వేడిచేస్తే విచ్ఛిన్నమయ్యే విటమిన్ ఏది?
B3 విటమిన్
-గోల్డ్బర్గర్ అనే శాస్త్రవేత్త ఈ విటమిన్‌ను గుర్తించాడు. దీని రసాయన నామం- నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. దీన్ని సాధారణంగా యాంటీ పెల్లాగ్రా విటమిన్, గోల్డ్బర్గర్ కారకం అంటారు.
-ఇది పిండిపదార్థాలు, మాంసకృత్తులు, లిపిడ్ల జీవక్రియలో తోడ్పడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
-పెల్లాగ్రా వ్యాధి: మెడ, చేతులు, వేళ్ల వంటి భాగాల్లో చర్మం ఎర్రబారి ఎండిపోవడం, చీరుకుపోయి బొడిపెలు బొడిపెలుగా ఏర్పడటం ఈ
-నల్ల నాలుక వ్యాధి: ఇది కుక్కల్లో వస్తుంది.
B5 విటమిన్
-దీని రసాయన నామం ఫాంటోథెనిక్ ఆమ్లం. గ్రీకు భాషలో ఫాంటోథెనిక్ అంటే ప్రతిదాని నుంచి లభ్యమవుతుంది అని అర్థం.
-ఇది కూడా పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వుల జీవక్రియలో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆధార జీవక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
-కోడి పిల్లల ఈకలు ముతకగాను, పొట్టిగాను ఏర్పడుతాయి.
-పందుల్లో బాతు నడక అనే అవలక్షణం ఏర్పడుతుంది.
B6 విటమిన్
-దీని రసాయన నామం- పైరిడాక్సిన్. దీన్ని సాధారణంగా రక్తహీనత నిరోధక విటమిన్ (యాంటీ ఎనీమియా విటమిన్) అంటారు.
-ఇది కణజాలాల్లో నిల్వ ఉండదు.
-ఇది అమైనో ఆమ్లాల జీవక్రియలో, హీమోగ్లోబిన్ (Hb) తయారీలో, ప్రతిరక్షకాల తయారీలో తోడ్పడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధి
-రక్త హీనత (ఎనీమియా): ఇది మైక్రోసైటిక్ ఎనీమియా రకం రక్త హీనత.
B9 విటమిన్
-దీని రసాయన నామం ఫోలిక్ఆమ్లం లేదా పోలెట్.
-దీన్ని సాధారణంగా విటమిన్-ఎం అంటారు. ఇందులో ఐరన్ (Fe) మూలకం ఉంటుంది. దీన్ని వేడిచేస్తే నశిస్తుం ది. ఇది గర్భిణిలకు అవసరమైన విటమిన్.
-ఇది చురుకైన శుక్రకణాలు, అండాల ఉత్పత్తికి, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉత్పత్తికి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీల పరిపక్వతకు దోహదపడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
-మాక్రో సైటిక్ ఎనీమియా, లుకేమియా
-గర్భిణీల్లో దీనిలోపం వల్ల మానసికరుగ్మత గల శిశువులు జన్మిస్తారు.
B12 విటమిన్
-దీని రసాయన నామం- సయనోకోబాలమిన్. దీన్ని సాధారణంగా పెర్నీసియస్ ఎనీమియా ప్రతికూల విటమిన్ అంటారు. ఇందులో కోబాల్ట్ అనే లోహ మూలకం ఉంటుంది. ఇది రసాయనికంగా హీమ్ అణువులను పోలి ఉంటుంది.
-ఇది అమైనో ఆమ్లాల జీవక్రియల్లో, హీమోగ్లోబిన్ ఏర్పాటులో, ఆర్‌బీసీల పరిపక్వతకు తోడ్పడుతుంది. అంతేకాకుండా డీఎన్ఏ, మిథియోనిన్ తయారీలో కూడా అవసరమవుతుంది.
లోపంతో వచ్చే వ్యాధి
-పెర్నీసియస్ ఎనీమియా (హానికర రక్తహీనత): ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోయి అసాధారణ పెద్ద రక్త కణాలు ఏర్పడుతాయి.
విటమిన్ సీ
-దీన్ని జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీని రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీన్ని సాధారణంగా యాంటీ స్కర్వీ విటమిన్, స్లిమ్‌నెస్ విటమిన్, చవక విటమిన్ అంటారు. వేడిచేస్తే ఇది విచ్ఛిన్నం అవుతుంది.
లభించే పదార్థాలు
-ఇది సిట్రస్ ఫలాలు (నిమ్మజాతి), ఉసిరి (ఎక్కువగా ఉండే ఫలం), జామ (చవకగా అధికంగా లభించే పదార్థం), టమాటో, రేగు, చింత మొదలైన వాటిలో లభిస్తుంది. జంతుసంబంధ ఆహార పదార్థాల్లో లభించదు (పాలు, గుడ్లు, మాంసం మొదలైనవి).
-ఇది రక్తనాళాల జీవితకాలాన్ని పెంచుతుంది. గుండె లయ ను నియంత్రిస్తుంది.
-విరిగిన ఎముకలు అతికించడం, కోల్పోయిన బాగాలను తిరిగి ఏర్పరచడం, గాయాలను మాన్పడంలో తోడ్పడుతుంది.
-కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీలో, యాంటీ క్యాన్సర్ పదార్థంగా పనిచేస్తుంది.
-వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, Fe శోషణంలో తోడ్పడి రక్త ఉత్పత్తికి దోహదపడుతుంది.
-దేహంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
లోపంవల్ల వచ్చే వ్యాధులు
-స్కర్వి: పంటి చిగుళ్లు వాచి రక్తస్రావం జరుగుతుంది.
-ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగులుతుంది.
ఖనిజ మూలకాలు
-మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లతోపాటు విటమిన్లు, ఖనిజ మూలకాలు (మినరల్స్) కూడా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజ మూలకాలను సూక్ష్మపోషకాలు అంటారు. ఇవి సూక్ష్మ పోషకాలే అయినప్పటికీ జీవి జీవనక్రియలకు ఎంతో అవసరం.
-వీటిలో ఖనిజ మూలకాలు అనేవి దేహ నిర్మాణంలో, అభివృద్ధిలో పాలుపంచుకుంటాయి.
-ఇవి జీవులకు ఆహారం, నీటి ద్వారా లభ్యమవుతాయి.
-ఇవి జీవులు జీవన క్రియలను క్రమబద్ధంగా నిర్వర్తించుకోవడానికి క్రమతాసాధకాలుగా దోహదపడుతాయి.
-ఈ ఖనిజ మూలకాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
1. స్థూల మూలకాలు (Macro elements)
2. సూక్ష్మ మూలకాలు (Micro elements)
స్థూల మూలకాలు
-జీవికి ఎక్కువ మొత్తాల్లో అవసరమయ్యే ఖనిజ మూలకాలను స్థూల మూలకాలు అంటారు.
-ఇవి దేహ నిర్మాణ సంబంధమైన కణజాలాన్ని రూపొందించడంలో అవసరమవుతాయి.
ఉదా: సోడియం (Na), పొటాషియం (K), కాల్షియం (Ca), ఫాస్పరస్ (P), మెగ్నీషియం (Mg), సల్ఫర్ (S), క్లోరిన్ (Cl)
సూక్ష్మ మూలకాలు
-జీవికి తక్కువ మొత్తాల్లో అవసరమయ్యే ఖనిజ మూలకాలను సూక్ష్మమూలకాలు అంటారు.
-ఇవి ఎంజైమ్‌లలో ముఖ్యాంశాలుగా ఉంటాయి.
ఉదా: ఐరన్ (Fe), అయోడిన్ (I), కాపర్ (Cu), మాంగనీస్ (Mn), కోబాల్ట్ (Co), మాలిబ్డినమ్ (Mo), ఫ్లోరిన్ (F), క్రోమియం (Cr), సెలీనియం (Se), వెనేడియం (Ve), బోరాన్ (B)
కాల్షియం (Ca)
-కాల్షియం అయాన్లు కండరాలు, నాడుల పనితీరును క్రమపరుస్తాయి.
-రక్తస్కందన చర్యల్లో, దేహ ద్రవాల PH కాపాడటంలో ఇది విశిష్ట పాత్రను నిర్వర్తిస్తుంది.
-క్షీరదాల్లో గర్భధారణ, క్షీరోత్పత్తిలో ఉపయోగపడుతుంది.
-ఎముకలు, దంతాలు పటుత్వంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
-జీవుల్లో కర్పరాలు, ప్రవాళాల ఏర్పాటులో అవసరమవుతుంది.
-మొక్కల్లో వేరు, కాండాగ్రాల అభివృద్ధిలోను, కణత్వచ పారగమ్యతలో తోడ్పడుతుంది.
లోపం వల్ల వచ్చే సమస్యలు
-రికెట్స్ వ్యాధి: చిన్న పిల్లల్లో ఎముకలు మెత్తబారుతాయి.
-ఆస్టియో మలేసియా: పెద్ద వారిలో ఎముకలు పెలుసుబారుతాయి.
పిజియన్ చెస్ట్
-మొక్కల్లో గిడసబారుతనం, పుష్పాలు సుప్తావస్తలో ఉంటాయి.
ఫాస్పరస్ (P)
-జంతువుల్లో ఇది కాల్షియంతో కలిసి ఎముకలు, దంతాలు పటుత్వంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
-కేంద్రక ఆమ్లాల ఏర్పాటులో, ఫాస్పోలిపిడ్ల తయారీలో శక్తి నిల్వలలో దోహదపడుతుంది.
-ఇది మృత్తికలో మొక్కలకు ఫాస్పేట్ రూపంలో అందుతుంది.
-ఈ మూలకం లోపంవల్ల కాల్షియం లోపం వల్ల కలిగి అవలక్షణాలే ఉంటాయి.
సోడియం, పొటాషియం, క్లోరిన్ (Na, K, Cl)
-జంతు కణాల్లో ఈ మూడు అతిసన్నిహితంగా కలిసి ఉంటా యి.
-ఇవి శరీర ద్రవాల్లో కణజాల్లో అయాన్ల రూపంలో ఉంటా యి.
-ఇవి నాడీ ప్రచోదనానికి, శరీర ద్రవాల సమతుల్యతకు ఉపయోగపడుతాయి.
-Na, Kలు కార్బోహైడ్రేట్ల జీవక్రియలో తోడ్పడుతాయి.
-దేహం సక్రమంగా పెరగడానికి, కండరాలు క్రమబద్ధంగా పనిచేయడానికి పోటాషియం అవసరమవుతుంది.
-మొక్కల్లో పత్రరంధ్రాలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి తోడ్పడుతుంది.
-పొటాషియం ప్రొటీన్లు, ైగ్లెకోజన్ తయారీలో అవసరమవుతుంది.
-క్లోరైడ్ అయాన్ జఠర ద్రవంలో Hcl తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
-నీటిలోకి క్లోరిన్ వాయువును పంపి సూక్ష్మ జీవులను చంపే క్లోరినేషన్ ప్రక్రియలో ఉపయోగపడుతుంది.
వీటి లోపంతో వచ్చే సమస్యలు
-సోడియం లోపం వల్ల కండర కొంకర్లు, వికారం, తలనొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
-పొటాషియం లోపం వల్ల మానవుల్లో నరాల బలహీనత, కండరాలు పట్టు తప్పడం వంటి లక్షణాలు కనబడుతాయి.
-క్లోరైడ్ లోపం వల్ల పందుల వంటి జంతువుల్లో దేహ బరువు తగ్గడం, నరాల ఉద్రిక్తత అధికమవడం వంటి సమస్యలు కలుగుతాయి.
-పాలిచ్చే జంతువులకు తగినంత NaCl సమకూరకపోతే పాలదిగుబడి తగ్గుతుంది.
B7 విటమిన్
-దీన్ని బయోటిన్ అనికూడా పిలుస్తారు. దీన్ని సాధారణంగా విటమిన్-H, కో ఎంజైమ్-R అనికూడా అంటారు. ఇందులో సల్ఫర్ మూలకం ఉంటుంది.
-ఇది ముఖ్యంగా అమైనో ఆమ్లాల జీవక్రియలో తోడ్పడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
-తెల్లసొన గాయం (Egg white injury): పచ్చి కోడిగుడ్డు తెల్లసొనలో అడ్విన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఉడికించిన స్థితిలో అడ్విన్ ప్రొటీన్‌గా రూపాంతరం చెందుతుంది. అయితే పచ్చి (ఉడకని) కోడి గుడ్డు తినేవారిలో తెల్లసొనలోని అడ్విన్ ప్రొటీన్ జీవిలోని బయోటిన్ విటమిన్‌తో సంయోగం చెందడం వల్ల బయోటిన్ లోపించి అలసట, కండరాల నొప్పులు, ఆకలి క్షీణించడం లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. దీన్నే తెల్లసొన గాయం అంటారు.
-దేహంలో ఎక్కువగా ఉండే లోహ మూలకం- కాల్షియం (Ca)
-దేహంలో తక్కువగా ఉండే లోహమూలకం- మెగ్నీషియం (Mg)
-దేహంలో అధికంగా ఉండే మూలకం- కార్బన్ (C)
-దేహంలో అధికంగా ఉండే వాయువు- ఆక్సిజన్ (O2)
-మాంసంలో అధికంగా ఉండే లోహ మూలకం- పొటాషియం (K)
-మానవ రక్తంలో అధికంగా ఉండే లోహం- ఇనుము (Fe)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు