Author PF Thoughts Book | ఆలోచనాలోచనలు గ్రంథ రచయిత?
కువలయమాల – దీని రచయిత ఉద్యోతనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జన కోసం నాగార్జునకొండ విశ్వవిద్యాలయానికి వచ్చారు
శాతవాహనుల నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు
– కాతంత్య్ర వ్యాకరణం – రచయిత శర్వవర్మ. తన రాజు కుంతల శాతకర్ణి ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం కోసం ఈ పుస్తకాన్ని రచించాడు.
– బృహత్కథ – ఈ గ్రంథాన్ని గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించాడు. విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించడానికి ఇది ఆధారమైంది.
– గాథాసప్తశతి- దీన్ని శాతవాహన చక్రవర్తి హాలుడు సంకలనం చేశాడు. ఇందులో 700 శృంగార పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి. ఈ గ్రంథంలో 40కు పైగా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఉదాహరణ: అందం, అత్త, పొట్ట, అద్దం, పిల్లి మొదలైనవి. హాలుడి గాథాసప్తశతి సంకలనంలో సహాయపడిన స్త్రీ కవులు – అనులక్ష్మి, అనువలబ్దం, మాధవి.
– లీలావతి పరిణయం- దీని రచయిత కుతూహాలుడు. సింహళ రాకుమార్తె లీలావతి వివాహం ఆధారంగా హాలుడు ఈ గ్రంథాన్ని రచించాడు.
– కామసూత్రం- ఈ శృంగార గ్రంథాన్ని వాత్సాయనుడు రాశాడు. దీనిద్వారా శాతవాహనుల కాలంనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు.
– కథాసరిత్సాగరం – దీని రచయిత సోమదేవుడు. బృహత్కథ ఆధారంగా దీన్ని రాశారు. శాతవాహనుల కాలంనాటి పాలన విశేషాలు, ప్రజల స్థితిగతులను ఇందులో తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం ప్రకారం శాతవాహన యువరాజు చేతిలో ఆచార్య నాగార్జునుడు మరణించాడు.
– ప్రజ్ఞాపారమితశాస్త్రం, మాధ్యమిక కారిక, సుహృల్లేఖ, శూన్యసప్తశతి, ద్వాదశనియమం, రసరత్నాకరం, రసరంజని, దశభూమి, ఆరోగ్యమంజరి తదితర గ్రంథాలను ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడు.
– బృహత్కథామంజరి – దీన్ని క్షేమేంద్రుడు రచించాడు.
– కువలయమాల – దీని రచయిత ఉద్యోతనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జన కోసం నాగార్జునకొండ విశ్వవిద్యాలయానికి వచ్చారు.
– ఆదిపురాణం, విక్రమార్జున విజయం- ఈ గ్రంథాల రచయిత పంపకవి. ఇతన్ని కన్నడ సాహిత్యంలో ఆదికవిగా పరిగణిస్తారు.
– కవిజనాశ్రయం – ఇది ఛందో గ్రంథం. దీని రచయిత మల్లియరేచన. ఇది తెలుగులో మొదటి లక్షణ గ్రంథం
– యశస్థిలక చంపూకావ్యం, నీతివాక్యామృత, యుక్తి చింతామణి, యశోధర మహారాజు చరిత్ర – ఈ గ్రంథాల రచయిత సోమదేవసూరి.
– నీతిశాస్త్రముక్తావళి, సుమతీ శతకం – వీటి రచయిత బద్దెన.
– బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర – ఈ గ్రంథాల రచయిత పాల్కురికి సోమనాథుడు. ఈ గ్రంథాలు కాకతీయుల కాలం నాటి మతస్థితిగతులను, శైవమత ఉజ్వల దశను తెలియజేస్తాయి.
– శివయోగం – కొలను గణపతిదేవుడు (ఇందులూరి నాయకుల చరిత్రను తెలుపుతుంది)
– క్రీడాభిరామం – రచయిత వినుకొండ వల్లభరాయుడు. కాకతీయుల కాలంనాటి ప్రజల జీవనపరిస్థితిని తెలియజేస్తుంది.
– ఆంధ్రమహాభారతం, నిర్వచనోత్తర రామాయణం – తిక్కన సోమయాజి.
– ప్రతాపచరిత్ర- ఏకామ్రనాథుడు
– సిద్ధేశ్వరచరిత్ర- కాసే సర్వప్ప
– నీతిసారం- కాకతి రుద్రదేవుడు (రాజ్య నిర్వహణ వివరాలు తెలియజేస్తుంది)
– ప్రతాపరుద్ర యశోభూషణం- రచయిత విద్యానాథుడు. కాకతీయుల కాలంనాటి కేంద్రప్రభుత్వ స్వభావం, సైనిక వ్యవస్థ గురించి తెలుపుతుంది.
– నృత్య రత్నావళి- రచయిత కాకతీయ గణపతిదేవుని గజసాహిణి జాయప సేనాని. నాటి నృత్యరీతులను తెలియజేస్తుంది.
– రంగనాథ రామాయణం- గోన బుద్ధారెడ్డి
– భాస్కర రామాయణం- భాస్కరాచార్యుడు (తెలుగులో మొదటి చంపూ గ్రంథం)
– మార్కండేయ పురాణం- మారన
– సకల నీతిసారం- మడికి సింగనాచార్యుడు
– పురుషార్థసారం- శివదేవయ్య
– ప్రేమాభిరామం- త్రిపురాంతకుడు
– శివతత్వసారం, శ్రీగిరి శతకం- మల్లికార్జున పండితుడు
– పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, రుద్రభాషణం- పాల్కుర్కి సోమనాథుడు
– దశకుమార చరిత్ర- దండి
– కేయూరబాహు చరిత్ర- మాచన
– కుమార సంభవం- నన్నెచోడుడు
– దాశరథి శతకం, రామదాసు కీర్తనలు- భక్తరామదాసు (కంచర్ల గోపన్న)
– మువ్వగోపాల పదాలు – క్షేత్రయ్య
– యయాతి చరిత్ర – పొన్నెగంటి తెలగనార్యుడు. దీన్ని సర్ధార్ అమీన్ఖాన్కు అంకితం ఇచ్చాడు.
– తపతీ సంవరణోపాఖ్యానం – అద్దంకి గంగాధర కవి. దీన్ని ఇబ్రహీం కుతబ్షాహికి అంకితమిచ్చాడు.
– రాజనీతి రత్నాకరం- కృష్ణయామాత్యుడు
– దశరథ రాజనందన చరిత్ర- మాగంటి సింగనాచార్యుడు
– సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం- కందుకూరి రుద్రకవి
– వజ్రాభ్యుదయం- వెల్లుట్ల నారాయణ కవి
– వైజయంతి విలాసం- సారంగు తమ్మయ్య
– శుకసప్తతి- దీని రచయిత పాలవేకిరి కదిరీపతి. ఈ గ్రంథంలో తెలంగాణ ప్రజల ఆహార, వేషభాషలను, ఇండ్లను, వారి వివాహ పద్ధతులను, నిత్య కార్యకలాపాలను వర్ణించాడు.
– కులియత్ అలీ- ఇది కవిత్వాల పుస్తకం. దీని రచయిత మహ్మద్ కులీ కుతుబ్షా
– తూతి నామా – దీని రచయిత గవాసి. శుకసప్తతి అనే తెలుగు కావ్యానికి ఇది ఉర్దూ అనువాదం
– ఫూల్బన్ – ఈ గ్రంథ రచయిత ఇబ్నే నిషాతి.
– లైలా మజ్నూ – దీని రచయిత మీర్జా మహ్మద్ అమీన్.
– పద్మావతి – ఈ గ్రంథ రచయిత గులాం అలీ. పద్మావత్ అనే హిందీ పుస్తకానికి ఇది ఉర్దూ అనువాదం
– సనబ్నామా కుతుబ్షాహీ – దీని రచయిత అలీపుర్సి.
– తెసల్నామా – ఈ గ్రంథ రచయిత ఫిరోజ్
– రిసాల మికర్దాయ – కుతుబ్షాహీల కాలంనాటి తూనికలు, కొలతలను వివరించే గ్రంథం. రచయిత మీర్ మహ్మద్ మోమిన్
– మిజాముల్ తబాయి కుతుబ్షాహీ- ఇది ఒక వైద్యశాస్త్ర గ్రంథం. దీని రచయిత అకిమ్ తకియుద్దీన్
– తారీఖ్-ఇ- కుతుబ్షాహి – ఈ గ్రంథ రచయిత కుర్షు
– ఇండికా – రచయిత మెగస్తనీస్. ఈ గ్రంథం ఆంధ్రులకు 30 దుర్గాలు, లక్ష కాల్బలం, రెండు వేల అశ్వబలం, 1000 గజదళం ఉన్నాయని తెలుపుతున్నది.
– నేచురల్ హిస్టరీ- దీని రచయిత ప్లీని. తూర్పు దేశాల చరిత్ర, సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను తెలియజేస్తుంది.
– పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ- దీని రచయిత ఒక అజ్ఞాత నావికుడు. ఈ గ్రంథం భారత్-రోమ్ వాణిజ్య సంబంధాలు, ఓడరేవుల గురించి తెలుపుతుంది.
– జాగ్రఫీ- టాలమీ. ఈ గ్రంథం శాతవాహనుల కాలంనాటి వాణిజ్య పట్టణాలు, ఓడరేవుల గురించి తెలుపుతుంది.
– కాలకసూరి ప్రబంధం- కాలకసూరి
– సమయసారం, మూలాచారం, పంచశక్తీయ, ప్రవచనసార- ఈ గ్రంథాల రచయిత కొండాకుందాచారీ
– ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్రవిజయం – పోతనామాత్యుడు
– ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దురంతాలు – ఈ గ్రంథ రచయిత దేవులపల్లి వెంకటేశ్వరరావు
– తెలంగాణ- ఆంధ్రుల కర్తవ్యం- ఈ పుస్తక రచయిత సురవరం ప్రతాపరెడ్డి. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి దీన్ని రాశారు.
– ఆంధ్రుల సాంఘిక చరిత్ర – దీని రచయిత సురవరం ప్రతాపరెడ్డి
– వీర తెలంగాణ నా అనుభవాలు- జ్ఞాపకాలు- రావినారాయణరెడ్డి
– తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర- దేవులపల్లి రామానుజరావు
– తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర- దేవులపల్లి వెంకటేశ్వరరావు
– తెలంగాణ పోరాట సృ్మతులు- ఆరుట్ల రామచంద్రారెడ్డి
– వీర తెలంగాణ- విప్లవ పోరాటం- చండ్ర రాజేశ్వరరావు
– దాశరథి కృష్ణమాచార్యులు- అగ్నిధార, రుద్రవీణ, గాలిబ్ గీతాలు, తిమిరంతో సమరం, నవమి, ఆలోచనాలోచనలు, పునర్ణవం, కవితా పుష్పకం
– వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు – పుచ్చలపల్లి సుందరయ్య
– ప్రజల మనిషి, గంగు- వట్టికోట ఆళ్వారుస్వామి
– తెలంగాణ సాయుధ పోరాటం-నా అనుభవాలు- నల్లా నర్సింహులు
– మా భూమి- సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు
– మరో జలియన్ వాలాబాగ్-పరకాల- రేపాల నరసింహుడు
– నాజీ నైజం- అయ్యపు వెంకటరమణ
– అడవి- కేవీ రంగారెడ్డి
– మహాభారత నాటకం- గంగాధర కవి
– శరభాంకలింగ శతకం- శరభాంకుడు
– అంబికా శతకం- తిప్పన్న
– నీతి భూషణం- అప్పన్న మంత్రి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు