Multimedia | మాయాలోకం మల్టీమీడియా
అపారమైన అవకాశాలకు చిరునామా మల్టీమీడియా. డ్రాయింగ్, పెయింటింగ్‌పై కొద్దిపాటి అవగాహన ఉండి, సృజనాత్మక ఆలోచనకు తోడు ఓపిక, కష్టపడేతత్వం ఉంటే ఆకాశమే హద్దుగా అతి తక్కువ సమయంలో విజయతీరాలకు చేరుకోవచ్చు. ఈ రంగంలో కొన్ని కోర్సులు అద్భుతమైన అవకాశాలను కల్పించడంతోపాటు ఆసక్తి ఉన్నవారిని నిష్ణాతులుగా మారుస్తూ వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్నాయి.
-మల్టీమీడియా అంటే ప్రింట్, ఇంటర్నెట్, ఆడియో, వీడియో సమ్మేళనమే కాకుండా సినిమాలు, గేమ్స్, ఇంజినీరింగ్ పరిశ్రమ, ఈ-కామర్స్, బ్రాండింగ్, మెడికల్ తదితర రంగాలకు అనుసంధానమైంది. ప్రస్తుతం మల్టీమీడియాలో యానిమేషన్, గ్రాఫిక్స్ అండ్ వెబ్ డిజైన్, వీఎఫ్ఎక్స్ వంటి ఆధునాతన రంగాలు విస్తృతమైన అవకాశాలను అందిస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ ద్వారా అద్భుతమైన సన్నివేశాలను లేక ఒక క్యారెక్టర్‌ను నమ్మశక్యం కాని విధంగా సృష్టించి విస్మయపరుస్తున్నారు.
-ఒకప్పుడు మనకు యానిమేషన్, వీఎఫ్ఎక్స్… కార్టూన్, యానిమేషన్ సినిమాల వరకు పరిమితమైంది. ప్రస్తుతం కొత్త సాంకేతికతతో ఎంఎన్సీ కంపెనీలు, వాటి ఉత్పత్తుల ప్రకటనలు, మార్కెటింగ్ చేయడానికి ఈ టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు. అంతేకాకుండా గేమ్ డిజైన్స్, మొబైల్ యాప్స్ తయారీలోనూ ఈ టెక్నాలజీ వినియోగం సర్వసాధారణమైంది.
-ఇప్పుడు కొత్తగా ఈ- కామర్స్, ఈ-లెర్నింగ్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలు వ్యాపారాలను సులభతరం చేసుకోవడం కోసం, నాణ్యమైన విద్యను అందించడానికి ఈ సాంకేతికతపై ఆధారపడుతున్నాయి.
-మల్టీమీడియాలో 24 నెలల వ్యవధి గల 18 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
-డిప్లొమా ఇన్ మల్టీమీడియా
-డిప్లొమా ఇన్ వీఎఫ్ఎక్స్
-డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్
-ఈ రంగంలో కొన్ని ముఖ్యమైన సంస్థలు డిప్లొమాలు, అడ్వాన్స్డ్ డిప్లొమాలు, బ్యాచిలర్స్ డిగ్రీలు, షార్టర్మ్ కోర్సులు ఇంకా నిష్ణాతులు కావడానికి వీలుగా మూడు, నాలుగేండ్ల పీజీ అండ్ బ్యాచిలర్ డిగ్రీలు అందిస్తున్నాయి. కెనడా తదితర దేశాల్లో డిప్లొమా కోర్సు చదవడానికి అవకాశాలు ఉన్నాయి.
డిప్లొమా ఇన్ మల్టీమీడియా, డిప్లొమా ఇన్ వీఎఫ్ఎక్స్
-ఈ కోర్సుల్లో ముఖ్యంగా మనకు గ్రాఫిక్స్, వెబ్ డిజైన్, త్రీడి బేసిక్స్, త్రీడి అడ్వాన్స్డ్, ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్, కంపోస్టింగ్, మోషన్ గ్రాఫిక్స్, రాస్టర్ గ్రాఫిక్స్, రొటోస్కాపీ, రాస్టేర్ అండ్ వెక్టార్, లుక్ డెవలప్మెంట్, యానిమేషన్ ప్రిన్సిపుల్స్, రిగ్గింగ్, గేమ్ టెస్ట్యురింగ్ వంటి అంశాలపైన పట్టు సాధించవచ్చు.
-ఉద్యోగావకాశాలు: పై కోర్సులు పూర్తిచేసిన వారికి వెబ్‌డిజైనర్, మల్టీమీడియా డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, అనిమాటోర్, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ఫిలిం వీడియో ఎడిటర్, రొటోస్కోపీ ఆర్టిస్ట్, విజువల్ మీడియా ప్రొఫెషనల్, ఏడీ మేకర్, ప్రొడక్షన్ డిజైనర్, గేమ్ డిసిగ్నేర్, గేమ్ టెస్టర్ వంటి వృత్తుల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
-అవకాశాలు కల్పిస్తున్న రంగాలు : ఈ రంగంలో నిపుణులకు యానిమేషన్ స్టూడియోలు, ఫిలిం ప్రొడక్షన్ స్టూడియోలు, టీవీ చానెళ్లు, డిజైన్ స్టూడియోలు, వెబ్ డెవలప్మెంట్ కంపెనీలు, గేమింగ్ కంపెనీలు, ఈ-లెర్నింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ వెబ్సైట్లు, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రింట్ అండ్ పబ్లిషింగ్ హౌస్‌లు, కార్పొరేట్ హౌస్‌ల్లో మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. పై కోర్సులు పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా అందిస్తున్నారు. ప్రారంభ వేతనం రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు తగిన వేతనంతో నియామకమవుతారు. ఈ కోర్సులను పూర్తిచేసిన వారు ఉద్యోగస్తులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా రాణించవచ్చు.
-మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో మొదటి 10 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాలు విస్తరించాయి. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటం తద్వారా యనిమేషన్, గేమింగ్ కంటెంట్ తదితర విషయాలు స్ట్రెమింగ్ చేస్తుండటంవల్ల అగుమెన్టేడ్ రియాలిటీ, వర్చ్యువల్ రియాలిటీ ప్రాముఖ్యం పెరగడం ఈ రంగం పురోగమించడానికి దోహదం చేస్తున్నాయి. ఫిలిం హౌసెస్, ప్రొడక్షన్ స్టూడియోలు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్తో కూడిన సన్నివేశాలు తీస్తున్నాయి. త్వరితగతిన మార్పు చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, దాని ప్రత్యేకతలను ఎక్కువ మంది ప్రజలకు చేరవేయడానికి యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్ దోహదం చేస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు