వందేమాతర ఉద్యమం ఎక్కడ మొదలైంది?
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్చెస్టర్ గార్డియన్ లాంటి విదేశీ పత్రికలు కూడా బెంగాల్ విభజనను నిరసిస్తూ వార్తలు ప్రచురించాయి. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు పరిమితం కాకుండా దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.
-ఈ ఉద్యమాన్ని బెంగాల్ నుంచి దేశవాప్తంగా ప్రచారం చేయడంలో బిపిన్ చంద్రపాల్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన మద్రాస్, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఈ ఉద్యమ కాలంలోనే ట్యుటికోరిన్ (మద్రాస్)లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీని స్థాపించారు. అక్కడ ఈ ఉద్యమాన్ని సుబ్రమణ్య అయ్యర్, చిదంబర పిైళ్లె విస్తృతం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు నేతృత్వం వహించారు. పంజాబ్‌లో భగత్‌సింగ్ మేనమామ అజిత్ సింగ్ అంజుమాన్ మెహబత్ వాటన్ అనే సంస్థను, భారతమాత అనే పత్రికను నడిపి ఉద్యమాన్ని విస్తరించారు.
-ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను, బ్రిటిష్ యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో హిందువులు, ముస్లింలు ఐక్యతతో పాల్గొన్నారు. దేశంలో మొదటిసారిగా మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు. బహిష్కరణోద్యమం జరుగుతున్న సమయంలోనే నాయకులు నిర్మాణాత్మక ఆలోచనలతో స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు.
-వందేమాతర ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపిన అతివాద నాయకుల్లో ముఖ్యులు బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్, అరవిందఘోష్.
బాలగంగాధర తిలక్
-1866లో పుణెలో జన్మించాడు. అతివాద ఉద్యమాల వల్ల ఇతన్ని అశాంతి పితామహుడు అని అన్నారు. లాఠీ క్లబ్‌లు, అఖాడాలు అని పిలిచే వ్యాయామశాలలు నెలకొల్పాడు.
-అగార్కర్, రనడే, దాదాబాయ్ నౌరోజీల వల్ల ప్రభావితుడైన బాలగంగాధర తిలక్ సాంఘిక, రాజకీయ దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాడు.
-ఇతడు రనడే స్థాపించిన దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీలో సభ్యత్వాన్ని పొందాడు. 1889లో జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. ప్రజల్లో దేశభక్తిని, జాతీయతను మేల్కొల్పడానికి 1893లో గణేష్, 1895లో శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు.
-అగార్కర్‌తో కలిసి ఇంగ్లిష్‌లో మరాఠ, మరాఠీలో కేసరి అనే పత్రికలను ప్రారంభించాడు. కేసరి పత్రిక ద్వారా ప్రజల్లో జాతీయభావాలను ప్రచారం చేశాడు.
-1896, 97ల్లో సంభవించిన కరువు వల్ల వేలకొద్ది ప్రజలు మరణించడంతో బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని కేసరి పత్రికలో విమర్శించి, ఉద్యమాన్ని ప్రారంభించినందుకు బ్రిటిష్ ప్రభుత్వం తిలక్‌కు 18 నెలల జైలుశిక్ష విధించింది.
-తిలక్ తాను రాసిన గీతా రహస్యం అనే గ్రంథంలో కర్మ సిద్ధాంతానికి కొత్త భాష్యం చెప్పాడు.
-ఇతడు భారతదేశ చరిత్రకు సంబంధించి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనే పుస్తకాన్ని రచించాడు.
-తిలక్ పుణెలో విదేశీ వస్త్ర దహన కార్యక్రమాన్ని నిర్వహించాడు.
-స్వదేశీ వస్తు ప్రచారిణి సభకు నాయకుడిగా, సహకార విక్రయ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా కేసరి పత్రికలో మనదేశం మహావృక్షం లాంటిది. స్వరాజ్యం మూలాధారం, స్వదేశీ, ఆర్థిక బహిష్కారం కొమ్మలు అని తిలక్ పేర్కొన్నాడు.
-1908లో తిలక్‌ను రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి మాండలే జైలుకు పంపారు. దీనికి నిరసనగా బొంబాయి కార్మికవర్గం మొదటిసారిగా సమ్మె చేసింది. దీన్ని విప్లవ ప్రాముఖ్యమైనదిగా లెనిన్ అభివర్ణించాడు. అప్పటి దినపత్రికైన మద్రాస్ టైమ్స్ తిలక్‌ను అరెస్టు చేయడం జాతి విపత్తును సృష్టించడం అని పేర్కొన్నది.
లాలా లజపతిరాయ్
-పంజాబ్‌లో స్వదేశీ ఉద్యమాలు నిర్వహించిన ప్రముఖ అతివాద నాయకుడు లాలా లజపతిరాయ్.
-ఈయన్ని పంజాబ్ కేసరి అని కూడా పిలుస్తారు. 1905-08 మధ్య జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర పోషించాడు.
-స్వదేశీ ఉద్యమం చివరికాలంలో దేశ బహిష్కరణకు గురయ్యాడు. తర్వాత అమెరికా సంయుక్త రాష్ర్టాలకు వెళ్లి అక్కడ హోమ్‌రూల్ ఉద్యమాన్ని స్థాపించాడు.
-1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన ఉద్యమ ంలో శాడర్స్ లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి 1928, నవంబర్ 17న మరణించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు