వీరే బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరళ్లు..
లార్డ్ కానింగ్ (1856-62)
-ఇతనికాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది.
-బ్రిటిష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్.
-1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారింది.
-ఈ చట్టం ద్వారా భారతదేశాన్ని పరిపాలించే అధికారం ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది.
-డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని 1859లో రద్దు చేశారు.
-కలకత్తా, బొంబాయి, మద్రాస్ యూనివర్సిటీలు 1857లో స్థాపించారు.
-ఇతడు భారత ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టాడు (కార్యనిర్వాహక మండలిలోని ఒక్కో సభ్యుడికి ఒక్కో పరిపాలనా శాఖను కేటాయించడం).
-యూరోపియన్ సైనికులు చేపట్టిన తెల్ల తిరుగుబాటును అణచివేశాడు.
-1859లో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ జారీ చేశారు. ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) అమలులోకి వచ్చింది.
-భారత హైకోర్టు చట్టం 1861లో జారీ చేశారు.
సర్ జాన్ లారెన్స్ (1864-69)
-ఇతడు నీటిపారుదల పథకాలను ప్రారంభించాడు.
-యూరప్‌తో టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్, సముద్ర టెలిగ్రాఫ్ విధానం ప్రారంభమయ్యాయి.
-కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులు 1865లో ప్రారంభమయ్యాయి.
-మొదటి అడవుల సంరక్షణ చట్టాన్ని 1865లో జారీ చేశాడు.
-సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాల్గొనడానికి గరిష్ఠ వయస్సును 23 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు 1866లో కుదించాడు.
లార్డ్ లిట్టన్ (1876-80)
-1877లో దేశంలో విపరీతమైన కరువు ఉన్నప్పుడు ఇతను ఢిల్లీలో గ్రాండ్ దర్బార్‌ను ఏర్పాటు చేశాడు.
-రాయల్ టైటిల్స్ చట్టాన్ని ఆమోదించి, విక్టోరియా మహారాణిని కైజర్-ఇ-హింద్‌గా ప్రకటించాడు.
-1876లో సివిల్ సర్వీసుల గరిష్ఠ వయస్సు పరిమితిని 21 నుంచి 19కి తగ్గించాడు.
-భారత ఆయుధాల చట్టాన్ని (1878) జారీ చేశాడు.
-భారత పత్రికల చట్టం (వెర్నాక్యులర్ ప్రెస్యాక్ట్ – 1878)ని జారీచేసి, దేశీయ పత్రికలపై అనేక ఆంక్షలు విధించాడు.
-ఇతని పరిపాలనా కాలంలో 29 వస్తువులపై దిగుమతి సుంకాలను రద్దు చేశాడు.
-భారతదేశ వైస్రాయ్ల్లో ఇతను ప్రముఖ నవలాకారుడు, కవిగా సాహితీ ప్రపంచానికి సుప్రసిద్ధుడు. ఇతనిని సాహిత్య ప్రపంచంలో Owen Meredith అని అంటారు.
లార్డ్ రిప్పన్ (1880- 1884)
-ఇతను రాష్ర్టాల్లో స్థానిక స్వపరిపాలనకు పునాది వేసి స్థానిక స్వపరిపాలన పితగా ఖ్యాతిగాంచాడు.
-1881లో మొదటి కర్మాగారాల చట్టాన్ని జారీచేశాడు.
-లిట్టన్ ప్రవేశపెట్టిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్టును 1882లో సడలించి భారతీయ పత్రికలపైన ఉన్న ఆంక్షలను తొలిగించాడు.
-విలయం హంటర్ అధ్యక్షతన ఒక విద్యా కమిషన్ 1882లో ఏర్పాటు చేశారు.
-రిప్పన్ కాలంలోనే మన దేశంలో మొదటిసారిగా 1881లో జనాభా లెక్కలు సేకరించారు.
-ఇతను ఇల్బర్ట్ బిల్లును 1883లో జారీ చేశాడు. తద్వారా ఆంగ్లేయ నేరస్థులను విచారించే అధికారం భారతీయ న్యాయమూర్తులకు కలిగింది.
-ఆంగ్లేయులు పెద్ద ఎత్తున ఆందోళన జరుపగా ఈ బిల్లును సవరించి, ఐదుగురు జడ్జీలు గల బెంచీని ఏర్పాటు చేసి, అందులో ముగ్గురు ఆంగ్లేయులు ఉండాలని నిర్ణయించడమైంది.
-ప్రధాన న్యాయమూర్తి సర్ రిచర్డ్ గార్త్ సెలువులో వెళ్లినప్పుడు ఆ స్థానంలో భారతీయుడైన సర్ రమేష్ మిత్తర్ను నియమించడం రిప్పన్ ఔదార్య గుణానికి నిదర్శనం.
-ఇతను సివిల్ సర్వీసుల గరిష్ఠ వయోపరిమితిని 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాడు.
-విలియం బెంటిక్ పరిపాలన కాలంలో దుష్పరిపాలన నెపంతో తీసుకున్న మైసూరును ఇతను వెనక్కిచ్చాడు.
-రిప్పన్ డ్యూటీ ఆఫ్ ది ఏజ్ అనే పేరు గల కరపత్రం రచించాడు.
లార్డ్ డఫ్రీన్ (1884 -1888)
-ఇతని కాలంలో భారతీ జాతీయ కాంగ్రెస్ 1885లో స్థాపించబడింది.
-మూడో బర్మా యుద్ధం జరిగి ఉత్తర బర్మా బ్రిటీష్ సామ్రాజ్యంలో విలీనమైంది.
-ఇతని కాలంలో విక్టోరియా రాణి పాలన కాలానికి చెందిన స్వర్ణోత్సవం (1887)లో జరిగింది.
లార్డ్ లాండ్స్ డౌన్ (1888- 1894)
-ఇతని కాలంలో భారత శాసనసభల చట్టం – 1892 చేయబడింది.
-మణిపూర్ తిరుగుబాటు జరిగింది.
-వారం వారం సెలువును మంజూరు చేస్తూ రెండో ఫ్యాక్టరీ చట్టం 1891లో చేయబడింది.
-భారత్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య సరిహద్దును నిర్ణయించడానికి డ్యూరాండ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
లార్డ్ కర్జన్ (1899- 1905)
-ఇతనిని బ్రిటీష్ ఇండియా ఔరంగజేబ్ అని అంటారు.
-ఇతను 1899లో కలకత్తా కార్పొరేషన్ చట్టం చేశాడు.
-ఇతనికాలంలో ఇంగ్లండ్ రాణి విక్టోరియా మరణించి, ఏడో ఎడ్వర్డ్ ఇంగ్లండ్ చక్రవర్తి అయ్యారు.
-ఇతను 1901లో పురావస్తు పరిశోధనశాఖను, 1901లోనే సర్ కొలన్ స్కాట్మన్ అధ్యక్షతన నీటిపారుదల కమిషన్‌ను ఏర్పాట చేశాడు.
-1902లో సర్ ఆండ్రూస్ ఫ్రెజర్ నాయకత్వంలో పోలీస్ కమిషన్‌ను నియమించాడు.
-1904లో ప్రాచీన స్మారక నిర్మాణాల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించి జారీ చేశాడు.
-1904లో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టాన్ని చేశాడు. సహకార సంఘాల చట్టాన్ని చేశాడు.
-ఇతను 1905లో బెంగాల్‌ను విభజించాడు. దాని ఫలితంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.
-ఈయన రైల్వే బోర్డును ఏర్పాటు చేసి, మరే గవర్నర్ జనరల్ కాలంలో వేయనన్ని రైల్వేలైన్లు వేసి, రైల్వే అభివృద్ధికి పాటుపడ్డాడు.
-కర్జన్ 1905 ఆగస్టులో కిచెనర్తో వివాదం కారణంగా పదవికి రాజీనామా చేశాడు.
లార్డ్ మేయో (1869-72)
-ఇతడు భారతదేశంలో ఆర్థికరంగాన్ని వికేంద్రీకరించాడు.
-కథియవార్‌లో రాజ్‌కోట్ కళాశాలను, అజ్మీర్‌లో మేయో కళాశాలను స్థాపించాడు.
-ఇతని కాలంలోనే డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ భారతదేశాన్ని సందర్శించాడు.
-భారత గణాంక సర్వేను, ప్రత్యేక వ్యవసాయ, వాణిజ్యశాఖలను స్థాపించాడు.
-భారత్‌లో హత్యకు గురైన మొదటి వైస్రాయ్ లార్డ్ మేయో
లార్డ్ నార్త్ బ్రూక్ (1872-76)
-పంజాబ్‌లో కుకా ఉద్యమం ఇతనికాలంలో తిరుగుబాటుగా మారింది.
-వేల్స్ యువరాజు భారతదేశాన్ని సందర్శించాడు.
-ఆఫ్ఘన్ సమస్య మీద ఇతను రాజీనామా చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు