తెలంగాణ ఉద్యమచరిత్ర – తెలంగాణ పోరాట మూలాలు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసి ఆంధ్రనాయకుల ఒత్తిడికి లొంగి, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలన్న ఎస్ఆర్సీ సిఫారసులను కూడా బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. పెద్ద మనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉల్లంఘించారు. ఆంధ్రనాయకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని లెక్కచేయలేదు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యమబాట పట్టారు.
1958 ప్రారంభంలో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు, పెద్దమనుషుల ఒప్పంద ఉల్లంఘన, ప్రాంతీయ కమిటీ ఏర్పాటులో ఆలస్యం తదితర అంశాలపై పోరాటడానికి రాజకీయాలకు అతీతంగా పెద్దలంతా కలిసి తెలంగాణ మహాసభ వేదికను ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నరలోపే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవని నిర్ణయానికి వచ్చి తెలంగాణను వేరుచేయాలని కోరుతూ రాష్ట్రపతికి 1958లోనే తెలంగాణ మహాసభ విజ్ఞప్తి చేసింది. అయినా అన్యాయాలు, పెద్దమనుషుల ఒప్పంద ఉల్లంఘనలు అదేవిధంగా కొనసాగుతుండటంతో 1961లో ప్రధాని నెహ్రూకు, 1967లో హైదరాబాద్ సందర్శించిన నాటి ఉపరాష్ట్రపతి వీవీ గిరికి తెలంగాణ మహాసభ వినతిపత్రం సమర్పించింది.
సుప్రీం కోర్టు తీర్పులను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ సిఫారసులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీఓ), తెలంగాణ రక్షణల యూనియన్ (తెలంగాణ సేఫ్ గార్డ్స్) అమలు కోసం 1968 జూలై నుంచి శ్రీకారం చుట్టింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు