విద్యా ప్రమాణాలు ఎన్ని? educational standards
1. సృజించడం అనేది అండర్సన్ వర్గీకరణలో ఎన్నోది?
1) 4 2) 5 3) 6 4) 1
2. A Taxonomy of teaching learning and Assessment అనే పుస్తక రచయిత?
1) క్రాత్‌హోల్ 2) అండర్సన్, క్రాత్‌హోల్
3) దవే 4) ఎలిజబెత్ సింప్సన్
3. పాఠశాల స్థాయి సాంఘికశాస్త్ర విద్యా ప్రమాణాలను సూచించింది?
1) ఎపీఎస్సీఎఫ్-2011 2) 1986 ఎన్పీఈ
3) 2005 ఎన్సీఎఫ్ 4) 1, 3
4. భారతదేశం, నైజీరియాల్లోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. ఇది భారతదేశంలో ఎందుకు బలంగా ఉంది. అనే ప్రశ్నకు సంబంధించింది?
1) విషయ అవగాహన
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
3) పట నైపుణ్యాలు
4) సమాచార సేకరణ నైపుణ్యాలు
5. గ్రిడ్ అంటే ఏమిటి? అది మనకు ఎలా సహాయపడుతుంది అనేది?
1) పట నైపుణ్యాలు
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
3) ప్రశంస సున్నితత్వం 4) విషయ అవగాహన
6. భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే ఒక పోస్టర్ తయారుచేయండి?
1) ప్రశంస సున్నితత్వం 2) విషయ అవగాహన
3) సమాచార సేకరణ నైపుణ్యాలు
4) సామాజిక సేవా నైపుణ్యాలు
7. సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం మధ్య తేడాలు, పోలికలు తెలుపండి?
1) సమాచార నైపుణ్యాలు 2) విషయ అవగాహన
3) సామాజికాంశాలపై ప్రతిస్పందన
4) పేరా అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం
8. తొమ్మిదో తరగతి పుస్తకం పేజీ నంబరు 9లో ఎరువుల సమస్యలు అంశం చదివి వ్యాఖ్యానించండి?
1) విషయాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం
2) సామాజికాంశాలపై ప్రతిస్పందన
3) ప్రశంస సున్నితత్వం
4) సమాచార సేకరణ నైపుణ్యాలు
9. దేశంలో చిరుధాన్యాలు పండే ప్రాంతాలను పటంలో గుర్తించండి?
1) విషయ అవగాహన 2) పట నైపుణ్యాలు
3) ప్రశంస సున్నితత్వం
4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
10. పారిశ్రామిక వస్తువుల టోకు ధరల సూచికలు కింది పటంలో ఉన్నాయి. వీటి ద్వారా రేఖాపటం గీయండి అనేది?
1) సమాచార సేకరణ నైపుణ్యాలు
2) విషయ అవగాహన
3) సామాజికాంశాలపై ప్రతిస్పందన
4) పట నైపుణ్యాలు
11. పక్కన ఉన్న పట్టిక పుస్తకాల ముద్రణలో వృద్ధి గురించి పేర్కొంటుంది. దాని గురించి ఏం చెప్పగలరు?
1) విషయ అవగాహన
2) సామాజికాంశాలపై ప్రతిస్పందన
3) సమాచార సేకరణ నైపుణ్యాలు
4) ప్రశంస సున్నితత్వం
12. ఫ్రాన్స్ విప్లవానికి దారితీసిన పరిస్థితులను వివరించండి?
1) ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం
2) సమాచార సేకరణ నైపుణ్యాలు
3) పట నైపుణ్యాలు 4) విషయ అవగాహన
13. ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను కొన్నింటిని పేర్కొనండి. ఈ కాలంలో కూడా ఆ సమస్యలు ఉన్నాయేమో చర్చించండి?
1) 3 2) 2 3) 4 4) 5
14. సాంఘికశాస్త్ర విద్యా ప్రమాణాల్లో నాలుగో ప్రమాణం?
1) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
2) సమాచార నైపుణ్యాలు
3) ప్రశంస సున్నితత్వం 4) విషయ అవగాహన
15. సాంఘికశాస్త్ర విద్యా ప్రమాణాలు తరగతిలో సాధించడానికి ఉపాధ్యాయుడు చేయకూడని పని?
1) విద్యార్థులను చర్చలో పాల్గొనేలా చేయాలి
2) విద్యార్థులు సొంతంగా నేర్చుకొనే అవకాశాలు కల్పించాలి
3) ఎక్కువగా బట్టీ విధానాన్ని ప్రోత్సహించాలి
4) ఇంటరాక్టివ్ విధానంలో బోధించడానికి ప్రయత్నించాలి
16. కింది వాటిలో ప్రశంస సున్నితత్వం అనే విద్యా ప్రమాణానికి సరిపోయేది?
1) తూర్పు మైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు ఏవి?
2) ఇచ్చిన పేరాగ్రాఫ్ నుంచి పట్టిక తయారు చేయడం
3) మహిళలు ఎదుర్కొనే సమస్యలపై దినపత్రిక ఎడిటర్‌కు ఒక లేఖ రాయండి
4) భారతదేశ పటంలో అమరావతిని గుర్తించండి
17. పదోతరగతి పాఠ్య పుస్తకం పేజీ నంబరు 182లో సైనికవాదం అంశాన్ని చదివి వ్యాఖ్యానించండి అనే విద్యా ప్రమాణాల్లో ఎన్నో ప్రమాణం కిందకు వస్తుంది?
1) 4 2) 3 3) 2 4) 5
18. విద్యార్థి పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలు అర్థం చేసుకొని సొంతంగా వివరించగలగడం ఏ జ్ఞానం అవుతుంది?
1) విధానాత్మక జ్ఞానం 2) మెటకాగ్నిషన్ జ్ఞానం
3) జ్ఞానం 4) భావనాత్మక జ్ఞానం
19. భారత స్వాతంత్రోద్యమం అనే పాఠ్యాంశం విద్యార్థి విని తాను కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలాగా తయారుకావాలి అనుకోవడం?
1) వృత్తి విలువ 2) ప్రేరణాత్మక విలువ
3) సామాజిక సేవ విలువ 4) బౌద్ధిక విలువ
20. టేబుల్ టు గ్రాఫ్, గ్రాఫ్ టు టేబుల్ తయారు చేయడం అనేది?
1) విషయ అవగాహన 2) సమాచార నైపుణ్యాలు
3) ప్రశంస, సున్నితత్వం
4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
21. విద్యార్థి భారతదేశ పటంలో వరి పండే ప్రాంతాలను గుర్తించాడు అనేది సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల్లో ఎన్నో ప్రమాణం కిందకు వస్తుంది?
1) 2 2) 3 3) 4 4) 5
22. సాంఘికశాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని?
1) 7 2) 5 3) 6 4) 8
23. గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడంవల్ల ఎదురయ్యే సమస్యలను విశ్లేషిస్తూ పత్రికా సంపాదకుడికి లేఖ రాయండి?
1) విషయ అవగాహన
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
3) ప్రశంస సున్నితత్వం 4) వ్యాఖ్యానించడం
24. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు, అనే విషయాలకు సంబంధించినది ఏ జ్ఞానం అవుతుంది?
1) భావనాత్మక జ్ఞానం 2) విధానాత్మక జ్ఞానం
3) మెటకాగ్నిషన్ జ్ఞానం 4) వాస్తవాల జ్ఞానం
25. ఏ పనైనా ఎలా చేయాలి, విచారణ చేసే విధానాలు, పద్ధతులు మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానం?
1) వాస్తవాల జ్ఞానం 2) మెటకాగ్నిషన్ జ్ఞానం
3) విధానాత్మక జ్ఞానం 4) భావ సంబంధ జ్ఞానం
26. అండర్సన్ వర్గీకరణలో ఐదో లక్ష్యం?
1) సృజించడం 2) సంశ్లేషణ
3) విశ్లేషణ 4) మూల్యాంకనం
27. ఉత్పత్తి, ప్రణాళిక అనేవి ప్రధానంగా దేనిలో
1) అవగాహన 2) సృజించడం
3) నైపుణ్యం 4) జ్ఞానం
28. విద్యార్థి బొమ్మలు గీయడం ద్వారా, సర్వే చేయడం ద్వారా, గ్రాఫ్‌ల ద్వారా విషయాన్ని బహిర్గతం చేయడం ఏ లక్ష్యానికి సంబంధించింది? (అండర్సన్ ప్రకారం)
1) అవగాహన 2) అనుప్రయుక్తం
3) విశ్లేషణ 4) మూల్యాంకనం
29. అండర్సన్ వర్గీకరణలో లక్ష్యాలు ఎలా అమర్చారు?
1) ఎక్కువ నుంచి ఎక్కువ 2) తక్కువ నుంచి ఎక్కువ 3) ఎక్కువగా తక్కువగా 4) ఎక్కువ నుంచి తక్కువ
30. వర్గీకరించడం, సారాంశం ఇవ్వడం, పోలికలు చెప్పడం అనేవి అండర్సన్ ప్రకారం దేనికి సంబంధించింది?
1) జ్ఞ్ఞప్తికి తెచ్చుకోవడం 2) అవగాహన
3) మూల్యాంకనం 4) సృజించడం
31. భారతదేశ అవుట్‌లైన్ పటం గీయండి అనేది?
1) విషయ అవగాహన 2) పట నైపుణ్యం
3) ప్రశంస 4) వ్యాఖ్యానించడం
32. రోడ్డు భద్రతకుగాను మీ ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలేవి? అనేది ఎన్నో విద్యా ప్రమాణం కిందకు వస్తుంది?
1) 4 2) 5 3) 6 4) 8
33. పదోతరగతి పాఠ్య పుస్తకం పేజీ నంబరు 209లోని నాగరికులుగా చేసే బాధ్యతలోని మొదటి నాలుగు వాక్యాలు చదవండి. దీంతో మీరు ఏకీభవిస్తారా ఎందుకు అనేది ఏ విద్యా ప్రమాణం? 1) విషయ అవగాహన
2) సామాజికాంశాలపై ప్రతిస్పందన
3) ఇచ్చిన విషయాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం
4) సమాచార సేకరణ నైపుణ్యాలు
34. భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్రను ప్రశంసిస్తూ రాయండి అనేది?
1) సమాచార నైపుణ్యాలు 2) ప్రశంస, సున్నితత్వం
3) పట నైపుణ్యాలు 4) విషయ అవగాహన
35. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు, బోధనా పద్ధతుల ఎంపికకు తోడ్పడేవి?
1) స్పష్టీకరణాలు 2) ఉద్దేశాలు
3) విలువలు 4) లక్ష్యాలు
36. యుద్ధాన్ని నివారించి శాంతిని పెంపొందించే కొన్ని నినాదాలు రాయండి అనే ప్రశ్న?
1) విషయ అవగాహన 2) ప్రశంస
3) సమాచార నైపుణ్యాలు 4) ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం
సమాధానాలు
1-3, 2-2, 3-4, 4-1, 5-4, 6-1, 7-2, 8-1, 9-2, 10-1, 11-3, 12-4, 13-3, 14-1, 15-3, 16-3, 17-2, 18-4, 19-2, 20-2, 21-4, 22-3, 23-3, 24-3, 25-3, 26-4, 27-2, 28-3, 29-2, 30-2, 31-2, 32-1, 33-3, 34-2, 35-4, 36-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు