Strong ideological spread | బలంగా భావజాల వ్యాప్తి
గ్రూప్-1 ప్రత్యేకం
సీమాంధ్ర లాబీకి తలొగ్గి తెలంగాణ ఉద్యమంపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవటంతో తెలంగాణలో ఉద్యమం మళ్లీ పెళ్లుబికింది. ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగానైనా అణచివేయటానికి కేంద్రం
విస్తృత సంప్రదింపుల కోసమంటూ శ్రీకృష్ణ కమిటీని వేసింది. ఈ చర్యవెనుక కుట్రను గ్రహించిన తెలంగాణవాదులు తీవ్ర నిరసన తెలిపారు.
కమిటీనే కాకుండా దాని విధివిధానాలను కూడా తిరస్కరించారు. ఈ సమయంలో ఉద్యమాన్ని జనంలోకి మరింత ఉధృతంగా తీసుకెళ్లేందుకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆలోచనలతో ఉద్యమకారులు అనేక కార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అధ్యయనం పేరుతో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని తెలంగాణ ప్రజాసంఘాల రాజకీయ ఐక్యకార్యచరణ సమితి విమర్శించింది. జేఏసీ అత్యవసర సమావేశాన్ని జరిపి కాలయాపనకే శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించినందున కమిటీని బహిష్కరించాలని, ప్రజాప్రతినిధులు రాజీనామాల ద్వారా రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చేది, తెచ్చేది తమ పార్టీయే అయినందున తమ పార్టీ ప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని భావించి కాంగ్రెస్ పార్టీ జేఏసీ నుంచి వైదొలగింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తేనే తాము కూడా రాజీనామాలు చేస్తామని టీడీపీ తిరకాసు పెట్టింది. అయితే టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం, ఆయన సమంక్షంలోనే తెలంగాణ న్యాయవాదులపై లాఠీచార్జి చేయడం మూలంగా టీడీపీని జేఏసీ నుంచి బహిష్కరించారు.
ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జేఏసీ కార్యాలయంలో తీసుకున్న నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరి 14న 12 మంది ఎమ్మెల్యేలు (ఒకరు టీడీపీ, ఒకరు బీజేపీ, పది మంది టీఆర్ఎస్) జేఏసీ కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లి అమరవీరుల స్మారక స్థూపం (గన్‌పార్క్) వద్ద నివాళులు అర్పించి స్పీకర్‌కు రాజీనామాలు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జేఏసీ, విద్యార్థి జేఏసీ, బీజేపీ శ్రీకృష్ణ కమిటీ సంప్రదింపులను బహిష్కరించాయి. అయితే తెలంగాణకు జరిగిన అన్యాయం, ఉద్యమం గురించి కమిటీకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని భావించి అనేక మంది ఉద్యమకారులు, సంఘాలు, పార్టీలు కమిటీకి లక్షలాదిగా నివేదికలు సమర్పించాయి.
రాజకీయ పార్టీల నివేదికలు
సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ ప్రజారాజ్యం, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిలు తెలంగాణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. సీపీఎం, ప్రజారాజ్యం, సీమాంధ్ర కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ సమైక్య రాష్ర్టానికి అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. అయితే ఎంఐఎం పార్టీ రాష్ర్టాన్ని సమైక్యంగానే ఉంచాలని, అది వీలుకాని పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటుచేయాలని పేర్కొంది. లోక్‌సత్తా పార్టీ తన నివేదికలో పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కాని, వ్యతిరేకంగాకాని స్పష్టత ఇవ్వలేకపోయింది. ఇలా మరోసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రెండువర్గాలుగా ఏర్పడ్డాయి. అయితే కాలయాపన కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించి తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించేందుకు పావుగా ఉపయోగించింది. ఇందుకు సీమాంధ్ర ఆధిపత్యంలోని మీడియా లోపాయికారిగా సంపూర్ణ సహకారం అందించింది. కమిటీ ఇచ్చే నివేదిక సర్వరోగ నివారిణిగా ప్రచారం చేశాయి.
కమిటీకి ఇచ్చిన గడువులోగా తెలంగాణలో ప్రజా ఉద్యమాన్ని బలహీనపర్చాలని, ఉద్యమంలో సంఘటితమవుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని విడదీయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ వ్యతిరేక శక్తులు అనేక ఎత్తుగడలను, వ్యూహాలను అమలు జరిపాయి. అయితే ఈ పరిణామాల ప్రభావాల నుంచి ఉద్యమాన్ని, ఉద్యమంలో మమేకమైన ప్రజానీకాన్ని, ఐక్యతను రక్షించుకునేందుకు జేఏసీ వూహాత్మకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చడానికి జేఏసీ పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఇటువంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఓయూ విద్యార్థి జేఏసీ 2010 ఫిబ్రవరి 21న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.
తెలంగాణ రాజకీయ జేఏసీ దీనికి మద్దతు ఇచ్చింది. అయితే ప్రభుత్వం వేలాది పోలీస్ బలగాలను మోహరించి, నిర్బంధం విధించి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో విద్యార్థులను కట్టడి చేసింది. దీంతో ఆవేదన చెందిన సిరిపురం యాదయ్య అనే ఉద్యమకారుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ, తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని ఓయూ క్యాంపస్‌లో వేలాది పోలీసులు చూస్తుండగానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ రెండు విడతలుగా బస్సుయాత్రను నిర్వహించింది.
మొదటి విడతగా 2010 మార్చి 21-23 వరకు గన్‌పార్క్ నుంచి హన్మకొండ వరకు సాగింది. రెండో విడత కొమురవెల్లి నుంచి మంచిర్యాలకు 2010 ఏప్రిల్ 9 నుంచి 12 వరకు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. ఇదిలా ఉండగా ఓదార్పుయాత్ర పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని వైఎస్ జగన్ చేసిన కుట్రను వరంగల్ జిల్లాలోని మానుకోట వద్ద 2010 మే 28న వేలాది మంది పోలీస్ భద్రతా బలగాలు, వైఎస్ జగన్ అనుచరుల దాడులను ఎదుర్కొని అడ్డుకుంది. ఈ సంఘటన సమైక్యవాదులకు, సమైక్యవాదానికి తెలంగాణ ప్రాంతంలో చోటులేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజలు అత్యంత భారీ మెజార్టీతో గెల్పించుకున్నారు. టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే అన్న అధికార పార్టీకి సైతం కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కలేదు. ఈ ఉప ఎన్నికల విజయంతో తెలంగాణవాదం ప్రజల్లో ఎంత బలంగా ఉందో గల్లీ నుంచి ఢిల్లీ దాక తెలిసివచ్చింది.
యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ప్రకటించిన పది రోజులకు కేంద్ర హోంశాఖ విధి విధానాలు వెల్లడించింది. మొత్తం ఏడు అంశాలపై అధ్యయనం చేసి డిసెంబర్ 31 నాటికి అంటే పది నెలల్లో నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ విధి విధానాలు కిందివిధంగా ఉన్నాయి.
1.ప్రత్యేక తెలంగాణ, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటిలాగే సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితిని పరీక్షించడం.
2.రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పురోగతి అభివృద్ధిపై ఆ పరిణామాల ప్రభావాన్ని సమీక్షించడం.
3.సమాజంలోని వివిధ వర్గాలైన మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు, చూపిన ప్రభావాలను పరీక్షించడం
4.పైన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తున్నప్పుడు (1,2,3) తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన కీలకమైన అంశాలను గుర్తించడం
5.పైన చెప్పిన అంశాలపై సమాజంలోని అన్నివర్గాల ప్రజలను, ముఖ్యంగా రాజకీయ పార్టీలను సంప్రదించడం, వారి అభిప్రాయాలను సేకరించడం, ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితిని పరిష్కరించి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల నుంచి పలు పరిష్కారాలను రాబట్టడం, దాని కోసం సర్వోత్తమ పరిష్కారాలను గుర్తించడం, వాటి సాధన కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను అందుకు తగిన మార్గసూచీ (రోడ్డుమ్యాప్)ని సిఫారసు చేయడం.
6.పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రైతు, మహిళ, విద్యార్థి సంఘాల వంటి పౌర సమాజంలోని ఇతర సంస్థలను పైన పేర్కొన్న విషయాలపై సంప్రదించడం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సమగ్రాభివృద్ధి అనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ వారి అభిప్రాయాన్ని సేకరించడం
7.వీటితో పాటు కమిటీ తగిన ఇతరత్రా సలహాలు, సిఫారసులు కూడా చేయవచ్చు.
తెలంగాణకు సీమాంధ్ర దళిత, బహుజన సంఘాల మద్దతు
-తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర సంపన్న పెట్టుబడిదారీ వర్గం అనుక్షణం అణచివేసే ప్రయత్నాలు చేసింది. కానీ సీమాంధ్ర దళిత, బహుజన సంఘాలతో పాటు పలు సీమాంధ్ర ఉద్యమ సంస్థలు, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చి ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాల సాధన కోసం ఉద్యమించారు.
వీటిలో కొన్ని ముఖ్యమైన సంఘాలు
-సామాజిక తెలంగాణ – ఆంధ్ర సమన్వయకర్త – ఉ. సాంబశివరావు
-బీసీ మహాజన్ సమితి – శీనయ్య సాగర్
-బహుజన కెరటాల వేదిక – పల్నాటి శ్రీరాములు
-ముస్లిం రిప్రజెంటేటీవ్ ఫోరం – సయ్యద్ రఫీ
-బాస పత్రిక – విద్యాసాగర్
-ఉత్తరాంధ్ర ప్రజాహక్కుల పోరాట వేదిక – గంట పాపారావు
-సామాజిక ఆంధ్ర దళిత మహిళాసభ – యూ పద్మావతి
-సామాజిక రాయలసీమ ప్రజల సమితి – అన్నా రాంచంద్రయ్య, శేషఫణి
-రాయలసీమ హక్కుల వేదిక – భూమన్ మొదలైన సంఘాలు
-ఇదే సమయంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలను సీమాంధ్ర సంపన్నవర్గాలు చేసినా అన్నదమ్ముళ్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం అనే స్ఫూర్తితో తెలంగాణ-ఆంధ్ర కవులు, రచయితలు కావడి కుండలు అనే కవితా సంకలనాన్ని తెచ్చారు.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






