Telugu | అచ్చునకు ఆమ్రేడితం పరమైన?
సంధులు
– పూర్వపదం, పరపదం పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు.
– ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు వస్తాయి.
– మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండో పదాన్ని పరపదం అని అంటారు.
– ఉదా: గజేంద్రుడు= గజ(పూర్వపదం)+ఇంద్రుడు(పరపదం)
పరస్పర కలయిక
– పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణం ప్రకారం పూర్వపదంలోని చివరి వర్ణాన్ని పలుకగా వచ్చే అచ్చును రాయాలి. పరపదంలోని మొదటి వర్ణాన్ని తీసుకోవాలి.
సంధులు రెండు రకాలు
1. సంస్కృత సంధులు, 2. తెలుగు సంధులు
సంస్కృత సంధులు
– సవర్ణదీర్ఘ సంధి
– గుణ సంధి
– వృద్ధి సంధి
– యణాదేశ సంధి
– అనునాసిక సంధి
– శ్చుత్వ సంధి
– జశ్వ సంధి
– విసర్గ సంధి
తెలుగు సంధులు
– ఆమ్రేడిత సంధి
– త్రిక సంధి
– రుగాగమ సంధి
– ద్విరుక్తటకార సంధి
– గసడదవాదేశ సంధి
– ద్రుత ప్రకృత సంధి(సరళాదేశ సంధి)
సవర్ణదీర్ఘ సంధి
– అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే దాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
– దీర్ఘంతో కూడుకున్న ఆ, ఈ, ఊ, ఋలను అక్కులు అంటారు.
ఉదా: దేవాలయం = దేవ+ఆలయం
– కరుణాలయం = కరుణ+ఆలయం
– ప్రళయాగ్ని = ప్రళయ+అగ్ని
– చంచలాత్మ = చంచల+ఆత్మ
– శీతాద్రి = శీత+అద్రి
– జలజాకారం = జలజ+ఆకారం
– ముఖారవిందం – ముఖ+అర్వందం
– మునీశ్వరుడు = ముని+ఈశ్వరుడు
– కవీంద్ర = కవి+ఇంద్ర
– గౌరీశ = గౌరి+ఈశ
– భానూదయం= భాను+ఉదయం
గుణసంధి
– అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే క్రమంగా ఏ, ఓ, ఆర్లు వచ్చును.
– ఏ, ఓ, ఆర్లను గుణాలు అంటారు.
వివరణ: అ+ఇ= ఏ, అ+ఉ= ఓ
అ+ఋ= ఆర్
ఉదా: దేవేంద్రుడు = దేవ+ఇంద్రుడు
– ఇతరేతర = ఇతర+ఇతర
– మహేశ్వరుడు = మహ+ఈశ్వరుడు
– కమలేంద్ర = కమల+ఇంద్ర
– తరుణేందుశేఖరుడు= తరుణ+ఇందుశేఖరుడు
– సురేశ్వర = సుర+ఈశ్వర
– పరోపకారం = పర+ఉపకారం
– కౌతుకోద్దతి = కౌతుక+ఉద్దతి
– గోవర్ధనోద్దరణ = గోవర్ధన+ఉద్దరణ
– ధీరోత్తములు = ధీర+ఉత్తములు
– కావ్యోపదేశం = కావ్య+ఉపదేశం
– తీరోత్సంగం = తీర+ఉత్సంగం
– హరణోద్యోగం = హరణ+ఉద్యోగం
– రాజర్షి = రాజ+ఋషి
వృద్ధి సంధి
– అకారానికి ఏ/ఇలు పరమైనప్పుడు ఐ కారం
– అకారానికి ఓ/ఔలు పరమైనప్పుడు ఔ కారాలు వస్తాయి.
– ఐ, ఔలను వృద్ధులు అంటారు.
వివరణ : అ+ఏ= ఐ, అ+ఐ= ఐ
అ+ఓ= ఔ, అ+ఔ= ఔ
ఉదా: అఖిలైశ్వరం = అఖిల + ఐశ్వర్యం
– పరమౌషధం = పరమ + ఔషధం
– లోకైక = లోక + ఏక
– మహైశ్వర్యం = మహ + ఐశ్వర్యం
– మహౌషధి = మహ+ఓషధి
– దేశౌన్నత్యం = దేశ+ఔన్నత్యం
– కృైష్ణెకత్వం = కృష్ణ + ఏకత్వం
– మహౌఘం = మహ + ఓఘం
– మహౌన్నత్యం = మహ+ఔన్నత్యం
– భువనైక = భువన + ఏక
– అఖండైశ్వర్యం = అఖండ + ఐశ్వర్యం
– పాపౌఘం = పాప + ఓఘం
– సురైక = సుర + ఏక
– ఏకైక = ఏక + ఏక
యణాదేశ సంధి
– ఇ, ఉ, ఋలకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు క్రమంగా య(య్), వ(వ్), ర(ర్)లు ఆదేశమగును.
– య, వ, రలను యణ్ణులు అంటారు.
వివరణ: ఇ+అసవర్ణాచ్చు-య(య్)
– ఉ+అసవర్ణాచ్చు-వ(వ్)
– ఋ+అసవర్ణాచ్చు-ర(ర్)
ఉదా: ప్రత్యుత్తరం = ప్రతి+ఉత్తరం
– అణ్వాయుధం = అణు + ఆయుధం
– మాత్రాశ = మాతృ+ఆశ
– ప్రత్యుపకారం = ప్రతి+ఉపకారం
– అత్యధికం = అతి+అధికం
– ప్రత్యక్షం = ప్రతి + అక్షం
– తర్వగ్రం = తరు+అగ్రం
– గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ
– అణ్వస్త్రం = అణు + అస్త్రం
– పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ
అనునాసిక సంధి – సూత్రం
– క, చ, ట, త, పలకు న, యలు పరమైతే అనునాసికలు వస్తాయి. న, మ ఒత్తు ఉన్న సంధి అనునాసిక సంధి
వివరణ: క, చ, ట, త, ప + న, య = ఙ, ఞ, న, య
ఉదా: వాక్ + మయం = వాఙ్మయం
– రాట్ + మహేంద్రవరం = రాణ్మహేంద్రవరం
– జగత్ + నాథుడు = జగన్నాథుడు
– జగత్ + నాటకం = జగన్నాటకం
ఉదా: రాణ్మహిమ = రాట్+మహిమ
– చిన్మయము = చిత్+మయము
– జగన్మాత = జగత్ + మాత
– జగన్మోహిని = జగత్ + మోహిని
– తన్మయము = తత్ + మయము
శ్చుత్వ సంధి
– స కార, త- వర్గాక్షరాలకు, శ-కార, చ వర్గాక్షరాలు పరమైనప్పుడు శకార, చ-వర్గాక్షరాలే వస్తాయి.
వివరణ: స, త వర్గాక్షరాలు+శ, చ వర్గాక్షరాలు = శ, చ వర్గాక్షరాలే వచ్చును.
– స, త, థ, ద, ధన+శ, చ, ఛ, జ, ఝ, ఞ = శ, చ, ఛ, జ, ఝ, ఞ ఇవే ఒత్తులు వచ్చే సంధి (శ్చ, చ్చ, జ్జ)
జశ్వ సంధి
– వర్గ ప్రథమాక్షరాలకు, వర్గద్వితీయ, వర్గ చతుర్థ, వర్గ తృతీయ, హ, య, వ, ర, ల, అచ్చులు పరమైనప్పుడు వర్గ తృతీయ అక్షరాలు వస్తాయి.
ఉదా: వాక్+ఈశుడు = వాగీశుడు
– సత్+ఆచారం = సదాచారం
– తత్+ధర్మం = తద్ధర్మం
– సత్+గమ్యం = సద్గమ్యం
– అప్ + లింగం = అబ్లింగం
– సత్+జనులు = సజ్జనులు
తెలుగు సంధులు
ఆమ్రేడిత సంధి
– అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగానగు అచ్చు+ఆమ్రేడితం.
ఉదా: అంత+అంత = అంతంత
– అహ+అహ = అహహ
– ఎంత+ఎంత= ఎంతెంత
– ఓహో+ఓహో = ఓహోహో
– ఇంత+ఇంత = ఇంతింత
– ఎదురు+ఎదురు = ఎదురెదురు
– పగలు+పగలు = పట్టపగలు
– కడ+కడ = కట్టకడ
– బయలు+బయలు = బట్టబయలు
కోడ్: 1) ఆమ్రేడిత సంధి పదాలను విడదీసినప్పుడు రెండు పదాలు ఒకే మాదిరిగా ఉంటాయి.
2) ఏక+ఏక, ఇతర+ఇతర అనే పదాలు ఆమ్రేడితి సంధికి ఉదాహరణలు కావు. కారణం ఇవి సంస్కృత పదాలు
– ఆమ్రేడితం: రెండు పదాలు ఒకేవిధంగా ప్రయోగించినప్పుడు రెండోసారి ప్రయోగించిన పదం ఆమ్రేడితం అవుతుంది.
త్రికసంధి
– ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికములు.
– త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళం.
– ద్విరుక్తమగు హల్లు పరమైనప్పుడు ఆచ్చికంబగు దీర్ఘము హ్రస్వమవును అచ్చ తెలుగు దీర్ఘం.
కోడ్: 1) మొదటి వర్ణం- అ, ఇ, ఎ
2) రెండో వర్ణం- ద్విత్వాక్షరం.
ఉదా: అద్విధము = ఆ+విధము
– ఇద్దరు = ఈ+దర
– ఎచ్చోట = ఏ+చోట
– అగ్గజేంద్రుడు = ఆ+గజేంద్రుడు
– రుగాగమ సంధి (ఆగమం = మిత్రుడు)
– సూత్రం-I: కర్మధారయంలో పేదాది శబ్దాలకు ఆలు పరమైతే సంధి రుగాగమ సంధి.
– కర్మధాయం = నామవాచక(విశేష్యం)+విశేషణాలతో ఏర్పడినది.
ఉదా: పేద+ఆలు = పేదరాలు
– బీద+ఆలు = బీదరాలు
– మనుమ+ఆలు = మనుమరాలు
– బాలింత+ఆలు = బాలింతరాలు
– జవ+ఆలు = జవరాలు
– సూత్రం-II: కర్మధారయంలో తత్సమ శబ్దాలకు ఆలు పరమైతే అత్వానికి ఉత్వం వచ్చే సంధి రుగాగమ సంధి.
ఉదా: గుణవంత+ఆలు = గుణవంతరాలు
– ధనవంత+ఆలు = ధనవంతురాలు
– ధైర్యవంత+ఆలు = ధైర్యవంతురాలు
– ఐశ్వర్యవంత+ఆలు = ఐశ్వర్యవంతురాలు
కోడ్: రుగాగమ సంధి పదాలు విడదీసినప్పుడు పరపదంలో కేవలం ఆలు అనే పదం మాత్రమే ఉంటుంది.
– రుగాగమ సంధి పదాలు కలిపి రాసినప్పుడు పదం చివర రాలు అని ఉంటుంది.
ద్విరుక్త టకార సంధి
– చిఱు, కఱు, కడు, నడు, నిడు శబ్దాల ఱ/డలకు అచ్చు పరమైతే వచ్చే సంధి ద్విరుక్తటకార సంధి.
ఉదా: చిఱు+ఎలుక = చిట్టెలుక
– కడు+ఎదురు = కట్టెదురు
– నడు+అడవి = నట్టడవి
– నిడు+ఊర్పు = నిట్టూర్పు
కోడ్: ద్విరుక్తటకార పదాలను విడదీసినప్పుడు పూర్వపదంలో చిఱు, కడు, కఱు, నడు, నిడు పదాలు వస్తాయి.
గసడదవాదేశ సంధి (ఆదేశం-శత్రువు)
– సూత్రం-I: ప్రథమ (డు, ము, వు, లు) మీది పరుషాల (క,చ, ట, త, ప)కు గసడదవలు బహుళం.
ఉదా: వాడు+కట్టె = వాడుగొట్టె
– వాడు+చనియే = వాడుసనియే
– పెళ్లము+కొట్టె = పెళ్లముగొట్టె
– మొగుడు+తన్నె = మొగుడుదన్నె
– సూత్రం-II: ద్వంద్వంబైన పదంబు మీద ఉన్న పరుషాలకు గసడదవలు కానవచ్చు.
ఉదా: అన్న+తమ్ముడు = అన్నదమ్ములు
– అక్క+చెల్లి = అక్కాచెళ్లెల్లు
– కూర+కాయలు = కూరగాయలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు