ఇవి విజ్ఞాన భాంఢాగారాలు
మనిషి విజ్ఞానాన్ని సంపాదించేందుకు, ఆ విజ్ఞానాన్ని భద్రపర్చేందుకు అత్యద్భుత ప్రదేశం గ్రంథాలయం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, మేధావులు ఇలా ఎవరికైనా ఏదో ఒకటి నేర్పేది గ్రంథాలయం. ఉద్యోగార్థులు, పరిశోధక విద్యార్థులకు ముఖ్యంగా గ్రంథాలయాలు ఎంతో అవసరం. దేశంలోని కొన్ని ప్రసిద్ధ గ్రంథాలయాల సమాచారం నిపుణ పాఠకుల కోసం..
స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాద్
ఇది హైదరాబాద్‌లో ఉంది. 1891లో దీనిని స్థాపించారు. నవాబ్ ఇమాద్-ఉల్-ముల్క్ అద్భుత నిర్మాణంతో ఈ లైబ్రరీని కట్టించాడు. తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ లైబ్రరీ ఇది. లక్షల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు కావాల్సిన సమాచారం అందిస్తూ పాఠకులను ఆకట్టుకుంటుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కొల్కతా
ఈ లైబ్రరీ కొల్‌కతాలోని అలీపూర్‌లో ఉంది. దేశంలో అత్యధిక పుస్తక భాంఢాగారాన్ని కలిగిన గ్రంథాలయం ఇది. సుమారు రెండు మిలియన్లకుపైగా పుస్తకాలు ఉండటంతో ఎక్కువ మంది పాఠకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. సింధ్, తమిళ్, తెలుగు, గుజరాతీ, హిందీ, కన్నడ, పంజాబీ, ఒరియా, కశ్మీరీ, సంస్కృతం, ఉర్దూ మొదలైన భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. పాళి, ప్రాకృతంలో రాసిన అరుదైన పుస్తకాలు కూడా లభ్యమవుతాయి.
నేషనల్ పబ్లిక్ లైబ్రరీ, న్యూఢిల్లీ
ఈ గ్రంథాలయంలో పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్లు వంటివి డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. ప్రారంభపు చందాతో పాఠకులు లైబ్రరీ సౌకర్యాలు పొందవచ్చు. ఢిల్లీవ్యాప్తంగా మొత్తం 30 బ్రాంచీలు ఉన్నాయి. వివిధ భాషలకు చెందిన 17 లక్షల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించడంతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందిస్తుంది. తీహార్ సెంట్రల్ జైలులో ఉండే ఖైదీలు సైతం చదువుకునేందుకు ప్రత్యేక లైబ్రరీని ఏర్పాటు చేయడమే కాకుండా, దృష్టిలోపం ఉన్న పిల్లలు సైతం చదివేలా అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది.
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, న్యూఢిల్లీ
చరిత్రాత్మక మ్యూజియంగా ఇది ప్రసిద్ధి. మహత్మాగాంధీ, జయప్రకాశ్ నారాయణ్, సరోజినీనాయుడు వంటి ప్రముఖ నాయకులకు సంబంధించిన కీలక విషయాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. సోషల్ సైన్స్, కార్మిక అంశాలకు సంబంధించిన ప్రత్యేక టాపిక్స్ ఇక్కడ చదవవచ్చు. నాలుగు లక్షల పేజీలతో డిజిటల్ వెబ్‌సైట్‌ను నడిపిస్తుంది ఈ గ్రంథాలయం.
ఇండియన్ హెబిటాట్ సెంట్రల్, న్యూఢిల్లీ
చదివిన అంశాలను నోట్ చేసుకునేందుకు, సందేహాలు వస్తే క్లారిఫై చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది ఈ లైబ్రరీ. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. రచయితల చర్చాగోష్టి, సభలు, సమావేశాలను నిర్వహిస్తూ పాఠకులను ఆకర్షిస్తుంది. ఆడియో విజువల్స్‌తో పాటు వైఫై సౌకర్యాన్ని పొందవచ్చు. పాఠకులు రిలాక్స్ అయ్యేందుకు క్యాంటీన్ సదుపాయం కూడా ఉంది. ఏవైనా పుస్తకాలు పాఠకులకు నచ్చినట్లయితే కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఈ లైబ్రరీ కల్పించింది.
సరస్వతి మహల్ లైబ్రరీ, తంజావూర్
ఆసియాలోనే అతి పురాతన గ్రంథాలయం ఇది. దీనిని తంజావూరు రాజులు నిర్మించారు. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ లైబ్రరీ కొనసాగుతుంది. తెలుగు, మరాఠీ, సంస్కృతం, హిందీ వంటి స్థానిక భాషలకు చెందిన రాతప్రతులను ఈ లైబ్రరీ భద్రపర్చింది. త్వరలోనే ఈ గ్రంథాలయం డిజిటలైజేషన్ కాబోతుంది.
ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్, బెంగళూరు
రీడింగ్ అలవాటును పెంపొందించడమే కాకుండా మేధోపరమైన యాక్టివిటీస్‌ను నిర్వహిస్తూ పాఠకులను ఆకట్టుకుంటుంది. దాదాపు 40,000 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఆంగ్లం, కన్నడ భాషలకు చెందిన పురాతన పుస్తకాలు ఇక్కడ భద్రపర్చబడి ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్, క్విజ్ షో వంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠకులను ఆకట్టుకుంటుంది.
శేషాద్రి మెమోరియల్ లైబ్రరీ, బెంగళూరు
ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పరిసరాలతో పాఠకులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది ఈ లైబ్రరీ. రాజా రామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అవార్డు, బెస్ట్ సెంట్రల్ లైబ్రరీ వంటి అవార్డులను సొంతం చేసుకుంది. రెండు లక్షల పుస్తకాలతోపాటు బ్రెయిలీ సెక్షన్ సౌకర్యం ఉంది.
స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, తిరువనంతపురం
దేశంలో మెదటి గ్రంథాలయం ఇది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఉంది. త్రివేండ్రం పబ్లిక్ ల్రైబ్రరీగా పేరొందింది. స్వాతి తిరునల్ మహరాజా నిర్మించారు. 700 డిజిటలైజ్డ్ పుస్తకాలు ఉన్నాయి.
అన్నా సెంటెనరీ లైబ్రరీ, చెన్నై
రూ. 170 కోట్లతో ఈ గ్రంథాలయ నిర్మాణం జరిగింది. చెన్నైలోని కొత్తపురంలో ఉన్న ఈ లైబ్రరీ ఆసియాలోనే అతిపొడవైంది. ప్రతినెలా 20,000 మంది పాఠకులు సందర్శిస్తుంటారు. ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) టెక్నాలజీ కలిగి ఉండటంతో పాటు ఆడిటోరియం, మీటింగ్ హాల్, పిల్లలకు ప్రత్యేక గదులు ఉన్నాయి. ఒక మిలియన్ పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.
కన్నెమర పబ్లిక్ లైబ్రరీ, చెన్నై, తమిళనాడు
దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పుస్తకాలు, దినపత్రికలు, మ్యాగజైన్లు ఈ లైబ్రరీలో లభిస్తాయి. విలువైన, ప్రసిద్ధమైన అంశాలను సేకరించి భద్రపరుస్తుంది. ఈ లైబ్రరీ అభివృద్ధికి ప్రతి ఏటా స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది.
బ్రిటిష్ కౌన్సిల్, చెన్నై
ఎటుచూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఒక్కసారి ఈ లైబ్రరీలో అడుగుపెడితే ఇతర విషయాలు మరిచిపోయి పుస్తకాలతో గడపాల్సిందే. పగలు, రాత్రి అనే తేడా లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పాఠకులకు విశేషంగా సేవలందిస్తుంది.
క్రిష్ణదాస్ శామ సెంట్రల్ లైబ్రరీ, గోవా
కొంకణి, ఉర్దూ, బెంగాలీ, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన అద్భుత పుస్తకాలు ఉన్నాయి. పోర్చుగీసుకు చెందిన పురాతన దినపత్రికలు ఇక్కడ ఉండటం విశేషం. 5 లక్షల పుస్తకాలు పట్టేలా భవన సముదాయంతో నెలకొల్పబడింది.
ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై
రాతిపై చెక్కిన పద్యంలా ఉంటుంది ఈ లైబ్రరీ. దీనిని జేమ్స్ మాకింతోష్ ప్రారంభించారు. 20 వేల అరుదైన పుస్తకాలు దీంట్లో ఉన్నాయి. పాఠకులను ఆకట్టుకునేందుకు అడాప్ట్ ఎ బుక్ లాంటి సృజనాత్మక ప్రోగ్రామ్‌లు ప్రారంభిస్తూ పాఠకులను ఆకట్టుకుంటుంది.
అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ, ఉత్తరప్రదేశ్
ఇది అలహాబాద్‌లో ఆల్ఫ్రెడ్ పార్క్ వద్ద ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద గ్రంథాలయం ఇది. లక్ష పుస్తకాలు, వివిధ భాషలకు చెందిన దినపత్రికలు, అరబిక్కు చెందిన అరుదైన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. అంతేకాకుండా నాలెడ్జ్ షేరింగ్ సెంటర్ కూడా ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు