Ecology Terminology | ఆవరణశాస్త్రం పరిభాష
జాతి
-తమలో తాము అంతర ప్రజననం చెందగల సమాన లక్షణాలు ఉన్న జీవుల సమూహాన్ని జాతి అంటారు.
-ఒక జాతి జీవులు మరొక జాతి జీవులతో లైంగిక వివక్తను కలిగి ఉంటాయి. పర్యావరణంలో అనేక జాతుల మొక్కలు, జంతువులు ఉన్నప్పటికీ ఒక జాతిలోని ఆడ, మగ జీవుల మధ్యనే అంతర ప్రజననం సాధ్యమవుతుంది.
జనాభా
-ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా లేదా Population అంటారు.
-జనాభా అనేది ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను తెలుపుతుంది.
ఉదా: భారతదేశంలో 2006 సెన్సెస్ ప్రకారం పులుల జనాభా 1411
జీవ సమాజం
-ఏదైనా నిర్దిష్ట ఆవాసంలో ఉండే వివిధ జాతులకు చెందిన సూక్ష్మజీవులు, వృక్షాలు, జంతువుల సమూహాన్ని జీవ సమాజం అంటారు.
-ఒక ప్రాంతంలోని వివిధ జాతుల జనాభాను కలిపి జీవసమాజం అంటారు.
జీవావరణ వ్యవస్థ
-జీవావరణ శాస్త్ర నిర్మాణాత్మక, క్రియాశీల ప్రమాణం, జీవావరణ వ్యవస్థ, జీవ, నిర్జీవ కారకాల మధ్య నిరంతరం జరిగే పదార్థాల, శక్తి మార్పిడి వ్యవస్థను జీవావరణ వ్యవస్థ అని అంటారు.
ఆవాసం
-ఒక జీవి నివసించే ప్రదేశాన్ని ఆవాసం అని అంటారు. కాంతి, ఉష్ణం, తేమ అనే భౌతిక లేదా నిర్జీవ కారకాలు ఒక జీవి జీవించే పర్యావరణ ప్రాంతాన్ని నిర్ధారిస్తాయి.
ఉదా: స్థూల నివాసం గల జీవి- టర్న్ పక్షి సూక్ష్మ నివాసం గల జీవి- కాకి
ఎకలాజికల్ నిషే (Ecological Niche)
-జీవ సమాజంలో ఒక జీవి క్రియాత్మక స్థాయిని Ecological Niche అంటారు.
-ఒక జీవి ప్రవర్తన, స్పందన, సమాజంలోని ఇతర జీవులతో ఇవి జరిపే కార్యకలాపాలు, పరస్పర చర్యలను ఎకలాజికల్ నిషే అంటారు.
ఉదా: జీవావరణంలో మనిషి ఒక సర్వభక్షకుడు.
జీవ మండలం
-ఒక నిర్దిష్ట వాతావరణం గల విశాల భౌగోళిక ప్రాంతంలోని అన్ని జీవ సమాజాల సముదాయాన్ని జీవమండలం(Biome) అంటారు.
-సాధారణంగా ఒక భూచర జీవమండలంలోని ఒక ఆధిక్య వృక్షజాలం ఆధారంగా దీనికి నామకరణం చేస్తారు.
ఉదా: టాండ్రా- వృక్షరహిత ప్రాంతం
జీవగోళం
-జీవులు, జీవం విస్తరించి ఉన్న భూభాగాన్ని జీవగోళం లేదా పర్యావరణ గోళం అంటారు.
-భూమి మీద ఉన్న అన్నిరకాల జీవ మండలాలను కలిపి జీవగోళం అంటారు. సముద్ర మట్టానికి 7-8 కి.మీ.ల ఎత్తు వరకు, సముద్రంలో 5 కి.మీ.ల లోతు వరకు జీవులు విస్తరించి ఉన్నాయి.
జీవావరణ అనుక్రమం
-భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని, ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. దీనిని జీవావరణ వ్యవస్థ అభివృద్ధి అని అంటారు.
-జీవావరణ అనుక్రమం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చాలాకాలం వరకు అంటే స్థిర సమాజం ఏర్పడే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది పరాకాష్ఠ సమాజం ఏర్పడడంతో నిలిచిపోతుంది.
ఆహార గొలుసు
-జీవావరణ వ్యవస్థలో ఒక పోషణస్థాయి నుంచి మరొక పోషణ స్థాయికి ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఆహారరూపంలో శక్తి ప్రసరించే విధానాన్ని ఆహార గొలుసు అంటారు. ఇది ఆవరణ వ్యవస్థ గతిశీల భాగం.
ఆహార వల
-వివిధ ఆహార గొలుసుల్లోని పోషణ స్థాయిల మధ్య ఏర్పడే చర్యల ద్వారా తయారయ్యే సంక్లిష్ట వల వంటి నిర్మాణాన్ని ఆహారవల అంటారు.
ఎకోటోన్
-ఇది రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య పరివర్తనా ప్రాంతం.
బయోమాగ్నిఫికేషన్
-ఒక ఆహార శృంఖలంలోని కింది పోషణ స్థాయి జీవుల నుంచి ఆహార మాధ్యమంగా కొన్ని హానికర రసాయనాలు పై పోషణ స్థాయి జీవుల్లో పేరుకుపోవడాన్ని బయోమాగ్నిఫికేషన్ లేదా బయెలాజికల్ అక్యుమ్యులేషన్ అంటారు
జీవావరణ పిరమిడ్
-ఒక ఆహార శృంఖలంలోని వివిధ పోషణ స్థాయిల మధ్య సంబంధాన్ని సూచించే పిరమిడ్ నిర్మాణం జీవావరణ పిరమిడ్.
-1920లో మొదటిసారిగా చార్లెస్ ఎల్టన్ ఈ భావనను వివరించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. థయామిన్ లోపంవల్ల కలిగేవ్యాధి?
1) బెరి-బెరి 2) పెల్లాగ్రా
3) అనీమియా 4) రికెట్స్
2. పండిన మామిడిపండ్లలో ఉండే విటమిన్?
1) మిటమిన్-ఏ 2) విటమిన్-బీ
3) విటమిన్-సీ 4) విటమిన్-డీ
3. గాయాలు మానడంలో, ఎముకల విరుగుడును తొందరగా తగ్గడానికి ఉపయోగిపడే విటమిన్?
1) సీ 2) బీ 3) బీ12 4) బీ1
4. తాజా పండ్లలో ఉండే విటమిన్?
1) సీ 2) డీ 3) ఈ 4) బీ
5. ప్రతిరక్షకాల ఉత్పత్తికి, హీమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్?
1) విటమిన్-బీ12 2) విటమిన్-బీ6 3) విటమిన్-బీ 4) బిటమిన్ -బీ1
6. శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మా అని సంబోధించి, తర్వాత వయసు పెరిగేకొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు 2) వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది
3) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
4) వికాసం ఒక కచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది
7. పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నవారు?
1) ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ 2) క్యాథరిన్ ఫ్రాంక్
3) జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్
4) జూడితే కెపెల్
8. మలేరియా ఏ పరాన్న జీవి (పారాజైట్) ద్వారా సంభవిస్తుంది?
1) దోమ 2) ప్లాస్మోడియం
3) ఎంటమీబా 4) ట్రిపనోసోమా
9. జాండిస్ వ్యాధి ఏ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది?
1) కాలేయం 2) పొట్ట
3) ఊపిరితిత్తులు 4) మూత్రపిండాలు
10. కింద పేర్కొన్న రోగాలు, వాటిని నివారించే వ్యాక్సిన్లలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. (4)
1) డిఫ్తీరియా- డీపీటీ 2) క్షయ- బీసీజీ
3) తట్టు- ఎంఎంఆర్
4) ధనుర్వాతం- శాబిన్
11. కోరింతదగ్గును కలిగించే వ్యాధికారకం?
1) బ్రాడిటెల్లీ బ్రాంకి సెప్టికా
2) మైకోప్లాస్మా
3) ఇన్ఫ్లుయెంజా 4) పేటరుల్లా
12. కిందివాటిలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి?
1) ప్లేగు 2) టైఫాయిడ్ 3) క్షయ 4) కలరా
13. ఒక బాలుడి వికాసదశకు సంబంధించి సరికాని వాక్యం?
1) యువ్వనారంభ దశ – అలైంగిక జీవి లైంగికంగా మారడం
2) కౌమార దశ – భిన్న లైంగిక దశ
3) పూర్వబాల్య దశ – ఆత్మభావన ఏర్పడే దశ
4) ఉత్తరబాల్య దశ – సాంఘిక వికాసానికి తొలిమెట్టు
14. ఒక శిశువు ఏడుస్తున్న మరో శిశువుకు తనవద్ద ఉన్న బొమ్మను ఇవ్వడం ద్వారా ఓదార్చింది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేన్ని సూచిస్తుంది?
1) సాంఘిక వికాసం మాత్రమే
2) సాంఘిక, ఉద్వేగ వికాసం
3) చలనాత్మక వికాసం
4) ఉద్వేగ వికాసం మాత్రమే
15. శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులననుసరించి తనను ప్రేమించుకునే గుణమైన నార్సిజంను ప్రదర్శించే దశ?
1) శైశవదశ 2) కౌమార దశ
3) బాల్య దశ 4) యవ్వన దశ
16. పిల్లలు తరచుగా ప్రవర్తించే చలనాత్మక నైపుణ్యాల్లో ఏ రకమైన కృత్యం సూక్ష్మ చలనాత్మక నైపుణ్యంను తెలుపుతుంది?
1) నెమ్మదిగా పాకడం
2) అరచేతిలో పట్టుకోవడం
3) కూర్చోవడం 4) నడవడం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?