Diversity in oral | మౌఖికంలో భిన్నత్వం
గ్రూప్-2 ఇంటర్వ్యూ గైడెన్స్
గ్రూప్-2 ఉద్యోగాల ఎంపికకు సంబంధించి జరుగుతున్న ఇంటర్వ్యూల్లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలను, సామాజిక నేపథ్యాన్ని, ప్రాంత వివరాలను అడగకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి (కోడింగ్, డికోడింగ్ విధానం) అభ్యర్థి వ్యక్తిగత వివరాలతో సంబంధం లేకుండా సామార్థ్యాన్ని అంచనా వేయడం జరుగుతున్నది. కాబట్టి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కింది అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రిపేర్ కావాలి.
-సాధారణంగా ఇప్పటివరకు ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువమంది జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ప్రభుత్వ టీచర్లు, ఇతర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. ఇకముందు హాజరయ్యే వారిలో కూడా వీరి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల విధులు, బాధ్యతలు, సమస్యలు వాటికి పరిష్కారాలు, భవిష్యత్ కార్యాచరణ, గ్రూప్-2 ఉద్యోగం పొందితే గత అనుభవం ఏ మేరకు ఉపయోగపడుతుందన్న కోణంలో ఎక్కువగా ప్రశ్నలు అడగటం జరుగుతున్నది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అభ్యర్థులను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు
-పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు
-తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రాముఖ్యత
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ల మధ్య ప్రధాన తేడాలు.
-గ్రామంలోని ప్రధాన సమస్యలు
-గ్రామీణాభివృద్ధి వ్యూహలు
-ఆదర్శ గ్రామపంచాయతీ అంటే?
-గ్రామస్థాయి పరిపాలన
-ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శికి సంబంధాలు
-గ్రామసభ పాత్ర
-జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతెన్నులు
-గ్రామపంచాయతీకి ఆదాయ వనరులు
-ఇంటి పన్ను వసూళ్లలో సవాళ్లు
-గ్రామాల సమగ్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు
-జిల్లాలు, మండలాల వికేంద్రీకరణ, కొత్తగ్రామ పంచాయతీల ఏర్పాటు, ప్రభావం
-గ్రామస్థాయిలో విద్య, ఆరోగ్యం, స్థితిగతులు
-పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, భవిష్యత్‌లో గ్రూప్-2 ఉద్యోగంలో ఎలా ఉపయోగపడుతుంది.
-గ్రామస్థాయిలో అవినీతి ఏయే రూపంలో ఉన్నది
-మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం సాధించలేకపోవడానికి కారణాలు
-పంచాయతీరాజ్ చట్టంలో ప్రజల బాధ్యత గురించి పేర్కొన్న అంశాలు
-గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి పాత్ర
-సర్పంచ్, ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ అంశం
-గ్రామపంచాయతీ అకౌంట్, ఆడిట్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర
-టాం, టాం వేయించడంవలన కలిగే ప్రయోజనాలు
-గ్రామస్థాయిలో మూఢనమ్మకాలవల్ల కలిగే నష్టం, ప్రజల్లో ఎలా చైతన్యం కలిగిస్తారు
-గ్రామస్థాయిలో కులాల ఆధిపత్యం, రాజకీయ జోక్యాన్ని ఎలా అధిగమించారు
-గ్రామస్థాయి పరిపాలనలో ప్రజాప్రతినిధులు, గ్రామసభ అవసరం, పాత్ర
-గ్రామంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, వికలాంగులు తదితర బలహీన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ, సదుపాయాలు, వాటి ప్రభావం
-ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అంటే ఎవరు?
-పంచాయతీ ఎన్నికల ప్రత్యేకత
-గ్రామీణ సమాజంలో విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారికి ఉండాల్సిన లక్షణాలు పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు
-తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 43లో పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలను పేర్కొన్నారు.
-సెక్షన్ 6(8) ప్రకారం గ్రామపంచాయతీ అభివృద్ధికి అవసరమైన ఎజెండాను తయారుచేసి గ్రామపంచాయతీతో ఆమోదింపచేసుకోవాలి.
-గ్రామపంచాయతీకి విధేయంగా ఉంటూ పరిపాలన పరంగా సర్పంచ్ ఆధీనంలో పనిచేయడం.
-గ్రామపంచాయతీ పరిధిలోని షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఇతర వెనుకబడిన తరగతుల నివాసాలను సందర్శించి వారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు చేరుతున్నాయో లేదో పరిశీలించడం. ముఖ్యంగా అంటరానితనం నిర్మూలనకు కృషిచేయడం
-వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామపంచాయతీకి సమర్పించడం, గ్రామపంచాయతీ ఆస్తులను కాపాడటం
-ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు అధికారులకు సహకరించడం
-వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారుల ఎంపిక, ఆ పథకాల అమలులో పాల్గొనడం n పింఛన్ల పంపిణీ
-గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడం
-మొక్కలను నాటించడం వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం
-మండల స్థాయిలోని మండల అభివృద్ధి అధికారి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అప్పజెప్పిన పనులను నిర్వహించడం వంటివి పంచాయతీ కార్యదర్శి విధుల్లో భాగంగా ఉంటాయి.
నూతన విద్యా విధానం-2019 ముసాయిదా
-దేశ భవిష్యత్ తరగతి గదులల్లో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి విద్యకు ప్రపంచ దేశాలన్నింటిలో మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. వేగంగా మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా విజ్ఞాన ఆధారిత సమాజాల నిర్మాణానికి విద్యాసంస్కరణలు అనివార్యం.ఇందులో భాగంగానే భారతదేశంలో నూతన విద్యా విధానాన్ని రూపొందించారు.
కస్తూరి రంగన్ కమిటీ (నూతన విద్యావిధానం) సిపార్సులు
-మానవ వనరుల మంత్రిత్వశాఖ పేరును విద్యామంత్రిత్వ శాఖగా మార్చడం
-జాతీయ స్థాయిలో విద్యాప్రగతిని పర్యవేక్షించడానికి గాను ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ విద్యాకమిషన్ ఏర్పాటు
-శిశు విద్య (3 ఏండ్లు) నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్యగా పరిగణించడం
-5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి.
-9 నుంచి 12వ తరగతి పాఠ్యప్రణాళికలో కరెంట్ ఆఫైర్స్‌ను చేర్చడం, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం
-త్రిభాషా సూత్రాన్ని కొనసాగిస్తూనే విదేశీ భాషలకు కూడా ప్రాధాన్యం పెంచడం
-సెమిస్టర్ల విధానాన్ని ఇప్పుడున్న 1 నుంచి 8 తరగతులు, 10 నుంచి 12వ తరగతులకు విస్తరించడం
-రాబోయే 5 ఏండ్లలో ఉన్నత విద్యారంగంలో ప్రవేశాలను రెట్టింపు చేయాలి
-ప్రపంచంలోని మొదటి వెయ్యి విశ్వవిద్యాలయాల జాబితాలో కనీసం 50 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉండేటట్లు కృషిచేయడం
-విద్యలో నాణ్యతకు భరోసా ఇచ్చే విధంగా అన్ని విద్యాసంస్థలకు అక్రిడేషన్ (గుర్తింపు) ఇవ్వడం
-ఉన్నత విద్యారంగంలో పెట్టుబడులను రెట్టింపుచేయడం
-విద్యారంగంలో భారత్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చడం
ప్రభుత్వ టీచర్లకు సంబంధించి ఇంటర్వ్యూలో అడగటానికి అవకాశమున్న ప్రశ్నలు
-టీచర్ ఉద్యోగాన్ని వదిలి గ్రూప్-2 ఉద్యోగాలకు ఎందుకు వస్తున్నారు?
-టీచర్ ఉద్యోగంలో సంతోషంగా ఉన్నారా
-ఉత్తమ ఉపాధ్యాయులు అంటే ఎవరు
-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉన్నది
-ప్రభుత్వ టీచర్లలో క్రమశిక్షణ ఏ మేరకు ఉన్నది
-ప్రభుత్వ టీచర్ల సమస్యలు
-గురుకుల విద్యావిధానం అవసరం గురించి
-ఆంగ్ల మాధ్యమంలో బోధన అవసరం
-విద్యలో నైతిక విలువల అవసరం
-ఉపాధ్యాయ అనుభవం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలలో ఎలా ఉపయోగపడుతుంది
-ఉత్తమ బోధన విధానం
-విద్యాహక్కు చట్టం-2009 ప్రభావం
-నూతన విద్యావిధానం
-మానవాభివృద్ధికి విద్య అవసరం?
-వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో విద్య పాత్ర
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?