Biographical arts | జీవనచిత్ర కళలు

ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ ఒక కళ ఉంటుంది. మనిషి సాంఘిక జీవనంలో కళ అనేది లేకపోతే సమాజం ఎడారిని తలపిస్తుంది. అనేక రకాల కళలకు భారతదేశం పెట్టింది పేరు. మరి మన పొరుగున ఉన్న దేశాల్లో ఎలాంటి కళలు ఉన్నాయి? ఈ ప్రశ్న ప్రతి వ్యక్తిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందుకే ఆసియాలోని కొన్నిదేశాల్లో జాతీయ నృత్యాల సమచారం నిపుణ పాఠకులకోసం
ఇండోనేషియా
-ఇండోనేషియాలో 3000లకు పైగా నృత్యాలు ఉన్నాయి. 700ల తెగలు ఉండగా, ఆయా తెగలకు సొంతంగా జానపద నృత్యాలు ఉన్నాయి. ప్రముఖ సమన్ డ్యాన్స్‌ను ప్రపంచ సాంస్కృతిక నృత్యంగా యునెస్కో ప్రకటించింది. బరాంగ్ (Barong), కెకాక్ (Kecak), లెగాంగ్ (Legong), సంగ్‌యాంగ్ (Sanghyang), జొగెడ్ (Joged), టపెంగ్ (Topeng), ఓలేగ్ (Oleg), పెండెట్ (Pendet), గంబుహ్ (Gambuh), బారిస్, కాన్డాంగ్ (Condong), సెండ్రావాసిహ్ (Cendrawasih), కెబ్యర్డుడుక్ (Kebyar duduk), పన్యెమ్బ్రమ (Panyembrama), జంగర్ తదితర నృత్యాలు ప్రసిద్ధి చెందినవి.
నేపాల్
-నేపాలీ సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానంలో నృత్యాలు ప్రత్యేక స్థానాన్ని పొందాయి. శాస్త్రీయ, జానపద నృత్యాలు రెండూ విశిష్ఠ స్థానాన్ని పొందాయి. గాటు నృత్య (Ghatu Nritya), డ్యుడా నాచ్ (Deuda Naach), చాందిని నాచ్, దండి నాచ్, ధన్ నాచ్, సొరథి నృత్య (Sorathi), మరుని నృత్య (Maruni Nritya), హనుమాన్ నృత్య, దేవి నృత్య, గౌన నృత్య (Gauna Nritya), చ్యాబ్రగ్ నృత్య (Chyabrug Nritya), హోప్చ నృత్య (Hopcha Nritya), కౌర నృత్య, ముందుమ్ నాచ్ (Mundhum Naach), క్యాలీ నాచ్ (Khyali Naach), చొకర నృత్య (Chhokara Nritya), పంచ బుద్ధ నృత్య, చరిత్ర నృత్య, భైరబ్ నృత్య తదితర శాస్త్రీయ, జానపద నృత్యాలు ప్రసిద్ధి చెందినవి.
శ్రీలంక
-శ్రీలంకలో ప్రధానంగా మూడు రకాలైన శాస్త్రీయ నృత్యరీతులు ఉన్నాయి. అవి… కండ్యన్ (Kandyan)/ ఉదరత నాటుమ్ (Uda Rata Natum), పహతరత నాటుమ్ (Pahatha Rata Natum), సబరగమువ డ్యాన్స్ (Sabaragamuwa) లేదా సబరగమువ నాటుమ్ (Sabaragamuwa Natum). ఇవే కాకుండా వెస్ (Ves), నాయ్యండి (Naiyandi), ఉడెక్కి (Uddekki), పంతెరు (Pantheru), వన నృత్యాలు ఉన్నాయి.
-జానపద నృత్యాలు: లీకెలి (Leekeli), కలగెడి (Kalagedi), రబన్ (Raban), పొల్కటు.
థాయిలాండ్
-జాతీయ నృత్యం థాయి డ్యాన్స్. థాయిలాండ్ కళల్లో ప్రముఖ స్థానం ఈ నృత్యానికి ఉన్నది.
-టర్కీ: ప్రముఖ నృత్యాలు జైబెక్ (Zeybek), హలే (Halay), సిఫ్టెటెలి (Ciftetelli), సిక్ కర్సీలామా (Kasik Karsilama), బార్, హొర (Hora), లెజింక (Lezginka). మధ్య, పశ్చిమ టర్కీ ప్రాంతాల్లో ప్రముఖంగా ప్రదర్శించే జానపద నృత్యం జైబెక్. ప్రాంతాలను బట్టి ఈ నృత్య శైలి మారుతూ ఉంటుంది. ప్రాంతీయ గ్రామీణ జానపద నృత్యం హాలే.
రష్యా
-జానపద నృత్యాలు రష్యా సంస్కృతిలో ఇప్పటికీ కీలక భూమిక పోషిస్తున్నాయి. సంప్రదాయ జానపద నృత్యాల ద్వారా వివిధ జాతులు తమ అస్థిత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి. గ్రూప్ డ్యాన్స్, కోరోవ్డ్ (Khorovod), ైప్లెఅస్కా (Plyaska), పెరిప్లేస్, క్వాడ్రిల్లెస్ (Quadrilles), బెరిన్య (Barynya), కామరిన్స్కాయ
-(Kamarinskaya), కాజచోక్ (Kazachok), చెచొట్క, ట్రోయ్కి, బేర్ డ్యాన్స్ తదితర నృత్యాలు ప్రసిద్ధి చెందాయి.
కొరియా
-జాతీయ నృత్యాలు బుచెఎచుమ్ (Buchaechum), పుంగ్ముల్ (Pungmul). బుచెఎచుమ్ కొరియా సంప్రదాయ నృత్యం. దీన్ని మహిళలు మాత్రమే ఉత్సవాల్లో ప్రదర్శిస్తుంటారు. నృత్యకారిణులు గులాబీ రంగు వేసిన ఫ్యాన్లతో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. గ్రామీణ సంప్రదాయ నృత్యం పుంగ్ముల్. ఈ నృత్యాన్ని ఎక్కువగా వ్యవసాయ పనుల సమయంలో ప్రదర్శిస్తుంటారు.
మలేషియా
-మలేషియా జాతీయ నృత్యం జపిన్ (Zapin). జొజెట్ అనేది సంప్రదాయ నృత్యం. ఇది పోర్చుగీసు నృత్యమైన బ్రన్యో (Branyo) వల్ల ప్రభావితమై పలు మార్పులకు లోనైంది. మలక్క దీవిలో అందరికీ చకున్చక్ (Chakunchak) గా సుప్రసిద్ధం. ఈ నృత్యాన్ని పండుగలు, పెండ్లిళ్ల సందర్భంగా ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.
-ప్రసిద్ధి చెందిన నృత్యాలు: ఎండాంగ్ (Endang), డికిర్ బరట్ (Dikir barat), జికీ, కుడ లంపింగ్, మక్ ఇనాగ్ (Mak inang), గజట్ (Ngajat), పాంగల్య, సుమజౌ (Sumazau), ఉలెక్ మయాంగ్ (Ulek mayang), బ్రన్యో.
సింగపూర్
-చైనీస్ నృత్యాలన్నీ సింగపూర్‌లో ప్రసిద్ధి గాంచాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా లయన్ డ్యాన్స్‌ను ప్రదర్శిస్తుంటారు. భారతీయ శాస్త్రీయ నృత్యాలైన భరతనాట్యం, కథక్లను కూడా ప్రముఖంగా సింగపూర్‌లో ప్రదర్శిస్తుంటారు.
బంగ్లాదేశ్
-ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమైన బంగ్లాదేశ్ సంస్కృతిపై బెంగాల్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఇక్కడి ముఖ్యమైన నృత్యాలు బౌల్ (Baul), కథక్, మణిపురి, బిజు (Bizhu), మర్మ, నెమలి, పాము నృత్యాలు ప్రఖ్యాతి గాంచాయి.
మయన్మార్
-మయన్మార్‌లో నాటకసంబంధమైన, జానపద, గ్రామీణ నృత్యాలు ప్రముఖమైనవి. జాతీయ నృత్యం బర్మీస్ (Burmese). ప్రసిద్ధి చెందిన నృత్యాలు బగన్, భైలు (Bilu), కిన్నెర (Kinnara), మౌంట్ పొపస్ గార్డియన్ స్పిరిట్స్, నాట్ (Nat), ఆయిల్ ల్యాంప్, రామాయణ, యూ మిన్ గ్యావ్ (U Min Gyaw), యూ ష్వి యో (U Shwe Yoe), Zat Pwe duet, Zawgyi.
అర్మేనియా
-అర్మేనియా జాతీయ నృత్యాలు షలకో (Shalakho), కొచారి (Kochari), లెజ్జిక (Lezginka). అజేరి తెగకు చెందిన కాకసస్ వారి ప్రసిద్ధ నృత్యం షలకో. ఈ నృత్యం జానపదాలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొచారి అర్మేనియా మరో జానపద నృత్యం. ఆర్మేనియన్లు, అసిరియన్లు, అజర్‌బైజానియన్లు, కుర్దులు, పొంటిక్ గ్రీకులు ఈ నృత్యాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తుంటారు.
ఆప్ఘనిస్థాన్
-నూతన సంవత్సరం, వివాహాలు, ఇతర ఉత్సవాలు, యుద్ధ సమయాల్లో పఠాన్లు అట్టన్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ నృత్యం పఠాన్ల సంస్కృతిలో భాగం. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ నృత్యం అట్టన్. మరో ప్రముఖ నృత్యం ఖట్టాక్. యుద్ధానికి వెళ్లే ముందు ఖట్టాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు.
కంబోడియా
-కంబోడియా జాతీయ నృత్యం రోమ్వంగ్. జానపద నృత్యమైన రోమ్వంగ్ కంబోడియాతోపాటు లావోస్, థాయిలాండ్ దేశాలలో చాలా ప్రసిద్ధి చెందినది. ఈ నృత్యాన్ని ఇప్పటికీ సంప్రదాయ ఉత్సవాలైన ఖైమర్, లావోలతోపాటు థాయి ఉత్సవాల్లో ప్రముఖంగా ప్రదర్శిస్తుంటారు.
-సైప్రస్: జాతీయ నృత్యాలు టర్కిష్ సైప్రియాట్ జానపద (Turkish Cypriot folk), సౌస్ట (Sousta), టట్సియ (Tatsia). ఉత్తర సైప్రస్ ప్రాంతాల్లో అంతర్జాతీయ ఉత్సవాల్లో ఏడాదంతా జానపద బృందాలు టర్కిష్ సైప్రియాట్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఇక్కడి జానపద నృత్యాలు సైప్రస్ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.
జపాన్
-వర్షాలు కురిసినప్పుడు, పంటల సాగు, చేపలు పట్టే సమయాల్లో చేసే జానపద నృత్యాలకు నెలవు జపాన్. ఇక్కడి సంప్రదాయ నృత్యాలకు సుదీర్ఘ చరిత్ర ఉన్నది. పెద్ద సంఖ్యలో సంప్రదాయ నృత్యాలు గల జపాన్‌లో ముఖ్యంగా ఒడోరి (Odori), అసోబి (Asobi), మయ్ (Mai), కబుకి (Kabuki), నోహ్ మయ్ (Noh mai), బొన్ ఒడోరి (Bon Odori), నిహొన్ బుయో (Nihon Buyo).
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?