రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
2015-16 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2014-15 కంటే కాలువల ద్వారా స్థూల నీటిపారుదల సౌకర్యాల శాతం తగ్గి, చెరువుల ద్వారా స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతం పెరిగింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించడమే దీనికి కారణం.
తెలంగాణ – నీటిపారుదల సౌకర్యాలు
– దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలో (1951-56) వ్యవసాయానికి, నీటిపారుదల రంగానికి అధిక కేటాయింపులు చేశారు.
– 1945లో కేంద్ర జల సంఘం స్థాపించారు.
– ఇది జలవనరుల అభివృద్ధి రంగంలో దేశంలోనే ప్రధానమైన ఇంజినీరింగ్ సంస్థ
– జాతీయ జలవిజ్ఞాన సంస్థను 1979లో స్థాపించారు.
– ప్రధాన కార్యాలయం రూర్కీ (ఒడిశా)లో ఉంది.
– 1985, అక్టోబర్లో నీటిపారుదల విభాగం పేరును జల వనరుల మంత్రిత్వశాఖగా మార్చారు.
– జాతీయ జలమండలిని (National Water policy) 1990లో స్థాపించారు.
– 2002లో కొత్త జాతీయ జల విధానాన్ని ప్రకటించారు.
– 2008, నవంబర్ 4న గంగానదిని జాతీయ నదిగా ప్రకటించారు.
– వ్యవసాయం సుస్థిరంగా కొనసాగాలంటే సరైన నీటి వసతి అన్నింటి కంటే ప్రధానమైంది.
– భారతదేశం, తెలంగాణలో ముఖ్యంగా నీటిపారుదల సౌకర్యాలు మూడు మార్గాల ద్వారా కల్పిస్తున్నారు. అవి..
– చెరువులు, కాలువల ద్వారా వ్యవసాయం క్షీణించి, ప్రస్తుతం బోరుబావుల ద్వారా వ్యవసాయం పెరిగింది.
– ఇండియా, తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాల క్రమం
ఇండియాలో > బావులు > కాలువలు > చెరువులు
తెలంగాణలో > బావులు > చెరువులు > కాలువలు
గమనిక: ఇండియా, తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు బావుల ద్వారానే అధికంగా కల్పిస్తున్నారు.
– రాష్ట్రంలో బోరుబావుల మీద అధికంగా ఆధారపడటం వల్ల కాలువలు, చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యాల విస్తీర్ణశాతం తగ్గింది.
– రాష్ట్రంలో 2014-15 గణాంకాల ప్రకారం పరిశీలిస్తే 2015-16 గణాంకాల ప్రకారం 2014-15 కంటే కాలువల ద్వారా స్థూల నీటి పారుదల సౌకర్యాల శాతం తగ్గి చెరువుల ద్వారా స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతం పెరిగింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించడం ఇందుకు కారణం.
నీటిపారుదల
– వర్షపాతం కాక ఇతర పద్ధతుల ద్వారా వర్షం వచ్చినప్పుడు నిల్వ చేసిన నీటిని సరఫరా చేసి వ్యవసాయం చేయడాన్ని నీటిపారుదల అంటారు.
– నీటిపారుదల స్థిరీకరించబడితే వ్యవసాయం, సాగు క్రమబద్ధీకరించబడుతాయి. సాగు నష్టాల సంభావ్యత తగ్గుతుంది.
– నీటిపారుదల సౌకర్యాలను కింది విధంగా వర్గీకరించవచ్చు.
నీటిపారుదల సౌకర్యాలు బావుల ద్వారా నీటిపారుదల
1. బోరు బావులు
2. గొట్టపు బావులు
– తెలంగాణ ప్రాంతంలో గడిచిన రెండు దశాబ్దాల కింద వరకు బావుల ద్వారా వ్యవసాయం జరిగేది. కాలక్రమేణా భూగర్భజలాలు ఇంకి లోపలికిపోయిన కారణంగా బావుల ద్వారా వ్యవసాయానికి సాగు నీటి సదుపాయం తగ్గిపోయింది.
గమనిక: గొట్టపుబావులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు –
1. తమిళనాడు (11 లక్షలు)
2. మహారాష్ట్ర
– కాలువ ద్వారా నీటిపారుదల
1. వరద కాలువలు
2. జీవకాలువలు
– తెలంగాణలో కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు వర్షపాతం ద్వారా జరిగేవి. తెలంగాణ వర్షపాతంలో అనిశ్చితత్వం, కరువు ఎక్కువ కాబట్టి వర్షపాతం ద్వారా సాగునీటి పారుదల విస్తీర్ణం తక్కువ. అందువల్ల కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు తక్కువ.
– కాలువల ద్వారా నీటిపారుదల నికరవిస్తీర్ణం పరంగా దేశంలో ఉత్తరప్రదేశ్లో అధికంగా ఉండగా, తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి.
– కాలువల ద్వారా నికరవిస్తీర్ణం పరంగా దేశంలో మిజోరంలో తక్కువగా ఉండగా, రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో తక్కువగా ఉన్నది.
– కాలువల విస్తీర్ణ శాతంపరంగా చూస్తే దేశంలో ఛత్తీస్గఢ్లో అధికంగా ఉండగా, రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నది.
– కాలువల విస్తీర్ణం దేశంలో తక్కువగా ఉండగా, తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి.
దేశంలో ముఖ్యమైన కాలువలు
– దేశంలో అతిపెద్ద కాలువ ఇందిరాగాంధీ కాలువ/రాజస్థాన్ కాలువ. ఇది 650 కి.మీ. పొడవు ఉన్నది.
– ఈ కాలువ రాజస్థాన్లోని జైసల్మీర్ నుంచి పంజాబ్లోని హరికే బ్యారేజి వద్ద గల ఫిరోజ్పూర్ వరకు ఉంది.
తెలంగాణలోని ప్రధాన కాలువలు
1. కాకతీయ కాలువ – ఇది తెలంగాణలో పొడవైన కాలువ 284 కి.మీ.
2. లక్ష్మీకాలువ
3. సరస్వతి కాలువ
– పై మూడు కాలువలు గోదావరి నదికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
4. లాల్ బహదూర్ కాలువ (ఎడమ కాలువ)
– ఈ కాలువ కృష్ణా నదికి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఉంది.
– దేశంలో క్లోనింగ్ ద్వారా బర్రెను సృష్టించిన మొదటి సంస్థ ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్)
– సంచార వైద్యశాల ఎమర్జెన్సీ నంబర్: 1962
మత్స్య సంపద
– చేపలు, సముద్ర ఉత్పత్తులను అభివృద్ధి చేయడాన్ని నీలి విప్లవం (Blue Revolution) అంటారు.
– చేపల పెంపకం పిసికల్చర్- ఆక్వాకల్చర్
– చేపల అధ్యయనం- ఇక్తియాలజీ
– ఇండియా వాణిజ్యంలో మత్స్య పరిశ్రమ 1 శాతం ఉంది.
– ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో
1. చైనా
2. ఇండియా
– దేశంలో లభించే ప్రాంతం ఆధారంగా చేపలు రెండు రకాలు..
1. మంచినీటి చేపలు – 42.6 శాతం
2. సముద్రం చేపలు – 57.4 శాతం
– ఇండియాలో మంచినీటి చేపల ఉత్పత్తిలో
1. పశ్చిమబెంగాల్
2. ఆంధ్రప్రదేశ్
– సముద్రం చేపల ఉత్పత్తిలో
1. కేరళ
2. గుజరాత్
– అన్నిరకాల చేపల ఉత్పత్తిలో
1. పశ్చిమబెంగాల్
2. ఆంధ్రప్రదేశ్
– తెలంగాణలో చేపల చెరువులు అధికంగా ఉన్న జిల్లా – ఖమ్మం.
– తెలంగాణలో రొయ్యల సాగు అధికంగా ఉన్న జిల్లా –
1. మహబూబ్నగర్
2. నల్లగొండ
– తెలంగాణలో చేపలు పట్టేవారు అధికంగా ఉన్న జిల్లా –
1. వరంగల్
2. మహబూబ్నగర్
రాష్ట్రంలో మత్స్యకారులకు సామూహిక ప్రమాద బీమా
మరణిస్తే – రూ. 2 లక్షలు
శాశ్వత వైకల్యం- రూ. లక్ష
పాక్షిక వైకల్యం/ దవాఖాన ఖర్చులకు
– రూ. 10 వేలు చెల్లిస్తారు
– 2016-17లో మొత్తం చేపలు, రొయ్యల ఉత్పత్తిలో లక్ష్యం – 35.35 లక్షల టన్నులకు చేరింది 5.63 లక్షల హెక్టార్లలో చేపల సంపదను పెంచడానికి 23,874 చెరువులను ప్రభుత్వం గుర్తించింది.
– రాష్ట్రంలో మత్స్యకారుల జనాభా – 19.04 లక్షలు
– రాష్ట్రంలో చేపల విత్తనోత్పత్తి కేంద్రాలు – 28
– రాష్ట్రంలో ఏడు మత్స్యకార మార్కెటింగ్ సహకార కేంద్రాలు ఉన్నాయి.
– 2016-17 స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ప్రస్తుత ధరల్లో చేపలు, రొయ్యల పెంపకం వాటా – 0.4శాతం
సెరికల్చర్ (Sericulture)
– పట్టు పురుగుల పెంపకం – సెరికల్చర్
– ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది.
– ప్రపంచంలో కృత్రిమ పట్టు ఉత్పత్తిలో జపాన్ అగ్రస్థానంలో ఉన్నది.
– దేశంలో పట్టు ఉత్పత్తిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి.
– తెలంగాణలో అంతర్జాతీయ పట్టు బివోల్టిన్ ఉత్పత్తిని ప్రభుత్వం మెరుగుపరుస్తుంది.
– టుస్సార్ పట్టు ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నది.
– రాష్ట్రంలో టుస్సార్ పట్టును అధికంగా పెంచే జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్
– తెలంగాణలో పట్టు వస్ర్తాల నేతకు ప్రసిద్ధి- పోచంపల్లి, గద్వాల, కొత్తకోట, నారాయణపేట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు