Telangana-Mineral-Resources | తెలంగాణ-ఖనిజ వనరులు
ఖనిజం
-భూమి లోపల నుంచి తవ్వితీసే దాన్ని ఖనిజం అంటారు. నీరు కూడా ఒక ఖనిజమే.
ఖనిజ వనరులు
-భూమిలోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను ఖనిజ వనరులు అంటారు.
-ఖనిజ వనరుల అధ్యయనాన్ని మినరాలజీ అంటారు.
-ఖనిజాలు పునరుత్పత్తి చేయలేని వనరులు.
-1958, నవంబర్‌లో ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను ఏర్పాటు చేశారు.
-తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ)ను 2014, అక్టోబర్ 8న ఏర్పాటు చేశారు.
-దేశంలో ఖనిజ సంపద (నిల్వలు) ద్వీపకల్ప పీఠభూమి, కొండలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నది.
-ఖనిజ నిల్వలు గంగా సింధు, బ్రహ్మపుత్ర మైదానాల పరివాణాల్లో తక్కువగా కేంద్రీకృతమై ఉన్నది.
గమనిక: 1993-94లో నూతన జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు.
-దేశంలో చోటానాగ్పూర్ పీఠభూమిని మినరల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
-దేశంలో ఖనిజ ఎక్స్ప్లోటేషన్ వల్ల అధిక రెవెన్యూను ఆర్జిస్తున్న రాష్ట్రం- ఒడిశా
-మైనింగ్, ఖనిజాల రంగం నుంచి 2016-17లో రూ. 2687.87 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. (2016 డిసెంబర్ నాటికి రూ. 1712 కోట్లు సాధించింది)
-2015-16 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 3.3 శాతం.
-2016-17 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగంవాటా 3.1 శాతం.
ఖనిజాల వర్గీకరణ
-ఖనిజాలను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. లోహ ఖనిజాలు
-ఫెర్రస్ ఖనిజాలు: ఇనుము, మాంగనీస్, కోబాల్ట్, నికెల్
-నాన్ ఫెర్రస్ ఖనిజాలు: రాగి, సీసం, తగరం, జింక్, బాక్సైట్
-విలువైన ఖనిజాలు: బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు
2. అలోహ ఖనిజాలు:
-మైకా, సున్నపురాయి (లైమ్‌స్టోన్), ముగ్గురాయి (బెరైటీస్), ఆస్బెస్టాస్ (రాతినార), గ్రాఫైట్, గ్రానైట్.
3. ఇంధన ఖనిజాలు:
-బొగ్గు, పెట్రోలియం
4. అణు ఖనిజాలు:
-యురేనియం, థోరియం, జిర్కోనియం, ఇల్మనైట్
లోహ ఖనిజాలు
-ఇనుము: ఇనుప ఖనిజాన్ని నాణ్యత ఆధారంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి…
1. మాగ్నటైట్- ఫెర్రస్ శాతం 72 (కనిష్టం)
2. హెమటైట్- ఫెర్రస్ శాతం 70 (గరిష్టం)
3. లిమోనైట్- ఫెర్రస్ శాతం 60
4. సెడిరైట్- ఫెర్రస్ శాతం 50
-దేశంలో, రాష్ట్రంలో ఇనుము ఎక్కువగా హెమటైట్ రూపంలో లభిస్తుంది. మాగ్నటైట్ రూపంలో తక్కువగా లభిస్తుంది.
-దేశంలో మొదటి ఇనుపగని జార్ఖండ్‌లోని సింగ్భమ్.
-దేశంలో ఇనుప ఖనిజం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్.
-అతిపెద్ద ఇనుపగని ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లాలో ఉంది. బైలదిల్ల అంటే ఎద్దు మూపురం అని అర్థం.
ఉత్పత్తి..
-ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, దేశంలో అధికంగా కర్ణాటకలోని కుద్రేముఖ్‌లో, తెలంగాణలో బయ్యారం (మహబూబాబాద్)లో ఇనుప ఖనిజం లభిస్తుంది. కుద్రేముఖ్ అంటే గుర్రం ముఖం అని అర్థం.
-రాష్ట్రంలో ఇనుప నిక్షేపాలు ఉమ్మడి ఆదిలాబాద్, కొత్తగూడెం, బయ్యారం, కరీంనగర్, చెరువుపురం, నావపాడులో ఉన్నాయి.
గమనిక: చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రేవు ద్వారా ఇనుప ఖనిజం జపాన్, దక్షిణ కొరియాలకు ఎగుమతి అవుతుంది.
-గోవాలోని ఇనుప ఖనిజం మర్మగోవా ఓడరేవు ద్వారా స్పాంజ్ ఐరన్ రూపంలో జపాన్‌కు వెళ్తుంది.
మంగనీస్
-దీన్ని విమానాల తయారీలో, ఫుడ్ ప్యాకేజింగ్‌కు వాడే వస్తువుల తయారీలో, ఉక్కు, బ్యాటరీలు, పెయింట్స్ తయారీలో ఉపయోగిస్తారు.
ఉత్పత్తి
-మాంగనీస్ ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.
-దేశంలో మధ్యప్రదేశ్ (చింద్వారా బెల్ట్), ఒడిశా (అత్యధిక నిల్వలు) తొలి రెండు స్థానాల్లో ఉండగా, రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ మొదటి స్థానంలో ఉంది.
రాగి
-ఇది రెండో అత్యుత్తమ విద్యుత్ వాహకం.
ఉత్పత్తి
-ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, దక్షిణాఫ్రికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో కర్ణాటక (ఉత్పత్తి) ప్రథమ స్థానంలో ఉండగా, రాజస్థాన్ (నిల్వలు అధికం) రెండో స్థానంలో ఉంది.
-రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారంలోని దార్వార్ అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-తెలంగాణలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాగి నిక్షేపాలు ఉన్నాయి.
బంగారం
-బంగారం ఆకుపచ్చ, తెలుపు, పసుపు అని మూడు రకాలుగా ఉంటుంది.
-వీటిలో ఆకుపచ్చ బంగారంలో అధికశాతం బంగారం ఉంటుంది.
-ఇది క్వార్ట్ శిల నుంచి లభిస్తుంది.
-ప్రపంచంలో బంగారాన్ని అధికంగా ఉపయోగిస్తున్న దేశం భారత్.
ఉత్పత్తి
-ప్రపంచంలో దక్షిణాఫ్రికా (పింట్ వాటర్స్రాండ్) మొదటి స్థానంలో ఉన్నది.
-దేశంలో కర్ణాటకలో బంగారం అధికంగా లభిస్తున్నది.
-రాష్ట్రంలో బంగారం నిల్వలు కిన్నెరసాని, గోదావరి నదులు కలిసే ప్రదేశం (భద్రాద్రి కొత్తగూడెం), మంగంపేట (జయశంకర్ భూపాలపల్లి), గద్వాల శిలా బెల్ట్లలో విస్తరించి ఉన్నాయి.
వజ్రాలు
-వజ్రం 100 శాతం స్వచ్ఛమైన కార్బన్‌ను కలిగి ఉంటుంది.
-క్లింబారైట్ రాతి పొరల్లో లభిస్తుంది.
ఉత్పత్తి
-ప్రపంచంలో దక్షిణాఫ్రికా (కింబర్లీ), భారత్‌లో మధ్యప్రదేశ్ (పన్నా)లో వజ్రాలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి.
-తెలంగాణలో మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలోని కోయిలకొండ-దేవరకద్ర ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి (పైపులైను పనుల్లో).
వెండి
ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకం.
ఉత్పత్తి
-దేశంలో కర్ణాటక, రాజస్థాన్‌లలో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
నికెల్
-నికెల్ ఎక్కువగా ఒడిశాలో ఉత్పత్తి అవుతున్నది.
అలోహ ఖనిజాలు
-ముగ్గురాయి (బెరైటీస్)
-దీన్ని రంగులు, రబ్బరు వస్తువులు, పేపర్లు, రసాయనాల పరిశ్రమల్లో వాడుతారు.
-రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ముగ్గురాయి నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.
-ప్రపంచంలోనే నాణ్యమైన, అధిక పరిమాణంలో బెరైటీస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా మంగంపేట వద్ద ఉన్నాయి.
సున్నపురాయి
-బొగ్గు నిల్వల తర్వాత రాష్ట్రంలో అధికంగా విస్తరించిన ఖనిజం.
ఉత్పత్తి
-రాష్ట్రంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
-దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక (అధిక నిల్వలు)లు మొదటి స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నది.
అభ్రకం (మైకా)
-దీన్ని విద్యుత్ బంధకంగా ఉపయోగిస్తారు.
ఉత్పత్తి
-ప్రపంచంలో భారత్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది.
-దేశంలో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉన్నది.
గ్రానైట్
-గ్రానైట్ బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ (టాన్బ్రౌన్ గ్రానైట్)గా లభిస్తుంది.
-తెలంగాణలో టాన్బ్రౌన్ గ్రానైట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
-నల్ల గ్రానైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఖమ్మం.
ఉత్పత్తి
-రాష్ట్రంలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్లు విస్తరించిన జిల్లాలు కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల
గ్రాఫైట్
-భారత్‌లో తమిళనాడు అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-దేశంలో అత్యధిక నిల్వలు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
-రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-గ్రాఫైట్‌ను నల్లసీసం (Black Lead) అని కూడా పిలుస్తారు.
-దీన్ని పెన్సిళ్లు, రంగులు, పూసల తయారీలో ఉపయోగిస్తారు.
ఇంధన ఖనిజాలు (Fuel Minerals)
1. బొగ్గు 2. పెట్రోలియం 3. సహజ వాయువు
1. బొగ్గు
-ఇదొక హైడ్రోకార్బన్
-రాష్ట్రంలో లభించే బొగ్గు ఖనిజం- గొండ్వానా శిలలు
-బొగ్గులో ఉండే కార్బన్ శాతం ఆధారంగా బొగ్గును నాలుగు రకాలుగా విభజించవచ్చు.
బొగ్గు రకం కార్బన్ శాతం
1. ఆంథ్రసైట్ 92 -98 శాతం ఇది
నాణ్యమైన బొగ్గు
2. బిట్యుమినస్ 70- 80 శాతం ఇది ఇండియాలో
అధికంగా లభిస్తుంది
3. లిగ్నైట్ 65 శాతం ఇది తమిళనాడులోని
నైవేలిలో లభిస్తుంది
4. పీట్ 35 శాతం ఇది అంతగా
నాణ్యత లేని బొగ్గు
గమనిక: తెలంగాణలో లభించే బొగ్గు రకం
– సెమీ బిట్యుమినస్
ఉత్పత్తి
-ప్రపంచంలో అత్యధిక చైనా, ఆతర్వాత అమెరికా, ఇండియా ఉత్పత్తి చేస్తున్నాయి.
-దేశంలో అత్యధికంగా జార్ఖండ్, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి చేస్తున్నాయి.
-తెలంగాణలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్పత్తి చేస్తున్నది
-అధిక బొగ్గు నిల్వలు – తెలంగాణలోని జిల్లాలు – మంచిర్యాల, పెద్దపల్లి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు