A Brief History of Railways | రైల్వేల సంక్షిప్త చరిత్ర
– దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు.
– మొదటి రైలు బొంబాయి- థానే మధ్య 34 కి.మీ. దూరం 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాల పాటు ప్రయాణం చేసింది.
– హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికే నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువుదీరింది. మొదటి రైల్వే లైన్ 1874 జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రారంభమైంది.
– 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.
– భారతీయ రైల్వేల నినాదం జాతి జీవనరేఖ.
– 1951లో భారత ప్రభుత్వం రైల్వేలను జాతీయం చేసింది.
– భారతీయ రైల్వేలు 150 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2002 ఏప్రిల్ 16న బోలు ది గార్డు అనే రైల్వే మస్కట్‌ను విడుదల చేశారు.
– ప్రపంచంలో పొడవైన రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ (1.8 కి.మీ.)లో ఉన్నది.
– ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,128 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ), రష్యా (87,157 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి.
– దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉండగా, వాటిలో అతి పెద్దది ఉత్తర రైల్వే జోన్ (6,968 కి.మీ.), అతి చిన్నది తూర్పు రైల్వే జోన్ (2,414 కి.మీ.).
– దేశంలో మొత్తం 21 రైళ్లు ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి.
– అత్యధిక దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది.
– దేశంలో అతి తక్కువగా 3 కి.మీ. ప్రయాణించే రైలు నాగ్‌పూర్-అజ్నీ ప్యాసింజర్.
– దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు గతిమాన్. ఇది గంటకు 160 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ-ఆగ్రా మధ్య నడుస్తున్నది.
– అత్యల్ప వేగంతో ప్రయాణం చేసే రైలు నీలగిరి. ఇది గంటకు 10 కి.మీ. వేగంతో మెట్టుపాలెం-ఊటి మధ్య నడుస్తున్నది.
వార్షిక బడ్జెట్లో రైల్వేలు
– గత ఆర్థిక ఏడాది (2017-18) నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెడుతున్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు రూ. 1,46,500 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కన్నా ఇది 22 శాతం ఎక్కువ. కేటాయింపుల్లో సింహ భాగం సామర్థ్య పెంపు కార్యక్రమాలకు ఖర్చుచేయనున్నారు. ముఖ్యంగా 18 వేల కి.మీ. మేర రెండు, మూడు, నాలుగు లైన్ల మార్గాలు ఏర్పాటు చేస్తారు. 5 వేల కి.మీ. మేర గేజ్ మార్పు చేపడుతారు. ఇది పూర్తయితే రైల్వే నెట్వర్క్ మెత్తం బ్రాడ్‌గేజ్‌గా రూపాంతరం చెందుతుంది.
– ఈ బడ్జెట్లో కొత్తగా రైళ్లను ప్రకటించలేదు.
– రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో 465 కి.మీ.ల పరిధిలో ఉన్న ముంబైలో 160 కి.మీ సబర్బన్ రైల్వే నెట్వర్క్ అభివృద్ధి
– రైల్వేల్లో రవాణారంగ కారిడార్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ
– గుజరాత్‌లోని వడోదరలో స్పెషలైజ్డ్ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
– 18 వేల కి.మీ. మేర రైల్వేలైన్ డబ్లింగ్ పనులు, 4,267 కాపలా లేని గేట్ల తొలిగింపు
– అత్యాధునిక సౌకర్యాలతో ట్రెయిన్ సెట్లు ఏర్పాటు
– అన్ని స్టేషన్లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సదుపాయాలు
– భారతీయ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్వంలో 600 ప్రధాన స్టేషన్లను అభివృద్ధి చేస్తారు.
– నిత్యం 25 వేల మంది ప్రయాణం చేసే చోట ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు.
– 2018-19 నాటికి పెరంబూరులోని కోచ్ ఫ్యాక్టరీలో తయారైన కోచ్‌లు పట్టాలకెక్కుతాయి.
– ప్రయివేటు సంస్థల సహకారంతో గూడ్స్ షెడ్ల వద్ద మౌలిక వసతుల కల్పన.
– రైళ్లలో, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన తాగునీరు, వైఫై, ఆధునిక నిరీక్షణ గదులు, సమాచార కియోస్కుల వంటి సదుపాయాలతో ప్రపంచ స్థాయి స్టేషన్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
– ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు 50 శాతం నిధుల పెంపు
– 2017-18 బడ్జెట్లో రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్… పేరుతో లక్ష కోట్ల రూపాయిలతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఐదేండ్ల పాటు రైళ్ల భద్రతకు అవపరమైన చర్యలు చేపడుతారు.
దేశ నాలుగు మూలల్లో ఉన్న రైల్వే స్టేషన్లు
ఉత్తరం- బారాముల్లా (కశ్మీర్)
దక్షిణం- కన్యాకుమారి (తమిళనాడు)
తూర్పు- లెడో (అసోంలోని తీన్ సుకాడియాలో)
పడమర- నలియా (గుజరాత్‌లోని భుజ్ సమీపంలో)
తొలి రైల్వే శాఖ మంత్రి జాన్‌మథాయ్ కాగా, ప్రస్తుతం పీయూష్ గోయల్ మంత్రిగా కొనసాగుతున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు