1. కిందివాటిలో సరికాని అంశం?
1) భారతదేశానికి నదీ ఆధారిత నామకరణం- ఇండియా
2) భారతదేశం ప్రధానంగా 80 4-370 6ల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది
3) కర్కాటకరేఖను రెండుసార్లు సమీపించే నది- సబర్మతి
4) భారత ప్రామాణిక కాలాన్ని 82 1/20 తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ధారిస్తారు
2. కింది వాటిని జతపర్చండి.
ఎ. దేశ భూ విస్తీర్ణం
1. 12 నాటికల్ మైళ్లు
బి. భారత ప్రధాన భూ సరిహద్దు పొడవు
2. 7,516.6 కి.మీ.
సి. సముద్ర తీరరేఖ పొడవు
3. 15,200 కి.మీ.
డి. ప్రాదేశిక జలాల పొడవు
4. 3.28 మి. చ.కి.మీ.
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
3. భారత్‌తో సరిహద్దును అధికంగా కలిగి ఉన్న కింది దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. చైనా
బి. మయన్మార్
సి. బంగ్లాదేశ్
డి. పాకిస్థాన్ ఇ. నేపాల్
1) సి, ఎ, ఇ, బి, డి
2) సి, ఎ, బి, డి, ఇ
3) ఎ, సి, బి, ఇ, డి
4) సి, ఎ, డి, ఇ, బి
4. మూడువైపులా అంతర్జాతీయ సరిహద్దుగల రాష్ర్టాలు?
1) సిక్కిం
2) అరుణాచల్‌ప్రదేశ్
3) జమ్ముకశ్మీర్
4) పైవన్నీ
5. 23 1/20 ఉత్తర అక్షాంశం కర్కటరేఖ దేశంలోని కింది పట్టణాల మీదుగా పయనిస్తుంది?
ఎ. గాంధీనగర్
బి. భోపాల్
సి. అగర్తల
డి. రాంచీ
1) ఎ, బి
2) ఎ, బి, డి
3) బి, సి, డి
4) పైవన్నీ
6. దేశంలో 82 1/20ల ప్రామాణిక రేఖాంశం ప్రయాణించే రాష్ర్టాలు, పట్టణాలకు సంబంధించి సరిగా అమర్చని జత?
1) ఉత్తరప్రదేశ్- వారణాసి
2) మధ్యప్రదేశ్-రేవా
3) ఆంధ్రప్రదేశ్- కాకినాడ
4) ఒడిశా- రాయ్‌పూర్
7. కింది వాటిలో సరైనదాన్ని ఎంచుకోండి.
ఎ. ఖండ భూభాగ విస్తీర్ణంలో భారత్ విస్తీర్ణం- 2.42%
బి. దేశంతో కృత్రిమ సరిహద్దుగల దేశాలు- పాకిస్థాన్, బంగ్లాదేశ్
సి. విస్తీర్ణంలో భారత్ కంటే ఆఫ్రికా సుమారు 9 రెట్లు పెద్దది
డి. నేపాల్‌తో పొడవైన సరిహద్దుగల రాష్ట్రం- ఉత్తరప్రదేశ్
1) ఎ, సి
2) ఎ, సి, డి
3) పైవన్నీ
4) బి, డి
8. నెఫా అనే పూర్వనామం కలిగిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్
2) అసోం
3) బీహార్
4) అరుణాచల్‌ప్రదేశ్
9. కిందివాటిలో సరికాని జత?
1) చైనాతో పొడవైన సరిహద్దుగల రాష్ట్రం- జమ్ముకశ్మీర్
2) భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న భారత భూభాగం- ఇందిరాపాయింట్
3) భూటాన్‌తో సరిహద్దు లేని రాష్ట్రం- అసోం
4) ప్రపంచంలో పొడవైన తీరరేఖ ఉన్న దేశం- కెనడా
10. దేశంలో మూడు సముద్రాలతో తీరరేఖ కలిగిన రాష్ట్రం?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఒడిశా
11. తీరరేఖ పొడవు ఆధారంగా కింది రాష్ర్టాలను అవరోహణ క్రమంలో అమర్చండి?
ఎ. కేరళ
బి. ఆంధ్రప్రదేశ్
సి. పశ్చిమబెంగాల్
డి. మహారాష్ట్ర ఇ. గోవా
1) బి, డి, సి, ఎ, ఇ
2) బి, సి, డి, ఇ, ఎ
3) బి, డి, ఎ, సి, ఇ
4) సి, బి, డి, ఎ, ఇ
12. కింది అంశాలను సరిచూడండి.
ఎ. దేశం మొత్తం భూసరిహద్దు పొడవులో బంగ్లాదేశ్‌తో సరిహద్దు 26.95 శాతం ఉంది
బి. బంగ్లాదేశ్‌తో జరిగిన సరిహద్దు ఒప్పందాన్ని భారత పార్లమెంటు 2015, మే 7న ఆమోదించింది
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
13. కిందివాటిని జతపర్చండి.
ఎ. కోకో చానల్
1. భారత్-శ్రీలంక
బి. పాక్ జలసంధి
2. భారత్-మయన్మార్
సి. 240 సమాంతర రేఖ
3. భారత్-మాల్దీవులు
డి. 80ల ఛానల్
4. భారత్-ఇండోనేషియా
ఇ. గ్రేట్ ఛానల్
5. భారత్-పాకిస్థాన్
1) ఎ-2, బి-1, సి-5, డి-3, ఇ-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
3) ఎ-2, బి-3, సి-1, డి-4, ఇ-5
4) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4
14. కిందివాటిని జతపర్చండి.
ఎ. భారత్‌లో చైనా ఆక్రమించిన ప్రాంతం
1. ఇందిరాకాల్
బి. దేశానికి తూర్పునగల చిట్టచివరి ప్రాంతం
2. కన్యాకుమారి
సి. దేశానికి ఉత్తరానగల చివరి ప్రాంతం 3. కిచుతు
డి. దేశంలో పగలు, రాత్రి సమయాలు 4. ఆక్సాయ్‌చిన్ ఇంచుమించు సమానంగా ఉండే ప్రాంతం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
15. దేశంలో విస్తీర్ణపరంగా పెద్ద భూపరివేష్టిత రాష్ట్రం?
1) హర్యానా
2) మధ్యప్రదేశ్
3) తెలంగాణ
4) జార్ఖండ్
16. కిందివాటిని జతపర్చండి.
ఎ. దేశంలో అతిపెద్ద ఆదివాసి జిల్లా
1. బస్తర్
బి. విస్తీర్ణపరంగా అతిచిన్న జిల్లా
2. ఎర్నాకుళం
సి. జనాభాపరంగా అతిచిన్న జిల్లా
3. మహే
డి. 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లా
4. దిబంగ్ లోయ
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-1, బి-2, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-4, సి-3, డి-1
17. పాల్ఘాట్ కనుమ కింది రాష్ర్టాలను కలుపుతుంది?
1) సిక్కిం-పశ్చిమ బెంగాల్
2) మహారాష్ట్ర-మధ్యప్రదేశ్
3) కేరళ-తమిళనాడు
4) అరుణాచల్‌ప్రదేశ్-అసోం
18. కిందివాటిలో 2000 సంవత్సరంలో దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు?
1) సిక్కిం, జార్ఖండ్, ఉత్తరాఖండ్
2) ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా
3) జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్
4) జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్
19. ప్రతిపాదన-ఎ: నాలుగు వైపులా నీటితో ఆవరించి ఉన్న ద్వీపం ప్రతిపాదన-బి: దేశంలోని నికోబార్ దీవుల సముదాయంలో 19 దీవులు విస్తరించి ఉన్నాయి.
1) ఎ
2) బి
3) ఏదీకాదు
4) పైవన్నీ