దేశంలో ప్రాజెక్టులు.. వ్యతిరేక ఉద్యమాలు
జాతీయ పునరావాస విధానం
-దేశంలో అభివృద్ధి సాధించడానికి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు విద్యుత్ తయారీ, గనుల తవ్వకం, కొత్త పట్టణాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాల అమలుకోసం అవసరమైన భూమిని సేకరించేటప్పుడు అక్కడ నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. ఇలా ఆర్థికాభివృద్ధి దృష్ట్యా ప్రజలను తమ స్థలాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని అభివృద్ధి ప్రేరిత స్థానభ్రంశం అని లేదా అభివృద్ధి కోసం స్థానభ్రంశం అని అంటారు.
-సాయుధ పోరాటాలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ హక్కులకు భంగం కలగడం వల్ల హింస, మానవ ప్రేరిత విధ్వంసాలు మొదలైన కారణాలతో ప్రజలు తమ మాతృప్రాంతాలను వదిలివెళ్లడం లేదా వెళ్లేలా చేయడాన్ని అభివృద్ధేతర స్థానభ్రంశం అంటారు.
-దేశంలో ఎక్కువగా కనబడుతున్న స్థానభ్రంశం అభివృద్ధి పేరిట స్థానభ్రంశం. ఇది 4 రకాలు..
1.రాజకీయ కారణాలు, వేర్పాటువాద ఉద్యమాలు
ఉదా: నాగా ఉద్యమం, అసోం ఉద్యమం వల్ల జరిగే స్థానభ్రంశం
2. స్థానిక హింసా ప్రేరిత స్థానభ్రంశం
ఉదా: కుల విభేదాలు, మతతత్వం వల్ల జరిగే స్థానభ్రంశం
3. గుర్తింపు ఆధారిత స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు
4. పర్యావరణ అభివృద్ధి స్థానంభ్రంశం
ఉదా: పోలవరం నిర్మాణం, కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల రక్షిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల జరిగిన గిరిజనుల స్థానభ్రంశం
-2013 డిసెంబర్లో పార్లమెంటు సెక్రటరీ విడుదల చేసిన డిస్ప్లేస్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ పీపుల్ డ్యూ టూ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనే పుస్తకంలో 20.8 మిలియన్ల మంది అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు.
-ఇందులో నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల- 16.4 మిలియన్లు
-గనుల తవ్వకం వల్ల- 2.25 మిలియన్లు
-పారిశ్రామికాభివృద్ధి వల్ల- 1.25 మిలియన్లు
-వన్యప్రాణి సంరక్షణ, జాతీయ పార్కుల వల్ల- 0.6 మిలియన్లు
-నీటిపారుదల జలవిద్యుత్ కోసం నిర్మించే భారీ ప్రాజెక్టులు అభివృద్ధి ప్రేరిత స్థానభ్రంశానికి ప్రధాన కారణాలు. దేశంలో 3300 ప్రాజెక్టులు స్వాతంత్య్రానంతరం నిర్మించారు. వీటివల్ల నిరాశ్రయులయ్యేవారిలో ఎక్కువ శాతం గిరిజన ప్రజలే ఉన్నారు.
నీటిపారుదల స్థానభ్రంశ పునరావాస ఉద్యమాలు
తెహ్రీ డ్యాం వ్యతిరేక ఉద్యమం
-ఈ డ్యాంను నిర్మించాలని 1949లో ప్రతిపాదించారు.
-భగీరథి, భలంగీన్.. నదుల సంగమం వద్ద ఈ డ్యాం నిర్మాణం ప్రారంభించారు. దీని సామర్థ్యం 3500 మె.వా.
-ఈ ఉద్యమంలో సుందర్‌లాల్ బహుగుణ పాల్గొన్నారు.
-ఈ డ్యాం వ్యతిరేకతకు కారణాలు..
1. భూకంపాన్ని తట్టుకోలేకపోవడం
2. దీనివల్ల అడవులు, జీవవైవిధ్యం నశించడం
3. అనేక గ్రామాలు, పట్టణాలు ముంపునకు గురికావడం
-దీని నిర్మాణానికి వ్యతిరేకంగా 1985లో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది.
కోయెల్ కరో ఉద్యమం
-ఇది జార్ఖండ్‌లోని కోయెల్ కరో బేసిన్లో జరిగింది.
-ముండా, ఒవరాన్ అనే తెగలు కోయెల్ కరో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాయి. ఇందులో కోయెల్ కరో జన్ సంఘర్షణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ పాల్గొన్నది.
-ఈ సంస్థ కాయ్ రఖో ఆందోళన్ అనే నినాదం ఇచ్చింది.
-అటవీ ప్రాంతం ముంపునకు గురికావడం, పునరావాస సమస్య, ఆ ప్రాంతంలో పవిత్ర స్థలాలు ఉండటం ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలు.
కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు
-రష్యా సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది.
-దీన్ని 2002లో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ప్రారంభించారు.
-ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు అందిస్తారు.
కారణాలు
1. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అక్కడున్న స్థానికులను తరలించే ప్రక్రియవల్ల కలిగే నష్టం.
2. మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోవడం
3. ప్రాజెక్ట్ నిర్మాణంతో పర్యావరణానికి హాని
సోంపేట ఉదంతం
-నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షతో 2009, డిసెంబర్ 5న ఈ ఉద్యమం ప్రారంభమైంది.
-ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట… కమిటీ కింతరి…. మండల్లాల్లోని సారవంతమైన భూములను థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఇచ్చింది.
కారణాలు
1. ఈ ప్రాజెక్టు వల్ల అనేక పక్షి, వృక్ష జంతుజాతుల ఉనికి ప్రశ్నార్ధకమయ్యే అవకాశం
2. వ్యవసాయదారులు, మత్స్యకారులు, చేతివృత్తులవారు జీవనోపాధి కోల్పోవడం
మహా ముంబై సెజ్
-ఈ సెజ్‌కు సంబంధించి భూసేకరణను చేపట్టారు.
-మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో 14వేల హెక్టార్ల విస్తీర్ణంలో మహాముంబాయి సెజ్ అనే మల్టీ సర్వీసు సెజ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
-ఇదంతా ఆదివాసి, కట్కూరి తెగలు, మత్స్యకారులు నివసిస్తున్న ప్రాంతం, అక్కడ వ్యవసాయం, ఉప్పు ఉత్పత్తి జరుగుతున్నది.
-రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ తాలూకాకు చెందిన 22 గ్రామాలు ఈ సెజ్ పరిధి నుంచి మినహాయించాలని ఉద్యమం చేశాయి.
-2008లో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 2/3వ వంతు రైతులు భూసేకరణను వ్యతిరేకించారు.
కారణాలు
-భూమిని కోల్పోయిన స్థానికులకు సెజ్‌ల అభివృద్ధిలో భాగస్వామ్యం లేకపోవడం
-ప్రైవేటు భూములను బలవంతంగా తీసుకోవడం
గుంతి హైడల్ వ్యతిరేక ఉద్యమం
-ఈ ప్రాజెక్టును 1974లో త్రిపురలో గుంతి నదిపై 8.6 మె.వా. లక్ష్యంతో నిర్మించారు.
-40వేల మంది గిరిజనులు ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యారు.
-ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో నీటి కొరతవల్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు.
-ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన గిరిజనులు దీన్ని రద్దుచేసి తమ భూములను తిరిగి ఇవ్వాలని ఉద్యమం చేపట్టారు.
ముల్షి డ్యాం ఉద్యమం
-ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ చేపట్టాలని నిర్ణయించారు.
-దీనివల్ల 11వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు.
-వీరంతా దేశంలోనే తొలిసారిగా 1927లో ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ ప్రాజెక్టులు
భూసేకరణ- నిరసనలు
-గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన భట్టాపర్సల్ గ్రామస్థులు 2011లో అప్పటికే చేపట్టిన ప్రాజెక్టు భూసేకరణకు తీవ్ర నిరసన చేపట్టారు.
-యమునా ఎక్స్‌ప్రెస్ వే (2001), గంగా ఎక్స్‌ప్రెస్ వే, కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజక్టులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు జరిగాయి.
-భట్టాపర్సల్ గ్రామ నిరసనకు సంబంధించి ప్రదీప్‌సింగ్, అభిషేక్ కుమార్‌లు తీసిన డాక్యుమెంటరీ రష్డ్ డ్రీమ్స్.
పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
-ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని ఖమ్మం, గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
కారణాలు:
1. రెండు నుంచి నాలుగు లక్షల మంది ప్రజలు ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్నారు. వీరిలో గిరిజనులే అధికం.
2. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 276 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
3. కొందరు పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు.
అసోం హైడల్ వ్యతిరేక ఉద్యమం
-ఈ ప్రాజెక్టును అసోం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని గెరుఖాముఖ్ ప్రాంతంలో 2వేల మె.వా. జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు.
-దీంతో వేలమంది ప్రజలు నిర్వాసితులై తమ జీవనోపాధిని కోల్పోయారు
-కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి సంస్థ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది.
నర్మదా బచావో
– 1985: ఈ ఉద్యమం మన దేశంలో జరిగిన అతిపెద్ద, విజయవంతమైన పర్యావరణ ఉద్యమం.
-నర్మదా నదిపై నిర్మిస్తున్న పెద్ద పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ఆదివాసీలు, మానవ హక్కుల కార్యకర్తలు, రైతులు సమష్టిగా చేపట్టారు.
-ఆదివాసీలు నిర్వాసితులు కావడం, అటవీ ప్రాంతాలు ముంపునకు లోనవడం ఈ ఉద్యమాలు చేయడానికి ప్రధాన కారణాలు..
-మేథా పాట్కర్ నర్మదా బచావో ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ సామాజిక కార్యకర్త.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు