Island Countries | ద్వీప దేశాలు-విశేషాలు
ద్వీపం… చుట్టూ నీరు.. మధ్యలో భూమి. ప్రకృతి రమణీయ దృశ్యాలు.. పర్యాటకులకు స్వర్గధామాలు.. అత్యంత అభివృద్ధి చెందినవి కొన్ని, నాగరిక ఆనవాళ్లను దరిచేరనీయకుండా తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నవి మరికొన్ని.. ఒకే భూభాగంతో ఉన్నవి కొన్నికాగా, కొన్ని దీవుల సముదాయంగా ఉండి దేశాలుగా.. ఖండాలుగా పిలువబడుతున్నవి ఇంకొన్ని.. చిన్న భూభాగాలే అయినప్పటికీ అభివృద్ధిలో దూసుకుపోతూ… యూరప్ వంటి ఖండాలను శాసిస్తున్నాయి.. ప్రపంచంలోని కొన్ని ద్వీపదేశాలు, వాటి రాజధానులు, జనాభా తదితర వివరాలు నిపుణ పాఠకుల కోసం..
పలావు
-ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ద్వీపదేశం. ఇది సుమారు 500 దీవులను కలిగి ఉంది.
-ఇందులో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం కొరోర్.
-ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాలతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది.
-దీని రాజధాని జెరుల్ముద్.
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు: జపనీస్, సోన్సోరోలిస్, టోబియన్
-కరెన్సీ: యూఎస్ డాలర్.
కిరిబతి
-ఇది సెంట్రల్ పసిఫిక్‌లో గణతంత్ర ద్వీప రాజ్యం.
-దీని రాజధాని దక్షిణ తారావా (ఇది అత్యధిక జనాభా నివసిస్తున్న ప్రాంతం).
-కరెన్సీ: ఆస్ట్రేలియన్ డాలర్, కిరిబతి డాలర్.
సింగపూర్
-ఇది 704 చ.కి.మీ. (272 చ.మై) విస్తీర్ణంతో దక్షిణాసియాలోని చిన్న దేశం.
-మతం: జనాభాలో 51 శాతం ప్రజలు బౌద్ధమతం, థాయిజం అవలంబిస్తున్నారు. 15 శాతం క్రిస్టియన్లు, 14 శాతం ముస్లింలు, 15 శాతం ఏ మతం అవలబించనివారు కాగా, మిగతా వారంతా సిక్కు, హిందూ, బహాయి మతస్తులు.
-భాషలు: జాతీయ భాష మలయ్. అధికార భాషలు మలయ్, మాండరిన్, ఇంగ్లిష్, తమిళం.
-జాతీయ గీతం: మజులా సింగపుర
పపువా న్యూగినియా
-ఇది నైరుతి పసిఫిక్‌లోని ద్వీపదేశం.
-రాజధాని: పోర్ట్ మోర్స్బి
-ఇక్కడి ప్రజలు 850కి పైగా భాషలు మాట్లాడుతారు.
-విస్తీర్ణం: 4,62,840 చ.కి.మీ.
-జనాభా: 80,83,700
-కరెన్సీ: పపువా న్యూగినియా కినా (పీజీకే)
మార్షల్ ఐలాండ్స్
-ఇది పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ సమీపంలో ఉన్న దేశం.
-దీని రాజధాని మజురో (Majuro)
-అధికార భాషలు: మార్షలీస్, ఇంగ్లిష్
-53,066 జనాభా ఉన్నారు.
-దీని కరెన్సీ యూఎస్ డాలర్.
ఇండోనేషియా
-ఇండియా, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉన్నది.
-ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం.
-దీని రాజధాని జకార్త.
-మాట్లాడే భాషలు ఇండోనేషియన్, జపనీస్, సుందనీస్.
-237.42 మిలియన్లు (2010 సెన్సస్ ప్రకారం), 26,11,15,456 (2016 అంచనా ప్రకారం) జనాభా ఉన్నది.
-ఈ దేశ కరెన్సీ ఇండోనేషియా రూపియా.
ఫిలిప్పీన్స్
-పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 7,641 ద్వీపాలను కలిగి ఉన్నది.
-దీని రాజధాని మనీలా. అతిపెద్ద నగరం క్వెజోన్.
-అధికార భాషలు ఫిలిపినో, ఇంగ్లిష్
-2015 సెన్సస్ ప్రకారం 10,09,81,437 జనాభా ఉంది.
-ఈ దేశ కరెన్సీని ప్రాంతీయంగా పిసో, అంతర్జాతీయంగా పెసో అంటారు.
టోంగా
-ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 169 ద్వీపాలను కలిగి ఉన్నది.
-దీని రాజధాని నుకువలోఫా (Nukualofa)
-అధికార భాషలు టోంగన్, ఇంగ్లిష్
-2011 సెన్సస్ ప్రకారం 1,03,036 జనాభా ఉన్నది.
-కరెన్సీ: పాంగా (Paanga)
వనువటు
-ఇది పసిఫిక్ మహాసముద్రంలో న్యూగినియాకు తూర్పున, సోలమన్ దీవులకు ఆగ్నేయాన, ఫిజీకి పశ్చిమాన ఉన్నది.
-దీని రాజధాని పోర్ట్ విలా (Port Vila)
-బిస్లామా (Bislama), ఫ్రెంచ్, ఇంగ్లిష్ అధికార భాషలు.
-2016 గణాంకాల ప్రకారం 2,72,459 జనాభా ఉంది.
-దీని కరెన్సీ వనువటు వటు (Vanuatu vatu).
మాల్టా
-ఇది మధ్యదరా సముద్రంలో ఉన్నది.
-దీని రాజధాని వాలెట్టా. అతిపెద్ద నగరం బిర్కిర్కర (Birkirkara)
-మాల్టీస్, మాల్టీస్ సైన్ లాంగ్వేజ్ అధికార భాషలు.
-2014 అంచనా ప్రకారం 4,45,426, 2011 సెన్సస్ ప్రకారం 4,16,055 జనాభా ఉన్నది.
-ఈ దేశ కరెన్సీ యూరో.
యునైటెడ్ కింగ్డమ్
-అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లిష్, ఐరిష్ సముద్రంతో ఆవరించి ఉన్న ద్వీప దేశం ఇది.
-దీనిలో ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ దేశాలు ఉన్నాయి.
-దీని రాజధాని, అతిపెద్ద నగరం లండన్.
-అధికార భాష ఇంగ్లిష్.
-2016 అంచనా ప్రకారం 6,56,48,100, 2011 సెన్సస్ ప్రకారం 6,31,81,775 జనాభా ఉన్నది.
-కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్
సైప్రస్
-రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్‌గా పిలిచే ఈ దేశం మధ్యదరా సముద్రంలో ఉన్నది.
-మధ్యదరా సముద్రంలోని జనసాంద్రత అధికంగా కలిగిన ద్వీపదేశాల్లో ఇది మూడో స్థానంలో ఉంది.
-దీని రాజధాని, అతిపెద్ద నగరం నికోషియా (Nicosia)
-గ్రీక్, టర్కిష్ అధికార భాషలు.
-2016 అంచనా ప్రకారం 11,70,125, 2011 సెన్సస్ ప్రకారం 8,38,897 జనాభా ఉన్నది.
-ఈ దేశ కరెన్సీ యూరో
బ్రూనై
-దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుస్సలామ్ లేదా నేషన్ ఆఫ్ దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్‌గా పిలుస్తారు.
-ఇది మలేషియా, దక్షిణ చైనా సముద్రం (పసిఫిక్ మహాసముద్రంలోని కొంతభాగం)లో చైనాకు అభిముఖంగా ఉన్న దేశం.
-దీని రాజధాని బందర్ సెరి బెగవాన్.
-మలాయ్, ఇంగ్లిష్ అధికార భాషలు.
-2015 అంచనా ప్రకారం 4,17,200 జనాభా ఉంది.
-కరెన్సీ బ్రూనై డాలర్
బహ్రెయిన్
-కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ అని పిలిచే ఇది మిడిల్ ఈస్ట్‌లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది.
-దీని రాజధాని మనామా.
-అధికార భాష అరబిక్.
-2016 అంచనా ప్రకారం 14,25,171, 2010 సెన్సస్ ప్రకారం 12,34,571 జనాభా ఉంది.
-కరెన్సీ బహ్రెయిన్ దినార్.
ఐర్లాండ్
-రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌గా పిలిచే ఇది అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ, సెల్టిక్ సముద్రం దక్షిణాన, ఆగ్నేయ దిశగా సెయింట్ జార్జ్ చానల్, తూర్పున ఐరిష్ సముద్రంతో ఉంటుంది.
-దీని రాజధాని డబ్లిన్
-జాతీయ భాష ఐరిష్. అధికార భాషలు ఐరిష్, ఇంగ్లిష్.
-2016 సెన్సస్ ప్రకారం 47,61,865 జనాభా ఉంది.
-దీని కరెన్సీ యూరో.
ఆస్ట్రేలియా
-ఇది భూగోళం దక్షిణ భాగంలో, పసిఫిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఉన్నది.
-ఇది ప్రపంచంలో ఆరో అతిపెద్ద దేశం.
-దీని రాజధాని కాన్బెర్రా. అతిపెద్ద నగరం సిడ్నీ.
-జాతీయ భాష ఇంగ్లిష్.
-2018 అంచనా ప్రకారం 2,47,74,800, 2016 సెన్సస్ ప్రకారం 2,34,01,892 జనాభా ఉన్నది.
-కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్.
గువామ్
-ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని, యూఎస్ స్టేట్స్ అన్ ఇన్కార్పొరేటెడ్ (Unincorporated), వ్యవస్థీకృత భూభాగం.
-దీని రాజధాని హగట్నా (Hagatna).
-ఇంగ్లిష్, చమొరో దీని అధికార భాషలు.
-2016 అంచనా ప్రకారం 1,62,742, 2010 సెన్సస్ ప్రకారం 1,59,358 జనాభా ఉంది.
-దీని కరెన్సీ యూఎస్ డాలర్.
న్యూ క్యాలిడోనియా
-ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చాలా ద్వీపాలను కలిగి ఉన్న దేశం.
-దీని రాజధాని నౌమియా (Noumea).
-అధికార భాష ఫ్రెంచ్.
-2014 సెన్సస్ ప్రకారం 2,68,767 జనాభా ఉన్నది.
-దీని కరెన్సీ సీఎఫ్‌పీ ఫ్రాంక్ (CFP franc)
ఉత్తర ఐర్లాండ్
-ఇది యునైటెడ్ కింగ్డమ్లో భాగం.
-దీని రాజధాని బెల్ఫ్రాస్ట్.
-అధికార భాష ఇంగ్లిష్. స్థానిక భాషలు ఐరిష్, ఉస్తెర్ స్కాట్స్.
-2017 అంచనా ప్రకారం 18,76,695, 2011 సెన్సస్ ప్రకారం 18,10,863 జనాభా ఉన్నది.
-దీని కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్.
ఐస్లాండ్
-ఇది నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలోని ద్వీప దేశం.
-3,32,529 జనాభా ఉంది.
-1,03,000 చ.కి.మీ. విస్తరించి ఉంది.
-దీని రాజధాని రెక్జావిక్ (Reykjavik)
-దీని కరెన్సీ ఐస్‌ల్యాండ్ క్రోనా
-ఐస్‌ల్యాండిక్ ఈ దేశ భాష.
న్యూజిలాండ్
-ఇది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్నది.
-దీని రాజధాని వెల్లింగ్టన్.
-ఈ ద్వీపదేశంలోని పెద్ద నగరం ఆక్లాండ్.
-అధికార భాషలు ఇంగ్లిష్, మయోరి, న్యూజిలాండ్ సైన్ లాంగ్వేజ్.
-42,80,000 జనాభా ఉంది.
-ఈ దేశ కరెన్సీ న్యూజిలాండ్ డాలర్.
ఫిజీ
-ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో వనువటుకు తూర్పున, టోంగాకు పశ్చిమాన ఉన్నది.
-ఈ దేశం అసలు పేరు రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్.
-సువా దీని రాజధాని. అతిపెద్ద నగరం కూడా ఇదే.
-ఇంగ్లిష్, బా ఫిజియన్ అధికార భాషలు.
-జనాభా 9,44,720
-కరెన్సీ ఫిజియన్ డాలర్
సమోవా
-ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది.
-దీని రాజధాని, అతిపెద్ద నగరం అపియా (Apia)
-సమోవా, ఇంగ్లిష్ అధికార భాషలు.
-దీని జనాభా 1,79,000
-దీని కరెన్సీ టాల (Tala)
నౌరూ
-ఇది సెంట్రల్ పసిఫిక్‌లోని ద్వీప దేశం.
-రాజధాని: ఎరెన్ డిస్ట్రిక్ట్
-జనాభా: 13,049
-కరెన్సీ: ఆస్ట్రేలియన్ డాలర్
-అధికార భాషలు: ఇంగ్లిష్, నౌరుయన్
సాలమన్ ఐలాండ్స్
-ఇది పసిఫిక్ మహాసముద్రంలో పపువా న్యూగినియాకు తూర్పున, వనువటుకు వాయవ్య ప్రాంతంలో 900కి పైగా చిన్న ద్వీపాలను కలిగి ఉన్న దేశం.
-దీని రాజధాని, అతిపెద్ద నగరం హోనియారా (Honiara)
-5,99,419 జనాభా ఉంది.
-అధికార భాష ఇంగ్లిష్
-సోలోమన్ ఐలాండ్స్ డాలర్ దీని కరెన్సీ.
తువాలు
-ఇది పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, మధ్య ఆస్ట్రేలియాలకు తూర్పు ఈశాన్యం, నౌరు, కిరిబతిలకు పశ్చిమాన ఉన్నది.
-దీని రాజధాని ఫునఫుటి (Funafuti)
-తువాలుయన్, ఇంగ్లిష్ దీని అధికార భాషలు
-దీని జనాభా 10,640
-దీని కరెన్సీ తువాలుయన్ డాలర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?