1. విస్తృతి అక్షాంశాల దృష్ట్యా భారతదేశం వేటి మధ్య విస్తరించింది?
1) అరుణాచల్ ప్రదేశ్ – రాణ్ ఆఫ్ కచ్
2) రాణ్ ఆఫ్ కచ్ – జమ్ముకశ్మీర్
3) కన్యాకుమారి – జమ్ముకశ్మీర్
4) గుజరాత్ – కన్యాకుమారి
2. దేశంలో పొడవైన బీచ్ ఏ తీరంతో సంబంధం కలిగి ఉన్నది?
1) మలబారు
2) కోరమండల్
3) కైత్వార్
4) సర్కార్
3. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తిగల రాష్ట్రం?
1) పంజాబ్
2) రాజస్థాన్
3) అసోం
4) హర్యానా
4. పశ్చిమబెంగాల్, మేఘాలయా, అసోం, త్రిపుర, మిజోరం రాష్ర్టాలతో సరిహద్దును కలిగిన దేశం?
1) మయన్మార్
2) భూటాన్
3) బంగ్లాదేశ్
4) చైనా
5. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రం?
1) తెలంగాణ
2) మధ్యప్రదేశ్
3) బీహార్
4) గోవా
6. పులికాట్ సరస్సు ఏ తీరాల మధ్య విస్తరించింది?
1) వంగ-ఉత్కల్
2) ఉత్కల్-సర్కార్
3) సర్కారు-కోరమండల్
4) కోరమండల్-మలబారు
7. కేరళ తీరం వెంబడి వ్యవసాయం చేసే ముస్లింలను ఎలా పిలుస్తారు?
1) మోప్లాలు
2) తోడాలు
3) మల్ఫీలు
4) ఖాసీలు
8. భారతదేశానికి నైరుతి దిశలో దగ్గరగా ఉన్న దీవి ఏది?
1) జావా
2) సుమత్రా
3) శ్రీలంక
4) మాల్దీవులు
9. నర్మదా, తపతి నదులు వరుసగా వేటిని వేరుచేస్తూ ప్రవహిస్తున్నవి?
1) వింద్య – అజంతా – సాత్పురా
2) అజంతా – సాత్పురా – వింద్య
3) సాత్పురా – అజంతా – వింద్య
4) వింద్య – సాత్పురా – అజంతా
10. కింది వాటిని జతపర్చండి.
జాబితా-1 జాబితా-2
ఎ. భారతదేశానికి దక్షిణ భాగంలో అత్యంత చివరిది
1. ఆరోమకొండ
బి. పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శిఖరం
2. కన్యాకుమారి
సి. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం
3. దొడబెట్ట
డి. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం
4. అనైముడి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) సి-1, ఎ-2, డి-3, బి-4
3) సి-1, ఎ-2, బి-3, డి-4
4) ఎ-1, డి-4, బి-3, సి-4
11. ఆగ్నేయ దిశలో ఏ దీవి భారతదేశంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నది?
1) శ్రీలంక
2) మాల్దీవులు
3) జావా
4) సుమత్రా
12. భారతదేశంలో అగ్నిలావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ?
1) వింద్యాపీఠభూమి
2) మాల్వా పీఠభూమి
3) చోటా నాగపూర్ పీఠభూమి
4) దక్కన్ పీఠభూమి
13. ్ర పతిపాదన (ఎ): పశ్చిమ కనుమల్లో జన్మించిన నదులు కూడా తూర్పు (ఆగ్నేయ)న ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
కారణం (బి): ద్వీపకల్ప పీఠభూమి కొంచెం తూర్పు (ఆగ్నేయ) వైపున వాలును కలిగి ఉన్నది.
1) A, R రెండూ నిజం, Aకి R సరైన వివరణ
2) A, R రెండూ నిజం, Aకి R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు
4) A తప్పు, R నిజం
14. కింది వాటిని కాలనుక్రమంగా అమర్చండి.
ఎ. ద్వీపకల్ప పీఠభూమి
బి. గంగా-సింధు మైదానం
సి. హిమాలయాలు
డి. తీరమైదానాలు
1) ఎ, బి, సి, డి
2) ఎ, సి, బి, డి
3) బి, సి, డి, ఎ
4) డి, బి, సి, ఎ
15. కింది వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా..
ఎ. సాత్పురా పర్వతాలు
బి. వింద్య పర్వతాలు
సి. నర్మదానది
డి. అజంతా కొండలు
ఇ. తపతి నది
1) ఎ, బి, సి, డి, ఇ
2) సి, బి, ఎ, డి, ఇ
3) బి, సి, ఎ, ఇ, డి
4) బి, సి, ఎ, డి, ఇ
16. కింది రాష్ర్టాలను వాటి భౌగోళిక విస్తీర్ణం రీత్యా అవరోహణ క్రమంలో పేర్కొనండి.
ఎ. మధ్యప్రదేశ్
బి. రాజస్థాన్
సి. మహారాష్ట్ర
డి. ఉత్తరప్రదేశ్
1) ఎ, బి, డి, సి
2) బి, సి, ఎ, డి
3) బి, సి, డి, ఎ
4) బి, ఎ, సి, డి
17. దేశంలో అత్యధిక వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం?
1) చురు
2) చంబా
3) మాసిన్రాం
4) నాంచీ
18. దేశంలో అత్యధిక, అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం?
1) కేరళ-కర్ణాటక
2) మధ్యప్రదేశ్-హర్యానా
3) హర్యానా-రాజస్థాన్
4) మిజోరాం-మధ్యప్రదేశ్
19. కింది వాటిని జతపర్చండి.
జాబితా-1 జాబితా-2
1. ఉత్తరాఖండ్
ఎ. షిప్కిలాపాస్
2. సిక్కిం
బి. బొమిడిలపాస్
3. హిమాచల్‌ప్రదేశ్ సి. జిలెపులపాస్
4. అరుణాచల్‌ప్రదేశ్ డి. నాతులాపాస్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
20. దేశంలో ఎత్తయిన శిఖరం ఏ పర్వత శ్రేణిలో కలదు?
1) ట్రాన్స్
2) పిర్ పంజాల్
3) హిందూకుష్
4) కారకోరమ్
21. రాడ్‌క్లిఫ్ రేఖకు దక్షిణాన చివరగా ఉన్న భారత్-శ్రీలంక మధ్య ఉన్న ప్రధానభాగం?
1) రామసేతు
2) పాంబన్ దీవి
3) కచ్చటపు దీవి
4) మన్నార్ సింధుశాఖ
22. ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే కారకాలు?
1) క్లోరోఫ్లోరో కార్బన్లు
2) హాలోజన్లు
3) మీథేన్లు
4) పైవన్నీ
23. కింది వాటిలో ఉత్తరప్రదేశ్‌తో సరిహద్దుగల రాష్ర్టాలు ఏవి?
ఎ. పంజాబ్
బి. రాజస్థాన్
సి. ఛత్తీస్‌గఢ్
డి. జార్ఖండ్
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, డి, బి
24. కింది వాటిలో లింగ నిష్పత్తి ఏది?
1) 1000 మంది స్త్రీలకు ఉన్న పురుషుల సంఖ్య
2) 100 మంది స్త్రీలకు ఉన్న పురుషుల సంఖ్య
3) 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
4) 100 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
25. మార్బుల్ రివర్ అని ఏ నదికి పేరు?
1) తపతి
2) నర్మద
3) గంగా
4) పెన్‌గంగ
26. ప్రస్తుతం దేశంలో ఎత్తయిన జలపాతం?
1) జోగ్
2) కుంటాల
3) కుంచికల్
4) యొన్న…….
27. భారతదేశపు పైకప్పు (ఎత్తయిన) పీఠభూమి అని దేన్ని పిలుస్తారు?
1) చోటానాగపూర్ పీఠభూమి
2) మాల్వా పీఠభూమి
3) కర్ణాటక పీఠభూమి
4) బుందేల్‌ఖండ్ పీఠభూమి
28. ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవిగల రాష్ట్రం?
1) పశ్చిమబెంగాల్
2) తెలంగాణ
3) అసోం
4) జమ్ముకశ్మీర్
29. భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద ప్రాంతం?
1) మైత్రివన్
2) తీన్ బిఘా
3) కవ్వాంచల్
4) కోకో దీవి
30. హిమాలయాలు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా..
ఎ. గ్రేటర్
బి. నిమ్న
సి. బాహ్య
డి. టిబెట్
1) ఎ, బి, సి, డి
2) బి, సి, డి, ఎ
3) బి, ఎ, సి, డి
4) డి, ఎ, బి, సి
31. నీలగిరి కొండలు ఏ కనుమల్లో భాగం?
1) తూర్పు కనుమలు
2) పశ్చిమ కనుమలు
3) 1, 2
4) ఏదీకాదు
32. పిర్ పంజాల్ పర్వతశ్రేణి, మహాభారత్ పర్వత శ్రేణిలు ఏ హిమాలయాల్లో ఉన్నాయి?
1) నిమ్న
2) గ్రేటర్
3) శివాలిక్
4) ట్రాన్స్
33. కింది లోయలను జతపర్చండి.
జాబితా-1 జాబితా-2
ఎ. సుర్మలోయ 1. సిక్కిం
బి. చుంబీలోయ 2. అసోం
సి. మాక్డోక్లోయ 3. కేరళ
డి. నిశ్శబ్ధలోయ
4. మేఘాలయ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
34. కింది వాటిలో సరికాని జత ఏది?
1) అసోం – కచార్ కొండలు
2) అరుణాచల్‌ప్రదేశ్ – మిష్మికొండలు
3) మేఘాలయా – జయంతి కొండలు
4) సిక్కిం – దుద్వా కొండలు
35. డూన్లు అనే సమతల మైదానాలు ఏ హిమాలయాల మధ్య ఏర్పడినవి?
1) నిమ్న – హిమాద్రి
2) హిమాద్రి – ట్రాన్స్
3) శివాలిక్ – నిమ్న
4) నిమ్న – హిమాద్రి
36. దేశంలో ఎత్తయిన శిఖరం ఏది?
1) కాంచనగంగ
2) నందాదేవి
3) కృష్ణగిరి
4) ఏదీకాదు
37. కింది తూర్పు కనుమలను జతపర్చండి.
జాబితా-1 జాబితా-2
ఎ. నల్లమల కొండలు 1. నిజామాబాద్
బి. దేవరకొండలు 2. వికారాబాద్
సి. అనంతగిరి కొండలు 3. నల్లగొండ
డి. సిర్నాపల్లి కొండలు 4. నాగర్‌కర్నూలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
38. కింది వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసక్రమంలో రాయండి.
ఎ. బాలఘాట్ కనుమ
బి. దాల్ఘాట్ కనుమ
సి. సెహన్ఖట్ కనుమ
డి. పాల్ఘాట్ కనుమ
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, డి, సి
3) సి, బి, ఎ, డి
4) బి, ఎ, డి, సి
39. ఈశాన్య రుతుపవనాలను తమిళనాడులో అడ్డగించే కొండలు?
1) నీలగిరి కొండలు
2) బలిగిరిరంగన్ కొండలు
3) జవధి కొండలు
4) షవరాయ్ కొండలు
40. కిందివాటిలో సరికాని జత.
1) ఖాదర్- నవీన ఒండ్రుమట్టి
2) భంగర్- పురాతన ఒండ్రుమట్టి
3) టెరాయి- చిత్తడి ఒండ్రుమట్టి
4) బాబర్- చౌడు, లవణాల ఒండ్రుమట్టి
41. కిందివాటిని జతపర్చండి.
ప్రదేశం దోబ్……..
ఎ. బియాస్-సట్లేజ్ నదుల మధ్య 1. రచన
బి. జీలం-చీనాబ్ నదుల మధ్య 2. బారీ
సి. చీనాబ్-రావి నదుల మధ్య 3. చాజ్
డి. బియాస్-రావి నదుల మధ్య 4. బిస్ట్ జలంధర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
42. ప్రవాళబిత్తిక దీవులు అని వేటిని పిలుస్తారు?
1) లక్షద్వీప దీవులు
2) అండమాన్ దీవులు
3) నికోబార్ దీవులు
4) ఇండోనేషియా దీవులు
43. అండమాన్ నికోబార్ దీవులతో సంబంధంలేని ఆదిమ తెగ?
1) జరావాలు
2) డొంగా
3) షాంపెన్
4) సెంటినలీస్
44. ప్రపంచ నదుల దినోత్సవం జరిపేరోజు?
1) మార్చి 22
2) ఏప్రిల్ 7
3) సెప్టెంబర్ 28
4) జూన్ 5
45. మాండమి, జువారి, రాచోల్ అనే నదులు ఏ రాష్ట్రం మీదుగా ప్రవహిస్తున్నాయి?
1) ఉత్తరాఖండ్
2) హిమాచల్‌ప్రదేశ్
3) తమిళనాడు
4) గోవా
46. భారతదేశంలో మొదటి చమురు బావి దిగ్భాయ్. ఇది ఏ నది పరీవాహక ప్రాంతం వెంబడి ఉన్నది?
1) గంగానది
2) సింధునది
3) తీస్తానది
4) బ్రహ్మపుత్రనది
47. గంగానదికి ఎడమవైపు నుంచి ఉత్తరదిశలో కలవని ఉపనది ఏది?
1) రామ్‌గంగా
2) గండక్
3) యమున
4) గోమతి
48. హైదరాబాద్ నగరం ఏ నది తీరాన వెలసినది (ఏర్పడింది)?
1) గోదావరి
2) మూసి
3) మంజీరా
4) కృష్ణా
49. నారాయణి అని బీహార్‌లో ఏ నదిని పిలుస్తారు?
1) కోసి
2) ఘాగ్రా
3) గండక్
4) సోన్
50. సింధు నది ఉపనదులు దక్షిణం నుంచి ఉత్తరానికి వరుసక్రమం?
ఎ. జీలం బి. బియాస్
సి. రావి డి. చీనాబ్ ఇ. సట్లేజ్
1) ఎ, బి, సి, డి, ఇ 2) ఇ, బి, సి, డి, ఎ
3) డి, సి, బి, ఎ, ఇ 4) ఎ, డి, సి, బి, ఇ
51. కృష్ణా బేసిన్ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ నగరానికి గోదావరి బేసిన్ ప్రాంతంలోని ఏ నది ద్వారా తాగునీరు అందుతున్నది?
1) మంజీరనది
2) మూసీనది
3) డిండీనది
4) ప్రాణహిత నది
52. ఫ్లోరైడ్ కాలుష్యం, కరువుతో బాధపడుతున్న నల్లగొండ జిల్లా, పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని భాగాల్లో సాగునీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం?
1) స్వర్ణ
2) నక్కల గండి
3) మూలవాగు
4) జూరాల
53. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం ఏ నీటి పారుదల వ్యవస్థకు సంబంధించింది?
1) భారీ తరహా
2) మధ్యతరహా
3) చిన్నతరహా
4) ఏదీకాదు
54. దేశంలో పొడవైన కాలువ ఇందిరా కాలువ అయితే, రాష్ట్రంలో పొడవైన కాలువ ఏది?
1) లాల్ బహదూర్ కాలువ
2) లక్ష్మీ కాలువ
3) సరస్వతి కాలువ
4) కాకతీయ కాలువ
55. మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమబెంగాల్
2) ఉత్తరప్రదేశ్
3) బీహార్
4) కర్ణాటక