దేశంలోని పన్నుల స్వభావం ఎలాంటిది?
1. ఆర్థిక వ్యవస్థలో టేకాఫ్ స్టేజ్ అంటే?
1) ఎలాంటి మార్పులు లేని దశ
2) స్థిరమైన వృద్ధి ప్రారంభ దశ
3) ఆర్థిక వ్యవస్థ పతన ప్రారంభ దశ
4) ఆర్థిక వ్యవస్థపై అన్ని నియంత్రణలు తొలగించిన దశ
2. దేశంలో ఆర్థిక ప్రణాళికలు భారత రాజ్యాంగంలోని ఏ భాగం నుంచి తన లక్ష్యాలను స్వీకరించాయి?
1) ప్రవేశిక 2) ప్రాథమిక విధులు
3) ఆదేశిక సూత్రాలు 4) ప్రాథమిక హక్కులు
3. పంచవర్ష ప్రణాళికల ప్రాథమిక లక్ష్యం?
ఎ. ఆర్థిక వృద్ధి బి. స్వీయ స్వావలంబన
సి. ఉపాధి కల్పన డి. జనాభా వృద్ధి
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, బి, సి, డి
4. మానవ వనరుల అభివృద్ధి అనే లక్ష్యాన్ని స్వీకరించిన పంచవర్ష ప్రణాళిక ఏది?
1) 3వ ప్రణాళిక 2) 5వ ప్రణాళిక
3) 8వ ప్రణాళిక 4) 6వ ప్రణాళిక
5. ఏ పంచవర్ష ప్రణాళిలో అన్ని రంగాలకంటే వ్యవసాయానికి ఎక్కువ నిధులు కేటాయించారు?
1) 1వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక
3) 2వ ప్రణాళిక 4) 5వ ప్రణాళిక
6. విదేశీ సహాయం అవసరంలేని స్వయం సమృద్ధి సాధించినట్టు ఏ ప్రణాళికా కాలంలో ప్రకటించారు?
1) 4వ ప్రణాళిక 2) 2వ ప్రణాళిక
3) 3వ ప్రణాళిక 4) 5వ ప్రణాళిక
7. కింది వాక్యాలను జతపర్చండి
1. గొప్ప విభాజక సంవత్సరం ఎ.1950
2. పారిశ్రామిక విధాన తీర్మానం బి. 1921
3. ప్రణాళికా సంఘం ఏర్పాటు సి. 1969
4. బ్యాంకుల జాతీయీకరణ డి.1956
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
8. కింది వాటిలో వాస్తవమైన వ్యాఖ్యలను గుర్తించండి?
ఎ. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉద్దేశించిన జాతీయ బాలకార్మిక కార్యక్రమాన్ని (ఎన్సీఎల్పీ) జాతీయ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది
బి. గురుపథ్స్వామి కమిటీ బాలకార్మిక అంశానికి సంబంధించినది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
9. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. దేశంలో అత్యధిక నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది
బి. వ్యవసాయరంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత నిరంతరం కొనసాగేది
సి. దేశంలో పారిశ్రామికీకరణవల్ల నిరుద్యోగిత పెరిగింది
1) ఎ 2) ఎ, బి, సి 3) ఎ, బి 4) బి, సి
10. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగితకు కారణం?
1) ఆర్థికాభివృద్ధి కోసం భారీ పరిశ్రమల స్థాపనకేప్రాధాన్యం ఇవ్వటం
2) దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందకపోవటం
3) భూ సంస్కరణలు నెమ్మదిగా అమలుచేయడంవల్ల జనాభా ఒత్తిడి పెరగడం
4) నిరుద్యోగిత ఎక్కువగా ఉండటం
11. దేశంలో దారిద్య్రరేఖను నిర్ణయించేందుకు ఏ కమిటీ సిఫారసులను ఆధారంగా తీసుకుంటున్నారు?
1. దత్ కమిటి 2. రాజా చెల్లయ్య కమిటీ
3. చక్రవర్తి కమిటీ 4. లక్డావాలా కమిటీ
12. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ అంటే?
1) విదేశాల నుంచి తీసుకొనే రుణాలు పెరగడం
2) విదేశాల్లో భారతీయ వ్యాపారాలు పెరగడం
3) విదేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాల్లో నిబంధనలను వీలైనంత కనీసస్థాయికి తీసుకురావడం
4) విదేశాల నుంచి దిగుమతులను ఆపివేయడం
13. కొత్త కంపెనీల స్థాపనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్ (ఎఫ్ఎఫ్ఎస్) గురించి కిందివాటిలో సరైనది?
ఎ. ఈ నిధి మొత్తం రూ. 10,000 కోట్లు. ఈ నిధులను 2015 సంవత్సరం నాటికి ఖర్చు చేయాలి
బి. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టర్ చేసుకొన్న కంపెనీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు కాకుండా సంస్థల వివిధ దశల్లో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని అందించడం ఈ పథకం ఉద్దేశం
సి. ఈ నిధి చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) పరిధిలో ఉంటుంది
డి. ఈ నిధి భారతీయ పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు పరిధిలో ఉంటుంది
1) ఎ,డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
14. ప్రాధాన్యరంగాల రుణ విధానం గురించి కింది అంశాల్లో వాస్తవమైనది?
ఎ. ఆర్థిక వ్యవస్థలో సొంతంగా, సమయానుకూలంగా రుణాలు పొందలేని రంగాలు ఈ విధానం కిందికి వస్తాయి
బి. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, విద్య, గృహనిర్మాణం తదితర రంగాలు ఈ విధానం కిందికి వస్తాయి
సి. ఈ రంగాలకు బ్యాంకులు తమ మొత్తం రుణాల్లో 40 శాతం కేటాయించాలి
1) బి, సి 2) ఎ, సి 3) ఎ, బి 4) ఎ, బి, సి
15. 1980లో రెండోదఫా బ్యాంకుల జాతీయీకరణ సందర్భంగా జాతీయం చేసిన బ్యాంకుల్లో లేనివి?
1) ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు
2) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, విజయా బ్యాంకు
3) సిండికేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు
4) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా
16. కింది వాక్యాలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి?
ఎ. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంటే విదేశీ కంపెనీలు నేరుగాగానీ, దేశంలోని ఏదో ఒక కంపెనీ భాగస్వామ్యంతోగానీ వ్యాపారం నిర్వహించడం
బి. విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ) అంటే విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని కంపెనీల్లో షేర్లు, బాండ్లలో పెట్టుబడులు పెట్టడం
1) ఎ 2) ఎ, బి 3) బి 4) ఏదీకాదు
17. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రారంభించే ప్రాజెక్టుల వాణిజ్య ప్రయోజనాలను పెంచేందుకు ఈ స్కీమ్ ద్వారా మూలధనం అందిస్తారు
బి. ఈ స్కీమ్‌ను కేంద్ర ఆర్థికశాఖ అమలు చేస్తుంది
సి. ప్రాజెక్టు నిర్మాణ దశలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది
1) ఎ, సి 2) ఎ, బి 3) బి, సి 4) ఎ, బి, సి
18. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ)లో విలీనం కాని పన్నులు ఏవి?
1) లాటరీలు, బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌లపై పన్ను
2) గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే వినోదపు పన్ను
3) వాణిజ్య ప్రకటనలపై పన్ను 4) సేవల పన్ను
19. కింది ఉత్పత్తుల్లో ఏవి జీఎస్టీ పరిధిలో ఉన్నవి?
1) పెట్రోలియం ఉత్పత్తులు 2) మద్యం
3) పొగాకు ఉత్పత్తులు 4) మోటార్ స్పిరిట్
20. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడిగా ఉండే జీఎస్టీ కౌన్సిల్లో ఏ అంశంపై అయినా నిర్ణయం తీసుకొనే విషయంలో కింది వాటిలో సరైనది?
ఎ. జీఎస్టీ కౌన్సిల్లో ఏ అంశంపై అయినా నిర్ణయం తీసుకోవాలంటే సమావేశానికి హాజరై, ఓటువేసిన మొత్తం ఓట్లలో వ వంతు ఓట్లకు తగ్గకుండా మద్దతు లభించాలి
బి. జీఎస్టీ కౌన్సిల్లో నమోదయ్యే మొత్తం ఓట్లలో కేంద్ర ప్రభుత్వానికి 1/3 శాతం, రాష్ర్టాలకు 2/3 శాతం ఓట్ల వెయిటేజీ ఉంటుంది
సి. జీఎస్టీ కౌన్సిల్‌లోని మొత్తం సభ్యుల్లో సగం మంది సమావేశానికి హాజరైతేనే కోరం ఉన్నట్లు లెక్క
1) బి 2) ఎ, బి 3) ఎ 4) అన్నీ సరైనవే
21. సాధారణంగా దేశంలో అమల్లో ఉన్న పన్నుల స్వభావం?
1) తిరోగామి స్వభావం 2) పురోగామి స్వభావం
3) స్థిర స్వభావం 4) అస్థిర స్వభావం
22. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి సరైనది?
ఎ. సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు పాలుపంచుకున్నారు
బి. 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 94 అంశాలపై సమాచారం సేకరించారు
సి. 2014 సెప్టెంబర్ 19న నిర్వహించిన ఈ సర్వేలో కుటుంబాలకు సంబంధించిన 94 అంశాలపై డాటా సేకరించారు
డి. ఈ సర్వే దేశంలోనే అతిపెద్దదని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
23. TS-ipass పూర్తి రూపం?
1) తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
2) తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
3) తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్లికేషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
4) తెలంగాణ స్టేట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
24. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండటానికి కారణం?
1. పౌరులు ఒక ఉపాధి రంగం నుంచి మరో రంగంవైపు మొగ్గుచూపటం
2. డిమాండ్ తగినంతగా లేకపోవటం
3. రుతుసంబంధ కారణాలు
4. అదనపు ఉత్పాదక మార్గాలు లేకపోవడం
25. దేశ వార్షిక ఆర్థిక పద్దును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ను అనుసరించి అదేశాలిస్తారు?
1. ఆర్టికల్స్ 116 (1),(3) 2. ఆర్టికల్ 117 (1),(3)
3. ఆర్టికల్ 217 (1), (3) 4. ఆర్టికల్ 119 (1),(3)
26. ప్రస్తుతం జాతీయాదాయ లెక్కింపులో ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తున్నారు.
1. 2010-11 2.2011-12
3. 2012-13 4. 2013-14
27. కేంద్ర ఆర్థికశాఖలో భాగంకాని విభాగం ఏది?
1. పెట్టుబడులు, ప్రజాఆస్తుల నిర్వహణ విభాగం
2. రెవిన్యూ విభాగం
3. ద్రవ్యసేవల విభాగం 4. వాణిజ్య విభాగం
సమాధానాలు..
1-2, 2-3, 3-2, 4-3, 5-2,
6-1, 7-1, 8-3, 9-3, 10-2,
11-4, 12-3, 13-3, 14-4, 15-3,
16-2, 17-4, 18-2, 19-3, 20-4,
21-2, 22-3, 23-2, 24-4, 25-2,
26-2, 27-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు