International organizations | అంతర్జాతీయ సంస్థలు
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్)
-రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పశ్చిమ యూరప్ భద్రతకు పెరుగుతున్న సోవియట్ యూనియన్ ప్రాబల్యంవల్ల ప్రమాదం ఏర్పడటంతో దీన్ని ఏర్పాటు చేశారు.
-1949, ఏప్రిల్ 4న నాటో ఒప్పందాన్ని బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ మొదలైన దేశాలు ఆమోదించగా 1949, ఆగస్టు 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందాన్ని అమలుపర్చేందుకుగాను 1949, సెప్టెంబర్‌లో నాటోను ఏర్పాటు చేశారు.
-సభ్య దేశాలు: బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, నార్వే, హంగేరి, ఐస్లాండ్, పోర్చుగల్, పోలెండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్పెయిన్, టర్కీ, యూకే, యూఎస్ఏ, బల్గేరియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రుమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, అల్జీరియా, క్రొయేషియా.
దీని ప్రధాన కార్యాలయం బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్‌లో ఉంది.
-ఇంటర్‌పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్)
-మొదటి అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ కాంగ్రెస్ సమావేశం మాంటేకార్లో (మొనాకో)లో 1914లో జరిగింది.
-ఈ సమావేశంలో బెల్జియానికి చెందిన ప్రిన్స్ ఆల్బర్ట్-1 ఇంటర్‌పోల్‌ను ఏర్పాటు చేయాలని మొదటగా ప్రతిపాదించాడు.
-ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ (ఐసీపీసీ)ని వియన్నాలో 1923లో 20 సభ్యదేశాలతో ప్రారంభమైంది. దీని సెక్రటేరియట్‌ను 1930లో వియన్నాలో ఏర్పాటు చేశారు.
-రెండో ప్రపంచ యుద్ధం తరువాత దీని ప్రధాన కార్యాలయాన్ని పారిస్‌కు మార్చారు. 1956లో జరిగిన 25వ సమావేశంలో ఐసీపీసీ ఐసీపీఓ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్)గా మారింది. దీన్ని సంకేతంగా ఇంటర్‌పోల్ అని పిలుస్తారు.
-దీనిలో 190 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం లయోన్స్ (ఫ్రాన్స్)లో ఉంది. దీని అధికార భాషలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్.
ఏయూ (ఆఫ్రికన్ యూనియన్)
-వలస పాలన నుంచి విముక్తి చెందిన దేశాలతో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికా యూనియన్ (ఓఏయూ) 1963లో ఏర్పడింది.
-రువాండా జాతుల పోరాటాలను, ఆఫ్రికాదేశాల అంతర్గత పోరాటాలను అరికట్టడంలో ఓఏయూ విఫలమైంది. దీంతో దీని స్థానంలో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2002, జూలై 9న ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) ఆవిర్భవించింది.
-దీనిలో 54 సభ్యదేశాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం అడిస్ అబాబా (ఇథియోపియా)లో ఉంది.
ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్)
-యుద్ధనేరాలపై విచారణ జరిపే శాశ్వత అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) 2002, జూలై 1న ఆవిర్భవించింది. మానవాళి పట్ల జరుగుతున్న యుద్ధనేరాలపై దేశాధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరిపై అయినా విచారణ జరిపే అధికారం దీనికి ఉంది.
-రెండో ప్రపంచ యుద్ధానంతరం అంతర్జాతీయ మిలిటరీ ట్రిబ్యునల్‌లోని మాజీ ఉన్నతాధికారులపై విచారణ జరుపుతున్న సమయంలో ఈ ఐసీసీ ఏర్పాటు ప్రతిపాదన తలెత్తింది. 1998 జూలైలో రోమ్‌లో ఐసీసీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై 139 దేశాలు సంతకం చేశాయి.
-2002 జూన్ నాటికి రోమ్ ఒప్పందాన్ని 66 దేశాలు ఆమోదించడంతో ఐసీసీ 2002 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2009, జనవరి 26న తొలిసారిగా నేర విచారణ ప్రారంభమైంది.
-దీనిలో 18 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీకాలం 3-9 ఏండ్ల వరకు ఉంటుంది. వీరిని అసెంబ్లీ ఆఫ్ స్టేట్ పార్టీస్ ఎన్నుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం ది హేగ్ (నెదర్లాండ్స్)లో ఉంది.
ఏఎస్ఈఏఎన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాన్ నేషన్స్)
-దీన్నే ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అంటారు. 1967లో బ్యాంకాక్‌లో జరిగిన సమావేశంలో ఆగ్నేయాసియా దేశాల సమావేశ డిక్లరేషన్‌పై ఆ దేశాలు సంతకాలు చేయడంతో ఏర్పడింది.
-ఆగ్నేయాసియాలోని కమ్యూనిస్టేతర దేశాల మధ్య ప్రాంతీయ సహకారం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇంతకుముందున్న ఏఎస్ఏ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా) స్థానంలో ఏర్పడింది.
-సభ్యదేశాలు: సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్, మయన్మార్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై. దీని ప్రధాన కార్యాలయం జకార్తా (ఇండోనేషియా)లో ఉంది. దీని అధికార భాష ఇంగ్లిష్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?