాలయాలు
గోల్డెన్ టెంపుల్: ఇది అమృత్‌సర్‌లో ఉంది. సిక్కు మతస్తుల పవిత్ర స్థలం.
ఫతేగర్ సాహిబ్ గురుద్వారా: దీన్ని 300 ఏండ్ల క్రితం సహోటాలో నిర్మించారు.
ఖిలా ముబారక్ ప్యాలెస్: ఇది పటియాలలో ఉంది. 1764లో మహారాజా అలా సింగ్ నిర్మించారు.
జలియన్ వాలా బాగ్: అమృత్‌సర్‌లో ఉంది.
వాఘా సరిహద్దు: బీఎస్ఎఫ్ , పాకిస్థాన్ రేంజర్లు నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌కు ప్రసిద్ధి. దీన్ని 1959 నుంచి ఇరుదేశాల సైనికులు ప్రతి రోజూ నిర్వహిస్తున్నారు.
జాతీయ రహదారులు: పంజాబ్గుండా మొత్తం 11 జాతీయ రహదారులు (ఎన్‌హెచ్-1, 1A, 10, 15, 20, 21, 22, 64, 70, 71, 95) వెళ్తున్నాయి. వాటి పొడవు 1553 కి.మీ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?