Marketing & Sales Jobs | మార్కెటింగ్ & సేల్స్ ఉద్యోగావకాశాలు ఎలా?
-మన దేశంలో వివిధ పరిశ్రమల్లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 130 కోట్లకు పైగా జనాభాగల దేశం మనది. దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి సేల్స్, మార్కెటింగ్ విభాగాలు ఎంతో తోడ్పడుతాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతి తొందరగా అభివృద్ది చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి.
-ప్రతి కంపెనీ పెరుగుదలలో మార్కెటింగ్, సేల్స్ విభాగాల పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. మనదేశం అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కార్పొరేట్ హబ్. అందుకే మార్కెటింగ్‌లో ఎవరి కేరీర్ అయినా లాభదాయకంగానే ఉంటుంది. చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నైపుణ్యతవల్లే అభివృద్ధి చెందుతుంది.
-మార్కెటింగ్, సేల్స్ ప్రభావం భౌతికంగా ఉండే వస్తువులు (టాంజెబుల్) & సర్వీస్ (ఇంటాంజెబుల్) ఇండస్ట్రీలపై ఆధారపడి ఉంది. ప్రోడక్ట్ ఇండస్ట్రీ కంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. కంపెనీ ఆర్థిక లాభాలుకానీ, వృత్తిలో పెరుగుదలకానీ సర్వీస్ ఇండస్ట్రీ నుంచే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేటు సంస్థల్లోనైనా సర్వీస్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది.
-కన్జ్యూమర్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్‌లో సేల్స్, మార్కెటింగ్ పాత్ర ఎంతో ఉన్నది. ప్రభుత్వ రంగంలో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలు తక్కువగా వుంటాయి. ప్రైవేటు సంస్థల్లో సేల్స్ మార్కెటింగ్ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటంవల్ల వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలకు కొదవలేదు. చిన్న, మధ్యతరహా, పెద్ద సంస్థల్లో మార్కెటింగ్, సేల్స్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. చిన్న గుండుసూది నుంచి పెద్దపెద్ద విమానాల వరకు ప్రతి వస్తువు క్రయవిక్రయాల్లో సేల్స్, మార్కెటింగ్ పాత్ర ఎంతగానో ఉంటుంది. సేల్స్, మార్కెటింగ్ విభాగం ప్రతి కంపెనీకి వెన్నెముక లాంటిది.
-సేల్స్, మార్కెటింగ్ రంగం ఉద్యోగికి నెలవారి ఆదాయం చాలా బాగుంటుంది. కమీషన్లు, టార్గెట్ రీచ్ అయితే ఇచ్చే ఇన్సెంటివ్‌లు సేల్స్ పర్సన్స్‌కు అదనపు ఆదాయాన్ని ఇస్తూ ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. సేల్స్ పర్సన్లు తమ నైపుణ్యం ఆధారంగా నెలకు వేల నుంచి లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
-మార్కెటింగ్ రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మార్కెటింగ్ రంగం ఎన్నో మార్గాల్లో అభివృద్ధి చెందింది. పరిశోధన, సమాచార, ఉత్పత్తి సేవలు, బిజినెస్ టు కన్జ్యూమర్ (B2C), బిజినెస్ టు బిజినెస్ (B2B), ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవలు, అరోగ్య సంరక్షణ, డిజిటల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, కన్సెల్టెన్సీ తదితర విభాగాల్లో మార్కెటింగ్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
-ఒకవేళ కంపెనీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా కూడా మార్కెటింగ్, సేల్స్‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వరంగంలోనే ఉద్యోగభద్రత ఉంటుందనుకోవడం భ్రమే. సమర్థమంతంగా పనిచేసే నైపుణ్యం ఉంటే ప్రైవేటురంగంలోనే ప్రభుత్వరంగంలో కంటే ఎక్కువ ఆదాయం సంపాదించొచ్చు.
-యువతలో చాలా మంది కెరీర్‌ను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం పాసయితే చాలు అనే ధోరణిలో చదువుతున్నారు. దీనివల్ల ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి కూడా నిరుద్యోగులుగా ఉండటానికి కారణం వారిలో సరైన నైపుణ్యాలు లేకపోవడమే. ఉద్యోగంలో చేరకముందే.. ఈ ఉద్యోగంలో రాణించగలమా? అనే సందేహం ఎక్కువ మందిలో నెలకొంటుంది. కాబట్టి ముందుగా మనలోని సామర్థ్యాలను గుర్తించి అందుకు తగిన ఉద్యోగంలో చేరితే మార్కెట్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?