తెలంగాణ ఉనికి-భౌగోళిక అంశాలు
విభిన్న రకాల నైసర్గిక స్వరూపంతో భౌగోళికంగా, రాజకీయంగా ప్రత్యేక ఉనికిని, విశిష్ఠతను కలిగి ఉంది.
-భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమి తాను రాసిన ది గైడ్ టు జియోగ్రఫి గ్రంథంలో తైలంగులు అనే తెగను గురించి పేర్కొన్నాడు. తైలంగులు నివసించే ప్రాంతంలోని నదిని తెలివాహ నది అని తెలిపాడు. అదే గోదావరి నది.
-కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్ల వజీరు మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగాన్ అని పిలిచారు. త్రిలింగాన్ పేరుమీదుగా తెలంగాణ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
-తెలంగాణ ప్రాంతం పౌరాణిక వాజ్ఞయంలో దక్షిణాపథంలో ఉండేది అని పేర్కొన్నారు. దక్షిణాపథం అంటే నర్మద-తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం అని, దక్షిణ భారతేదేశానికి మార్గం అని అర్థం.
-తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న గోళార్ధం- ఉత్తరార్ధ గోళం
-తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న ప్రాంతం- దక్షిణాసియా
-తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న భారతప్రాంతం- దక్షిణ భారతదేశం
-తెలంగాణ ఉనికి రీత్యా విస్తరించిన పీఠభూమి- దక్కన్ పీఠభూమి
-దక్కన్ పీఠభూమి అతిపురాతన అగ్ని, నీస్, సిస్ట్ శిలలతో ఏర్పడింది.
-గమనిక: బౌద్ధమతానికి ప్రసిద్ధిగాంచిన బౌద్ధస్థూపం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఉంది. ఈ ప్రాంతాన్ని టాలమీ తన గ్రంథంలో నెల్సిండాగా పేర్కొన్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అంశాలు..
-తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం- 2014, ఫిబ్రవరి 6
-తెలంగాణ బిల్లు లోక్‌సభలో ప్రవేశం- 2014, ఫిబ్రవరి 13
-తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం- 2014, ఫిబ్రవరి 18 (కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే)
-రాజ్యసభలో ఆమోదం- 2014, ఫిబ్రవరి 20 (డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్)
-తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర- 2014, మార్చి 1
-తెలంగాణ గెజిట్ ప్రకటన- 2014, మార్చి 2
-తెలంగాణ అపాయింటెడ్ డే (ఆవిర్భావ దినం) జూన్ 2గా ప్రకటన- 2014, మార్చి 4
-ఫలితంగా 2014, జూన్ 2న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
-జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.
-కుకునూరు, కూనవరం, వేలేరుపాడు, వరరామచంద్రపురం, చింతూరు మండలాలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపివేసింది.
-పాక్షికంగా కోల్పోయిన మండలాలు భద్రాచలం, బూర్గంపహాడ్.
-భద్రాచలం పట్టణం మినహా, భద్రాచలం మండలం నుండి 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలను బూర్గంపహాడ్ మండలం నుంచి 6 రెవెన్యూ గ్రామాలు, 4 గ్రామపంచాయతీలను కోల్పోవడం జరిగింది.
-దీనిప్రకారం తెలంగాణ 327 రెవెన్యూగ్రామాలను, 87 గ్రామపంచాయతీలను కోల్పోయింది.
-దీని ప్రకారం 2.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణం, ఇందులో 2 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం, 1.90 లక్షల జనాభాను తెలంగాణ కోల్పోయింది.
-దీంతో భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.గా ఉంది.
తెలంగాణ విస్తరణ
-భారతదేశ ద్వీపకల్పంలో తెలంగాణ అక్షాంశాల దృష్ట్యా 150 50| ఉత్తర అక్షాంశాల మధ్య, రేఖాంశాల దృష్ట్యా 770 15| నుంచి 810 19| తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
-అక్షాంశాల మధ్య విస్తృతి దక్షిణాన గద్వాల జిల్లా నుంచి ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లాల మధ్య విస్తరించి ఉంది. రేఖాంశాల దృష్ట్యా విస్తృతి పడమర మహబూబ్ నగర్ జిల్లా నుంచి తూర్పున భద్రాది కొత్తగూడెం జిల్లాల మధ్య విస్తరించి ఉంది.
-తెలంగాణకు తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దులు లేవు. అందువల్ల దీన్ని భూ పరివేష్టిత రాష్ట్రం (La-d Locked State) అని పిలుస్తారు.
-ఇది దేశంలో 5వ భూపరివేష్టిత రాష్ట్రం.
-తెలంగాణలో చివరగా 1978, ఆగస్టు 15న (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది.
-ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.
-కొత్త జిల్లాల ఏర్పాటు కోసం 2016, ఆగస్టు 10న ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయ్యింది. దీనిప్రకారం పాత 10 జిల్లాలకు అదనంగా 17 జిల్లాలను సూచిస్తూ ముసాయిదాను ప్రకటించారు.
-ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అదనంగా కావాల్సిన జిల్లాల ఏర్పాటుపై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఆధ్వర్యంలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, జీ జగదీశ్వర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
-ఈ కమిటీ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్న జిల్లాలు కాకుండా అదనంగా 4 జిల్లాల (రాజన్న సిరిసిల్ల, జనగామ, జోగుళాంబ గద్వాల, కుమ్రం భీం ఆసిఫాబాద్)ను సిఫారసు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరింది.
-కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలు 2016, అక్టోబర్ 11 (దసరా)న అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జిల్లాలు విభజించిన విధానం…
-వరంగల్ జిల్లాను అత్యధికంగా 5 జిల్లాలుగా విభజించారు. అవి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్
-కరీంనగర్ జిల్లాను కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలుగా విభజించారు.
-ఆదిలాబాద్ జిల్లాను విభజించి ఆదిలాబాద్‌తోపాటు కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేశారు. అవి.. నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్.
-మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, బోగుళాంబ గద్వాల జిల్లాలుగా విభజించారు.
-నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఏర్పాటు చేశారు.
-రంగారెడ్డి జిల్లాను విభజించి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను ఏర్పాటు చేశారు.
-మెదక్ జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి మెదక్ మొత్తం మూడు జిల్లాలుగా ఏర్పాటైంది.
-నిజామాబాద్ జిల్లాలో కొత్తగా కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేశారు.
-ఖమ్మం జిల్లాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా విభజించారు.
-హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగించారు.
-అత్యధికంగా కొత్త జిల్లాలు: వరంగల్ నుంచి 4
-అత్యల్పంగా కొత్త జిల్లాలు: నిజామాబాద్, ఖమ్మం నుంచి 1 చొప్పున ఏర్పడ్డాయి.
-ఎటువంటి మార్పులకు లోనుకాని జిల్లా: హైదరాబాద్
జిల్లాలు-రెవెన్యూ డివిజన్లు
పాతవి కొత్తవి మొత్తం
జిల్లాలు 10 21 31
రెవెన్యూ డివిజన్లు 43 25 68
మండలాలు 459 125 584
గ్రామ పంచాయతీలు 8695
-రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య: 68
-అధిక రెవెన్యూ డివిజన్లు కలిగిన జిల్లా: రంగారెడ్డి (4)
-తక్కువ రెవెన్యూ డివిజన్ల జిల్లాలు: వరంగల్ అర్బన్ (1), వనపర్తి (1), రాజన్న సిరిసిల్ల (1), జోగుళాంబ గద్వాల (1)
-రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య: 584
-అత్యధిక మండలాలు గల జిల్లాలు: నల్లగొండ (31), రంగారెడ్డి (27), నిజామాబాద్ (27)
-అత్యల్ప మండలాలు గల జిల్లాలు: వరంగల్ అర్బన్ (11), జోగుళాంబ గద్వాల (12)
-రాష్ట్రంలో మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య: 8695
-అత్యధిక గ్రామపంచాయతీలుగల జిల్లాలు: నల్లగొండ (502), సంగారెడ్డి (472)
-అతి తక్కువ గ్రామపంచాయతీలుగల జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి (77)
-గ్రామ పంచాయతీలు లేని జిల్లా: హైదరాబాద్
ప్రజాప్రతినిధులు
-రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్‌లు- 438
-ఎంపీటీసీలు- 6476
-ఎంపీపీలు- 438
-రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్‌లు- 9
-జెడ్పీటీసీలు- 438
-జిల్లా పరిషత్ లేని జిల్లా- హైదరాబాద్
-లోక్‌సభ స్థానాలు- 17
-రాజ్యసభ స్థానాలు- 7
-మొత్తం శాసనసభ్యుల సంఖ్య (ఎమ్మెల్యేలు)- 119+1 (ఒక సభ్యుడిని గవర్నర్ నామినేట్ చేస్తారు)
-శాసనమండలి స్థానాల సంఖ్య- 43
-పట్టణ స్థానిక సంస్థలు- 68
-మున్సిపల్ కార్పొరేషన్లు- 6 (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం)
-మున్సిపాలిటీలు- 37
-నగర పంచాయతీలు- 25
తెలంగాణతో సరిహద్దు కలిగిన రాష్ర్టాలు
-పశ్చిమ, నైరుతి దిశలో- కర్ణాటక
-వాయవ్య, ఉత్తర, ఈశాన్య దిశలో- మహారాష్ట్ర
-తూర్పున ఛత్తీస్‌గఢ్
-ఆగ్నేయ, దక్షిణ, నైరుతి దిశలో- ఆంధ్రప్రదేశ్
-గమనిక: ఖమ్మం జిల్లాలోని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల ఒడిశాతో సరిహద్దును కోల్పోయింది.
-కర్ణాటకతో సరిహద్దుగల జిల్లాలు (5): జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి
-మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు (7): కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి
-ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు గల జిల్లాలు (7): జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
-ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు గల జిల్లాలు (2): జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు