PHYSICS | ఫిజికల్ సైన్స్
1. కింది వాటిలో మితులు లేని భౌతిక రాశి?
1) యంగ్ గుణకం 2) పాయిజన్ నిష్పత్తి
3) స్థూల గుణకం 4) దృఢతా గుణకం
2. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం?
1) కాలం 2) దూరం 3) వడి 4) ఏడాది
3. కేంద్రక వ్యాసాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం?
1) ఫెర్మి 2) ఆంగ్‌స్ట్రామ్
3) మైక్రాన్ 4) నానోమీటర్
4. పార్సెక్ ఉపమాణం దేన్ని కొలవడానికి?
1) కాలం 2) దూరం
3) ద్రవ్యరాశి 4) బలం
5. ఎలక్ట్రాన్ వోల్ట్ దేనికి ప్రమాణం?
1) శక్తి 2) ఆవేశం
3) పొటెన్షియల్ తేడా 4) ద్రవ్యరాశి
6. స్థిర వేగంతో ప్రయాణిస్తున్న పై భాగంలేని కారులో కూర్చున్న వ్యక్తి ఒక బంతిని నిలువుగా పైకి గాలిలోకి విసిరాడు. ఆ బంతి పడే చోటు?
1) కారుకు వెలుపల
2) కారులో ఆ వ్యక్తికి ఎదురుగా
3) కారులో ఆ వ్యక్తి పక్కకు
4) ఏ చేతితో విసిరాడో కచ్చితంగా అదే చేతిలో
7. నిలువుగా ఊర్ధ దిశలో ప్రక్షిప్తం చేసిన వస్తువు వేగం, కాలం గ్రాఫ్?
1) పరావలయం 2) దీర్ఘవృత్తం
3) అతిపరావలయం 4) సరళరేఖ
8. కణం స్థానభ్రంశం శూన్యమైతే అది పూర్తిచేసిన దూరం?
1) తప్పకుండా సున్నా కావాలి
2) సున్నా అవ్వొచ్చు లేదా కాకపోవచ్చు
3) సున్నా కాదు
4) కణంపై ఆధారపడుతుంది
9. ఒక ఇంటి పైకప్పు నుంచి ఒక బాణంతో అంతే ఎత్తులో చెట్టు మీది ఉన్న ఆపిల్‌ను కొట్టారు. బాణం వదిలిన వెంటనే ఆపిల్ స్వేచ్ఛగా కిందికి పడటం ప్రారంభమైతే, ఆపిల్‌కు బాణం తగలాలంటే దాన్ని?
1) ఆపిల్ తొలి స్థానం కంటే కాస్తపైన గురిపెట్టాలి
2) ఆపిల్ తొలిస్థానం కంటే కాస్త కిందకు గురిపెట్టాలి
3) ఆపిల్ చివరగా నేలను చేరే బిందువును గురిపెట్టాలి
4) ఆపిల్‌పై గురిపెట్టాలి
10. ఏకరీతి వృత్తాకార చలనంలో ఉన్న ఒక వస్తువు?
1) వేగం స్థిరంగా ఉంటుంది
2) త్వరణం స్థిరంగా ఉంటుంది
3) కోణీయ వేగం స్థిరంగా ఉంటుంది
4) స్థానభ్రంశం స్థిరంగా ఉంటుంది
11. ఒక క్రీడాకారుడు R వ్యాసార్థం గల క్షితిజ సమాంతర వృత్తాకార మార్గం వెంట ఒక చుట్టు పూర్తిచేయడానికి 40 సెకన్లు పట్టింది. 2 ని. 20 సెకన్ల చివర అతని స్థానభ్రంశం పరిమాణం?
1) 7R 2) pR 3) 2pR 4) 2R
12. న్యూటన్ మూడు గమన నియమాల దృష్ట్యా కింది వాటిలో సరైన ప్రవచనం?
1) 2, 3 నియమాలను మొదటి నియమం నుంచి ఉత్పాదించవచ్చు
2) 3, మొదటి నియమాలను 2వ నియమం నుంచి ఉత్పాదించవచ్చు
3) మొదటి, 2వ నియమాలను 3వ నియమం నుంచి రాబట్టవచ్చు
4) ప్రతి నియమం దేనికదే స్వతంత్రం
13. ఒక వస్తువు బలం-కాలం వక్రంలో వైశాల్యం సూచించేది?
1) వస్తువు స్థానభ్రంశం
2) బలం చేసిన పని
3) వస్తువు పనిచేసే రేఖీయ ప్రచోదనం
4) వస్తువు రేఖీయ ద్రవ్యవేగం
14. న్యూటన్ రెండో నియమం వేటిని పాటిస్తుంది?
1) సదిశ నియమాలు
2) అదిశ నియమాలు
3) టెన్సర్ నియమాలు
4) జడత్వ నియమాలు
15. సదిశ Q దిశలో P అంశ శూన్యం అయితే ఈ రెండు సదిశ రాశులు ఒకదానికొకటి?
1) సమాంతరంగా ఉంటాయి
2) ప్రతి సమాంతరంగా ఉంటాయి
3) పరస్పరం లంబంగా ఉంటాయి
4) 450 కోణంతో ఉంటాయి
16. ఒక వస్తువుపై పనిచేసే బలం దాని వడికి విలోమానుపాతంలో ఉంటే ఆ వస్తువు గతిజశక్తి?
1) కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది
2) కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది
3) కాలం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది
4) స్థిరాంకం
17. గడియారంలోని స్ప్రింగ్?
1) ఎలాంటి శక్తిని నిల్వ ఉంచుకోదు
2) యాంత్రిక గతిజశక్తిని నిల్వ చేసుకుని ఉంటుంది
3) యాంత్రిక స్థితిజశక్తిని నిల్వ చేసుకుని ఉంటుంది
4) విద్యుత్ శక్తిని నిల్వ ఉంచుకుంటుంది
18. ఒక కణం వృత్తాకార మార్గానికి పరిమితమై క్రమంగా తగ్గుతున్న రేఖీయ వడితో భ్రమణం చేస్తుంది. అప్పుడు?
1) కేంద్రం పరంగా ఆ కణం నిత్యత్వం అవుతుంది (ఆ కోణీయ ద్రవ్యవేగం)
2) ఆ కణం కోణీయ ద్రవ్యవేగం L దిశ మాత్రమే నిత్యత్వం అవుతుంది
3) ఆ కణం కేంద్రంవైపు సర్పిలాకార మార్గంలో చలిస్తుంది
4) కణం త్వరణం కేంద్రంవైపు ఉంటుంది
19. కణాల వ్యవస్థపై పనిచేసే అన్ని బాహ్యబలాల ఫలిత బలం శూన్యం అయితే ఒక జడత్వ నిర్దేశ చట్రం నుంచి గమనించినప్పుడు?
1) ఆ వ్యవస్థ రేఖీయ ద్రవ్యవేగం కాలంతో మారదు
2) ఆ వ్యవస్థ గతిజశక్తి కాలంతో మారదు
3) ఆ వ్యవస్థ కోణీయ ద్రవ్యవేగం కాలంతో మారదు
4) ఆ వ్యవస్థ స్థితిజశక్తి కాలంతో మారదు
20. గరుకు క్షితిజ సమాంతర తలంపై ఒక బంతి దొర్లుతుంది. దాని వేగం క్రమంగా శూన్యం వరకు తగ్గింది. దానిపై పనిచేసే ఘర్షణ బలం దాని?
1) రేఖీయ వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది
2) కోణీయ వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది
3) రేఖీయ వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది
4) కోణీయ ద్రవ్యవేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది
21. ఒక మనిషి స్వేచ్ఛా ప్రదేశంలో భ్రమణం చేస్తూ చేతులు చాచి లేదా ముడుచుకుని శరీరాకృతిని మార్చుకుంటున్నప్పుడు అతని?
ఎ. జడత్వ భ్రామకం మారుతుంది
బి. కోణీయ ద్రవ్యవేగం మారుతుంది
సి. కోణీయ వేగం మారుతుంది
డి. భ్రమణ గతిజశక్తి మారుతుంది
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
22. వడి అవిచ్ఛిన్నంగా పెరుగుతూ ఉండే విధంగా ఒక కణం వృత్తాకార మార్గంలో చలిస్తుంది. వృత్త వ్యాసం మీద కణం ప్రక్షేప చలనం?
1) ఆవర్తన 2) డోలనాత్మక
3) సరళహరాత్మకం 4) సమవేగంతో కూడిన
23. లఘులోలకానికి ఉక్కు గోళం బదులు అదే పరిమాణంలో చెక్కతే చేసిన గోళాన్ని వేలాడదీసినట్లయితే లోలకం ఆవర్తన కాలం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) సగం అవుతుంది
24. లఘులోలకం గోళం బోలుగా ఉండి నీటితో నిండి ఉంది. గోళం అడుగున రంధ్రం చేస్తే కొద్దిసేపటికి నీరంతా బయటికి పోయి గోళం ఖాళీ అయ్యింది. ఈ సమయంలో లోలక డోలనావర్తన కాలం?
1) మారదు
2) క్రమంగా పెరుగుతూ స్థిరంగా ఉంటుంది
3) మొదట పెరిగి, ఆ తర్వాత తొలి విలువకు తగ్గుతుంది
4) మొదట తగ్గి, ఆ తరువాత పెరుగుతుంది
25. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యలో జూలై నెలలో కంటే జనవరి నెలలో ఎక్కువ వేగంగా తిరుగుతుంది. ఇది దేన్ని సూచిస్తుంది?
1) భూమి జూన్ నెలలో కంటే జనవరి నెలలో సూర్యునికి దగ్గరగా ఉంటుంది
2) భూమి జూన్ నెలలో కంటే జనవరి నెలలో సూర్యునికి గరిష్ట దూరంలో ఉంటుంది
3) సంక్రాతి జనవరి నెలలో వస్తుంది కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చెందడానికి ఆత్రుతపడతాడు
4) కొత్త ఏడాది జనవరి నెలలో మొదలవడం వల్ల దాన్ని అందుకోవడానికి సూర్యుడు వడివడిగా తిరుగుతాడు
26. కెప్లర్ గ్రహగతుల నియమాల సందర్భంలో గ్రహ కక్ష్య ఉత్కేంధ్రత (e) విలువ సున్నా అయితే ఆ కక్ష్య?
1) దీర్ఘ వృత్తాకారం
2) వృత్తాకారం
3) అతి పరావలయ ఆకారం
4) ఉత్కేంద్రత e విలువ సున్నాను సమీపిస్తున్న కొద్దీ అది ఎలాంటి వక్రపు జాడను గీయదు
27. ఒక ఊహాజనిత నక్షత్రం చుట్టూ తొమ్మిది ఊహాజనిత గ్రహాలు ఒకే అర్ధగురు అక్షం పొడవులు వేర్వేరు ఉత్కేంద్రతలను కలిగి ఉంటూ తిరుగుతున్నాయి అనుకుందాం. అప్పుడు కింది వాటిలో వాస్తవమైనది?
1) ఈ గ్రహాలన్నింటికి స్థితిజశక్తి సమానంగా ఉంటుంది
2) ఈ గ్రహాలన్నింటికి గతిజశక్తి సమానంగా ఉంటుంది
3) ఈ గ్రహాలన్నింటి యాంత్రికశక్తి సమానంగా ఉంటుంది
4) ఈ గ్రహాలన్నింటి స్థితిజశక్తి మాత్రమే సమానంగా ఉంటుంది, గతిజశక్తి సమానంగా ఉండదు
28. ఒక మామిడి పండు ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్నది. అంతే ద్రవ్యరాశి ఉన్న మరో మామిడిపండు అంతే ఎత్తు నుంచి అప్పుడే కిందికి పడటం ప్రారంభించింది. వేలాడుతున్న మామిడి పండు కింద పడుతున్న క్షణంలో ఈ మామిడి పండ్లపై గురుత్వాకర్షణ బలాలను పోల్చినట్టయితే మనం ఏ నిర్ణయానికి వస్తాం?
1) వేలాడుతున్న మామిడి పండుపై కంటే కిందపడుతున్న పండుపై గురుత్వాకర్షణ బలం ఎక్కువ
2) కిందపడుతున్న మామిడి పండుపై కంటే వేలాడుతున్న పండుపై గురుత్వాకర్షణ బలం ఎక్కువ
3) వేలాడుతున్న మామిడి పండు, కిందపడుతున్న మామిడి పండు ఒకే గురుత్వాకర్షణ బలాన్ని అనుభవిస్తాయి
4) మామిడి పండు పడిందా లేదా అనే విషయంపై పాక్షికంగా గురుత్వాకర్షణ బలం ఆధారపడి ఉంటుంది
29. రెండు కృత్రిమ ఉపగ్రహాలు భూమిచుట్టూ ఒకే వ్యాసార్ధం ఉన్న వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. ఒక కృత్రిమ ఉపగ్రహం ద్రవ్యరాశిలో వేరొక దానికి రెట్టింపు ఉంది. అప్పుడు?
1) ఎక్కువ బరువున్న కృత్రిమ ఉపగ్రహం తేలికైన దానికంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తుంది
2) రెండు కృత్రిమ ఉపగ్రహాలకు ఒకే కక్ష్యా వడి ఉంటుంది
3) తక్కువ బరువున్న కృత్రిమ ఉపగ్రహం ఎక్కువ బరువున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తుంది
4) ఎక్కువ బరువున్న కృత్రిమ ఉపగ్రహం తేలికైన దానికంటే 4 రెట్లు ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తుంది
30. సూర్యుడు అకస్మాత్తుగా ఒక కృష్ణబిలంగా రూపాంతరం చెందిందని ఊహిద్దాం. అలాంటి ఒక ఊహాజనిత పరిస్థితిలో…?
1) కృష్ణబిలం అపరిమితమైన గురుత్వాకర్షణ బలం కారణంగా సూర్యుడి గర్భంలోకి భూమి పీల్చబడుతుంది
2) అంతరిక్షంలోకి స్పర్శరేఖీయంగా భూమి ఎగిరిపోతుంది
3) భూమి తన అసలైన కక్ష్యలోనే పరిభ్రమించడం కొనసాగిస్తుంది
4) భూమి తన అసలైన కక్ష్యలోనే పరిభ్రమించినప్పటికీ మునుపటికంటే రెండు రెట్లు శక్తిని కలిగి ఉంటుంది
31. పదార్థపు స్థితిస్థాపకతను ప్రభావితం చేయగలిగినవి?
ఎ. మోదన, అనీలనం
బి. పదార్థంలోని మాలిన్యం
సి. ఉష్ణోగ్రతలో మార్పు
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
32. వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడి ఒకే రకంగా ఉన్న లోహపు తీగల ఖండన ప్రతిబలం?
1) తీగ సాంద్రతపై ఆధారపడుతుంది
2) తీగ మధ్యచ్ఛేద వైశాల్యంపై ఆధారపడుతుంది
3) తీగపొడవుపై ఆధారపడుతుంది
4) తీగ యంగ్ గుణకంపై ఆధాపడుతుంది
33. l పొడవు, A మధ్యచ్ఛేద వైశాల్యం గల ఇనుప కడ్డీని 00 నుంచి 1000 C ఉష్ణోగ్రత వరకు వేడిచేశారు. కడ్డీలో వ్యాకోచం లేదా కడ్డీని వంగకుండా ఉండేలా పట్టుకున్నట్లయితే అందులో వృద్ధిచెందే బలం?
1) కడ్డీ మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది
2) కడ్డీ పొడవుపై ఆధారపడదు
3) కడ్డీ పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది
4) కడ్డీ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది
34. కింది ప్రవచనాల్లో ఏది తప్పు?
1) ఆదర్శ దృఢ వస్తువు యంగ్ గుణకం శూన్యం
2) ఆయతన గుణకాన్ని ఘన, ద్రవ, వాయు పదార్థాలకు నిర్వచిస్తారు
3) ఉక్కుకంటే రబ్బరు తక్కువ స్థితిస్థాపకత గల పదార్థం
4) ఒక లోహ తీగ సాగుదల దాని నిమోటన గుణకంపై ఆధారపడుతుంది
35. ద్రవాన్ని వేడిచేస్తే దాని స్పర్శా కోణం పెరుగుతుంది. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ఆ ద్రవం తలతన్యత?
1) అనంతం 2) సున్నా
3) నిర్వచించలేం 4) చాలా కొంచెం
36. ద్రవం ఉపరితలంపై ఒక సూది తేలుతూ ఉండగలిగే దృగ్విషయానికి కారణం?
1) ద్రవం స్నిగ్ధత 2) ద్రవ తలతన్యత
3) ద్రవ ఉల్లేకనం 4) ఆర్కిమెడిస్ సూత్రం
37. ఆటోమైజర్ పనిచేసే విధానం?
1) ద్రవం తలతన్యతపై ఆధారపడుతుంది
2) గురుత్వ త్వరణంపై ఆధారపడుతుంది
3) బెర్నౌలీ సూత్రంపై ఆధారపడుతుంది
4) ద్రవం స్నిగ్ధతపై ఆధారపడుతుంది
38. l పొడవు ఉండే లోలకాన్ని కలిగిఉన్న గడియారం 200 C వద్ద సరైన సమయాన్ని ఇస్తుంది. గడియారం 600 C పనిచేస్తే అది?
1) నిదానంగా నడుస్తుంది
2) వేగంగా నడుస్తుంది
3) కచ్చితంగా నడుస్తుంది
4) చెప్పలేం
39. 2770 K వద్ద ఒక పాత్రలో నీటిని నింపారు. ఉష్ణోగ్రతను తగ్గిస్తే ఆ పాత్రలోని నీరు? 1) పొర్లిపోతుంది 2) పొర్లదు
3) ద్రవమట్టం పడిపోతుంది 4) ఏమీ చెప్పలేం
40. స్థిర ఘనపరిమాణ వాయు ధర్మామీటర్ పనిచేసే సూత్రం?
1) బాయిల్ నియమం 2) చార్లెస్ నియమం
3) అవగాడ్రో నియమం 4) డాల్టన్ నియమం
41. నీటిని 0 నుంచి 40C మధ్య ఘనపరిమాణ వ్యాకోచ గుణకం?
1) రుణాత్మకం 2) ధనాత్మకం
3) సున్నా 4) కనిష్టం
42. ఒక ద్విలోహాత్మక పట్టి ఇత్తడి, ఇనుమును కలిగి ఉంది. దాన్ని వేడిచేసినప్పుడు ఇత్తడి కుంభాకారం వైపు ఇనుము, పుటాకారం వైపు ఉండేటట్లుగా ఒక చాపంగా వంగింది. ఇలా జరగడానికి కారణం?
1) ఇత్తడి, ఇనుము కంటే ఎక్కువ ఉష్ణధారణ సామర్థ్యం కలిగి ఉండటం
2) ఇత్తడి సాంద్రత ఇనుము కంటే ఎక్కువ
3) ఇనుము బద్దను ఇత్తడి బద్ద కంటే సులభంగా వంచవచ్చు
4) ఇత్తడి విలువ ఇనుము కంటే ఎక్కువ
43. వాయువుల్లో ధ్వని వేగాన్ని తెలిపే న్యూటన్ నియమాన్ని లాప్లస్ సవరించడానికి కారణం?
1) ధ్వని తరంగాలు కనిష్ట తరంగ ధైర్ఘ్యం కలిగి ఉంటాయి
2) ధ్వని తరంగాలు సమోష్ణోగ్రత పరిస్థితుల్లో ప్రయాణిస్తాయి
3) ధ్వని తరంగాలు స్థిరోష్ణోగ్రత పరిస్థితుల్లో ప్రయాణిస్తాయి
4) ధ్వని తరంగాలు అనుధైర్ఘ్య తరంగాలు
44. కింది తరంగ ధర్మాల్లో మిగిలినవాటిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేది?
1) తరంగధైర్ఘ్యం 2) కంపన పరిమితి
3) పౌనఃపున్యం 4) వేగం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు