Indian island | భూమధ్య రేఖకు దగ్గరున్న భారతదేశ దీవి
ఆసియాలోని ముఖ్యమైన సింధుశాఖలు
– గల్ఫ్ ఆఫ్ ఎడెన్: ఇది హిందూ మహాసముద్రానికి పశ్చిమాన ఏర్పడింది. సోమాలియా (ఆఫ్రికా), యెమన్‌కు మధ్య ఉన్నది.
– గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్: ఇది హిందూ మహాసముద్రానికి తూర్పున ఉన్నది. థాయ్‌లాండ్, కాంబోడియా దేశాలను వేరుచేస్తున్నది.
– పర్షియన్ గల్ఫ్: ఇది హిందూ మహాసముద్రానికి వాయవ్యాన ఏర్పడింది. ఇరాన్ పీఠభూమి, సౌదీ అరేబియాకు మధ్య ఉన్నది.
– గల్ఫ్ ఆఫ్ ఓబ్ : ఇది ఆర్కిటిక్ మహాసముద్ర మూలన ఏర్పడింది. యమాల్-గైడా ద్వీపకల్పాల మధ్య ఉన్నది.
– గల్ఫ్ ఆఫ్ టాన్‌కిన్: ఇది దక్షిణ చైనా సముద్రానికి వాయవ్య దిశలో ఏర్పడింది. చైనా, వియత్నాం మధ్య ఉన్నది.
– గల్ఫ్ ఆఫ్ పో ఆమ్: ఇది పసుపు సముద్రానికి వాయవ్య దిశలో ఉంది. ఉత్తర కొరియా, చైనాల మధ్య ఉంది.
– భారత్, శ్రీలంక మధ్య మన్నార్ సింధుశాఖ (గల్ఫ్ ఆఫ్ మన్నార్) ఉన్నది.
– మన్నార్ సింధుశాఖ: ఇది బంగాళాఖాతం, అరేబియా శాఖల్లో ఉంది. ఇది రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జికి దక్షిణాన ఉన్నది. నాగర్ కోయల్ (తమిళనాడు) నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు విస్తరించి ఉంది.
– ప్రపంచంలో అతిపెద్ద సింధుశాఖ- మెక్సికో సింధుశాఖ
సింధుశాఖ
– ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని సింధుశాఖ అంటారు.
ఆసియాలో కొన్ని ముఖ్యమైన జలసంధులు..
– టార్ టార్ జలసంధి: ఇది జపాన్ సముద్రానికి ఉత్తర భాగంలో ఉన్నది. రష్యా, సకాలిన్ దీవులను వేరు చేస్తుంది. ఇది ప్రపంచంలో పొడవైన జలసంధి.
– తైవాన్ జలసంధి: ఇది తైవాన్, చైనాను వేరుచేస్తున్నది. తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రాలను కలుపుతున్నది.
– ప్రపంచంలో వెడల్పైన జలసంధి- డేవిస్ జలసంధి. ఇది గ్రీన్లాండ్, కెనడాలను వేరుచేస్తుంది.
– మలక్కా జలసంధి: మలయా ద్వీపకల్పాన్ని సుమత్రా దీవుల నుంచి వేరుచేస్తున్నది. ఇది జావా సముద్రాన్ని బంగాళాఖాతంతో కలుపుతున్నది.
– హర్మోజ్ జలసంధి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇరాన్‌ను వేరు చేస్తుంది. పర్షియన్ సింధుశాఖను ఒమన్ సింధు శాఖతో కలుపుతుంది.
– బాస్పరస్ జలసంధి: ఇది ఆసియాను యూరప్‌ను వేరు చేస్తుంది. నల్ల సముద్రాన్ని, మర్మరా సముద్రాన్ని కలుపుతున్నది.
– భారత్, శ్రీలంకల మధ్య పాక్ జలసంధి ఉన్నది (పాక్ స్ట్రెయిట్)
– బేరింగ్ జలసంధి: ఇది ఆసియా, ఉత్తర అమెరికా ఖండాలను వేరుచేస్తుంది. తూర్పు సైబీరియాను బేరింగ్ సముద్రాన్ని కలుపుతుంది.
– జలసంధి: రెండు సముద్రాలను కలిపే ఇరుకైన మార్గాన్ని జలసంధి అంటారు.
– పాక్ జలసంధి: ఇది బంగాళాఖాతంలో ఉన్నది. రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌కి ఉత్తరాన ఉన్నది. ఇది ఇండియా పాయింట్ కొడుక్కిరామ్ నుంచి శ్రీలంకలోని పిడ్మౌంట్ వరకు విస్తరించి ఉంది.
దీవులు
– నాలుగు వైపులా నీరు ఉండి లేదా చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉన్న భూస్వరూపమే దీవి.
– ఆసియాలోని ముఖ్యమైన దీవులు
– పెరియంటియన్ దీవి- మలేసియా
– పొం పొం దీవి- మలేసియా
– సిమిలియన్ దీవి- థాయ్‌లాండ్
– కొరండగ్ దీవి- కాంబోడియా
– క్యాట్ బో దీవి- వియత్నాం
– పాలవాన్ దీవి, సెబూ దీవి- ఫిలిప్పీన్స్
– అండమాన్ నికోబార్ దీవి- భారత్
– లక్ష్యదీవులు- భారత్
ముఖ్యమైన దీవి దేశాలు
– జపాన్: ఇది తూర్పు దేశ దీవి. పసిఫిక్ మహాసముద్రంలో ఆసియా ఖండానికి తూర్పు తీరంగా ఉన్నది. 6,852 దీవుల సముదాయమైన ఈ దీవికి పశ్చిమాన జపాన్ సముద్రం, ఉత్తరాన ఓకొట్స్కా సముద్రం, దక్షిణాన తూర్పు చైనా సముద్రం ఉన్నాయి.
– అనేక దీవుల సముదాయాన్ని ఆర్చ్పెలాగో అంటారు.
– శ్రీలంక: ఇది బంగాళాఖాతంలో ఉన్నది. ఈ దీవిని పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖలు ఆసియా ఖండం భూభాగం నుంచి వేరుస్తున్నాయి.
– ఇండోనేషియా: ఆసియా ఖండానికి ఆగ్నేయ దిశలో హిందూ మహాసముద్రంలో ఉన్నది. ప్రపంచంలో పొడవైన దీవి దేశం. ఇది 13500 దీవుల సముదాయం. ఇక్కడ ఉన్న జావా దీవి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దీవి. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో.
– ఫిలిప్పీన్స్: ఈ దీవి పశ్చిమ పసిఫిక్ మహసముద్రంలో ఉంది. దీనికి పడమరన దక్షిణ చైనా సముద్రం, దక్షిణాన సెలబేసి సముద్రం, ఉత్తరాన తూర్పు చైనా సముద్రం ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఐదో పొడవైన తీరరేఖగల దేశం. ఇది 7641 దీవుల సముదాయం.
– మాల్దీవులు: ఇది అరేబియా సముద్రంలో భారతదేశానికి నైరుతి దిశలో ఉంది. ఆసియా ఖండంలో జనాభా, వైశాల్యం దృష్ట్యా అతి చిన్నది. ఇందులో 1192 కోరల్ దీవులు ఉన్నాయి.
– సింగపూర్: ఇది ఆగ్నేయాసియా ద్వీపకల్ప దీవిగా ఉంది (మలేసియా ద్వీపకల్పం, ఇండోనేషియా రై దీవుల మధ్య). ఈ దీవి చుట్టూ 62 చిన్న దీవులు ఉండి, సింగపూర్ పెద్ద దీవిగా ఉన్నది.
– తూర్పు తైమూర్: ఇది ఆగ్నేయాసియా దేశంగా ఉన్నది.
– తైవాన్: ఇది అధికారికంగా చైనా రిపబ్లిక్లో ఉన్నది. చైనాకు సుమారు 180 కి.మీ. దూరంలో ఉన్నది.
– బ్రూనై దారుస్సాలామ్: ఇది బ్రూనై దేశపు దీవిగా ఆసియా ఖండానికి ఆగ్నేయాన దక్షిణ చైనా సముద్రంలో ఉన్నది. దీనికి మూడు వైపుల మలేసియాకు చెందిన సర్వాక్ రాష్ట్రం ఉన్నది. ఉత్తరాన, దక్షిణాన సముద్రం ఉన్నది.
ఇతర దీవులు
– కురైల్ దీవులు: ఇవి కామ్చెట్కా ద్వీపకల్పానికి, జపాన్‌లోని హొక్కైడో దీవులకు మధ్య ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో జపాన్, రష్యాకు మధ్య ఉన్న వివాదాస్పద దీవులు.
– న్యూ సైబీరియన్ దీవులు: ఇవి రష్యాకు ఉత్తరాన ఉన్నా యి. ఆర్కిటిక్, తూర్పు సైబీరియన్ సముద్రాల మధ్య ఉన్నాయి.
– ప్రాంగల్ దీవులు: ఇవి తూర్పు సైబీరియా సముద్రానికి ఆర్కిటిక్ మహా సముద్రానికి మధ్యలో ఉన్నాయి.
– స్పార్పీ, పార్సెల్ దీవులు: ఇవి పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా, దక్షిణ చైనా సముద్రంలో ఉన్నాయి. చైనా, వియత్నాం, మలేషియా, తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై దేశాల మధ్య ఉన్న వివాదాస్పద దీవులు. ఈ దీవుల భూతలంపై చమురు నిల్వలు అధికంగా ఉండటమే దీనికి కారణం.
– చిన్నదీవి- బెట్రా దీవి (0.12 చ.కి.మీ.)
భారత్‌లో దీవులు
– దేశంలో రెండు రకాల దీవులు ఉన్నాయి. అవి లక్ష ద్వీప దీవులు, అండమాన్ నికోబార్ దీవులు.
లక్ష ద్వీప దీవులు
– ఇవి భారత్‌కు పశ్చిమ తీరంలో, మాల్దీవులకు నైరుతి దిశలో, అరేబియా సముద్రంలో ఉన్నాయి. 32 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉన్న దీవుల్లో మొత్తం 36 దీవులు ఉన్నాయి. వీటిలో 10 మాత్రమే జన నివాసానికి అనుకూలమైనవి. ఇవి పగడపు దీవులు (ప్రవాళ బిత్తికలు).
– పరలి-1 అనే దీవి ఇటీవల అరేబియా సముద్రంలో అంతర్ధానమైంది.
– ఇవి 80N నుంచి 12020N, 71045E నుంచి 740Eల మధ్య విస్తరించి ఉన్నాయి. రాజధాని అయిన కవరత్తి కన్ననూర్ ద్వీపసముదాయంలో ఉన్నది. ఇది ఎర్నాకులం (కేరళ) హైకోర్టు పరిధిలో ఉన్నది. ఇక్కడ అత్యధికులు ముస్లింలు.
– ఇవి జంతు, వృక్ష జాతులకు ప్రసిద్ధి. పిట్టిలో పక్షి సంరక్షణ కేంద్రం ఉన్నది.
– లక్ష ద్వీప దీవులను 80 అక్షాంశరేఖ- మినికాయ్ దీవిని, మాల్దీవులను వేరు చేస్తుంది.
– 900 అక్షాంశ రేఖ- మినికాయ్ దీవి, సుహేలి దీవులను వేరుచేస్తుంది.
అండమాన్, నికోబార్ దీవులు
– ఇవి భారత్‌కు తూర్పు తీరంలో ఆగ్నేయదిశలో బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి.
– 8249 చ.కి.మీ. వైశాల్యంలో ఉన్న ఈ దీవులు 6045N నుంచి 13045N, 92010E నుంచి 94015Eల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇది అత్యధిక వైశాల్యం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం.
– దక్షిణ అండమాన్‌లో ఉన్న పోర్ట్‌బ్లేయిర్ దీని రాజధాని. ఇది పశ్చిమబెంగాల్ హైకోర్టు పరిధికి చెందుతుంది.
– అండమాన్ వైశాల్యం 6596 చ.కి.మీ., నికోబార్ వైశాల్యం 1653 చ.కి.మీ.
– ఇక్కడి ప్రధాన దీవులు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా… ఉత్తర అండమాన్ (నార్త్ అండమాన్), మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్, కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్ దీవులు.
– ఇవి అగ్ని సంబంధ దీవులు. దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతమైన బారెన్ అగ్నిపర్వతం మధ్య అండమాన్‌లో ఉన్నది.
– హిందూ మహా సముద్రంలో అమెరికా సైనిక స్థావరం- డిగో గార్షియా
– దేశంలోని విలుప్త (నిద్రాణ) అగ్నిపర్వతం నార్కొండమ్ ఉత్తర అండమాన్‌లో ఉన్నది.
– అండమాన్ నికోబార్ దీవుల్లో జరవాలు అనే ఆదివాసీలు (దక్షిణ అండమాన్) ఉంటారు. గ్రేట్ నికోబార్‌లో నికొబరీస్, సెంటినలీస్, షాంపేన్లు ఉంటారు.
– ఇక్కడ 36 మ్రాతమే నివాస యోగ్యమైన దీవులు.
– వీటి దగ్గరగా చెన్నై, కోల్‌కతా నగరాలు, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలున్నాయి.
ప్రధానాంశాలు
– ఉత్తర అండమాన్‌లో నార్కొండమ్, మిడిల్ అండమాన్‌లో బారెన్, దక్షిణ అండమాన్‌లో కవరత్తి ఉన్నాయి.
– డంకన్ కనుమ- లిటిల్ అండమాన్, దక్షిణ అండమాన్ దీవులను కలుపుతుంది.
– సొంబ్రె చానల్- లిటిల్ నికోబార్, కచ్చటపు దీవులను కలుపుతుంది.
– కొకొ చానల్- ఉత్తర అండమాన్, కొకో దీవులను (మయన్మార్) కలుపుతుంది.
– 100 అక్షాంశ రేఖ- లిటిల్ అండమాన్, కార్ నికోబార్ దీవుల మధ్యగా వెళ్తున్నది.
– గ్రేట్ చానల్- గ్రేట్ నికోబార్ దీవులు, సుమత్రా దీవులను (ఇండోనేషియా) కలుపుతుంది.
– గ్రేట్ నికోబార్ దీవుల్లోని ఇందిరాపాయింట్ (పిగ్మాలియన్ పాయింట్) భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరిది.
– గ్రేట్ నికోబార్ దీవులు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ దీవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు