కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి?
1. కింది వాటిలో అధిక ప్రొటీన్లుగల ఆహారం? (1)
1) పాలు 2) నూనె 3) చపాతి 4) అన్నం
2. పత్రరంధ్రాల ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ఏమంటారు? (1)
1) భాష్పోత్సేకం 2) భాష్పీభవనం
3) బిందు స్రావం 4) విసరణ
3. కింది వాటిలో మలేరియా నివారణకు తోడ్పడే ఔషధం? (2)
1) మార్ఫీన్ 2) క్వినైన్
3) సింకోనా 4) టానిన్స్
4. తాజా ఫలాలు, కూరగాయలు తినడంవల్ల స్కర్వీ వ్యాధి రాదని కనుగొన్న శాస్త్రవేత్త? (4)
1) లెవోయిజర్ 2) లూయీపాశ్చర్
3) విట్టేకర్ 4) జేమ్స్ లిండ్స్
5. కింది వాటిని జతపర్చండి. (2)
ఎ. బ్రయోఫైటా 1. నాళికాపుంజ కణ
జాలం ఉంటుంది
బి. టెరిడోఫైటా 2. నాళికాపుంజ కణ జాలం ఉండదు
సి. వివృత బీజాలు 3. విత్తనాలు బయటకు
కనిపిస్తాయి
డి. ఆవృత బీజాలు 4. విత్తనాలు ఫలం లోపల ఉంటాయి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
6. కిరణజన్య సంయోగక్రియ అంత్యపదార్థం? (1)
1) కార్బోహైడ్రేట్స్ 2) ప్రొటీన్స్
3) విటమిన్స్ 4) లిపిడ్స్
7. కింది వాటిలో ఏ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు అవసరం? (3)
1) మక్కజొన్న 2) పత్తి
3) వరి 4) గోధుమ
8. హానికర రక్తహీనతను కలుగజేసే విటమిన్? (4)
1) B1 2) B2 3) B6 4) B12
9. కణశక్తి భాండాగారాలు అని వేటిని అంటారు? (1)
1) మైటోకాండ్రియా 2) హరిత రేణువులు
3) గాల్జీ సంక్లిష్టం 4) రైబోజోమ్‌లు
10. కింది వాటిలో ద్రవరూప కణజాలం? (2)
1) టెండాన్ 2) రక్తం
3) ఎడిపోజ్ 4) ఏరియోలార్
11. కణంలో నిర్జీవ భాగం ఏది? (2)
1) జీవపదార్థం 2) కణ కవచం
3) ప్లాస్టిడ్స్ 4) ఏదీకాదు
12. కింది వాటిలో నిశాచర జీవి? (4)
1) బొద్దింక 2) గబ్బిలం
3) గుడ్లగూబ 4) పైవన్నీ
13. అతి పురాతన జీవులు ఏ రాజ్యానికి చెందినవి? (3)
1) మెటాఫైటా 2) మెటాజొవా
3) మొనిరా 4) ఫంగై
14. సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్లు అని వేటిని అంటారు? (1)
1) డయాటమ్స్ 2) శిలీంధ్రాలు
3) వైరస్లు 4) బ్యాక్టీరియాలు
15. కింది వాటిలో ఏది సరైన వాక్యం? (2)
ఎ. ట్రిపనోసోమా గాంబియన్సీ మానవునిలో అతినిద్ర వ్యాధిని కలుగజేస్తుంది
బి. ఎంటమీబా హిస్టాలిటికా వల్ల జిగట విరేచనాలు కలుగుతాయి
1) ఎ 2) ఎ, బి 3) బి 4) ఏదీకాదు
16. ప్రపంచంలో మొదట భూమిని చుట్టి వచ్చిన నావికుడు? (1)
1) మాజిలాన్ 2) కోజిలాన్
3) కొలంబస్ 4) కెప్టెన్ కుక్
17. భూమికి సమీపంగా ఉన్న నక్షత్రం? (3)
1) ఓరియన్ 2) ధృవ నక్షత్రం
3) సూర్యుడు 4) ఏదీకాదు
18. భూమి చుట్టు కొలత? (3)
1) 45,000 కి.మీ. 2) 43,000 కి.మీ.
3) 40,000 కి.మీ. 4) 42,000 కి.మీ.
19. మృత గ్రహం అని దేన్నంటారు? (1)
1) ఫ్లూటో 2) బుధుడు
3) శుక్రుడు 4) నెఫ్ట్యూన్
20. కింది వాటిని జతపర్చండి. (1)
ఎ. పౌనఃపున్యం 1. హెర్ట్
బి. శక్తి 2. జౌల్
సి. బలం 3. న్యూటన్
డి. పీడనం 4. పాస్కల్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-1
21. స్క్రూగేజీని ఉపయోగించి కొలువగలిగే అతితక్కువ కొలత? (2)
1) 0.001 మి.మీ. 2) 0.001 సెం.మీ.
3) 0.01 సెం.మీ. 4) 0.01 మి.మీ.
22. కింది వాటిలో బొగ్గు అసంపూర్ణంగా మండినప్పుడు విడుదలయ్యే వాయువు? (1)
1) CO 2) CO2 3) SO2 4) SO3
23. సబ్బులో అధికంగా ఉండే పదార్థం? (3)
1) సోడియం సల్ఫేట్
2) పొటాషియం స్టియరేట్
3) సోడియం స్టియరేట్
4) పొటాషియం పెర్మ్యుటేట్
24. గోబర్ గ్యాస్‌లో అధికంగా ఉండేది? (4)
1) ఈథేన్ 2) ప్రొఫేన్
3) బ్యూటేన్ 4) మీథేన్
25. విమానాలు, పక్షులు ఏ సూత్రం ఆధారంగా పైకి ఎగరుతాయి? (1)
1) బెర్నౌలీ 2) పాస్కల్
3) ఆర్కిమెడిస్ 4) బాయిల్
26. ఒక రాయి బరువు గాలిలో 10 గ్రాములు, నీటిలో 8 గ్రాములు. అయిన రాయి సాపేక్ష సాంద్రత ఎంత? (2)
1) 4 2) 5 3) 6 4) 7
27. గుండు పిన్ను పాదరసంపై తేలుతుంది ఎందుకు? (1)
1) సాంద్రత తక్కువ 2) సాంద్రత ఎక్కువ
3) రెండూ సమాన సాంద్రత కలిగి ఉంటాయి
4) ఏదీకాదు
28. కింది వాటిని జతపర్చండి. (3)
ఎ. వైర్లెస్ 1. మార్కోని
బి. సబ్‌మెరైన్ 2. డేవిడ్ బుష్నల్
సి. టెలిఫోన్ 3. గ్రాహంబెల్
డి. ఫిల్మ్ 4. లూయీస్ ప్రిన్స్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
29. కింది వాటిలో త్వరగా ఆవిరయ్యే గుణం కలిగినది? (2)
1) నీరు 2) కిరోసిన్ 3) నూనె 4) ఆముదం
30. ప్రతిధ్వని ఏర్పడటానికి ఉండాల్సిన కనీస దూరం? (1)
1) 11 మీ. 2) 15 మీ. 3) 13 మీ. 4) 9 మీ.
31. బేరియం క్లోరైడ్‌పై వేడిమి చర్య? (4)
1) రసాయన మార్పు 2) భౌతిక మార్పు
3) రసాయన మార్పు, ద్విగత చర్య
4) భౌతిక మార్పు, ద్విగత చర్య
32. చల్లని స్థితిలో జింక్ ఆక్సైడ్ రంగు? (3)
1) పసుపు 2) ఊదా 3) తెలుపు 4) ఎరుపు
33. కింది వాటిలో ఉత్పతనం చెందే పదార్థం? (4)
1) పారఫిన్ మైనం 2) నీరు
3) లెడ్ నైట్రేట్ 4) అయోడిన్
34. కింది వాటిని జతపర్చండి. (2)
ఎ. బెంజీన్ 1. C6 H6
బి. ఎసిటలీన్ 2. C2 H2
సి. ఎథిలీన్ 3. C2 H4
డి. డై బోరేన్ 4. B2 H6
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
35. టిన్, లెడ్, ఆంటిమొని సంకేతాలు వరుసగా … (1)
1) Sn, Pb, Sb 2) Sb, Pb, Sn
3) Sb, Pb, An 4) W, Pb, Sb
36. కింది వాటిలో స్వతంత్రంగా ఉండగల పరమాణువు ఏది? (3)
1) హైడ్రోజన్ 2) నైట్రోజన్
3) హీలియం 4) ఆక్సిజన్
37. సంకేతం అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది ఎవరు? (1)
1) బెర్జీలియస్ 2) లెవోయిజర్
3) ఓలర్ 4) జోసఫ్ఫ్రాస్ట్
38. రెండు పదార్థాలు తమలోని మూలకాలను పరస్పరం మార్చుకునే చర్యను ఏమంటారు? (1)
1) రసాయన ద్వంద్వ వినియోగం
2) రసాయన సంయోగం
3) రసాయన వియోగం
4) రసాయన స్థానభ్రంశం
39. నీటిని విశ్వ ద్రావణి అంటారు ఎందుకు? (3)
1) నీరు ప్రపంచంలో చాలా చోట్ల దొరుకుతుంది
2) నీరు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది
3) నీటికి అనేక పదార్థాలను కరిగించుకునే గుణం ఉంది
4) పైవన్నీ
40. తేమ సమక్షంలో సల్ఫర్ డై ఆక్సైడ్ చర్య? (2)
1) భౌతిక చర్య 2) విరంజన చర్య
3) పై రెండూ 4) ఏదీకాదు
41. నేలను సారవంతం చేసే బ్యాక్టీరియా? (1)
1) రైజోబియం బ్యాక్టీరియా
2) నైట్రసో బ్యాక్టీరియా
3) నైట్రిఫయింగ్ బ్యాక్టీరియా
4) డీనైట్రిఫయింగ్ బ్యాక్టీరియా
42. కృత్రిమ సిల్క్ రసాయన నామం? (3)
1) సెల్యులోజ్ ఎసిటేట్ 2) సెల్యులోజ్ క్లోరైడ్
3) సెల్యులోజ్ నైట్రేట్ 4) సెల్యులోజ్ బ్రోమైడ్
43. ఫాస్ఫరస్‌ను శుద్ధిచేయడంలో వాడే రసాయనాలు? (1)
1) K2 Cr2 O7 2) సజల HCl
3) గాఢ H2 SO7 4) 1, 3
44. 4P + 3NaOH + 3H2 O -> PH3 + A. ఈ సమీకరణంలో A అంటే? (2)
1) సోడియం హైపోఫాస్ఫైడ్
2) సోడియం హైపోఫాస్ఫేట్
3) సోడియం థయోసల్ఫైడ్
4) సోడియం థయోసల్ఫేట్
45. NaOH ద్రావణానికి ఫినాప్తలీన్ సూచికను కలిపిన ఏర్పడే రంగు? (3)
1) పసుపు 2) నారింజ
3) ఊదా 4) ఆకుపచ్చ
46. చారిత్రక కట్టడాలు రూపు కోల్పోవడానికి ప్రధాన కారకం? (1)
1) SO2 2) CO2 3) Cl2 4) P2 O5
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు