తెలంగాణ.. సంస్కరణలకు ముందు- తర్వాత
నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని తాలూకాదారులు పర్యవేక్షించేవారు. తెలంగాణ ప్రాంతంలో 5,119 పెద్ద చెరువులు, 15,000 చిన్న చెరువులు ఉండేవి. పాకాల, రామప్ప, లక్నవరం, హుస్సేన్‌సాగర్, మీర్ ఆలం వంటి పెద్ద చెరువులు సాగునీటిని అందించేవి.
సంస్కరణల్లో తీసుకున్న నిర్ణయాలు
– సాలార్జంగ్ కేవలం సంవత్సరకాలానికి తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ప్రవేశపెట్టిన శిస్తు విధానాన్ని హైదరాబాద్ రాష్ట్రమంతా విస్తరింపజేశాడు.
– ఈ విధానంలో రైతుల హక్కులు, ప్రభుత్వ శిస్తును, తాలూకాదార్ల్ల అధికారాన్ని స్పష్టంగా నిర్వచించాడు.
– వంశపారపర్యంగా అధికారాన్ని చెలాయిస్తున్న అసమర్థులైన, అవినీతిపరులైన తాలూకాదార్లను తొలిగించి తక్కువ వేతనంతో పనిచేసే కొత్త తాలూకాదార్లను నియమించాడు.
– వీరిని ముందే గుర్తించి వారి శక్తిసామర్థ్యాలను, విశ్వాసపాత్రను, ప్రవర్తనను ముందే అంచనావేయడం, గుర్తించడం జరిగేది.
– ఇలా రకరకాల జాగీర్దార్ల నుంచి భూమిని దివానీ (ప్రభుత్వం) ప్రాంతంలో కలిపారు.
– ఈ సంస్కరణలు మొదటి దశ 1853-63లో ప్రారంభమై, రెండోదశ 1864-83కి కూడా కొనసాగడంవల్ల సంస్కరణలు నిరంతరాయంగా కొనసాగాయని చెప్పుకోవచ్చు.
– ప్రభుత్వ భూమి (దివానీ ప్రాంతం) భారీగా విస్తరించడానికి కారణం 1) తనఖా జాగీర్లను కలుపుకోవడం 2) 1861 తర్వాత నిజాంకు కొన్ని జిల్లాలు అప్పగించడం
– ఇదే కోవలో మొదటి దశ సంస్కరణల్లో భాగంగా ఎగుమతులు, దిగుమతులపై పన్నులు తొలిగించి వాణిజ్యాన్ని సులభతరం చేశారు. 1860లో సుంకాలు రద్దుచేసి, సుంకశాఖను ఏర్పాటుచేసి అది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటట్టు చేశాడు.
– అదేవిధంగా ఉప్పుపై విధించే రకరకాల పన్నులను తొలిగించి క్రమబ్ధమైన పన్నుల విధింపు, వసూళ్ల కోసం సుంకాల శాఖకు అధికారం కట్టబెట్టారు.
– ఈ విధంగా క్రమబద్ధమైన పన్ను విధానం అమల్లోకి రావడంవల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా అది నిరంతరంగా స్థిర ఆదాయాన్ని ఇచ్చింది.
– దీనివల్ల ప్రభుత్వ ఖజానా ఏర్పడి, తక్కువ వడ్డీకి ప్రజలకు రుణసదుపాయం కలిగింది.
Laknavaram-lake1
నీటిపారుదల శాఖలో సంస్కరణలు
– హైదరాబాద్ స్టేట్ నీటిపారుదల వ్యవస్థ వైభవంగా వెలుగొందుతూ ఉండేది. తెలంగాణ ప్రాంతంలో 5119 పెద్ద చెరువులు, 15,000 చిన్న చెరువులు ఉండేవి. పాకాల, రామప్ప, లక్నవరం, హుస్సేన్‌సాగర్, మీర్ ఆలం వంటి పెద్ద చెరువులు సాగునీటిని అందించి జీవధారలుగా ఉండేవి.
– నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని పర్యవేక్షించేది మాత్రం తాలూకాదారులే. ఈ తాలూకాదారులే తమ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను పరిశీలించేవారు.
– ఈ విధంగా భూసంబంధ విషయాల్లో, నీటిపారుదల వ్యవస్థల్లో, శిస్తు విషయాల్లో ఉన్న ఎన్నో లోపాలను సరిదిద్ది, ప్రభుత్వ ఖజానాకు ఓ స్థిరమైన ఆదాయాన్ని, సుస్థిర పాలనా వ్యవస్థను నెలకొల్పారు.
సంస్కరణల అనంతరం హైదరాబాద్ స్టేట్
– సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలకు ముందు, తర్వాత హైదరాబాద్ స్టేట్‌లో వ్యవసాయం, రైతులు, పరిశ్రమల పరిస్థితి, దాని తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి..
వ్యవసాయం..
– 82,700 చ.మైళ్ల పరిధిలో ఉన్న హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ వ్యవసాయ ప్రాంతంగా పరిఢవిల్లింది. రాజ్యంలో ఉన్న మొత్తం 5.3 కోట్ల ఎకరాల్లో 53.7 శాతం సాగుభూమిగా ఉండేది. ఇందులో 67.45 శాతం ఆహార పంటలు, 7.3 శాతం బీడుభూములు, 6.2 శాతం పండించే బీడుభూములు, 11 శాతం అడవుల రూపంలో ఉండేది.
– హైదరాబాద్ స్టేట్‌లో భౌగోళికంగా రెండు భాగాలుగా విడివడినట్లుండే భూ సంబంధాలు ఉండేవి. ఒక రకంగా భూమిశిస్తు పరంగా (దివానీ, జాగీరు ప్రాంతాలు) జరిగే విభజన కూడా దీన్నే పోలి ఉండేది.
సాలార్‌జంగ్‌కు పూర్వం వ్యవసాయం
– వ్యవసాయం కేవలం ఆహార అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. దివానీ, దివానీయేతర ప్రాంతాల్లో భూస్వామ్య లక్షణాల్లో ఉపయోగపు విలువ కోసం మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఉండేది. దీంతోపాటు సాంప్రదాయ కుల ప్రాతిపదికగా రకరకాల కులవృత్తులపై ఆధారపడ్డ కుటుంబాల పరంగా వ్యవసాయేతర ఉత్పత్తి జరిగేది. కానీ సంస్కరణల తర్వాత, ఇంగ్లండ్‌తో సహా పశ్చిమ యూరప్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం అనంతరం ఏర్పడ్డ పరిస్థితులవల్ల భారతదేశం వెలుపల, లోపల వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారింది. దీంతో హైదరాబాద్ స్టేట్‌లో వ్యవసాయం కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారింది. ఇతర రాజ్యాలతో పోల్చినప్పుడు విదేశాలకు సైతం ఎక్కువ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
– అయితే హైదరాబాద్ స్టేట్ దక్కన్ పీఠభూమిలో, కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉండటంతో నీటిపారుదల వ్యవస్థ సరైన రీతిలో అభివృద్ధి చెందలేదు. దీంతో నీటివసతి తక్కువ అవసరమయ్యే పంటలు పండించేవారు.
– వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, పత్తి, పొగాకు, మిరప లాంటి సాధారణ పంటలు అధికంగా సాగులో ఉండేవి. వరంగల్ సుభాలో నీటివనరులు అందుబాటులో ఉండటంతో వరి, జొన్న అధికంగా పండించేవారు. హైదరాబాద్ స్టేట్ నుంచి ముఖ్యంగా ఆహార పంటలు ఎగుమతి అయ్యేవి. ఇక్కడ బియ్యం కొరత ఎక్కువగా ఉండటంతో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి దిగుమతి చేసుకునేవారు.
– 1920 ప్రాంతంలో నూనెగింజలు, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటలు అధికంగా సాగుచేశారు.
– నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో అధికంగా నీటిపారుదల సౌకర్యం ఉండటంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది.
– 1930 వరకు సాగునీరు, వాణిజ్య వ్యవసాయం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. చక్కెర, పత్తి, నూనె గింజల ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ స్టేట్ వ్యవసాయపరంగా అభివృద్ధి చెందింది.
ప్రపంచ మార్కెట్లో హైదరాబాద్ ఆర్థికవ్యవస్థ
– 19వ శతాబ్దంలో ప్రపంచ మార్కెట్లో పత్తికి విపరీతంగా గిరాకీ పెరగడం వల్ల మరట్వాడా ప్రాంతం పత్తికి కేంద్రంగా మారింది. అయితే ఆ తరువాత నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా కూడా పత్తికి వ్యాపార కేంద్రంగా నిలిచింది. 1930 నాటికి ఉత్పత్తి అయిన పత్తిలో 60 శాతం విదేశాలకు ఎగుమతి అయ్యేది. అదేకాలంలో నూనెగింజల ఉత్పత్తి కూడా పెరగడంతో హైదరాబాద్ స్టేట్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ మార్కెట్లో పేరుగడించింది.
1940లలో ఆహార కొరత
– 1930-40 మధ్యకాలంలో వాణిజ్య పంటలపై ఎక్కువగా ఆధారపడటం, నీటిపారుదల వ్యవస్థ సంస్థానమంతా విస్తరించకపోవడంతో హైదరాబాద్ స్టేట్‌లో ఆహార కొరత ఏర్పడింది. ముఖ్యంగా జొన్నల ఉత్పత్తి విపరీతంగా పడిపోయింది.
– 1940-44 మధ్య ఆహార పంటల విస్తీర్ణం- 1,83,44,000 ఎకరాలు
– 1934-40 మధ్య ఆహార పంటల విస్తీర్ణం- 1,94,93,000 ఎకరాలు
– అంటే దాదాపు 10,49,000 ఎకరాలు తగ్గిపోయి ఆహార పంటలకు కొరత ఏర్పడింది.
– 1920-22లో ఆహార ధాన్యాల విస్తీర్ణం మొత్తం పంటల విస్తీర్ణంలో 75 శాతం ఉండగా, 1949-50 నాటికి అది 68 శాతానికి తగ్గింది. అంటే ఆహారేతర పంటల్లో నూనెగింజల సాగు మొత్తం విస్తీర్ణంలో 20 శాతం అధికమైంది. ఆహారపంటల్లో కూడా ప్రత్యేకత సంతరించుకుని మొత్తం వరి ధాన్యపు విస్తీర్ణం 1920-22లో 3 శాతం ఉండగా 1949-50 నాటికి 6 శాతానికి పెరిగింది. అదే కాలంలో జొన్న, సజ్జ కలిపి 49 శాతం నుంచి 31 శాతానికి పడిపోయింది.
హైదరాబాద్ స్టేట్ చేపట్టిన సాంకేతిక మార్పులవల్ల పంటల సాగుబడిలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.
– 1940-41 నాటికి 53.2 శాతం భూమి వివిధ పంటల కింద ఉండింది. అయితే భారీ నీటిపారుదల అభివృద్ధి వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. 1922లో కేవలం 0.8 మిలియన్ ఎకరాలుగా ఉన్న నీటిపారుదల వ్యవస్థ, 1945 నాటికి 1.7 మిలియన్ ఎకరాలకు పెరిగింది.
హైదరాబాద్ స్టేట్‌లో వ్యవసాయం
-రాజ్యంలో ఎక్కువ భూమి సాగులో ఉంది. కానీ తక్కువ సారవంతమైనది. ఈ రాజ్యం వ్యవసాయ ఆధారమైనది. అందువల్ల ఎక్కువమంది ప్రజలు భూమిపై, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ రైత్వారీ పద్ధతి లాంటి భూమిశిస్తు విధానం ఉంది. అయితే ఎక్కువ భూమి అతి తక్కువమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. ఎక్కువ మంది ప్రజలు చిన్న భూకమతాలపై ఆధారపడి ఉండేవారు. 22 శాతం మంది వ్యవసాయ కూలీలుగా ఉండగా, వీరిలో ఎక్కువమంది అంటరాని కులాలవారు, సామాజికంగా వెనుకబడిన కులాలవారు ఉండేవారు.
– భాస్కర్ రావు (1985, పుట 160) అధ్యయనం ప్రకారం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు