ఆర్థిక వ్యవస్థ-జాతీయాదాయం
1951 చివరలో కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో)ను ప్రారంభించారు. సీఎస్‌వో మొదటి గణాంకాలను వైట్ పేపర్‌గా పిలిచారు. అనంతరం నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్)గా మార్చారు. దేశంలో కేంద్ర గణాంకాల సంస్థ ఆధార సంవత్సరాన్ని ఎంపిక చేస్తుంది. సాధారణంగా ఆధార సంవత్సరాన్ని దశాబ్దానికి ఒకసారి మారుస్తారు. ఇప్పటివరకు సీఎస్‌వో 8 ఆధార సంవత్సరాలను ఏర్పాటు చేసింది.
-గ్రూప్-4, వీఆర్వో పరీక్షల్లో భారతదేశ, తెలంగాణ ఆర్థికవ్యవస్థ అనే టాపిక్కు సంబంధించి.. జాతీయ ఆదాయం, పేదరిక సమస్యలు-వాటి నిర్మూలన పథకాలు, నిరుద్యోగ నిర్మూలన పథకాలు, వివిధ పంచవర్ష ప్రణాళికలు, జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఇటీవల ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న ఆర్థికాభివృద్ధి పథకాలు, నీతి ఆయోగ్ ఏర్పాటు-నిర్వహణ-విధులు, దేశ, రాష్ట్ర ఆర్థిక సర్వేలు మొదలైన అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.
1. జాతీయ ఆదాయం
-ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ఏడాదిలో కొలవడాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొనవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుంటాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక ఏడాదిగా పరిగణిస్తున్నారు.
-ఒక దేశంలో ఒక ఏడాదిలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. అంటే జాతీయ ఆదాయ గణనలో ముడి పదార్థాన్నిగాని, మాధ్యమిక వస్తువులనుగానీ తీసుకోకుండా పూర్తిగా తయారైన వస్తువులను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
జాతీయ ఆదాయ చారిత్రక అంశాలు
-భారత జాతీయ ఆదాయాన్ని మొదటిసారి 1868లో శ్రీ దాదాభాయ్ నౌరోజీ కొలిచారు. ఆయన ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్‌వారు పూర్తిగా దోపిడీ చేశారు. ఈ విషయాన్ని నౌరోజీ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథంలో పేర్కొన్నారు.
నాడు నౌరోజీ గణన ప్రకారం…తలసరి ఆదాయం- రూ. 20 జాతీయ ఆదాయం- రూ. 340 కోట్లు
-1945-46 ఆర్థిక ఏడాదిలో వాణిజ్య శాఖ భారత జాతీయ ఆదాయాన్ని లెక్కించింది. దాని ప్రకారం… తలసరి ఆదాయం- రూ. 198 జాతీయ ఆదాయం- రూ. 6,234 కోట్లు
-1949, ఆగస్టులో భారత ప్రభుత్వం జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షులు పీసీ మహలనోబిస్. ఆయనకు సహాయకులుగా వీకేఆర్‌వీ రావు, డీఆర్ గాడ్గిల్ నియమితులయ్యారు. జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికను 1951లో సమర్పించింది.
-1951 చివరలో కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో)ను ప్రారంభించారు. సీఎస్‌వో మొదటి గణాంకాలను వైట్ పేపర్‌గా పిలిచారు. అనంతరం నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్)గా మార్చారు. ఎన్ఏఎస్.. తలసరి ఆదాయాన్ని రూ. 268 గా, జాతీయ ఆదాయాన్ని రూ. 8,525 కోట్లుగా గణించింది.
ఆధార సంవత్సరం
-ఆధార సంవత్సరంలో ధరలు ఎక్కువగాగానీ, తక్కువగాగానీ ఉండకుండా విధాన ధరలు ఉంటాయి. కాబట్టి ప్రతి దేశం ఆధార సంవత్సరాన్ని కలిగి ఉంటుంది.
-మనదేశంలో కేంద్ర గణాంకాల సంస్థ ఆధార సంవత్సరాన్ని ఎంపిక చేస్తుంది. సాధారణంగా ఆధార సంవత్సరాన్ని దశాబ్దానికి ఒకసారి మారుస్తారు. ఇప్పటివరకు సీఎస్‌వో 8 ఆధార సంవత్సరాలను ఏర్పాటు చేసింది.
1948-49 దేశంలో మొదటి ఆధార సంవత్సరం
2004-05 ఇంతకుముందటి ఆధార సంవత్సరం
2011-12 ప్రస్తుత ఆధార సంవత్సరం
-ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ప్రస్తుత ఏడాది ధరలతో గణిస్తే లభించేది నామమాత్రపు జాతీయాదాయం. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ప్రస్తుత ధరలతో కాకుండా ఆధార సంవత్సర ధరలతో గణించగా లభించేది నిజ జాతీయాదాయం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు