భక్తి ఉద్యమం భారత సమాజం
భారతదేశ సంస్కృతిపై ఇస్లాం మత ప్రభావం
అరబ్బుల దండయాత్రతో ప్రారంభమైన ఇస్లాం ఆగమ నం భారతీయ సంస్కృతిలోని పలు అంశాలపై ప్రభావం చూపింది. దీని ప్రభావం ముఖ్యంగా మత, సామాజిక, సాంస్కృతిక రంగాలపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మతపరంగా హిందూ, వేదాంత, సంగీత సంప్రదాయాలను ఇస్లాం గ్రహించినప్పటికీ మతం పేరుతో హిందూ సమాజంలో ఉన్న అసమానతలను, విగ్రహారాధన, బహుదేవతారాధనను ఇస్లాం ఖండించింది. ఫలితంగా హిందూ మతంలో సంస్కరణ వాదంతో కూడుకున్న భక్తి ఉద్యమం మొదలవడానికి ఇస్లాం ప్రత్యక్ష కారణమైంది.
ఇస్లాం రాకతో బౌద్ధం పూర్తిగా దెబ్బతిన్నది. భక్తియార్ ఖిల్జీ 1197లో చేసిన బీహార్, బెంగాల్ ఆక్రమణలో రక్షణలేని కారణంగా బౌద్ధం నేపాల్‌కు వలసపోయింది.
మతపరంగా అశాంతికి, ఆందోళనకు, సంక్షోభానికి కూడా ఇస్లామే కారణమైంది. హిందూ దేవాలయాల విధ్వంసం, మత మార్పిడులు, హిందువులపై అరాచకాలు చోటు చేసుకున్నాయి.
తత్వం పరంగా ఇస్లాం రూపంలేని దేవుడి గురించి, సామాజిక సమానత్వాన్ని చాటడంవల్ల నిర్గుణ భక్తి బహుళ ప్రచారంలోకి వచ్చింది.
సామాజిక రంగంలోనూ ఇస్లాం తన ప్రభావాన్ని చూపింది. భారతీయుల వస్త్రధారణలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. పొడగాటి వస్ర్తాలు, పైజామాలు, కుర్తాలు ధరించడం, ఆహారానంతరం పాన్ నమలడం, హుక్కా పీల్చడం వంటి అలవాట్లు ప్రవేశించాయి. అదేవిధంగా ముస్లింలు బురఖా ధరించే సాంప్రదాయం నుంచి హిందువుల పరదా విధానం ప్రారంభమైంది.
సామాజిక రంగంలో ఇస్లాం ఆగమనంతో పట్టణీకరణ ఊపందుకుంది. విదేశీయులుగా ముస్లింలు పట్టణాల్లో స్థిరపడటానికి ఇష్టపడటంతో పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందింది.
రాజకీయ రంగంలోనూ ఇస్లాం గొప్ప మార్పులకు కారణమైంది. భారతదేశ చరిత్రలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడటం, అప్పటి వరకు కొనసాగిన బలమైన హిందూ రాజ్యాల అంతానికి దారితీసింది. హిందూ సంస్కృతిని, ధర్మాన్ని కాపాడటానికి 1336లో విజయనగర సామ్రాజ్యం ఏర్పడటంలోనూ శివాజీ మరాఠా ఉద్యమం ప్రారంభించి చివరకు స్వరాజ్యం స్థాపించడంలోనూ ఇస్లాం ప్రభావం కనిపిస్తుంది.
ఇస్లాం ప్రభావం సాంస్కృతిక రంగంలో అంటే వాస్తు, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాస్తు పరంగా ముస్లింల వాస్తు శైలిలోని గుమ్మటాలు, కమాన్లు, ఎత్తయిన కట్టడాలు, విశాలమైన ప్రవేశ ద్వారాలు వంటి వాస్తు సంప్రదాయాలను హిందువులు గ్రహించారు. ఇండో-ఇస్లామిక్ వాస్తు శైలి అభివృద్ధి చెందింది.
సంగీతపరంగా ముస్లింలు సారంగి, షెహనాయ్, రహాబ్ వంటి వాయిద్యాలు, ప్రవేశపెట్టారు. హిందువుల నుంచి నాదస్వరం, మృదంగం వంటి వాయిద్యాలు గ్రహించారు. ఫలితంగా హిందుస్థాన్ అనే మిశ్రమ సంగీత సంప్రదాయం అభివృద్ధి చెందింది.
చిత్రలేఖనంలో భాగంగా ఘనమైన పర్షియన్ శైలితో కూడిన చిత్రలేఖనం భారతదేశంలోకి ప్రవేశించింది.
సాహిత్య రంగంలో ఇస్లాం ఆగమనంతో పర్షియన్, హిందీ భాషల కలయికవల్ల దక్కనీ లేదా ఉర్దూ ఒక ప్రత్యేక భాషగా అభివృద్ధి చెందింది.
స్వీయ చరిత్రలో, ప్రాంతీయ చరిత్రలో, రోజువారీ సంఘటనలను ప్రస్తావించడం ముస్లింలతోనే ప్రారంభమైంది. చారిత్రక రచనా వ్యాసంగంలో అతిశయోక్తులకు తావులేని నిర్దిష్టమైన, క్లుప్తమైన, స్పష్టమైన సమాచారంతో రచనలు చేయడం వీరితోనే ప్రారంభమైంది.
మధ్య యుగ భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమ ఆవిర్భావానికి గల కారణాలను తెలపండి.
మధ్యయుగ భారతదేశ చరిత్రను గొప్పగా ప్రభావితం చేసిన అంశాల్లో భక్తి ఉద్యమం ఒకటి.
- Tags
- nipuna special
- TET
- TSLPRB
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు