Principle of the fountain pen | ఫౌంటెన్ పెన్ను పనిచేసే సూత్రం?
స్పర్శ కోణానికి కొన్ని ఉదాహరణలు
– నీరు, ఆల్కహాల్, గ్లిజరిన్ ద్రవాల స్పర్శకోణం దాదాపు గాజుతో 00 ఉంటుంది.
– పాదరసం, గాజుల మధ్య స్పర్శకోణం 1400
– వాటర్ ప్రూఫింగ్ కారకాల స్పర్శకోణం 900ల కంటే ఎక్కువ.
– వెట్టింగ్ కారకాలకు స్పర్శకోణం 900ల కంటే తక్కువ.
– ద్రవాల స్పర్శకోణం అనేది 900ల కంటే తక్కువగా ఉంటే అలాంటి ద్రవపదార్థాలు పాత్ర గోడలకు అంటుకుని ఉంటాయి. ఉదా: నీరు
– కాబట్టి నీటిని ఉష్ణోగ్రత మాపకాలు, భారమితుల్లో ఉపయోగించరు.
– ద్రవాల స్పర్శకోణం అనేది 900ల కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవపదార్థాలు పాత్ర గోడలకు అంటుకోవు. అందువల్ల పాదరసాన్ని ఉష్ణోగ్రత మాపకాలు, భారమితుల్లో ఉపయోగిస్తారు.
– ద్రవాల స్పర్శకోణం అనేది 900లకు సమానంగా ఉంటే పాత్ర గోడలను కేవలం తాకుతుంది. అంటే పాత్ర గోడల నుంచి విడిపోయి ఉండటం లేదా అంటుకుని ఉండటం అనేది జరగదు.
స్పర్శకోణం మార్పు చెందడానికి గల కారణాలు
– ద్రవపదార్థాల్లో మాలిన్య కణాలను కలిపినప్పుడు వాటి స్పర్శకోణం మారుతుంది.
ఉదా: నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు ఆ సబ్బునీటి స్పర్శకోణం తగ్గి బట్ట రంధ్రంలోనికి చొచ్చుకుని వెళ్లి మురికిని సులభంగా తొలిగిస్తుంది.
– ద్రవాలను వేడి చేసినప్పుడు స్పర్శకోణం పెరుగుతుంది. కాబట్టి వేడినీటితో స్నానం చేయడంవల్ల శరీరంపై ఉన్న మురికి సులభంగా తొలిగిపోతుంది.
స్నిగ్ధత (Viscosity)
– ద్రవాలు, వాయువులను కలిపి ప్రవాహాలు అంటారు. స్నిగ్ధత ప్రవాహిధర్మం.
– ప్రవాహి పొరల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే ధర్మమే స్నిగ్ధత.
– స్నిగ్ధత తగ్గించడం కోసం నీటి కాలువలను V ఆకారంలో నిర్మిస్తారు.
– స్నిగ్ధత గుణకానికి CGS ప్రమాణం పాయిజ్. దీనికి ఇతర ప్రమాణాలు Nsm-2 లేదా Kgm-1S-1 లేదా పాస్కల్ సెకన్
– అత్యధిక స్నిగ్ధత ఉన్న ద్రవాలను స్నేహక తైలాలుగా ఉపయోగిస్తారు.
ఉదా: గ్రీజు, ఇంజిన్ ఆయిల్ మొదలైనవి
– పారాచూట్ సాయంతో కిందికి దిగుతున్న వ్యక్తి వేగం వాయువుల స్నిగ్ధత గుణంవల్ల క్రమక్రమంగా తగ్గుతుంది. అందువల్ల ఆ వ్యక్తి భూమిని చేరేటప్పుడు వేగం తక్కువగా ఉంటుంది.
– వర్షపు చినుకులు కిందికి పడుతున్నప్పుడు వాటి వేగాన్ని వాయువుల పొరల మధ్య ఉండే స్నిగ్ధత నిరోధిస్తుంది. కాబట్టి వేగం తగ్గుతుంది.
– సముద్రంలో అలలు ఉద్భవించి కొంతదూరం ప్రయాణించిన తర్వాత క్షీణించిపోవడానికి కారణం ఆ నీటి పొరల మధ్య ఉండే స్నిగ్ధతే.
– స్నిగ్ధత, ఘర్షణ, విద్యుత్ నిరోధాలను పోలి ఉంది.
– రక్తం, స్నిగ్ధత, రక్తకణాల అపసార రేటు కొన్ని రోగాలను నిర్ణయించడంలో తోడ్పడుతుంది.
– నదుల్లో నీటి ప్రవాహం తొలి దశలో నిలకడగా ఉండదు. ఆ నది ప్రవాహంలో స్నిగ్ధత బలాలు రానురాను నీటి వేగాన్ని తగ్గిస్తాయి.
– నది చాలా ఎక్కువ దూరం ప్రవహించిన తర్వాత నీటి వేగం సందిగ్ధ వేగం కంటే తగ్గుతుంది. నదికి నిలకడ వేగం ఉంటుంది.
– వర్షపు బిందువులు పరిమాణంలో చిన్నవైనా చాలా ఎత్తు నుంచి పడుతాయి. గురుత్వబలం వల్ల మాత్రమే ఆ వేగాన్ని పొందితే, వాటి ద్రవ్యవేగం చాలా అధికంగా ఉండి భూమిపై ఉన్న వస్తువుల మీద అవి పడినప్పుడు ఆ వస్తువులు ముక్కలై పోవాలి. అయితే, అవి గాలిలో కిందకు పడుతాయి. కాబట్టి గాలి స్నిగ్ధత స్వభావం వల్ల వాటిపై నిరోధక బలం ఉంటుంది. అందువల్ల వర్షపు బిందువులు త్వరగా స్థిరమైన అంతిమ వేగాన్ని పొందుతాయి.
– స్నిగ్ధత ధర్మాన్ని ఉపయోగించి బంగారు కణాల నుంచి మట్టి కణాలను వేరు చేయవచ్చు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో చలనశీలి ప్రవాహి?
1) నీరు
2) తేనె
3) ఆముదం
4) గమ్
2. ద్రవాల విశిష్ఠ సాంద్రత దేనితో కొలుస్తారు?
1) హైగ్రోమీటర్
2) హైడ్రోమీటర్
3) హిప్సామీటర్
4) అనిమోమీటర్
3. హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?
1) ఆర్కిమెడిస్
2) బాయిల్
3) పాస్కల్
4) బెర్నౌలి
4. విమానాలు, పక్షులు ఏ సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి?
1) పాస్కల్
2) ఆర్కిమెడిస్
3) బెర్నౌలి
4) బాయిల్
5. ఒక వస్తువు ద్రవంలో కోల్పోయిన బరువు తొలిగించిన ద్రవపు ద్రవ్యరాశికి సమానం అనేది?
1) బాయిల్ నియమం
2) ఆర్కిమెడిస్ నియమం
3) పాస్కల్ సూత్రం
4) బెర్నౌలి సూత్రం
6. కింది వాటిలో ఏది బెర్నౌలి సూత్రానికి సంబంధం లేనిది?
1) గాలిపటం
2) క్యాలెండర్ పేపర్లు పైకి ఎగరడం
3) ఆభరణాల్లోని లోపాలు
4) విమానాలు
7. పర్వతాలపై వాతావరణ పీడనం?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) మారదు
4) చెప్పలేం
8. భారమితిలో వాడే ద్రవం?
1) ఆల్కహాల్
2) పాదరసం
3) బ్రోమిన్
4) పైవన్నీ
9. ప్లవన సూత్రాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?
1) బాయిల్
2) పాస్కల్
3) బెర్నౌలి
4) ఆర్కిమెడిస్
10. ఖరీదైన ఆభరణాల్లోని లోపాలు ఏ సూత్రం ఆధారంగా కనుగొంటారు?
1) బెర్నౌలి
2) పాస్కల్
3) ఆర్కిమెడిస్
4) చార్లెస్
11. పాదరస మట్టం హఠాత్తుగా పడిపోతే దేనిని సూచిస్తుంది?
1) తుఫాన్
2) వర్షం
3) సునామీ
4) ఏదీకాదు
12. పాదరస మట్టం నిదానంగా పెరిగితే ఏమవుతుంది?
1) తుఫాన్
2) సాధారణ వాతావరణం
3) వర్షం
4) పైవన్నీ
13. పర్వతాలపై మనిషి శరీరం నుంచి లేదా ముక్కు నుంచి రక్తం కారడానికి కారణం?
1) ఎక్కువ పీడనం
2) తక్కువ పీడనం
3) సమాన పీడనాలు
4) అనారోగ్యం
14. కిరోసిన్ దీపంలోని వత్తి ద్వారా కిరోసిన్ పైకి ఎగబాకడానికి కారణం?
1) పీడన వ్యత్యాసం
2) కేశనాళికీయత
3) గురుత్వాకర్షణ
4) కిరోసిన్ అల్పస్నిగ్ధత
15. సిరంజిలో ద్రవం తలంపైకి జరగడానికి కారణం?
1) తలతన్యత
2) స్థితిస్థాపకత
3) కేశనాళికీయత
4) సిరంజి, ద్రవాల మధ్య ఆకర్షణ బలాలు
16. ఫౌంటెన్ పెన్ను పనిచేసే సూత్రం?
1) కేశనాళికీయత
2) తలతన్యత
3) స్నిగ్ధత
4) ఊర్ధ ఒత్తిడి
17. ద్రవాల్లో మలినాల వల్ల తలతన్యత…
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) ముందు తగ్గి తర్వాత పెరుగుతుంది
4) ముందు పెరిగి తర్వాత తగ్గుతుంది
18. నదిలో ప్రయాణిస్తున్న ఓడ సముద్రంలోకి ప్రవేశించగానే అది కొంత పైకి తేలుతుంది కారణం..
1) నది నీటి సాంద్రత, సముద్రపు నీటి సాంద్రత కంటే అధికం
2) నది నీటి సాంద్రత కంటే సముద్రపు నీటి సాంద్రత అధికం
3) నది నీటి సాంద్రత, సముద్రపు నీటి సాంద్రత రెండూ సమానం
4) చెప్పలేం
19. ఘన పదార్థాలకు స్నిగ్ధత గుణం ….
1) అధికం
2) స్వల్పం
3) ఉండదు
4) పదార్థాన్ని బట్టి మారుతుంది
20. జలాంతర్గామి పనిచేయడంలో ఉపయోగించే సూత్రం?
1) బాయిల్ నియమం
2) పాస్కల్ నియమం
3) బెర్నౌలి నియమం
4) ప్లవన సూత్రం
21. ద్రవపదార్థాలు ప్రదర్శించే ధర్మం?
1) తలతన్యత
2) కేశనాళికీయత
3) స్నిగ్ధత
4) పైవన్నీ
22. చెట్టు వేర్ల ద్వారా నీరు తనంతట తానుగా పైకి ఎగబాకడంలోని ధర్మం?
1) కేశనాళికీయత
2) స్నిగ్ధత
3) నీటి పీడనం
4) తలతన్యత
23. తల వెంట్రుకలకు నూనె అద్దినప్పుడు అవి పరస్పరం దగ్గరగా రావడానికి కారణం?
1) తలతన్యత
2) కేశనాళికీయత
3) ద్రవపీడనం
4) గాలిపీడనం
24. నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు దాని తలతన్యత?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) మారదు
4) శూన్యమవుతుంది
25. సబ్బునీటి బుడగలు గోళాకారంలో ఎందుకుంటాయి?
1) కేశనాళికీయత
2) స్నిగ్ధత
3) తలతన్యత
4) ద్రవపీడనం
26. కేశనాళిక గొట్టాన్ని ఏ ప్రాంతంలోకి తీసుకెళ్లినప్పుడు దానిలో నీటిమట్టం ఎక్కువగా ఉంటుంది?
1) భూమధ్యరేఖ
2) ధృవప్రాంతాలు
3) భూకేంద్రం
4) సముద్రగర్భం
27. స్వచ్ఛమైన నీటి స్పర్శకోణం?
1) 00
2) 450
3) 900
4) 1800
28. ఆర్కిమెడిస్ సిద్ధాంతం ఉపయోగించి పదార్థం ఏ భౌతిక రాశిని కనుగొనవచ్చు?
1) ఘనపరిమాణం
2) రంగు
3) స్వచ్ఛత
4) పైవన్నీ
29. ఎర్ర, తెల్ల రక్తకణాలు వేరు చేయడానికి ఉపయోగించే ధర్మం?
1) తలతన్యత
2) స్నిగ్ధత
3) పీడనం
4) కిరోసిన్
30. సముద్రంలో అల్పపీడనం ఏ ప్రభావం వల్ల ఏర్పడుతుంది?
1) బెర్నౌలీ నియమం
2) ఎల్‌నినో నియమం
3) డాప్లర్ ఫలితం
4) స్టార్క్ ఫలితం
31.ఇసుక ఎడారిలో ఒయాసిస్‌లు ఏర్పడటానికి కారణం?
1) నీటిపీడనం
2) భూపొరల మధ్య పీడనం
3) కేశనాళికీయత
4) స్నిగ్ధత
32. ప్రయోగశాలలో వాతావరణ పీడనం కనుగొనడానికి ఉపయోగించే భారమితి?
1) టారిసెల్లీ
2) అనార్ధ్ర
3) ఆల్కహాల్
4) ఫార్టిన్
33. బెర్నౌలి సిద్ధాంతం ఏ నిత్యత్వ నియమం ఆధారంగా ప్రతిపాదించారు?
1) ద్రవ్యవేగ
2) శక్తి
3) ద్రవ్యరాశి
4) పైవన్నీ
34. కేశనాళిక గొట్టంలో అసలు మట్టం కంటే తక్కువ మట్టానికి చేరే ద్రవం ఏది?
1) నీరు
2) ఆల్కహాల్
3) పాదరసం
4) ఉప్పునీరు
35. వాయువులను వేడి చేసినప్పుడు వాటి స్నిగ్ధత?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) మారదు
4) శూన్యమవుతుంది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు