International organizations | అంతర్జాతీయ సంస్థలు
ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్)
-దీన్ని 1960లో బాగ్దాద్ (ఇరాక్)లో స్థాపించారు. అధికారికంగా 1961లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాలు కలిసి దీన్ని నెలకొల్పాయి.
-పై దేశాలతో పాటు ఖతార్, ఇండోనేషియా, లిబియా, అబుదాబి (యూఏఈ), అల్జీరియా, నైజీరియా, గబాన్, అంగోలాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు భాగాన్ని ఈ ఒపెక్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం నిల్వల్లో 70 శాతం నిల్వలు ఈ దేశాలు కలిగి ఉన్నాయి.
-దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా) లో ఉంది. అధికార భాష ఇంగ్లిష్.
ADB (ఆసియా అభివృద్ధి బ్యాంక్)
-ఈ బ్యాంక్‌ను ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ (EASCAP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీని కార్యకలాపాలు 1966లో ప్రారంభమయ్యాయి.
-సభ్యదేశాల ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ఆర్థిక విధానాల సమన్వయం, పేదరికాన్ని తగ్గించడం, మహిళల స్థాయిని పెంపొందించడం, మానవాభివృద్ధికి తోడ్పడటం, పర్యావరణాన్ని రక్షించడం ఈ బ్యాంక్ లక్ష్యాలు.
-దీనిలో ఆసియాలోని 48 దేశాలు, పసిఫిక్‌లోని 19 దేశాలు మొత్తం 67 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం మనీలా (ఫిలిప్పైన్స్)లో ఉంది.
నామ్ (అలీనోద్యమం)
-20వ శతాబ్దం మధ్యభాగంలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన చిన్న దేశాలు కలిసి అగ్రరాజ్యాల ఆధిపత్యానికి దూరంగా వాటి స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి అలీనోద్యమాన్ని ప్రారంభించాయి.
-1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ నగరంలో ఏర్పాటు చేసిన ఆఫ్రో-ఆసియా మహాసమావేశంలో ఆఫ్రికా ఖండం నుంచి 6 దేశాలతో పాటు మొత్తం 29 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశం అనుకున్న ఫలితం ఇవ్వలేదు.
-1961లో బెల్గ్రేడ్ (యుగోస్లేవియా)లో నిర్వహించిన సమావేశంలో 25 దేశాలకు చెందిన అలీనోద్యమ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సభలో యుగోస్లేవియా అధ్యక్షుడు జోసెఫ్ టిటో అగ్రదేశాలైన సోవియట్ యూనియన్, అమెరికాల ఆయుధ సేకరణ యుద్ధానికి దారితీయగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సభకు ఇండియా నుంచి జవహర్లాల్ నెహ్రూ హాజరయ్యారు.
-స్వాతంత్య్రం, సమానత్వం, సాంఘిక న్యాయం, అందరి క్షేమాన్ని ప్రోత్సహించడం, శాంతిని కాపాడటం, నిరాయుధీకరణ సాధించడం, ప్రపంచాభివృద్ధిని సాధించడం ఈ అలీనోద్యమ ముఖ్యోద్దేశం.
అపెక్ (ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్)
-మొదటిసారిగా 1989లో నాటి ఆస్ట్రేలియా ప్రధాని అయిన రాబర్ట్ హుక్ 1989, జనవరిలో స్వేచ్ఛా మార్కెట్ అనుకూల దేశాల ఆర్థిక సంబంధాల సమన్వయానికి శాశ్వత సంస్థ ఏర్పాటు కోసం ప్రతిపాదన తెచ్చాడు.
-ఈ ప్రతిపాదనపై పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ కౌన్సిల్ చర్చలు జరిపి ఆసియా, పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ మొదటి సమావేశాన్ని 1989, నవంబర్‌లో కాన్బెర్రా (ఆస్ట్రేలియా)లో ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, న్యూజిలాండ్, యూఎస్‌తో పాటు నాటి ఏఎస్ఈఏఎన్ సభ్యదేశాలైన ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణ కొరియా, బ్రూనై దేశాలు పాల్గొన్నాయి.
-దీనిలో 21 సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. దీని అధికార భాష ఇగ్లిష్.
సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్)
-మొదటిసారిగా సార్క్ ఏర్పాటుకు అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడైన జియా ఉర్ రెహమాన్ ప్రతిపాదన చేశాడు. 1983లో న్యూఢిల్లీలో జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో సౌత్ ఆసియా రీజినల్ కో ఆపరేషన్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ యాక్షన్ (ఐపీఏ)లను ఏర్పాటు చేశారు.
-SARC సిఫారసుతో 1985, డిసెంబర్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించిన మొదటి సమావేశంలో SAARC స్థాపనకు ఆమోదముద్ర పడింది. ప్రజల సంక్షేమం, వారి జీవనస్థాయిని పెంపొందించడం, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక, శాస్త్ర, వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారం దీని ప్రధాన లక్ష్యం.
-సభ్యదేశాలు: శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, పాకిస్థాన్. దీని ప్రధాన కార్యాలయాన్ని ఖాట్మండులో 1987లో ఏర్పాటు చేశారు. దీనికి మొదటి సెక్రటరీ జనరల్‌గా అబుల్ హసన్ పనిచేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?