భారత దర్శనం
రాజుల కాలంలో రాజ్యాలుగా, బ్రిటిష్‌వారి కాలంలో ప్రావిన్సులుగా భారతదేశం ఉంది. స్వాతంత్య్రానంతరం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాలుగా విభజించారు.
తెలంగాణ
-2014, జూన్ 2న ఏర్పడింది.
-రాజధాని హైదరాబాద్.
-ఈ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి.
-గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. సీఎం కే చంద్రశేఖర్‌రావు (టీఆర్ఎస్).
-రాజ్యసభ 7, లోక్‌సభ 17 స్థానాలున్నాయి.
-119 ఎమ్మెల్యే, 43 ఎమ్మెల్సీ స్థానాలున్నాయి.
-2011 జనగణన ప్రకారం 3,51,93,978 జనాభాతో 12వ స్థానంలో ఉన్నది.
-66.54 శాతం అక్షరాస్యత ఉంది.
-ఈ రాష్ట్రం సదరన్ జోన్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్
-1953, అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడిన ఈ రాష్ట్రం 1956, నవంబర్ 1న తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది.
-2014, జూన్ 2న మళ్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు విడిపోయాయి.
-రాజధాని అమరావతి (నూతనంగా ఏర్పాటుకానున్నది).
-మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి.
-175 ఎమ్మెల్యే, 58 ఎమ్మెల్సీ స్థానాలున్నాయి.
-25 లోక్‌సభ, రాజ్యసభ 11 స్థానాలున్నాయి.
-4,93,86,799 మంది జనాభాతో 10వ స్థానంలో ఉంది.
-67.41 శాతం అక్షరాస్యత ఉంది.
-ఈ రాష్ట్రం సదరన్ జోన్లో ఉంది.
అరుణాచల్‌ప్రదేశ్
-1987, ఫిబ్రవరి 20న ఏర్పడింది. రాజధాని ఇటానగర్.
-మొత్తం 23 జిల్లాలు ఉన్నాయి.
-2 లోక్‌సభ, 1 రాజ్యసభ, 60 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.
-13,82,611 మంది జనాభాతో 27వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 66.95 శాతం ఉంది.
-అధికార భాష ఇంగ్లిష్.
-ఈ రాష్ట్రం నార్త్ ఈస్టర్న్ జోన్లో ఉంది.
అసోం
-1960, జనవరి 26న ఏర్పాటైన ఈ రాష్ట్ర రాజధాని దిస్పూర్.
-33 జిల్లాలున్నాయి.
-126 ఎమ్మెల్యే, 14 లోక్‌సభ, 7 రాజ్యసభ స్థానాలున్నాయి.
-3,12,05,576 మంది జనాభాతో 15వ స్థానంలో ఉంది.
-72.19 శాతం అక్షరాస్యతతో 19వ స్థానంలో ఉంది.
-అధికార భాషలు అస్సామీ, బెంగాలీ.
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
బీహార్
-1912, మార్చి 22న ఏర్పాటైన దీనికి 1950, జనవరి 26న రాష్ట్రహోదా వచ్చింది.
-దీని రాజధాని పట్నా.
-38 జిల్లాలు ఉన్నాయి.
-40 లోక్‌సభ, 16 రాజ్యసభ, 243 ఎమ్మెల్యే, 75 ఎమ్మెల్సీ స్థానాలున్నాయి.
-10,38,04,637 మంది జనాభాతో మూడో స్థానంలో ఉంది.
-63.8 శాతం అక్షరాస్యత ఉంది.
-అధికార భాష హిందీ.
-ఇది ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
ఛత్తీస్‌గఢ్
-2000, నవంబర్ 1న ఏర్పడింది. రాజధాని రాయ్‌పూర్.
-ఈ రాష్ట్రం 27 జిల్లాలతో ఉంది.
-11 లోక్‌సభ, 5 రాజ్యసభ, 90 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి.
-2.55 కోట్ల జనాభాతో 17వ స్థానంలో ఉంది.
-70.01 శాతం అక్షరాస్యత (27వ స్థానం) ఉంది.
-అధికార భాష హిందీ.
-ఇది సెంట్రల్ జోన్ పరిధిలో ఉంది.
గోవా
-1987, మే 29న ఏర్పడిన ఈ రాష్ట్ర రాజధాని పనాజి.
-రెండే జిల్లాలు ఉన్నాయి.
-2 లోక్‌సభ, 1 రాజ్యసభ, 40 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.
-18,17,000 మంది జనాభాతో 26వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 87.40 శాతంతో మూడో స్థానంలో ఉంది.
-అధికార భాష కొంకణి.
-ఇది వెస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
గుజరాత్
-1960, మే 1న రాష్ట్రంగా ఏర్పడింది.
-దీని రాజధాని గాంధీనగర్.
-ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి.
-26 ఎంపీ, 11 రాజ్యసభ, 182 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.
-6,03,83,628 మంది జనాభాతో 9వ స్థానంలో ఉంది.
-79.31 శాతం అక్షరాస్యత ఉంది.
-ఇది వెస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
హర్యానా
-ఇది రాష్ట్రంగా 1966, నవంబర్ 1న ఏర్పాటయ్యింది.
-రాజధాని చండీగఢ్. 22 జిల్లాలు ఉన్నాయి.
-10 లోక్‌సభ, 5 రాజ్యసభ, 90 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.
-2,53,53,081 మంది జనాభాతో 19వ స్థానంలో ఉంది.
-అధికార భాష హిందీ. అక్షరాస్యత 76.64 శాతం ఉంది.
-ఇది నార్తర్న్ జోన్ పరిధిలో ఉంది.
హిమాచల్‌ప్రదేశ్
-1971, జనవరి 25న రాష్ట్రంగా ఏర్పడింది.
-రాజధాని షిమ్లా, రెండో రాజధాని ధర్మశాల.
-ఈ రాష్ట్రంలో 12 జిల్లాలున్నాయి.
-4 లోక్‌సభ, 3 రాజ్యసభ, 68 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.
-68,64,602 మంది జనాభాతో 21వ స్థానంలో ఉంది.
-అధికార భాష హిందీ.
-83.78 అక్షరాస్యతతో నాలుగో స్థానంలో ఉంది.
-ఇది నార్తర్న్ జోన్ పరిధిలో ఉంది.
జమ్ముకశ్మీర్
-1947, అక్టోబర్ 26న భారత యూనియన్‌లో విలీనమైంది.
-రాజధానులు శ్రీనగర్ (వేసవికాలం), జమ్ము (శీతాకాలం).
-4 రాజ్యసభ, 6 లోక్‌సభ, 87 ఎమ్మెల్యే, 36 ఎమ్మెల్సీ స్థానాలున్నాయి.
-జనాభా 1,25,41,302 (19వ స్థానం).
-అక్షరాస్యత 68.74 శాతం.
-అధికార భాష ఉర్దూ.
-ఇది నార్తర్న్ జోన్ పరిధిలో ఉంది.
జార్ఖండ్
-2000, నవంబర్ 15న ఈ రాష్ట్రం ఏర్పడింది.
-రాజధాని రాంచీ.
-14 లోక్‌సభ, 6 రాజ్యసభ, 81 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.
-జనాభా 3,29,88,134 (14వ స్థానం).
-అక్షరాస్యత 67.6 శాతం ఉంది.
-అధికార భాష హిందీ.
-ఇది ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
కేరళ
-గాడ్స్ ఓన్ కంట్రీ, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఈ రాష్ర్టాన్ని పిలుస్తారు.
-ఇది 1956, నవంబర్ 1న ఏర్పడింది.
-14 జిల్లాలున్న ఈ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం.
-లోక్‌సభ 20, రాజ్యసభ 9, అసెంబ్లీ 140 సీట్లు ఉన్నాయి.
-3,33,87,577 మంది జనాభాతో 13వ స్థానంలో ఉంది.
-93.91 శాతం అక్షరాస్యతతో మొదటి స్థానంలో ఉంది.
-అధికార భాష మలయాళం.
-ఇది సదరన్ జోన్ పరిధిలో ఉంది.
మధ్యప్రదేశ్
-ఈ రాష్ట్రం 1956, నవంబర్ 1న ఏర్పడింది.
-దీని రాజధాని భోపాల్.
-ఈ రాష్ట్రంలో 51 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 29, 11 రాజ్యసభ, అసెంబ్లీ సీట్లు 230 ఉన్నాయి.
-7,26,26,809 మంది జనాభాతో ఐదో స్థానంలో ఉంది.
-అక్షరాస్యత శాతం 70.63
– అధికార భాష హిందీ.
-ఇది సెంట్రల్ జోన్ పరిధిలో ఉంది.
మహారాష్ట్ర
-ఇది 1960, మే 1న ఏర్పడింది.
-రాజధానులు ముంబై (వేసవికాలం), నాగ్‌పూర్ (శీతాకాలం). ఈ రాష్ట్రంలో 36 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 48, రాజ్యసభ 19, ఎమ్మెల్యే 288, ఎమ్మెల్సీ 78 సీట్లు ఉన్నాయి.
-11,23,72,972 మంది జనాభాతో రెండో స్థానంలో ఉంది.
-82.91 శాతం అక్షరాస్యతతో ఆరో స్థానంలో ఉంది.
-అధికార భాష మరాఠీ.
-ఇది వెస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
మణిపూర్
-1972, జనవరి 21న ఈ రాష్ట్రం ఏర్పడింది.
-రాజధాని ఇంఫాల్.
-ఈ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 2, రాజ్యసభ 1, ఎమ్మెల్యే 60 సీట్లు ఉన్నాయి.
-28,55,794 మంది జనాభాతో 24వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యతలో 79.85 శాతంతో 16వ స్థానంలో ఉంది.
-అధికార భాష మణిపురి (మీటీ).
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
మేఘాలయ
-ఇది 1972, జనవరి 21న ఏర్పడింది.
-రాజధాని షిల్లాంగ్.
-11 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 2, రాజ్యసభ 1, అసెంబ్లీ 60 సీట్లు ఉన్నాయి.
-32,12,000 మంది జనాభాతో 23వ స్థానంలో ఉంది.
-75.48 శాతం అక్షరాస్యతతో 24వ స్థానంలో ఉంది.
-అధికార భాష ఇంగ్లిష్.
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
ఒడిశా
-1936, ఏప్రిల్ 1న ఈ రాష్ట్రం ఏర్పడింది.
-రాజధాని భువనేశ్వర్.
-ఈ రాష్ట్రంలో 30 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 21, రాజ్యసభ 10, అసెంబ్లీ 147 సీట్లు ఉన్నాయి.
-4,19,74,218 మంది జనాభాతో 11వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత శాతం 73.45.
-అధికార భాష ఒడియా.
-ఇది ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
మిజోరం
-1987, ఫిబ్రవరి 20న ఈ రాష్ట్రం ఏర్పడింది.
-రాజధాని ఐజ్వాల్.
-ఈ రాష్ట్రంలో 8 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 1, రాజ్యసభ 1, అసెంబ్లీ 40 సీట్లు ఉన్నాయి.
-10,91,013 మంది జనాభాతో 28వ స్థానంలో ఉంది.
-91.58 శాతం అక్షరాస్యత ఉంది.
-అధికార భాషలు మిజో, ఇంగ్లిష్, హిందీ
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
నాగాలాండ్
-ఇది 1963, డిసెంబర్ 1న ఏర్పడింది.
-రాజధాని కొహిమ. ఈ రాష్ట్రంలో 11 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 1, రాజ్యసభ 1, అసెంబ్లీ 60 సీట్లు ఉన్నాయి.
-19,80,602 మంది జనాభాతో 25వ స్థానంలో ఉంది.
-80.11 శాతం అక్షరాస్యతతో 15వ స్థానంలో ఉంది.
-అధికార భాష ఇంగ్లిష్.
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
పంజాబ్
-ఇది 1966, నవంబర్ 1న ఏర్పడింది.
-దీని రాజధాని చండీగఢ్.
-ఈ రాష్ట్రంలో 22 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 13, రాజ్యసభ 7, అసెంబ్లీ 117 స్థానాలున్నాయి.
-2,77,04,236 మంది జనాభాతో 16వ స్థానంలో ఉంది.
-76.68 శాతం అక్షరాస్యత ఉంది.
-అధికార భాష పంజాబీ.
-ఇది నార్తర్న్ జోన్ పరిధిలో ఉంది.
సిక్కిం
-ఈ రాష్ట్రం 1975, మే 15న ఏర్పడింది.
-రాజధాని గ్యాంగ్‌టక్.
-ఈ రాష్ట్రంలో 4 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 1, రాజ్యసభ 1, అసెంబ్లీ 32 స్థానాలు ఉన్నాయి.
-6,10,577 మంది జనాభాతో 29వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 82.6 శాతం.
-అధికార భాషలు ఇంగ్లిష్, నేపాలి.
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
తమిళనాడు
-ఈ రాష్ట్రం 1950, జనవరి 26న ఏర్పడింది.
-రాజధాని చెన్నై.
-ఈ రాష్ట్రంలో 32 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 39, రాజ్యసభ 18, అసెంబ్లీ 234 స్థానాలు ఉన్నాయి.
-7,21,47,030 మంది జనాభాతో 6వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 80.33 శాతం ఉంది.
-ఇది సదరన్ జోన్ పరిధిలో ఉంది.
త్రిపుర
-ఇది 1972, జనవరి 21న ఏర్పడింది.
-రాజధాని అగర్తల.
-8 జిల్లాలున్న రాష్ట్రం ఇది.
-లోక్‌సభ 2, రాజ్యసభ 1, అసెంబ్లీ 60 స్థానాలు ఉన్నాయి.
-36,71,032 మంది జనాభాతో 22వ స్థానంలో ఉంది.
-87.75 శాతం అక్షరాస్యత ఉంది.
-అధికార భాషలు బెంగాలి, ఇంగ్లిష్.
-ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
ఉత్తరాఖండ్
-ఈ రాష్ట్రం 2000, నవంబర్ 9న ఏర్పడింది.
-రాజధాని డెహ్రాడూన్. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలున్నాయి.
-లోక్‌సభ 5, రాజ్యసభ 3, అసెంబ్లీ 70 స్థానాలు ఉన్నాయి.
-1,00,86,292 మంది జనాభాతో 20వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 79.63 శాతం ఉంది.
-ఇది సెంట్రల్ జోన్ పరిధిలో ఉంది.
పశ్చిమ బెంగాల్
-ఇది 1950, జనవరి 26న ఏర్పడింది.
-రాజధాని కోల్‌కతా. 23 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 42, రాజ్యసభ 16, అసెంబ్లీ 294 స్థానాలున్నాయి.
-9,13,47,736 మంది జనాభాతో 4వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 77.08 శాతం ఉంది.
-ఇది ఈస్టర్న్ జోన్ పరిధిలో ఉంది.
ఉత్తరప్రదేశ్
-1950, జనవరి 24న ఈ రాష్ట్రం ఏర్పడింది.
-రాజధాని లక్నో.
-75 జిల్లాలున్న రాష్ట్రం ఇది.
-లోక్‌సభ 80, రాజ్యసభ 31, అసెంబ్లీ 403 స్థానాలు ఉన్నాయి.
-19,98,12,341 మంది జనాభాతో మొదటి స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 69.72 శాతం ఉంది.
-ఇది సెంట్రల్ జోన్ పరిధిలో ఉంది.
రాజస్థాన్
-ఈ రాష్ట్రం 1956, నవంబర్ 1న ఏర్పడింది.
-రాజధాని జైపూర్. 33 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 25, రాజ్యసభ 10, అసెంబ్లీ 200 సీట్లు ఉన్నాయి.
-6,85,48,437 మంది జనాభాతో 7వ స్థానంలో ఉంది.
-అక్షరాస్యత 67,06 శాతం ఉంది.
-ఇది నార్తర్న్ జోన్ పరిధిలో ఉంది.
కర్ణాటక
-1956, నవంబర్ 1న ఏర్పడింది.
-రాజధాని బెంగళూరు. 30 జిల్లాలు ఉన్నాయి.
-లోక్‌సభ 28, రాజ్యసభ 12, ఎమ్మెల్యే 224, ఎమ్మెల్సీ 75 స్థానాలు ఉన్నాయి.
-6,11,30,704 మంది జనాభాతో 8వ స్థానంలో ఉంది.
-అధికార భాష కన్నడ. 75.60 శాతం అక్షరాస్యత ఉన్నది.
-ఇది సదరన్ జోన్ పరిధిలో ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు