1. భారత్‌లో వేసవికాలం సంభవించడానికి కారణం?
1) సూర్యునికి భూమి దగ్గరగా వెళ్లడం
2) సూర్యునికి భూమి దూరంగా వెళ్లడం
3) ఉత్తరాయణంలోకి ప్రవేశించడం
4) భూమి దక్షిణాయణంలోకి ప్రవేశించడం
2. సూర్యగ్రహణానికి సంబంధించి సరైనది?
1) భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
2) భూమికి, చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు
3) భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యా మార్గంలో లేనప్పుడు
4) భూమి, సూర్యుని కక్ష్యా వర్తనంలో ఉన్నప్పుడు
3. మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యుని కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి?
1) భూమధ్య రేఖ 2) కర్కటరేఖ
3) మకరరేఖ 4) స్ట్రాటో ఆవరణం
4. కాంటినెంటల్ ట్రెయిడ్ అని వేటిని పిలుస్తారు?
1) ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా
2) ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా
3) ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా
4) ఆసియా, ఆఫ్రికా, యూరప్
5. ఆర్చ్పిలాగో అంటే?
1) అనేక ద్వీపకల్పాల సముదాయం
2) అనేక దీవుల సముదాయం
3) అనేక నదుల సముదాయం
4) అనేక సముద్రాల సముదాయం
6. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1) సర్ ఫ్రాన్సిస్ బేకన్ 2) జేడీ డానా
3) ఆల్ఫ్రెడ్ వెజ్నర్ 4) డుటోయిట్
7. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం దేని గురించి తెలుపుతుంది?
1) విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం
2) నక్షత్రాల గురించి
3) తోకచుక్కల గురించి 4) గ్రహణాల గురించి
8. శుక్ర గ్రహానికి సంబంధించి కిందివాటిలో ఏది అసత్యం?
1) ఇది అత్యంత ఉష్ణోగ్రత కలది
2) ఇది అత్యధిక భ్రమణకాలం గల గ్రహణం
3) దీన్ని ఈవినింగ్, మార్నింగ్‌స్టార్ అని పిలుస్తారు
4) అతి తక్కువ సాంద్రత ఉటుంది
9. కాంతి సంవత్సరం అనేది దేని ప్రమాణం?
1) కాలం 2) దూరం
3) కాంతి తరంగదైర్ఘ్యం 4) ద్రవ్యరాశి
10. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. క్రియాశీలక అగ్నిపర్వతం- బారెన్
బి. విలుప్త అగ్నిపర్వతం- కిలిమంజారో
సి. నిద్రాణ అగ్నిపర్వతం- ప్యూజియామా
డి. నిద్రాణ అగ్నిపర్వతం- క్రాకటోవా
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
11. వాతావరణంలో పొరల భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్ది ఆవరణాల క్రమం?
ఎ. స్ట్రాటో బి. ట్రోపో
సి. మిసో డి. థర్మో ఇ. ఎక్సో
1) ఎ, బి, సి, డి, ఇ 2) బి, సి, ఎ, డి, ఇ
3) బి, ఎ, సి, డి, ఇ 4) ఇ, డి, సి, ఎ, బి
12. నిమ్నమేఘం కానిది ఏది?
1) ఆల్టోస్ట్రాటస్ 2) స్ట్రాటో క్యుములస్
3) స్ట్రాటస్ 4) నింబో స్ట్రాటస్
13. వాతారణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి?
1) ఐనోస్పియర్ 2) ట్రోపోస్పియర్
3) స్ట్రాటోస్పియర్ 4) మిసోస్పియర్
14. వేసవిలో వేడి ధూళి కలిగిన గాలి సహారా ఎడారి నుంచి మధ్యదరా సముద్ర ప్రాంతానికి వీస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారు?
1) మిస్ట్రాల్ 2) చినూక్
3) శాంటాఅన్నా 4) సిరాకో
15. కిందివాటిని జతపర్చండి.
ఎ. టోర్నడోలు 1. ఉత్తర అమెరికా
బి. విల్లీవిల్లీలు 2. పశ్చిమపసిఫిక్
సి. టైపూన్లు 3. అరేబియా సముద్రం
డి. సైక్లోన్లు 4. దక్షిణ ఆస్ట్రేలియా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-2, బి-4, సి-1, డి-3
16. కిందివాటిలో సరికాని జత.
1) ఆల్ఫ్స్ పర్వతాలు- నవీన ముడుత పర్వతాలు
2) అట్లాస్ పర్వతాలు- పురాతన ముడుత పర్వతాలు
3) బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు- అగ్నిపర్వతాలు
4) పశ్చిమ కనుమలు- అవశిష్ట పర్వతాలు
17. కిందివాటిని జతపర్చండి.
ఎ. U ఆకారపు లోయ 1. సియాచిన్
బి. V ఆకారపు లోయ 2. హిమానీనద క్రమక్షయం
సి. హిమానీనదం 3. రెండు నదుల మధ్య విశాల ప్రాంతం
డి. దోఆబ్ 4. నదీక్రమక్షయం
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3
18. భూగోళం వేడెక్కడంలో కిందివాటిలో ఏ ప్రక్రియ జరుగుతుంది?
1) ఉష్ణవహనం 2) ఉష్ణసంవహనం
3) ఉష్ణవికిరణం 4) పైవన్నీ
19. దేశంలోని జంతుజాలాల్లో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నవి?
ఎ. ఘరియల్
బి. తోలుబొమ్మ తాబేలు సి. స్వాంప్డీర్
1) ఎ, బి 2) సి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు
20. కిందివాటిలో సరికాని జత?
1) వ్యతిరేక పరిభ్రమణం గల గ్రహం- యురేనస్
2) వేగవంతమైన భ్రమణ కాలం కలది- బృహస్పతి
3) నిమ్నగ్రహం- శుక్రుడు
4) అధమ గ్రహం- బుధుడు
21. ఉష్ణమండల సవన్నా ప్రాంతపు శీతోష్ణస్థితి లక్షణం ఏది?
1) ఏడాది అంతా వర్షపాతం
2) శీతాకాలంలో వర్షపాతం
3) ఎక్కువభాగం తక్కువ పొడికాలం
4) పొడి, తడికాలం
22. మిశ్రమ వ్యవసాయానికి సంబంధించి సరైన లక్షణం కలిగింది ఏది?
1) వాణిజ్య, ఆహార పంటలను కలిపిచేసే వ్యవసాయం
2) ఒకే నేలపై రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను కలిపి చేసే వ్యవసాయం
3) కొన్ని రకాల జంతువులను పెంచడం, పంటలను కూడా పండించడం 4) ఏదీకాదు
23. సునామీ, భూకంపాలు ఎప్పుడు ఏర్పడుతాయి?
1) ఉదయం 2) రాత్రి
3) మధ్యాహ్నం 4) ఎప్పుడైనా
24. కిందివాటిలో సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసేవి?
ఎ. భూ భ్రమణం బి. గాలి పీడనం, పవనం
సి. సముద్ర నీటిసాంద్రత డి. భూపరిభ్రమణం
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ, డి 4) బి, సి, డి
25. సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. కారణం?
ఎ. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్ది
వాతావరణం వేడెక్కడం
బి. వాతావరణం ఎక్కువ తేమను కలిగి ఉండటం
సి. వాతావరణంపై గాలి సాంద్రత తక్కువగా ఉండటం
1) ఎ 2) ఎ, సి 3) బి, సి 4) ఎ, బి, సి
26. కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి.
ఎ. గోండ్వానా శిలల్లో సహజ వాయువులు లభిస్తాయి
బి. ఖొడార్మా మైకాకు ప్రసిద్ధి
సి. దార్వార్ శిలలు పెట్రోలియం ఉత్పత్తులకు ప్రసిద్ధి
1) ఎ, బి 2) బి 3) బి, సి 4) ఏదీకాదు
27. కిందివాటిలో కోరల్ రీఫ్స్‌ను కలిగి ఉన్నవి?
ఎ. అండమాన్ నికోబార్ దీవులు
బి. గల్ఫ్ ఆఫ్ మన్నార్
సి. గల్ఫ్ ఆఫ్ కచ్ డి. సుందర్బన్స్
1) ఎ, బి, సి 2) బి, డి 3) ఎ, సి 4) పైవన్నీ
28. టర్కీ వేటి మధ్య ఉన్నది?
1) నల్లసముద్రం, మధ్యదరా సముద్రం
2) గల్ఫ్ ఆఫ్ సూయజ్, మధ్యదరా సముద్రం
3) గల్ఫ్ ఆఫ్ ఆబా, మృత సముద్రం
4) నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం
29. ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన నగరాలు దక్షిణం నుంచి ఉత్తరానికి వరుసగా?
ఎ. బ్యాంకాక్ బి. హనోయి
సి. జకర్తా డి. సింగపూర్
1) డి, బి, ఎ, సి 2) సి, బి, డి, ఎ
3) సి, డి, ఎ, బి 4) డి, సి, బి, ఎ
30. కింది వాటిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవహించే నదులు?
ఎ. బరాక్ బి. లోహిత్ సి. సుభనసరి
1) ఎ 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
31. ఒకేరకమైన ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోబార్స్ 2) ఐసో థర్మ్
3) ఐసో హైట్స్ 4) ఐసో హలైన్స్
32. భూమి సగటు ఆల్బిడో?
1) 30% 2) 45% 3) 47% 4) 35%
33. కొన్ని ప్రాంతాల వాతావరణంలో అత్యధిక వేగంతో ఎత్తుగా తిరిగే గాలి పంథాను ఏమంటారు?
1) జెట్ స్ట్రీమ్‌లు 2) రుతుపవనాలు
3) సైక్లోన్లు 4) ప్రతిసైక్లోన్లు
34. దేశంలో ఉత్పత్తి అయ్యే గోధుమలు తక్కువ నాణ్యతతో ఉండటానికి కారణం?
1) నీటిపారుదల సదుపాయాల కొరత
2) చలికాలంలో అధిక ఉష్ణోగ్రత
3) పరిపక్వపు కాలంలో ఉష్ణోగ్రత త్వరగా పెరగడం
4) ఏదీకాదు
35. మెర్క్యూరీని అధికంగా తయారుచేసే దేశం?
1) ఇటలీ 2) అమెరికా 3) కెనడా 4) స్పెయిన్
36. భారతదేశంలో అత్యంత పోటు-పాటులను ఎదుర్కొంటున్న ఓడరేవు?
1) విశాఖపట్నం 2) న్యూమంగళూరు
3) కాండ్లా 4) చెన్నై
37. ప్రపంచంలో అతి పొడవైన నది?
1) నైలు 2) అమెజాన్ 3) కాంగో 4) గంగ
38. ప్రపంచంలో అత్యంత లవణీయత గల సరస్సు?
1) వాన్ 2) ఊలార్
3) సుపీరియర్ 4) లోక్తక్
39. పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఒడంటాలజీ 2) మెటీరియాలజీ
3) మౌంటెనాలజీ 4) ఓరాలజీ
40. ప్రపంచ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది?
1) జకార్తా 2) హొనొలులు
3) హైదరాబాద్ 4) సుమత్రా
41. ప్రపంచ ప్రామాణిక రేఖ అని దేన్ని పిలుస్తారు?
1) 00ల రేఖాంశం
2) 1800ల తూర్పు/పశ్చిమ రేఖాంశం
3) 82 1/20ల తూర్పు రేఖాంశం
4) 900ల అక్షాంశం
42. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం?
1) కుమయాన్ పర్వతాలు 2) బారలాంచల్ కనుమ
3) షమ్యమ్ డంగ్ 4) నాథులా కనుమ
43. భారతదేశ రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేస్తున్న పవనాలు?
1) ఎల్‌నినో 2) లానినో 3) 1, 2 4) ఏదీకాదు
44. భూకంపాలు ఏర్పడటానికి ఏవి సంభవిస్తాయి?
1) అగ్నిపర్వతాల విస్ఫోటనం
2) భూ పలకల చలనం
3) పేలుడు పదార్థాల విస్ఫోటనం 4) పైవన్నీ