పల్లె నుంచి పట్టణం దిశగా..
– పట్టణాల్లో జనాభా పెరుగుదలనే పట్టణీకరణ అంటారు.
– పట్టణీకరణ అనేది ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఒక పరిణామం.
– సహజ వృద్ధిరేటువల్లే కాకుండా వలసలవల్ల కూడా పట్టణ జనాభా పెరుగుతుంది.
– ఆర్థికాభివృద్ధిలో భాగంగా పారిశ్రామికీకరణ జరిగే కొద్దీ వ్యవసాయ రంగం నుంచి శ్రామికులు ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతారు. దీనివల్ల పట్టణీకరణ వేగవంతం అవుతుంది.
– ఒక దేశ మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతాన్ని తెలియజేసేదే పట్టణీకరణ.
– పాపులేషన్ రెఫరెన్స్ బ్యూరో-2013 ప్రకారం ప్రపంచ జనాభా 7,137 మిలియన్లు. దీనిలో 52 శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు.
– ఒక ప్రాంతాన్ని పట్టణంగా పిలవాలంటే కింది లక్షణాలుండాలి. అవి..
1. కనీస జనాభా 5000.
2. పనిచేసే పురుష జనాభాలో కనీసం 75 శాతం వ్యవసాయేతర ఆర్థిక కార్యకలాపాల్లో ఉండాలి.
3. చదరపు కిలోమీటర్‌కు కనీసం 400 మంది నివసించాలి.
– పైన పేర్కొన్న వాటిలో మొదటి రకం పట్టణాలను Statutary towns అంటారు.
– రెండో రకం పట్టణాలను Censes towns అంటారు.
– లక్ష జనాభా దాటితే వాటిని నగరాలు అంటారు.
– లక్షలోపు జనాభా ఉంటే వాటిని పట్టణాలు అంటారు.
– రెండో, మూడో తరగతి పట్టణాలను మధ్యతరగతి పట్టణాలు అంటారు.
– నాలుగు, ఐదు, ఆరో తరగతి పట్టణాలను చిన్న పట్టణాలు అంటారు.
– మధ్యతరగతి పట్టణాలు (రెండో తరగతి) క్రమంగా ఒకటో తరగతిలో చేరుతున్నాయి. కారణం వలస.
– 1951 జనాభా లెక్కల్లో Town Group అనే భావనను ప్రవేశపెట్టారు.
– 1971 జనాభా లెక్కల్లో మహానగరం (Urban Agglomeration) అనే భావనను ప్రవేశపెట్టారు. దీని లక్షణాలు…
1. నిరంతరం Out Growth కలిగిన నగరం.
2. రెండు లేదా మూడు పట్టణాలు బయటపెరిగే జనాభాతో వృద్ధి చెందడం.
3. రెండు లేదా మూడు పట్టణాలు కలిసి ఒక నగరంగా నిరంతరం విస్తరించడం.
– 10 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉంటే మెట్రో నగరం అంటారు.
– 50 లక్షల జనాభా దాటితే మెగా నగరం అంటారు.
– కోటి జనాభా దాటితే మహా మెగా నగరం అంటారు.
పట్టణాల సంఖ్య
1901 జనాభా లెక్కల ప్రకారం – 1,827
2001 జనాభా లెక్కల ప్రకారం – 5,161
2011 జనాభా లెక్కల ప్రకారం – 7,935
– పట్టణ వృద్ధి అంటే.. పట్టణాలు, నగరాల్లో అదనంగా పెరిగిన జనాభా.
– పట్టణీకరణ అంటే ఒక దేశం మొత్తం జనాభాలో పట్టణ జనాభా పెరుగుదల.
– గ్రామీణ జనాభా పెరుగుదల రేటుకంటే పట్టణ జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం పెరుగుతుంది.
– 1911 నుంచి పట్టణ జనాభా పెరుగుదల రేటు పెరుగుతూ వస్తుంది.
– పట్టణ జనాభా ధోరణులను 1901-1951, 1951-2011 మధ్య సరిచూసినప్పుడు…
1901-1951 మధ్య పట్టణీకరణ ధోరణులు
– 1901లో పట్టణ జనాభా 2.5 కోట్లు. ఇది దేశ జనాభాలో 10.9 శాతం. 1951 నాటికి పట్టణ జనాభా 6.24 కోట్లకు చేరింది. ఇది దేశ జనాభాలో 17 శాతం. అంటే 1951 నాటికి ప్రతి ఆరుగురిలో ఒకరు పట్టణాల్లో నివసిస్తున్నారు.
– 1900-1911 మధ్య పట్టణ జనాభా వృద్ధిరేటు గ్రామీణ జనాభా వృద్ధిరేటుకంటే తక్కువ ఉంది.
– 1911 తర్వాత గ్రామీణ వృద్ధిరేటు కంటే పట్టణ వృద్ధిరేటు అధికంగా ఉంది.
– 1951లో పట్టణ జనాభా వృద్ధి 41.2 శాతంగా నమోదయ్యింది.
1961-2011 మధ్య పట్టణీకరణ ధోరణులు
– 2011 నాటికి పట్టణ జనాభా 37.7 కోట్లు.
– 2001-11 మధ్య అదనంగా పెరిగిన పట్టణ జనాభా 9.1 కోట్లు. ఇది గ్రామీణ జనాభా పెరుగుదల 9.06 కంటే ఎక్కువ.
– దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు పట్టణాల్లో నివసిస్తున్నారు. 2030 నాటికి దేశంలో పట్టణ జనాభా 60 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది 42.8 శాతం.
– భారత్‌లో అత్యధికంగా 1981లో 46.2 శాతం పట్టణ జనాభా వృద్ధిరేటు నమోదయ్యింది.
– 2011లో గ్రామీణ జనాభా వృద్ధి 12.2 శాతం. పట్టణ జనాభా వృద్ధి 31.8 శాతం.
– 1950లో మొత్తం ప్రపంచ జనాభాలో పట్టణ జనాభా 30 శాతం, ఇది 2000 నాటికి 47 శాతానికి పెరిగింది. భారత్‌లో 1951లో పట్టణ జనాభా 17 శాతం. 2001 నాటికి ఇది 27.8 శాతానికి పెరిగింది.
– అంటే ప్రపంచ సగటు పట్టణీకరణ శాతం కంటే భారత పట్టణీకరణ శాతం తక్కువగా ఉంది.
– అత్యధిక పట్టణ జనాభాగల రాష్ర్టాలు – 1.మహారాష్ట్ర, 2.ఉత్తరప్రదేశ్, 3.తమిళనాడు.
– అత్యల్ప పట్టణ జనాభాగల రాష్ర్టాలు – 1.సిక్కిం, 2.అరుణాచల్‌ప్రదేశ్, 3.మిజోరం
– అధిక పట్టణ జనాభాగల కేంద్రపాలిత ప్రాంతం – ఢిల్లీ
– తక్కువ పట్టణ జనాభాగల కేంద్రపాలిత ప్రాంతం – లక్షదీవులు
– అధిక పట్టణ జనాభా శాతంగల రాష్ర్టాలు – గోవా (62.2 శాతం), మిజోరం (52.1 శాతం)
– తక్కువ పట్టణ జనాభా శాతంగల రాష్ర్టాలు – హిమాచల్‌ప్రదేశ్ (10 శాతం), బీహార్ (11.3 శాతం)
పట్టణ జనాభా పెరగడానికి మూడు ప్రత్యేక కారణాలున్నాయి. అవి..
1. పట్టణాల్లో సహజసిద్దంగా పెరిగే జనాభా
2. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు
3. గ్రామాల నుంచి కొన్ని ఆవాసాలను పట్టణాల్లో ఏర్పాటు చేయడం.
– దేశ పట్టణ జనాభాలో ఎక్కువ జనాభా మెట్రో నగరాల్లో నివసిస్తున్నారు. 2001లో 35గా ఉన్న మెట్రో నగరాలు, 2011 నాటికి 53కు చేరాయి.
– దేశ పట్టణ జనాభాలో ఎక్కువ శాతం 1వ తరగతి పట్టణాల్లో నివసిస్తున్నారు. కారణం పరిశ్రమలు అధికంగా ఉండటం, సేవలు అధికంగా విస్తరించడం, విద్య, వైద్య సదుపాయాలు పెరగడం, పరిపాలన సంబంధ ప్రభుత్వ కార్యకలాపాలు పెరగడం వంటి అంశాలు కారణం.
– ప్రాంతాలవారిగా పట్టణీకరణ: 2011 జనాభా లెక్కల్లో ముఖ్యమైన ధోరణి ఏమంటే దక్షిణ భారతదేశంలో పట్టణీకరణ పెరగడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప దక్షిణ భారత రాష్ర్టాలన్నీ 35 శాతానికిపైగా పట్టణీకరణను కలిగి ఉన్నాయి.
– దక్షిణ భారత రాష్ర్టాలు 20వ శతాబ్దం చివరి దశకంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కనబర్చాయి.
– ఇతర రాష్ర్టాల్లో హర్యానా, పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు అధిక పట్టణీకరణను కలిగి ఉన్నాయి.
– 2011లో గుజరాత్ 42.6 శాతం, మహారాష్ట్ర 45.2 శాతం పట్టణీకరణను కలిగి ఉన్నాయి.
– అధిక పట్టణీకరణ వృద్ధి కలిగిన రాష్ర్టాలు: 2001లో కేరళ పట్టణ జనాభా 26 శాతం. ఇది 2011లో 47.7 శాతం. అంటే పదేండ్లలో 21.7 శాతం పెరిగింది.
– 2001-11 మధ్య అత్యధిక పట్టణ జనాభా వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం కేరళ (21.7 శాతం) కాగా, రెండో స్థానంలో సిక్కిం (13.9 శాతం), మూడో స్థానంలో గోవా ఉన్నాయి. 2001లో సిక్కిం పట్టణ జనాభా వృద్ధి 11.1 శాతం. 2011 నాటికి ఇది 24.97 శాతానికి పెరిగింది.
– నగరాలు, మహానగరాలు వృద్ధి: లక్ష జనాభా దాటిన నగరాలు 1951లో 72 ఉండేవి. దేశ పట్టణ జనాభాలో ఈ 72 పట్టణాల్లో నివసించే వారు 44.6 శాతం. 2011 నాటికి నగరాలు, మహానగరాలు 468కి పెరిగాయి. ఈ నగరాల్లో నివసించే వారు 70 శాతం.
– పట్టణ జనాభాలో ప్రతి 10 మందిలో ఏడుగురు 1వ తరగతి పట్టణాల్లోనే నివసిస్తున్నారు.
– దేశ జనాభాలో 1వ తరగతి పట్టణాల్లో నివసించే జనాభా శాతం 21.9 శాతం. మరో రకంగా చెప్పాలంటే దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు నగరాలు, మహానగరాల్లో నివసిస్తున్నారు.
– భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పట్టణ ఆవాసాలు 6 రకాలు.
జనాభా తరగతి
1. లక్షకుపైన – Iవ తరగతి
2. 50 వేల నుంచి 99,999 – IIవ తరగతి
3. 20 వేల నుంచి 49,999 – IIIవ తరగతి
4. 10 వేల నుంచి 19,999 – IVవ తరగతి
5. 5,000 నుంచి 9,999 – Vవ తరగతి
6. 5000 కంటే తక్కువ – VIవ తరగతి
– వివిధ దక్షిణ భారత రాష్ర్టాల్లో పట్టణీకరణ శాతం..
– తమిళనాడు – 48.4 శాతం
– కర్ణాటక – 38.6 శాతం
– తెలంగాణ – 38 శాతం
– ఉమ్మడి ఏపీ – 33.5 శాతం
– కేరళ – 47.7 శాతం
– మహానగరాలు (మిలియన్ జనాభా దాటిన పట్టణాలు): 1971లో ఇవి తొమ్మిది ఉండేవి. 2001 నాటికి 35కు, 2011 నాటికి 53కు చేరాయి.
– మెగా నగరాలు: ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం కోటి జనాభా దాటితే అవి మెగా సిటీలుగా పిలువబడుతాయి. ప్రస్తుతం భారత్‌లో మూడు మెగాసిటీలు ఉన్నాయి. అవి..
1. గ్రేటర్ ముంబై – 18.4 మిలియన్లు
2. గ్రేటర్ ఢిల్లీ – 16.3 మిలియన్లు
3. గ్రేటర్ కోల్‌కతా – 14.1 మిలియన్లు
– 2001లో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ 2011 నాటి కి రెండో స్థానానికి ఎదిగింది. అయితే మెగానగరాల్లో జనాభా వృద్ధి తగ్గుతున్నది. ఈ ధోరణి మూడు మెగా నగరాల్లో కనిపిస్తున్నది.
– ఈ మూడు నగరాల్లో మొత్తం జనాభా 2001 జనా భా లెక్కల ప్రకారం 42.5 మిలియన్లు. ఇది 2011 నాటికి 48.8 మిలియన్లకు చేరింది.
– 2011 జనాభా లెక్కల ప్రకారం.. పట్ణణ జనాభాలో 13శాతం ఈ మూడు మహానగరాల్లో నివసిస్తున్నారు.
– అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత – 73 శాతం
– దేశంలో పట్టణ అక్షరాస్యత – 84.98 శాతం
– పట్టణ లింగనిష్పత్తి – 936
– 2011లో పట్టణ జనాభా 37.71 కోట్లు.
– 2001తో పోలిస్తే 2011లో పట్టణాల్లో.. పురుషుల్లో అక్షరాస్యత పెరుగుదల కంటే స్త్రీలలో అక్షరాస్యత పెరుగుదల ఎక్కువగా నమోదైంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు