Get used to reading fast | వేగంగా చదవడం అలవర్చుకోండి!
కనుపాపలు కదులుతూ అదే సమయంలో పదాలు చదువుతూ విషయాన్ని గ్రహిస్తాయని అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. మన కనుపాపలు దేన్నయినా సరే నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అదేమిటో తెలుసుకోగలుగుతాయి. చదివేటప్పుడు కూడా ఒక పదం వద్ద సెకనులో వెయ్యోవంతు సేపయినా నిశ్చలంగా ఉంటేనే ఆ పదం ఏమిటో కళ్లు గ్రహించగలుగుతాయి.దీన్ని మార్చలేంకానీ, కళ్లు ఎంతసేపు నిశ్చలంగా ఉండాలనేది మాత్రం మనం నియంత్రించగలం.
పఠానాభిలాషను పెంచుకున్న తర్వాత వేగంగా చదవటం అలవర్చుకోవటం ద్వారా విద్యార్థులు ఎక్కువ కాలాన్ని ఆదా చేయగలుగుతారు. అయితే ఇలా వేగంగా చదివేయడం వల్ల అది తలకెక్కుతుందా? లేదా అని కొంతమందికి సంశయం ఉండవచ్చు. సరిగ్గా మైండ్‌ను ఫోకస్ చేసి ఏకాగ్రతతో చదివినట్లయితే వేగంగా చదువుతూ వేగంగా అర్థం చేసుకున్నది ఎలా గుర్తుంటుందో, స్లోగా చదువుతూ స్లోగా అర్థం చేసుకున్నది కూడా అలాగే గుర్తుంటుందని హేరీ బైలీ అంటాడు. మీరు ఇప్పుడు చదువుతూ ఉన్న వేగాన్ని రెట్టింపు చేసినా మీరు చదివిన విషయాన్ని గుర్తు పెట్టుకోవడంలో అది ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండబోదని ఆయన కనుగొన్నాడు. చదివిన విషయం ఎక్కువ కాలం పాటు గుర్తిండిపోవడానికి, అవసరమైనప్పుడు దాన్ని స్ఫురణకు తెచ్చుకోవడానికి గల కారణాలు, వాటి ప్రభావాలూ వేరు. దానికీ మీరు వేగంగా చదివారా? లేక స్లోగా చదివారా? అనేది ముఖ్యం కాదు. కాబట్టి వేగంగా చదవడం ప్రాక్టీస్ చేయడం ఎంతైనా సముచితం. దీని వల్ల మీ విజ్ఞాన సముపార్జన కాల వ్యవధి గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా మీరు తక్కువ సమయంలో ఎంతో ఎక్కువ నేర్చుకోగలుగుతారు.
మీ రీడింగ్ స్పీడ్ ఎంత..?
-ఒక సగటు చదువరి ఒక నిమిషానికి 200-300 పదాలు చదవగలుగుతాడు. బాగా నెమ్మదిగా చదివే వ్యక్తి 100-200 పదాలు మాత్రమే చదవగలడు. బాగా వేగంగా చదివే వ్యక్తి 400 పదాల దాకా చదువుతాడు. ఈ వైవిధ్యం ఎందుకు ఏర్పడుతుందంటే చదివే వ్యక్తి నేత్రాల కదలికలో ఉండే తేడాను బట్టి జరుగుతుంది. ఒక వాక్యం చదివేటప్పుడు కన్ను అనేకసార్లు పదాల మధ్య గెంతుతూ కదులుతుంది. పదాలను, పద సమూహాలను విడివిడిగా చదువుతూ, తిరిగి వాటిని కలుపుకుంటూ వాక్యంలోని తర్వాత ప్రదేశానికి కదలడం ద్వారా పఠన అనేది కొనసాగుతుంది. ఈ కనుల కదలిక అందరు వ్యక్తుల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఫాస్ట్‌గా చదివే వ్యక్తి కళ్లు మూడు, లేక నాలుగుసార్లు జంప్ చేస్తాయి. అయితే నెమ్మదిగా చదివే వ్యక్తికి ఈ సంఖ్య అధికం.
ప్రతి పదాన్ని విడిగా చదువుతూ అంతకుముందే చదివిన పదాలను తిరిగి చదువుతూ ముందుకు వెళ్లడం వల్ల అనేక సెకన్ల కాలం వృథా అవుతూ ఉంటుంది. మీ రీడింగ్ స్పీడ్ ఎంతో మీరు స్వయంగా పరీక్షించుకోవచ్చు. మీరు ఒక పారాగ్రాఫ్‌ను తీసుకోండి. దానిలో 250 పదాలు ఉండాలి. స్టాప్‌వాచ్ సహాయంతో మీ పఠనవేగాన్ని కొలుచుకోండి. 250 పదాలు చదవడానికి మీకు 20 సెకన్లలోపే పడితే మీరు మరీ వేగంగా చదివేసినట్టు లెక్క. మీరు 21 నుంచి 30 సెకన్లలోపు చదివినట్లయితే మీరు వేగంగా చదివే వ్యక్తిగా భావించవచ్చు. 31 నుంచి 45 సెకన్లు పడితే మీ పఠనవేగం సరాసరిగా ఉన్నట్లు లెక్క. 46-60 సెకన్లు టైం తీసుకున్నట్లయితే మీరు నెమ్మదిగా చదివే వ్యక్తిగా భావించాలి. 60 సెకన్ల కన్నా ఎక్కువ కాలాన్నే వెచ్చించినట్లయితే మీరు మరీ నత్తనడకలా చదువుతున్నట్లు తెలుసుకోవాలి. పాస్కల్ అనే మనోవైజ్ఞానికవేత్త ప్రకారం మీరు మరీ వేగంగా చదివినా, లేదా మరి స్లోగా చదివినా అందువల్ల మీకు ప్రయోజనమేమీ ఉండదు. మీరు చదివినదాంట్లోంచి మీరు అర్థం చేసుకునేది కూడా అట్టే ఉండదు. కాబట్టి మీరు ఫాస్ట్‌గా చదవటం అలవాటు చేసుకుంటే సత్ఫలితాలను పొందగలుగుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?