Rainbow revolution | ఇంద్రధనస్సు విప్లవం ప్రధాన ఉద్దేశం?
ఉల్లి (Onion)
– ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో చైనా ప్రథమస్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో ఉన్నది.
– దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
– రాష్ట్రంలో ఉల్లిగడ్డల సాగు విస్తీర్ణం- 15 శాతంగా ఉంది.
– వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా వృద్ధిలోకి తీసుకురావడానికి వివిధ రకాల విప్లవాలను, వాటి పెంపకాలను ప్రవేశపెట్టారు.
అవి..
1. తేనె టీగల పెంపకం- ఎపికల్చర్
2. పట్టు పురుగుల పెంపకం- సెరికల్చర్
3. చేపల పెంపకం- ఆక్వాకల్చర్ (పిసికల్చర్)
4. కూరగాయలు, మొక్కల పెంపకం (సాగు)- ఆర్బొరికల్చర్
5. ఉద్యానపంటల పెంపకం- హార్టికల్చర్ (పండ్లు, పూలు, కూరగాయలు)
6. పండ్లు, పండ్లతోటల పెంపకం- పొమికల్చర్
7. పూల పెంపకం- ఫ్లోరికల్చర్
8. ద్రాక్షతోటల పెంపకం-విటికల్చర్
– వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన విప్లవాలు.
1. ఊదా విప్లవం (Violet Revolution)
– ఉన్ని వస్తువుల అభివృద్ధి
2. నీలి విప్లవం (Blue Revolution)
– చేపలు, సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి
3. హరిత విప్లవం (Green Revolution)
– గోధుమ ఉత్పత్తుల అభివృద్ధి
4. పసుపు విప్లవం (Yellow Revolution)
– నూనెగింజల ఉత్పత్తి పెంపకం
5. ఆరెంజ్ విప్లవం (Orange Revolution)
– నిమ్మజాతి ఫలాల దిగుబడులు పెంచడం
6. ఎరుపు విప్లవం(Red Revolution)
– మాంసం, టమాటా ఉత్పత్తుల పెంపకం
7. శ్వేత విప్లవం(White Revolution)
– పాలు/ పాల ఉత్పత్తుల పెంపకం
8. బ్లాక్ విప్లవం (Black Revolution)
– చమురు/ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులను అధికం చేయడం
9. బూడిద విప్లవం (Grey Revolution)
– కృత్రిమ ఎరువుల ఉత్పత్తులను పెంచడం
10. గులాబి విప్లవం (Pink Revolution)
– రొయ్యల అభివృద్ధి
11. బ్రౌన్ విప్లవం (Brown Revolution)
– సుగంధ ద్రవ్యాల ఉత్పత్తుల పెంపకం
12. వెండి విప్లవం (Silver Revolution)
– కోడిగుడ్ల ఉత్పత్తుల పెంపకం
13. బంగారు విప్లవం (Gold Revolution)
– పండ్ల ఉత్పత్తుల పెంపకం
14. రౌండ్ విప్లవం (Round Revolution)
– ఆలుగడ్డల ఉత్పత్తుల పెంపకం
15. ఆహారపు గొలుసు విప్లవం (Food chain Revolution)
– గిడ్డంగుల ఏర్పాటు
16. ఇంద్రధనస్సు విప్లవం (Rainbow Revolution)
– అన్నిరకాల ఉత్పత్తుల పెంపకం
గమనిక: 2000, జనవరి 28న మొదటిసారిగా భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా విప్లవాలన్నింటిని ఏకీకృతం చేస్తూ ఇంద్రధనస్సు విప్లవంను ప్రవేశపెట్టింది. ఈ విప్లవంలో మిశ్రమ వ్యవసాయం కూడా ఒక భాగం.
హరితవిప్లవం (1965-66)
– హరిత విప్లవం అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి
– విలియం గాట్
– హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచంలో వ్యాప్తి చేసిన వ్యక్తి (ప్రపంచ హరితవిప్లవ పితామహుడు)
– నార్మన్ బోర్లాగ్ (మెక్సికో)
– భారతదేశంలో హరిత విప్లవాన్ని అధికంగా వ్యాప్తిచేసిన వ్యక్తి (భారత హరితవిప్లవ పితామహుడు)
– ఎంఎస్ స్వామినాథన్
దేశంలో హరితవిప్లవం
– దేశంలో హరితవిప్లవం ద్వారా పంజాబ్, హర్యానా రాష్ర్టాలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అధికంగా ప్రయోజనం పొందాయి.
– హరితవిప్లవం వల్ల అధికంగా ప్రయోజనం పొందిన పంటలు గోధుమ, వరి, జొన్నలు, మొక్కజొన్న
– హరితవిప్లవం ద్వారా తక్కువ ప్రయోజనం పొందిన పంటలు.. పప్పుధాన్యాలు, నూనెగింజలు
శ్వేత విప్లవం (White Revolution)
– కేంద్ర ప్రభుత్వం శ్వేత విప్లవాన్ని ప్రోత్సహిస్తూ 1970లో పాల వెల్లువ (Operation Flood) అనే పథకాన్ని ప్రారంభించింది.
– పాల విప్లవ (శ్వేత విప్లవ) పితామహుడు – వర్గీస్‌కురియన్
ఉద్దేశం: గ్రామాలను పట్టణాలతో అనుసంధానించడం. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను, పట్టణ ప్రాంతాల్లో పాల వినియోగతను పెంచడం
గమనిక: దేశంలో ప్రముఖ పాల కంపెనీ – Amul (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)
– జాతీయ పాల పరిశోధనా కేంద్రం – కర్నాల్ (హర్యానా)
గోదాంల ఏర్పాటు (Food Revolution)
– తెలంగాణ ప్రభుత్వం మొత్తం 17,057 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాంల నిర్మాణం చేపడుతుంది.
– మొత్తం 330 ప్రదేశాలోల నాబార్డ్ సహాయంతో మొత్తం 138 గోదాంల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఒక్కొక్క గోదాం ప్రత్యేక డిజైన్‌తో కూడి మొత్తం మూడు కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది. వీటిలో..
– రైతుబంధు పథకం
– ఎంఎస్పీ ఆపరేషన్లు
– పీడీఎస్ బియ్యం/ విత్తనాలు నిల్వ చేస్తారు.
పశుసంపద
– ప్రపంచంలో పశువుల విషయంలో మొదటి స్థానం భారత్
– ప్రపంచం మొత్తం మీద ఉన్న పశువుల్లో 57 శాతం బర్రెలు భారత్‌లో ఉన్నాయి.
– 2016-17 సీజన్లో పశువులు 42 శాతం కలిగి వ్యవసాయం తర్వాత స్థానాన్ని కలిగి ఉన్నాయి.
– వ్యవసాయరంగంలో పశుపోషణ ఒక భాగం.
పాడి పశువులను ఆవులు, బర్రెలుగా.. మాంసాన్నిచ్చే జంతువులను గొర్రెలు, మేకలుగా విడదీస్తాం.
– భారత్‌లోని బర్రెలు, గొర్రెల సంతతి మొత్తంలో తెలంగాణలోని బర్రెలు, గొర్రెల సంతతి 5.52 శాతానికిపైగా ఉంది.
– దేశంలో మొదటిసారిగా పశుసంపద గణాంకాలను తయారుచేసిన సంవత్సరం 1919
– ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఈ గణాంకాలు తయారు చేస్తారు.
– తెలంగాణలో సుమారు 29 లక్షల కుటుంబాలు పశుపోషణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి.
– రాష్ట్రంలో మొత్తం పశుసంపద 2,70,72,891
(తెలంగాణ పశుసంపద 2012 లెక్కల ప్రకారం)
వీటిలో
– గొర్రెలు – 1,28,35,761
– ఆవులు, ఎద్దులు -48,80,293
– గేదెలు – 41,60,419
– మేకలు – 45,75,695
– కోళ్లు – 807.51 లక్షలు
– పశుసంపద జనాభాలో భారత్‌లో తెలంగాణ
– 10వ స్థానం
దేశ పశుసంపదలో తెలంగాణ స్థానం
– గొర్రెల సంఖ్యలో 2వ స్థానం
– కోళ్ల సంఖ్యలో 4వ స్థానం
– మేకల సంఖ్యలో 13వ స్థానం
– పశువుల సంఖ్యలో 13వ స్థానం
– పందుల సంఖ్యలో 15వ స్థానం
గమనిక: తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిలో భాగంగా గొల్లకురుమ, యాదవులకు గొర్రెల పంపిణీని చేపట్టారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2017, జూన్ 20న సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో ప్రారంభించారు.
– ఈ పథకంలో 75 శాతం సబ్సిడీతో ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తున్నారు.
– తెలంగాణలోని మూడు రకాల గొర్రెలు లభిస్తాయి. అవి.. 1. దక్కనీబ్రీడ్ 2. నెల్లూరు బ్రీడ్ 3. జొడిపి
– కేంద్ర గొర్రెలు, ఉన్ని పరిశోధనా సంస్థ
– అవికానగర్ (రాజస్థాన్)
– కేంద్ర మేకల పరిశోధనా సంస్థ- మక్దూమ్ (ఉత్తరప్రదేశ్)
– కేంద్ర ఉన్ని అభివృద్ధి బోర్డు- జోధ్‌పూర్ (రాజస్థాన్)
– కేంద్ర బర్రెల పరిశోధన సంస్థ- హిస్సార్ (హర్యానా)
– కేంద్ర పాడి పరిశోధన సంస్థ- కర్నాల్ (హర్యానా )
– తెలంగాణలో ఏడాదికి 34.24 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో దేశంలో 13వ స్థానంలో ఉంది.
– భారత్ మొదటి స్థానం: ఉత్తరప్రదేశ్
పాల ఉత్పత్తి – ఉత్పాదకత
– 2014-15లో రాష్ట్రం 235.32 మెట్రిక్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది.
– రాష్ట్రంలో జనాభాకు తలసరి పాల లభ్యత: 234 గ్రా./ రోజు
– జాతీయ తలసరి లభ్యత 2009-10లో 263 గ్రా./ రోజు అంటే జాతీయ తలసరి లభ్యత కంటే రాష్ట్ర తలసరి లభ్యత తక్కువగా ఉంది.
– రాష్ట్రంలో డెయిరీ ఫెడరేషన్‌కి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతులకు 2014, నవంబర్ 1 నుంచి లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి జరుగుతుంది. ఇందుకోసం 537 లక్షల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది.
– ప్రస్తుత ధరల్లో జీఎస్డీపీలో పశుసంపద వాటా (2016-17) – 6.4 శాతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు