Right to Education Act | విద్యాహక్కు చట్టం-2009
దేశంలో 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Educatio- Act 2009. ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి.
విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు
అధ్యాయం -1
సెక్షన్-1
– చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009
– చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
– చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1
సెక్షన్-2
– 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు
– ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు
– క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు
– స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయతీ
అధ్యాయం-2
సెక్షన్-3
– 6 నుంచి 14 ఏండ్లలోపు బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది.
– బాలలు ప్రాథమిక విద్య పూర్తిచేయడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవరసరం లేదు.
సెక్షన్-4
– 6 నుంచి 14 ఏండ్లలోపు వయసున్న పిల్లలు మధ్యలోనే బడి మానివేస్తే వారిని తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
– వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి విద్యార్థులతో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలను పొందటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
– ఈ విధంగా ప్రాథమిక విద్యలో ప్రవేశించిన బాలలు 14 ఏండ్లు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తిచేసేవరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది.
– ఆ విద్యార్థులకు శిక్షణ కాలవ్యవధి కనీసం మూడు నెలలు, గరిష్టంగా రెండేండ్లవరకు ఉండవచ్చు.
సెక్షన్-5
– బడిలో ప్రాథమిక విద్య పూర్తిచేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు బాలలకు ఉంటుంది.
అధ్యాయం-3
సెక్షన్-6
– ఆర్టీఈ అంశాలు అమలు చేయటానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేండ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ బడిని నెలకొల్పాలి.
– 1 నుంచి 5 తరగతుల వరకు కిలోమీటర్ దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి. 6 నుంచి 8 తరగతుల బాలలకు 3 కి.మీ.లోపు పాఠశాలను ఏర్పాటుచేయాలి.
– తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రవాణా సౌకర్యా లు ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇంటివద్దే విద్యనందించాలి.
సెక్షన్-7
– చట్టాన్ని అమలుచేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది.
– రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లందరికీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి.
సెక్షన్-8
– ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లలను చేర్పించి, ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలని అడిగే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకు ఉండదు.
సెక్షన్-9
– తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏండ్లు వచ్చేవరకు పిల్లలందరి రికార్డులను స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి.
సెక్షన్-10
– 6 నుంచి 14 ఏండ్లలోపు పిలల్లను పరిసర పాఠశాలలో చేర్పించటం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
సెక్షన్-11
– ఆరేండ్లు నిండే వరకు ప్రాథమిక విద్యకు బాలలను సంసిద్ధులను చేయటానికి పూర్వ ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
అధ్యాయం-4
సెక్షన్-12
– బడులు ప్రభుత్వ గ్రాంట్లు ఎంతశాతం పొందుతున్నాయో బడిలో చేరిన పిల్లల్లో అంతశాతం మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కనీసం 25 శాతానికి తగ్గకుండా పిల్లలను బడిలో చేర్చుకోవాలి.
– కేంద్రీయ, నవోదయ, సైనిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్యలో 25శాతం సీట్లు బలహీనవర్గాలకు, ప్రతికూల పరిస్థితులు ఉన్న పిల్లలకు కేటాయించాలి.
సెక్షన్-13
– బాలబాలికలను బడిలో చేర్చుకోవటానికి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. బడిలో చేర్చుకొనేందుకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించరాదు. అనుమతి లేకుండా పరీక్ష నిర్వహిస్తే జరిమానా విధిస్తారు.
సెక్షన్-14
– వయసు ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు.
సెక్షన్-15
– విద్యాసంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణంగా జూన్ 12 నుంచి ఆగస్టు 31వరకు గడువు ఉంటుంది. గడువు తర్వాత ప్రవేశం కోరినా తిరస్కరించకూడదు.
సెక్షన్-16
– బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు బడి నుంచి తొలగించకూడదు.
సెక్షన్-17
– బాలలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
సెక్షన్-18
– ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను స్థాపించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు.
సెక్షన్-19
– షెడ్యూల్లోని నియమాలను పాటించని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు. ఈ చట్టం అమలుకు ముందే స్థాపించిన పాఠశాలలు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేండ్లలోపు తమ సొంత ఖర్చులతో షెడ్యూల్లోని నియమనిబంధనల మేరకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.
సెక్షన్-20
– షెడ్యూల్లోని నియమాలు, ప్రామాణికాలు తొలగించటం, కొత్తగా చేర్చటం లేదా సవరణ చేయటం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.
సెక్షన్-21
– అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, బడిలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటుచేయాలి. కమిటీ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా ఉండాలి.
సెక్షన్-22
– పాఠశాల యాజమాన్య కమిటీ ఏటా నవంబర్‌లో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి.
సెక్షన్-23
– ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
సెక్షన్-24
– ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తిచేయాలి.
సెక్షన్-25
– షెడ్యూల్లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సెక్షన్-26
– ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో ఖాళీలు పదిశాతానికి మించకుండా చూడాలి.
సెక్షన్-27
– జనాభా గణన, ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు.
సెక్షన్-28
– ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్స్, ప్రైవేటు బోధన పనులు చేయరాదు.
అధ్యాయం-5
సెక్షన్-29
– బాలల జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తిచేయాలి.
సెక్షన్-30
– ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
అధ్యాయం-6
సెక్షన్-31
– విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి, కాపాడే ఏర్పాట్లను సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన సూచనలు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి.
సెక్షన్-32
– విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు గురైన పక్షంలో ఎవరైనా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.
సెక్షన్-33, 34
– బాలల హక్కుల రక్షణకు జాతీయ, రాష్ట్ర సలహా సంఘాలను ఏర్పాటుచేయాలి.
అధ్యాయం-7
సెక్షన్-35
– చట్టం అమలు కోసం సంబంధిత ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది.
సెక్షన్-36
– శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి.
సెక్షన్-37
– సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పించాలి.
సెక్షన్-38
– చట్ట నియమాలు రూపొందించటానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
షెడ్యూల్ బడి నియమాలు, ప్రామాణికాలు
1 నుంచి 5వ తరగతి వరకు
– 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు
– 61 నుంచి 90 మంది బాలల వరకు ముగ్గురు
ఉపాధ్యాయులు
– 91 నుంచి 120 మంది విద్యార్థుల వరకు నలుగురు
– 121 నుంచి 200 వరకు ఐదుగురు ఉపాధ్యాయులు
– 150 మించి విద్యార్థులు ఉంటే ఐదుగురు
ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు
– 200 మించి విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు కాకుండా ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి
– 1 నుంచి 5వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో 200 పనిదినాలు, 800 బోధనా గంటలు ఉండాలి.
6 నుంచి 8వ తరగతి వరకు
– ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కింది అంశాలకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
1. విజ్జానశాస్త్రం, లెక్కలు, 2. సామాజిక శాస్త్రం 3.భాషలు
– ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధాయ్యు డు ఉండాలి.
– బడిలో చేర్చుకున్న విద్యార్థుల సంఖ్య 100కు మించితే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడితోపాటు
1. చిత్రకళ, 2. ఆరోగ్యం, వ్యాయామ విద్య
3. వృత్తి విద్యలకు పార్ట్‌టైం బోధకులు ఉండాలి
– 6-8 తరగతులకు 220 పనిదినాలు, 1000 బోధనా గంటలు ఉండాలి.
– ప్రతి టీచర్‌కు ఒక తరగతి గది ఉండాలి
– వారానికి కనీసం బోధన 45 గంటలు ఉండాలి.
ప్రాక్టీస్ బిట్స్
1. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 89 అయితే, విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి?
1) ఆరుగురు 2) ఐదుగురు 3) ముగ్గురు 4) ఇద్దరు
2. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పాఠశాలలో వారానికి ఉపాధ్యాయుడు పనిచేయాల్సిన పనిగంటలు?
1) సంసిద్ధతా సమయాన్ని కలుపుకొని 40 బోధనా గంటలు
2) సంసిద్ధతా సమయాన్ని కలుపుకొని 45
బోధనా గంటలు
3) సంసిద్ధతా సమయాన్ని మినహాయించుకొని 45
బోధనా గంటలు
4) సంసిద్ధతా సమయాన్ని మినహాయించి 40
బోధనా గంటలు
3. విద్యాహక్కు చట్టం-2009 ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
1) 2009, మార్చి 10 2) 2009, ఏప్రిల్ 10
3) 2009, ఏప్రిల్ 1 4) 2009, మార్చి 1
4. ఆర్టీఈ-2009 Sec-10 ప్రకారం?
1) తల్లిదండ్రులు 6-14 ఏండ్ల వయస్సున్న తమ
పిల్లలను విధిగా బడిలో చేర్పించాలి
2) ఉపాధ్యాయులు చేర్పించాలి
3) స్థానిక సర్పంచ్ చేర్పించాలి 4) అధికారులు చేర్పించాలి
5. ఆర్టీఈ-2009 కింది ఏ సమూహపు పిల్లలకు వర్తిస్తుంది?
1) 0-14 ఏండ్లు 2) 6-14 ఏండ్లు
3) 5-16 ఏండ్లు 4) 1-16 ఏండ్లు
6. ఆర్టీఈ-2009, Sec-29 సూచించేది?
1) విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే
పాఠ్య ప్రణాళిక రూపొందించడం
2) నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టడం
3) బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు
పెంపొందించడం 4) పైవన్నీ
7. ఆర్టీఈ-2009 విధికానిది?
1) జనన ధ్రువీకరణ పత్రం లేకున్నా బడిలో చేర్చుకోవాలి
2) క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు
3) విద్యా సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా చేర్చుకోవాలి
4) హాజరు ఉండి అనుత్తీర్ణుడైతే అదే తరగతిలో
కొనసాగించాలి
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






