-లక్ష్యాలు: విద్యార్థులకు వాస్తవ పరిశ్రమ అనుభవాన్ని, ప్రొఫెషనలిజానికి కావాల్సిన అనుభవాన్ని ఇస్తుంది. సంబంధిత బ్రాంచీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత ద్వారా శిక్షణ ఉంటుంది. దీంతో ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్‌లో గడించిన అనుభవాన్ని తరగతి గదుల్లో చర్చించడం, తరగతిగదిలో చదివిన అంశాలకు ప్రాక్టికల్ అనుభవాన్ని జోడించడం సాధ్యపడుతుంది. దీని ద్వారా భవిష్యత్‌లో పరిశ్రమలకు కావాల్సిన నిపుణుల కొరత తీరుతుంది.
ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు లాభాలు
-ఇండస్ట్రీ/ఆర్గనైజేషన్ హైరింగ్‌కు అవకాశాలు
-ప్రాక్టికల్ అనుభవం
-తరగతిగదిలో నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్ ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవడం
-విద్యార్థులు భవిష్యత్తులో వృత్తి ఎంపిక, కెరీర్‌ను తీర్చిదిద్దుకునే క్రమంలో ఉపయోగపడుతుంది
-కొత్త నైపుణ్యాలను, జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం
-టీం వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు.
-టైం మేనేజ్మెంట్, మల్టీటాస్కింగ్ స్ట్రాటజీలను నేర్చుకునే అవకాశం
-కొత్త వ్యక్తులను కలవడం, నెట్వర్కింగ్ నైపుణ్యాలను అభ్యసించడం
విద్యాసంస్థలకు ఉపయోగాలు
-పరిశ్రమతో విద్యాసంస్థలకు సంబంధాలు మెరుగుపడటం
-సంస్థల క్రెడిబిలిటీ, బ్రాండింగ్ పెరుగుతుంది
-పరిశ్రమ/విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌తో కరిక్యులంలో మార్పులు చేర్పులకు అవకాశం
-బోధన, అభ్యసన పద్ధతిలో అభివృద్ధి.
ఏఐసీటీఈ కొత్త నిబంధనలు
-దేశంలోని ఇంజినీరింగ్/పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచడంతోపాటు పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా విద్యార్థులను తయారుచేయడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కొత్త నిబంధనలను రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పద్ధతికి భిన్నంగా రెండో సెమిస్టర్ నుంచే ఇంటర్న్‌షిప్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం..
-ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్) విద్యార్థులు: కనీసం 14-20 క్రెడిట్స్ ఇంటర్న్‌షిప్/ఎంట్రప్రెన్యూరియల్ యాక్టివిటీస్ లేదా ప్రాజెక్ట్ వర్క్ లేదా సెమినార్ అండ్ ఇంటర్ లేదా ఇంట్రా ఇన్స్టిట్యూషనల్ ట్రెయినింగ్ చేయాల్సి ఉంటుంది.
-డిప్లొమా విద్యార్థులు: మూడేండ్లలో కనీసం 10-14 క్రెడిట్స్ ఇంటర్న్‌షిప్ చేయాలి.
నోట్: 1 క్రెడిట్ అంటే కనీసం 40-45 గంటల పని. ఫుల్‌టైం ఇంటర్న్‌షిప్‌లో వారంలో కనీసం 40-45 గంటలు ఇంటర్న్‌షిప్/ట్రెయినింగ్ లేదా ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అంచనా ప్రకారం బీఈ/బీటెక్ పూర్తయ్యేలోగా కనీసం 600-700 గంటల ఇంటర్న్‌షిప్, డిప్లొమా విద్యార్థులు అయితే 450-500 గంటల ఇంటర్న్‌షిప్ చేయాలి.
-ఇంటర్న్‌షిప్ పార్ట్‌టైం/ఫుల్‌టైంలో చేయవచ్చు. వేసవి సెలవులు అయితే ఫుల్‌టైం, అకడమిక్ సెషన్లో అయితే పార్ట్‌టైం చేసుకునే విధంగా ఏఐసీటీఈ కరిక్యులాన్ని రూపొందించింది.
-4, 6వ సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్/ఇన్నోవేషన్ లేదా ఎంట్రప్రెన్యూర్షిప్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనాలి.
ఇంటర్న్‌షిప్ ఎక్కడ
-పరిశ్రమల్లో లేదా ఎన్జీవోలు, ప్రభుత్వ సంస్థలు, చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. 8వ సెమిస్టర్ చివరలో ప్రాజెక్టు వర్క్, సెమినార్ లాంటివి ఆయా సంస్థ/కాలేజీల్లో పేర్కొన్న ప్రకారం చేయాలి.
-ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తాను చేసిన ప్రతి పనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఫ్రూప్స్ను ధృవీకరించే విధంగా ఫైల్‌ను తయారుచేసుకోవాలి. దాన్ని కాలేజీలో సమర్పించాలి.
కాలేజీలు ఏం చేయాలి?
-ఏఐసీటీఈ కొత్త నిబంధన ప్రకారం ప్రతి కాలేజీలో ట్రెయినింగ్ ప్లేస్మెంట్ సెల్‌ను, దానిలో ట్రెయినింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ (టీపీవో)ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. టీపీవో విద్యార్థి కెరీర్ విషయంలో కీలకంగా వ్యవహరించాలి. అకడమిక్/కెరీర్ పరంగా విద్యార్థికి సలహాలు, సూచనలు ఇస్తుండాలి. పరిశ్రమకు, విద్యార్థులకు మధ్య వారిధిగా పనిచేయాలి. టీపీసీ విద్యార్థుల పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, వొకాబులరీ, రెజ్యూమే తయారీ, ఈమెయిల్ రైటింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఆప్టిట్యూడ్ ట్రెయినింగ్, ప్రాక్టీస్ టెస్ట్‌లు, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్, ప్రజంటేషన్ స్కిల్స్, విదేశీ భాషల్లో ప్రావీణ్యం వంటివాటిని పర్యవేక్షించాలి.
గైడ్‌లైన్స్
-టీ&పీ సెల్ విద్యార్థులకు పరిశ్రమలు/సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ను ఏర్పాటుచేయాలి. 2,4,6,7వ సెమిస్టర్ లేదా ఏఐసీటీఈ/సంబంధిత విశ్వవిద్యాలయ నిబంధన ప్రకారం ఇంటర్న్‌షిప్‌పై కార్యక్రమాలను రూపొందించాలి.
ఏఐసీటీఈ అసిస్టెన్స్/ఫెసిలిటేషన్:
-దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఏఐసీటీఈ వివిధ సంస్థలు/మంత్రిత్వశాఖలతో, విదేశీ సంస్థలతో ఎంవోయూలను కుదుర్చుకుంది.
ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు
-ఇంటర్న్‌శాల, NETiit for internships in Taiwan, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, సీసీఈఐ-కొరియా, ఐఐడబ్ల్యూఎం-బెంగళూరు, ఈసీఐ, ఫోర్త్ ఆంబిట్, లింక్డ్ ఇన్, టీఎస్ఎస్సీ, స్కాలర్స్మెరిట్, ఎంఎస్ఎంఈ.
-మూల్యాంకనం: విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌పై సంస్థలు/పరిశ్రమలు, సైట్ విజిట్ చేసే ఫ్యాకల్టీ సూపర్వైజర్లు మూల్యాంకనం చేస్తారు. సంస్థలో సెమినార్, వైవా ద్వారా ఇంటర్న్‌షిప్ తీరును మదింపు చేస్తారు.
అదనపు అకడమిక్ గ్రేడ్లు
-అకడమిక్ గ్రేడ్లకు అదనంగా ఇంటర్న్‌షిప్‌లకు ఏఐసీటీఈ 100 పాయింట్లను కేటాయించనుం ది. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో పాయింట్లు కేటాయిస్తారు. లేటరల్ ఎంట్రీ ఇంజినీరింగ్ విద్యార్థులకు 75 పాయింట్లు నిర్దేశించారు. సామాజిక సే వ, తదితర కార్యాక్రమాలను ఇంజినీరింగ్ విద్యార్థులు 300-400 గంటలు. డిప్లొమా విద్యార్థులు 200 నుంచి 250 గంటలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది నాన్ క్రెడిట్ కార్యక్రమంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలి. స్థానిక పాఠశాలలో సేవలందించడం, గ్రామాల ఆర్థిక వనరులు పెం పొందించేందుకు ప్రణాళికలు సూచించడం, మంచినీటి సదుపాయాలు, టూరిజం ప్రమోషన్, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడం తదితర అంశాలను చేపట్టాలి.
కొత్త విధానంలో
-విద్యార్థులు కేవలం కాలేజీలకే పరిమితం కాకుం డా థియరీకి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపుదల, సంక్లిష్ట సమస్యల శోధన, సాధన, సామాజి క బాధ్యతలను చేపట్టడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ తదితరాలను నేర్చుకోవడం కొత్త ఇంటర్న్‌షిప్ లక్ష్యాలు.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
ఇంటర్న్‌షిప్ నుంచి ప్లేస్మెంట్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్‌లో ఇంటర్న్‌షిప్ గురించి ఆ సంస్థ డైరెక్టర్ మాటల్లో…
-విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంటర్న్‌షిప్‌నకు సంబంధించి సంస్థ ఏ కార్యక్రమం చేపట్టదు. ఇక్కడ విద్యార్థులే స్వతహాగా ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుని వారికి ఇష్టమున్న ఏరియాలు, కంపెనీలు, ప్రాంతాల్లో ఇంటర్న్‌షిప్ చేస్తుంటారు. తర్వాత దాన్నే ఎక్కువమంది ప్రాజెక్ట్‌గా చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ చదివే విద్యార్థుల్లో ఎక్కువమందికి ఇంటర్న్‌షిప్-ప్రాజెక్ట్ అనంతరం ఆయా కంపెనీలే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇటీవలికాలంలో ఒక ప్రముఖ కంపెనీలో రూ.47లక్షల సీటీసీకి నిట్ విద్యార్థికి అవకాశం కల్పించింది. నిట్‌లలో వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తుంటారు. ఆరో సెమిస్టర్ నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తారు. ఐఐటీల్లో కూడా ఇదే పద్ధతి ఉంది. నిట్‌లో చదివే విద్యార్థులకు ఆయా విషయాలపై సందేహాలు ఉన్నా, సహాయం కావాలన్నా సంబంధిత బ్రాంచీ లేదా ప్లేస్మెంట్ సెల్ వారు సహాయం చేస్తుంటారు