Agriculture | పంటలు- సాంద్రత, దిగుబడి
– స్థూల పంటల సాగు విస్తీర్ణానికి, నికర పంటల సాగు విస్తీర్ణానికి మధ్యగల నిష్పత్తిని పంటల సాంద్రత అంటారు.
– పంటల సాంద్రత= స్థూల పంటల సాగు విస్తీర్ణం/ నికర పంటల సాగు విస్తీర్ణం
– రాష్ట్ర సగటు పంటల సాంద్రత: 1.27
– రాష్ట్రంలో అత్యధిక పంటల సాంద్రత గల జిల్లా: నిజామాబాద్
– రాష్ట్రంలో అత్యల్ప పంటల సాంద్రత గల జిల్లా: కుమ్రంభీం ఆసిఫాబాద్
– పంట సాగుకాలాన్ని అనుసరించి ఒక ఏడాదిని మూడు పంట కాలాలుగా వర్గీకరించారు. అవి…
1. ఖరీఫ్ పంటకాలం:ఇది నైరుతి రుతుపవన పంట కాలం
– వ్యవధి: (జూన్ – అక్టోబర్) ఐదు నెలలు
2. రబీ పంటకాలం: ఇది శీతాకాలం పంటకాలం
– వ్యవధి: (నవంబర్ – ఫిబ్రవరి) – నాలుగు నెలలు
– ఈ కాలంలో పండే పంటలు: గోధుమ, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, రాగి, బార్లీ, చిక్కుడు, సోయా మొదలైనవి.
3. జయీద్ పంటకాలం: ఇది వేసవి పంటకాలం
– వ్యవధి: (మార్చి -మే) – మూడు నెలలు
– ఈ కాలంలో పండే పంటలు: కూరగాయలు, తీగపంటలు. అంటే కూరగాయలు, పుచ్చకాయలు, అనిగెపుకాయలు, దోసకాయలు, కాకరకాయలు, పూలు మొదలైనవి.
– గమనిక: నీటిపారుదల సౌకర్యాలు ఉన్నచోట జయీద్ పంటకాలంలో అన్నిరకాల పంటలను పండించవచ్చు.
పంటల రకాలు
– దేశం, రాష్ట్రంలో పంటలను ముఖ్యంగా నాలుగు విధాలుగా విభజించవచ్చు.
1. ఆహారపంటలు.. ఇవి తిరిగి మూడు రకాలు
– ప్రధాన ధాన్యాలు: వరి, గోధుమ, మక్కజొన్న
– తృణధాన్యాలు (చిరుధాన్యాలు): జొన్నలు, సజ్జలు, రాగులు, బార్లీ
– పప్పుధాన్యాలు: పెసరులు, కందులు, మినుములు, శెనగలు, సోయాబీన్
2. వాణిజ్య పంటలు (నగదు పంటలు): పత్తి, పొగాకు, చెరుకు, జనుము, నూనెగింజలు మొదలైనవి.
– నూనెగింజలు: వేరుశెనగలు, ఆముదం, పొద్దుతిరుగుడు, పామోలివ్, నువ్వులు, కుసుమలు,
3. తోట పంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు
4. ఉద్యాన పంటలు: పండ్లు, పూలు, కూరగాయలు
పంటలు- ఉత్పత్తులు
1. ఆహార పంటలు: రాష్ట్రంలో 2016-17 వ్యవసాయ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆహారధాన్యాల దిగుబడుల్లో పెరుగుదల నమోదైంది.
– 2015-16 వ్యవసాయ సీజన్లో ఆహారధాన్యాల దిగుబడి – 51.45 లక్షల టన్నులు
– 2016-17 వ్యవసాయ సీజన్లో ఆహారధాన్యాల దిగుబడి 71.93 లక్షల టన్నులు (ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు)
– 2016-17 వ్యవసాయ సీజన్లో ఆహారధాన్యాల దిగుబడి, సాగు విస్తీర్ణం పెరుగుదల నమోదు కావడానికి కారణం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం.
ప్రధాన ధాన్యాలు వరి
– ఇది ప్రధాన ఆహారపంట
– ఇది ఉష్ణమండల పంట
– వరి సాగును హో కల్చర్ అంటారు.
– వరి పంటకు ఒండ్రు నేలలు అనుకూలం
– వరి ఉత్పత్తిలోను, సాగు విస్తీర్ణంలోను అగ్రస్థానంలో ఉన్న జిల్లా : నల్లగొండ
– వరి ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా: కరీంనగర్
– గమనిక: 1. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ- కరీంనగర్
2. జాతీయ వరి పరిశోధన కేంద్రం- కటక్ (ఒడిశా)
3. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం – మనీలా (ఫిలిప్పీన్స్)
గోధుమ
– ఇది సమశీతోష్ణమండల పంట (15o C- 21o C) కాబట్టి తెలంగాణ గోధుమ పంట సాగుకు అనుకూలం కాదు. అందువల్ల గోధుమను అతి తక్కువగా సాగుచేస్తారు.
– గోధుమ పంటకు ఒండ్రు లోమ్ నేలలు అనుకూలం
– గోధుమ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం, ఉత్పాదకతలో అగ్రస్థానంలోగల జిల్లా- ఆదిలాబాద్
– భారత్లో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే గోధుమ రకాలు:
1) కళ్యాణ్సోనా
2) సోనాలికా
3) షర్బతి
– గమనిక: హరిత విప్లవం(1965) ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన పంటలు- 1. గోధుమ, 2. వరి, 3. జొన్నలు
– తక్కువ ప్రయోజనం పొందిన పంటలు- 1. పప్పుధాన్యాలు 2. నూనెగింజలు
హరిత విప్లవం (1965-66)
– హరిత విప్లవం అనే పదాన్ని మొదటవాడిన వ్యక్తి – విలియం గాండ్
– హరితవిప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచంలో వ్యాప్తిచేసిన వ్యక్తి – నార్మన్ బోర్లాగ్ (మెక్సికో)
– బోర్లాగ్ను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ అని అంటారు.
– దేశంలో హరితవిప్లవాన్ని అధికంగా వ్యాప్తిచేసిన వ్యక్తి – ఎంఎస్ స్వామినాథన్ (ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా)
– హరిత విప్లవాన్ని అమలుచేసిన రాష్ర్టాలు: 1. పంజాబ్ 2. హర్యానా 3. పశ్చిమ ఉత్తరప్రదేశ్
– ప్రపంచ రొట్టెలగంప (వరల్డ్ బాస్కెట్ ఆఫ్ బ్రెడ్) అని ఏ దేశాన్ని పిలుస్తారు? – ఉక్రెయిన్ (రాజధాని కీవ్)
మక్కజొన్న (MAIZE)
ఉత్పత్తి:
– ప్రపంచంలో: అమెరికా, చైనాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
– భారత్లో: కర్ణాటక మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి.
– తెలంగాణలో: కరీంనగర్ ప్రథమ స్థానంలో, పెద్దపల్లి రెండో స్థానంలో ఉన్నాయి.
తృణ ధాన్యాలు (మిల్లెట్లు):
– ప్రపంచంలో తృణ ధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– తెలంగాణలో ఉత్పత్తయ్యే తృణ ధాన్యాలు: జొన్నలు, సజ్జలు, రాగులు, బార్లీ.
1. జొన్నలు (JOWAR):
ఉత్పత్తి:– ప్రపంచంలో: నైజీరియా ప్రథమ స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.
– దేశంలో: మహారాష్ట్ర అగ్రస్థానంలో, కర్ణాటక రెండోస్థానంలో ఉన్నాయి.
– తెలంగాణలో: మహబూబ్నగర్ ప్రథమ స్థానంలో, ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉన్నాయి.
– ఇది రబీ కాలం పంట.
– ఈ పంటకు నల్ల జంబాల మృత్తికలు (పొర మాదిరి) చాలా అనుకూలం.
2. సజ్జలు (BAJRA)/ముత్యాల తృణ ధాన్యాలు:
ఉత్పత్తి:– ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– దేశంలో: రాజస్థాన్ ప్రథమస్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో ఉన్నాయి.
– తెలంగాణలో: ఉమ్మడి నిజామాబాద్ మొదటి స్థానంలో, మహబూబ్నగర్, మెదక్ తర్వాతి స్థానంల్లో ఉన్నాయి.
3. రాగులు (RAGI)/తైదలు:
ఉత్పత్తి: – ప్రపంచంలో: భారత్ మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నాయి.
– దేశంలో: కర్ణాటక అగ్రస్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో, కేరళ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
– తెలంగాణలో: మహబూబ్నగర్ ప్రథమ స్థానంలో, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
– రాగులు దక్షిణ భారతదేశంలో మాత్రమే పండుతాయి.
– మారుపేర్లు: తైదలు, ఫింగర్ మిల్లెట్, బక్వీట్
– నోట్: జొన్నలు, సజ్జలు, రాగులను పేదవాని ఆహారంగా పిలుస్తారు.
4. బార్లీ (Barley):
ఉత్పత్తి:– ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– భారత్లో: ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, బీహార్ రెండో స్థానంలో ఉన్నాయి.
– ప్రపంచంలో భారత్ 10 శాతం బార్లీని ఉత్పత్తి చేస్తున్నది.
– బార్లీ గింజలను బీరు, విస్కీ తయారీలో ఉపయోగిస్తారు.
– నోట్: భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ – హైదరాబాద్
– తెలంగాణలో చిరుధాన్యాలు అధికంగా ఉత్పత్తిచేసే జిల్లా: ఉమ్మడి మహబూబ్నగర్
పప్పు ధాన్యాలు (PULSES)
– తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పప్పు దినుసులు పండిస్తారు.
– పప్పు దినుసులను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు 11 రకాలుగా వర్గీకరించారు. కాని అందులో ప్రధానమైనవి: పెసర, కందులు, మినుములు, శనగలు, సోయాబీన్.
1. పెసర (GREEN GRAM):
ఉత్పత్తి: – ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– భారత్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది.
– తెలంగాణలో: నల్లగొండ ప్రథమ స్థానంలో, సూర్యాపేట రెండో స్థానంలో ఉన్నాయి.
– రాష్ట్రంలో పెసర ఉత్పత్తి, సాగు విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా- నల్లగొండ.
2. కందులు (Red Gram):
ఉత్పత్తి:– ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– దేశంలో మహారాష్ట్ర ప్రథమస్థానంలో ఉంది.
– తెలంగాణలో మెదక్ అగ్రస్థానంలో, మహబూబ్నగర్ రెండో స్థానంలో ఉన్నాయి.
– రాష్ట్రంలో కందుల సాగు విస్తీర్ణం ఎక్కువగాగల జిల్లా – మహబూబ్నగర్
3. మినుములు (Black Gram)
ఉత్పత్తి:– ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– దేశంలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
– తెలంగాణలో: సంగారెడ్డి మొదటి స్థానంలో, మెదక్ రెండో స్థానంలో, నిజామాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి.
– రాష్ట్రంలో మినుముల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంలో అగ్రస్థానంగల జిల్లా- సంగారెడ్డి.
4. శనగలు (Bengal Gram)
ఉత్పత్తి: – ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
– దేశంలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
– తెలంగాణలో: సంగారెడ్డి ప్రథమ స్థానంలో, మెదక్ రెండో స్థానంలో ఉన్నాయి.
– రాష్ట్రంలో శనగల సాగు విస్తీర్ణంలో అగ్రస్థానంగల జిల్లా – సంగారెడ్డి.
– రాష్ట్రంలో శనగల ఉత్పత్తిలో అగ్రస్థానంలోగల జిల్లా – నిజామాబాద్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు