విపత్తు నిర్వహణ-నిర్మాణం గురించి తెలుసా?
దేశంలోని విభిన్న ప్రాంతాల దుర్బలత్వ చరిత్ర ఆధారంగా ప్రత్యేక బెటాలియన్లను 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అవి…
1. భటిండా (పంజాబ్)- ఐటీబీపీ బెటాలియన్
2. ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్)- ఐటీబీపీ బెటాలియన్
3. గాంధీనగర్ (గుజరాత్)- సీఆర్పీఎఫ్ బెటాలియన్
4. పుణె (మహారాష్ట్ర)- సీఆర్పీఎఫ్ బెటాలియన్
5. చెన్నై (అరక్కోణం)- సీఐఎస్ఎఫ్ బెటాలియన్
6. మండలి (ఒడిశా)- సీఐఎస్ఎఫ్ బెటాలియన్
7. కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)- బీఎస్ఎఫ్ బెటాలియన్
8. గువాహటి (అసోం)- బీఎస్ఎఫ్ బెటాలియన్
9. పట్నా (బీహార్)- బీఎస్ఎఫ్ బెటాలియన్
10. విజయవాడ (ఏపీ)- సీఆర్పీఎఫ్ బెటాలియన్
గమనిక: చివరి రెండు బెటాలియన్లను 2015, ఏప్రిల్ 29న ప్రారంభించారు.
– 2015లో సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో రెండు కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేశారు.
1. వారణాసి (ఉత్తరప్రదేశ్)
2. ఇటానగర్ (అరుణాచల్‌ప్రదేశ్)
గమనిక: ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలో పనిచేస్తుంది.
వీరితోపాటు
1. హోంగార్డ్స్ – 1946
2. ఎన్సీసీ -1948
3. ఎన్ఎస్ఎస్ – 1969
4. యువజన సంఘాలు నుంచి వలంటీర్లు -1972 నుంచి వాలంటీర్లు విపత్తు సమయంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.
– జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక తయారీకి కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని కార్యదర్శి అధ్యక్షతన ఒక ఫెసిలిటేషన్ కమిటీని, మూడు ఉపకమిటీలను ఏర్పాటు చేశారు. అవి… 1. జాతీయ ప్రతి స్పందన ప్రణాళిక కమిటీ
2. జాతీయ విపత్తు ఉపశమన ప్రణాళిక కమిటీ
3. జాతీయ విపత్తు సామర్థ్య నిర్మాణ ప్రణాళిక కమిటీ జాతీయ విపత్తు ప్రతి స్పందన ప్రణాళిక కమిటీ
– 13వ ఆర్థిక సంఘం సూచన మేరకు నేషనల్ కాలమిటి కాంటిజెన్సీ ఫండ్‌ను కాలమిటి రిలీఫ్ ఫండ్‌ను కలిపి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్లాన్ కమిటీగా ఏర్పాటు చేశారు. దీనిలో..
కేంద్రం వాటా- 75 శాతం
రాష్ట్రం వాటా- 25 శాతం
– విపత్తు సమయంలో తక్షణ ఉపశమనం, వెంటనే ఆవా సం, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలను జాతీ య విపత్తు ప్రతిస్పందన ప్రణాళిక కమిటీ చేపడుతుంది.
జాతీయ విపత్తు ఉపశమన ప్రణాళిక కమిటీ
– విపత్తు నిర్వహణ చట్టం – 2005లో సెక్షన్ 47 జాతీయ ఉపశమన ప్రణాళిక కమిటీ ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది.
– ఈ కమిటీని ఎన్డీఎంఏ అమలు చేయాలి.
జాతీయ విపత్తు సామర్థ్య నిర్మాణ ప్రణాళిక కమిటీ
– విపత్తు సంభవించినప్పుడు, విపత్తు సంభవించిన తర్వాత నిర్మాణ సంబంధమైన వాటిని గురించి ఈ ప్రణాళిక కమిటీ చర్యలు తీసుకుంటుంది.
రాష్ట్ర స్థాయి సంస్థలు
1. ఎస్డీఎంఏ
– విపత్తు నిర్వహణ చట్టం – 2005 ప్రకారం అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్డీఎంఏ), జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ)ల ఏర్పాటుకు ఆదేశించింది.
– ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఏర్పాటు ఉంటుంది.
గమనిక: గుజరాత్, డయ్యూ డామన్ విపత్తు నిర్వహణ చట్టం- 2005 అమలులోకి రాకముందే ఎస్‌డీఎంఏను రూపొందించుకున్నాయి.
గమనిక: కేంద్రపాలిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు- లెఫ్టినెంట్ గవర్నర్
రాష్ట్ర కార్యనిర్వహక కమిటీ (ఎస్ఈసీ)
– విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్- 20 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహక కమిటీని (ఎస్ఈసీ) ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి.
– ఎస్ఈసీ అధ్యక్షుడు- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి + నలుగురు సభ్యులు (ఇతర ప్రభుత్వశాఖల కార్యదర్శులు)
ఈ కమిటీ బాధ్యతలు
1. జాతీయ ప్రణాళిక
2. రాష్ట్ర ప్రణాళిక అమలును సమన్వయపర్చడం
విపత్తు నిర్వహణ చట్టం- 2005 సంస్థ పేరు
1. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) ప్రధాన మంత్రి
2. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎస్డీఎంఏ) ముఖ్యమంత్రి
3. డిస్ట్రిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) జిల్లా కలెక్టర్
5. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్సెస్
దేశంలో విపత్తు నిర్వహణ విధానం
1. కేంద్ర ప్రభుత్వం
i. ఎన్డీఎంఏ (ప్రధాని చైర్మన్ )
ఎ. ఎన్ఈసీ
బి. ఎన్డీఆర్ఎఫ్
సి. ఎన్ఐడీఎం
2. రాష్ట్ర ప్రభుత్వం
i. ఎస్డీఎంఏ (ముఖ్యమంత్రి చైర్మన్)
ఎ. ఎస్ఈసీ
3. జిల్లా యంత్రాంగం
i. డీడీఎంఏ (చైర్మన్: జిల్లా కలెక్టర్)
ఎ. కార్పొరేషన్లు
బి. మున్సిపాలిటీలు
సి. గ్రామ పంచాయతీలు
విపత్తు నిర్వహణలోని విభిన్న దశలు
– విపత్తు ముప్పు కుదింపును దిగువ విధంగా చేపడుతారు.
1. విపత్తు ముందు (Pre- disaster)
2. విపత్తు జరిగే సమయంలో (disaster occurrence)
3. విపత్తు తర్వాత (Post -disaster)
1. విపత్తుకు ముందు
– విపత్తు వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం కలుగకుండా నివారించేందుకు విపత్తు కంటే ముందు చేపట్టే చర్యలు
ఎ. ప్రజలను చైతన్యవంతులను చేయడం (కార్యక్రమాల ద్వారా)
బి. ప్రస్తుతం బలహీనంగా ఉన్న నిర్మాణాలను పటిష్టం చేయడం
సి. గృహ సంబంధమైన, సమాజపు స్థాయిల్లోను మొదలైన విపత్తు నిర్వహణ ప్రణాళికలను తయారుచేయడం
– ఈ విపత్తు ముప్పు కుదింపును లెక్కించే/ చేపట్టే దశ/ కార్యకలాపాలను సంసిద్ధత/ ఉపశమనం అంటారు.
2. విపత్తు జరిగే సమయంలో
– విపత్తు జరిగే సమయంలో బాధితుల అవసరాలను, బాధలను తీర్చేందుకు చేపట్టే చర్యలు. ఈ దశలో చేపట్టే చర్యలను అత్యవసర ప్రతిస్పందన కార్యకలాపాలు అంటారు.
ఉదా: తక్షణ చర్యలు
ఎ. శోధన, రక్షణ చర్యలు
బి. ప్రథమ చికిత్స, మందులు
సి. ఆహారం, నీరు, బట్టలు, షెల్టర్
ప్రథమ చికిత్స కిట్‌లో ఉండాల్సిన వస్తువులు: థర్మామీటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, దూది, ట్రయాంగులర్ బ్యాండేజి, క్రేపి బ్యాండేజి, సీజర్స్, గ్లౌవ్‌లు, సబ్బులు, యాంటాసిడ్, స్టెరైల్ డ్రెస్సింగ్, పాముకాటు కిట్, నొప్పి నివారిణి
3. విపత్తు తర్వాత
– విపత్తు తాకిన వెంటనే విపత్తు ప్రభావానికి గురైన కమ్యూనిటీలు త్వరగా కొలుకునే విధంగా చేపట్టే పునరావాస చర్యలు.
– వీటినే ప్రతిస్పందన, స్వస్థత కార్యకలాపాలు అంటారు.
– ఎత్తయిన ప్రాంతాల్లో శాశ్వత గృహ నిర్మాణాలు నిర్మించడం
– రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను తిరిగి పటిష్టం చేయడం
– కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు పునరుద్ధరించడం
– జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్థిక పునరావసం కల్పించడం
గమనిక: విపత్తు ముందు, విపత్తు తర్వాత, విపత్తు జరిగే సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండటానికి రక్షణ చర్యల్లో భాగంగా ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరిగా అందరి వద్ద ఉండాలి. ప్రథమ చికిత్స లక్ష్యాలు.
1. జీవితాన్ని రక్షించడం
2. బాధితుని స్థితి మరింత దిగజారకుండ నివారించడం
3. స్వస్థత చేకూర్చడం
జిల్లా స్థాయి సంస్థలు
– జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ
– విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ – 25 ప్రకారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా డీడీఎంఏను ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తున్నది.
– వైస్ చైర్మన్‌గా నామినేట్ చేసిన స్థానిక సంస్థ ప్రతినిధి ఉంటారు.
– గిరిజన ప్రాంతాల్లో వైస్‌చైర్మన్‌గా గిరిజన డిస్ట్రిక్ కౌన్సిల్ ఆఫ్ అటానమస్ డిస్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఉంటారు.
డీడీఎంఏలో సభ్యులు
1. జిల్లా అధికారి సీఈఓ
2. జిల్లా పోలీసు సూపరింటెండెంట్
3. జిల్లా ప్రధాన వైద్యాధికారి
4. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మరో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు ఉంటారు.
డీడీఎంఏ సభ్యులు
1. జిల్లా అథారిటీ సీఈఓ
2. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)
3. జిల్లా వైద్యాధికారి
4. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన జిల్లా స్థాయి ర్యాంక్ అధికారులు
డీడీఎంఏ బాధ్యతలు
1. జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక తయారుచేయడం
2. సమన్వయం చేయడం
3. విపత్తు నిర్వహణ అమలు
ఇతర బాధ్యతలు
1. భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలుచేయడం
2. నిర్మాణాలను పరిశీలించడం
3. పునరావాస చర్యలను చేపట్టడం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు