Multipurpose achievement projects | దేశంలో ప్రధాన బహుళార్థక సాధక ప్రాజెక్టులు
భాక్రానంగల్
-దేశంలో నిర్మించిన మొదటి, అన్నింటికన్నా ఎత్తయిన ప్రాజెక్టు. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు. అయినప్పటికీ హిమాచల్‌ప్రదేశ్ కూడా లబ్ధిపొందుతున్నది.
-సట్లెజ్ నదిపై భాక్రావద్ద 226 మీ. ఎత్తుతో ఒక ఆనకట్ట, నంగల్ వద్ద 29 మీ. ఎత్తులో మరో ఆనకట్ట నిర్మించారు.
-ఈ ప్రాజెక్టువల్ల సుమారు 18 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి వసతులు ఏర్పడ్డాయి.
నాగార్జున సాగర్
-రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఉంది. ఇది ప్రపంచంలోకెల్లా మొదటి రాతి ఆనకట్ట, మానవ నిర్మిత జలాశయాల్లో మూడో స్థానంలో ఉంది.
-408 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు 1450 మీ. పొడవు ఉన్నది. దీని గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.
-ప్రాజెక్టుకు ఇరువైపులా రెండు కాలువలు నిర్మించారు. 179 కి.మీ. పొడవున్న ఎడమ కాలువ (లాల్‌బహదూర్ కాలువ), 204 కి.మీ. పొడవున్న కుడి కాలువ (జవహర్ కాలువ)ల ద్వారా సుమారు 8.95 లక్షల హెక్టార్లకు సాగునీటి సదుపాయం కలుగుతున్నది.
తుంగభద్ర
-తుంగభద్ర నదిపై హోస్పేటకు సమీపంలో మల్లాపురం వద్ద నిర్మించారు. దీని ఎత్తు 49.39 మీ.
-ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు. దీని ఎడమ కాలువ పొడవు 272 కి.మీ., కుడివైపు దిగువ కాలువ పొడవు 349 కి.మీ., ఎగువ కాలువ 196 కి.మీ.
-ఈ ప్రాజెక్టుతో సుమారు 4.97 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది.
గండక్
-ఇది గండక్ నదిపై బీహార్‌లోని వాల్మీకి నగరం వద్ద ఉంది.
-ఇది బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టు. దీనిద్వారా నేపాల్ కూడా లబ్ధిపొందుతున్నది.
-దీనిపై 747.37 మీ. పొడవున బ్యారేజీ, దానిపై రోడ్డు వంతెన నిర్మించారు.
-ఈ ప్రాజెక్టుతో బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్‌లో మొత్తం 14.58 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది.
హీరాకుడ్
-ప్రపంచంలో అతిపొడవైన ప్రాజెక్టుల్లో ఒకటైన దీన్ని ఒడిశాలో మహానదిపై నిర్మించారు. దీని పొడవు 4,801 మీ., నీటినిల్వ 810 కోట్ల ఘనపు మీటర్లు.
-దీనివల్ల 2.42 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది.
దామోదర్ నదీలోయ ప్రాజెక్టు
-ఇది పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు. వరదల నివారణ కోసం ఈ ప్రాజెక్టును నిర్మించారు.
-తిలైయా, కోనార్, మైథాన్, పంచట్హిల్ల వద్ద నాలుగు జలాశయాలు ఉన్నాయి.
-తిలైయా, మైథాస్ ఆనకట్టలను బరాకర్ నదిపై నిర్మించారు. పంచట్హిల్ ఆనకట్టను దామోదర్ నదిపై నిర్మించారు.
-దామోదర్ నదిపై పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్వద్ద 692 మీటర్ల పొడవు, 11.58 మీ. ఎత్తులో బరాజ్ నిర్మించారు.
-ఈ నది నుంచి తవ్విన 137 కి.మీ.ల కాలువ నౌకాయానానికి అనువుగా ఉంది.
-ఈ ప్రాజెక్టుద్వారా 5.15 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది.
పెరియార్ నదీలోయ ప్రాజెక్టు
-దీన్ని కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అల్వేకు సమీపంలో పెరియార్ నదిపై నిర్మించారు. ఈ బరాజ్ పొడవు 210.92 మీ. దీనిద్వారా 41 వేల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతున్నది.
చంబల్ ప్రాజెక్టు
-ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులో గాంధీసాగర్ డ్యామ్, రాణాప్రతాప్ సాగర్ బ్యారేజీ, కోటా బ్యారేజీ, జవహర్ డ్యామ్ ఉన్నాయి.
-గాంధీసాగర్ జలాశయం నీటినిల్వ సామర్థ్యం 77,460 టీఎంసీలు. దీనివల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 4.44 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది.
-రాణాప్రతాప్ సాగర్ డ్యామ్వల్ల 1.2 లక్షల హెక్టార్ల భూమి, జవహర్ డ్యామ్‌తో 5.66 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?