Self-employment | స్వయం ఉపాధికి దగ్గరి దారులు
ఆర్థిక కారణాల వల్లనో, మరే ఇతర సమస్య వల్లనో ఉన్నత చదువులకు నోచుకోక మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టినవారు చాలా మంది ఉంటారు. ఇలాంటివారు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే పారిశ్రామిక సంస్థలతో పాటు ఇతర రంగాల్లో ఈజీగా అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి పొందవచ్చు. స్వయం ఉపాధి కోర్సుల సమాచారం మీకోసం..
డీటీపీ (డెస్క్‌టాప్ పబ్లిషింగ్):
సెల్ఫ్ ఎంప్లాయిమెంట్కి బెస్ట్ ఆప్షన్ డీటీపీ వర్క్. సిస్టమ్ వర్క్ వచ్చినవారికి ఉపాధి అవకాశాలకు బాగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ ఆపరేటింగ్‌తో పాటు పేజ్మేకర్, ఫొటోషాప్, కోరల్డ్రా వంటి సాఫ్ట్వేర్లు నేర్చుకొని ఉంటే ఇందులో రాణించగలరు. బ్యానర్లు, పెండ్లి పత్రికలు, బుక్స్ తయారుచేయడం వంటి వాటితో సొంతంగా ఉపాధి పొందవచ్చు. ఈ వర్క్‌లో నైపుణ్యం సాధిస్తే నెలకు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు సంపాదించవచ్చు.
ఎంఎస్ ఆఫీస్:
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి ఎంఎస్ ఆఫీస్ తప్పనిసరి. టైపింగ్‌తో పాటు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఔట్లుక్ వంటివి నేర్చుకుంటే ఎంఎస్ ఆఫీస్ ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఆఫీస్ వ్యవహారాలన్నీ కంప్యూటర్‌తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఒక్క ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే సులభంగా ఉపాధి పొందవచ్చు. ఏదైనా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో ఆరు నెలలు శిక్షణ తీసుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోనే కాకుండా సొంతంగానూ ఇంటర్నెట్ షాపులు పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్గానూ వేలల్లో వేత నాలు పొందవచ్చు.
మొబైల్, ల్యాప్‌టాప్ సర్వీసింగ్:
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మొబైల్, ల్యాప్‌టాప్‌లు మానవజీవితంలో భాగమయ్యాయి. మొబైల్, ల్యాప్‌టాప్ ఉపయోగించే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్, ల్యాప్‌టాప్ సర్వీసింగ్ కోర్సులు చేసినవారికి డిమాండ్ ఉంది. వీటిపై పట్టు సాధించినట్లయితే ప్రైవేట్ కంపెనీల్లోనే కాకుండా సొంతంగానూ ఉపాధి పొందవచ్చు.
హార్డ్‌వేర్:
సాఫ్ట్‌వేరే కాకుండా హార్డ్వేర్కూ బాగానే డిమాండ్ ఉంది. ఏదైనా హార్డ్‌వేర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లలో లేదా రిపేరింగ్ షోరూంల్లో ఉపాధి పొందవచ్చు. పెద్ద పెద్ద కంపెనీల్లోనూ ఈ సెక్టార్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ఫారిన్ లాంగ్వేజెస్:
స్వయం ఉపాధికి బాగా డిమాండ్ ఉన్న కోర్సు ఇది. జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్‌తో పాటు ఇంగ్లిష్ కోర్సులు చేసినవారికి బాగా ఉపయోగపడుతుంది. పది, ఇంటర్ అర్హతతో ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో పూర్తిస్థాయిలో శిక్షణ పొందితే అవకాశాలను ఈజీగా పొందవచ్చు. టీచింగ్‌తో పాటు ట్రాన్స్లేటర్గానూ అకాశాలున్నాయి. కేవలం ట్రాన్స్‌లేటర్‌గా నెలకు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు సంపాదించవచ్చు.
ఫ్యాషన్ డిజైనింగ్:
క్రియేటివ్ ఫీల్డ్ ఇది. చదువుతో సంబంధం లేకుండా ఈ రంగంలో రాణించవచ్చు. వస్త్ర ప్రపంచంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, డిజైనింగ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవారికి ఈ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. మార్కెట్ అభిరుచులకనుగుణంగా కొత్త డ్రెస్సులను డిజైన్ చేయగలిగినవారు వేలల్లో సంపాదిస్తూ లైఫ్‌లో సెటిల్అయిపోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్‌లోనే కాకుండా టైలరింగ్, మగ్గం వర్క్ వచ్చినవారు కూడా ఆర్థికంగా ఎదగవచ్చు.
బ్యూటీషియన్
మేనిమూలల్లో దాగి ఉన్న అందాన్ని ఇనుమడింపజేసేవారు బ్యూటీషియన్లు. అందంగా ఉండాలని, పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. మహిళలతో పాటు పురుషులూ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో బ్యూటీషియన్లకు డిమాండ్ ఉంది. దీంతో బ్యూటీపార్లర్లకు ఆదరణ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకువస్తున్నాయి. నామమాత్రపు ఫీజులతో మూడు నెలల కోర్సు చేసినట్లయితే ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది.
నిరుద్యోగుల జీవితాల్లో జాగృతి వెలుగులు
చదువు మధ్యలో ఆపేసి నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నవారికి ప్రోత్సాహం కల్పించి చేయూతనందించాలనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో జాగృతి ప్రతినిధులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అనూహ్య స్పందన లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజనలో భాగంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులను అందిస్తుంది. పది, ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ ప్రవేశం కోరే అభ్యర్థులు 18 నుంచి 35 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పక్కన దోమలగూడలో ప్రధాన కార్యాలయం ఉంది. కార్యాలయ పని వేళల్లో కోర్సుల ప్రవేశం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వయం ఉపాధి
కోర్సులు
– డీటీపీ
– ఎంఎస్ ఆఫీస్
– ఫ్యాషన్ డిజైనింగ్
– ఫారిన్ లాంగ్వేజెస్
– హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్వేర్
– మొబైల్, ల్యాప్‌టాప్ సర్వీసింగ్
– బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం, బ్యాగ్‌ల తయారీ మొదలైనవి.
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు
– స్వామిరామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, పోచంపల్లి
-రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్
– అనూస్ బ్యూటీపార్లర్, సోమాజిగూడ, హైదరాబాద్
– సెట్విన్ శిక్షణ సంస్థలు, హైదరాబాద్
– ఇన్వలూట్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, బాలాపూర్
– డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, హైదరాబాద్
– బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్
– అర్హత : 8వ తరగతి నుంచి 10 తరగతి ఉత్తీర్ణత
– ఫీజుల వివరాలు : ఆయా సంస్థలను బట్టి ఫీజు ఉంటుంది.
– విద్యాసంస్థలు : ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఒకేషనల్ ఇంటర్ కళాశాలలు, సెట్విన్ సంస్థలు, ఇఫ్లూ, న్యాక్ హైదరాబాద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు
– తెలంగాణ ప్రభుత్వం అందించే స్కాలర్షిప్స్, వివిధ పారిశ్రామిక సంస్థలు అందించే స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి.
– ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అందించే కోర్సుల కోసం www.apbired.org/ ఈ వెబ్సైట్లో లభ్యమవుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?