ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ఎంత కేటాయించారు?
- స్థూల ఉత్పత్తిలో తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? (డి)
ఎ) హైదరాబాద్ బి) వరంగల్ అర్బన్
సి) మేడ్చల్ మల్కాజ్గిరి డి) రంగారెడ్డి
వివరణ: తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆ జిల్లా రూ.1,82,561 కోట్లను సాధించింది. హైదరాబాద్ రూ.1,71,435 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చివరి స్థానంలో ములుగు జిల్లా ఉంది. ఆ జిల్లా సాధించిన స్థూల ఉత్పత్తి రూ.5716 కోట్లు. స్థిర ధరల్లోనూ రంగారెడ్డి జిల్లా అగ్ర భాగంలో ఉంది. రూ.1,25,934 కోట్ల ఉత్పత్తిని ఆ జిల్లా సాధించగా.. రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఉన్నాయి. - కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (బి)
ఎ) దేశ తలసరి ఆదాయం, తెలంగాణ
తలసరి ఆదాయం సమానంగా ఉన్నాయి
బి) దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ
సి) దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం తక్కువ
డి) ఏదీకాదు
వివరణ: దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.99,377 ఎక్కువ. కరోనా నేపథ్యంలో దేశ తలసరి ఆదాయం తగ్గినప్పటికీ రా ష్ట్రంలో మాత్రం ఆదాయం పెరిగింది. గతేడాది కంటే 0.6% వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,27,145 ఉందని కేంద్ర గణాంక శాఖ పేర్కొంది. - జతపరచండి (సి)
రంగం కేటాయింపులు - వ్యవసాయ రంగం ఎ. రూ.1200 కోట్లు
- రైతుబంధు బి. రూ.25,000 కోట్లు
- రైతుబీమా సి. రూ.14,800 కోట్లు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి
బి) 1-బి, 2-ఎ, 3-సి
సి) 1-బి, 2-సి, 3-ఎ
డి) 1-సి, 2-బి, 3-ఎ
వివరణ: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించింది. గతేడాది కంటే రూ.1000 కోట్లు అదనం. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించారు. గతేడాది రైతుబంధు పథకానికి కేటాయించింది రూ.14,000 కోట్లు. అంటే ఈ ఏడాది అదనంగా రూ.800 కోట్లు కేటాయించారు. అలాగే రైతుబీమా పథకానికి రూ.1200 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చితే రూ.60 కోట్లు ఎక్కువ. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సాహానికి రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రత్యేకంగా రూ.100 కోట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇవ్వనున్నారు. - ప్రతిపాదన (ఏ): ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరానికి రూ.30 వేల రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు (బి)
కారణం (ఆర్): మిగిలిన పెట్టుబడిని బ్యాంక్ నుంచి రైతులకు రుణాలు ఇప్పించడానికి ప్రతిపాదన రూపొందించారు
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏకు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వనున్నారు. మిగిలిన పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించింది. అలాగే రుణాలను వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేండ్ల పాటు మారటోరియం విధించేలా బ్యాంకులను ఒప్పించింది. నాలుగేండ్ల తర్వాత వాయిదాల పద్ధతిలో రుణాలు చెల్లిస్తే సరిపోతుంది. తెలంగాణలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. - శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఏటా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులను? (డి)
ఎ) ఈ ఏడాది తొలిగించారు
బి) రూ.కోటి నుంచి రూ.3 కోట్లకు పెంచారు
సి) రూ.కోటి నుంచి రూ.4 కోట్లకు పెంచారు
డి) రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు
వివరణ: పార్లమెంట్ సభ్యులకు ఇస్తున్న స్థాయిలోనే రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ, శాసన మండలి సభ్యులకు రూ.5 కోట్లు ఇవ్వనున్నారు. గతంలో ఏటా రూ.3 కోట్లు ఇచ్చారు. గతేడాది కరోనా కారణంగా ఈ కేటాయింపులు చేయలేదు. ఈ మొత్తంతో శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, స్కూలు, కమ్యూనిటీ భవనాలు, మంచినీరు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను చేపట్టవచ్చు. - కింది వాటిలో 2021-22 బడ్జెట్లో కొత్తగా తీసుకువచ్చింది ఏది? (సి)
- మార్కెటింగ్ విశ్లేషణ, పరిశోధన విభాగం 2. సీఎం దళిత్ ఎంపవర్మెంట్
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: దళితుల చైతన్యం కోసం రూ.1000 కోట్లతో కొత్తగా దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగామ్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కేటాయించిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (రూ.21,306.85 కోట్లు)కి ఇది అదనం. అలాగే పంటల ధరపై పరిశోధన, విశ్లేషణ చేసి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ‘మార్కెటింగ్ విశ్లేషణ, పరిశోధన విభాగాన్ని మార్కెటింగ్ శాఖలో ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.15 కోట్లు కేటాయించారు. మార్కెట్ జోక్యం పథకం కింద రూ.500 కోట్లు కేటాయించారు.
- మార్కెటింగ్ విశ్లేషణ, పరిశోధన విభాగం 2. సీఎం దళిత్ ఎంపవర్మెంట్
- ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ఎంత కేటాయించారు? (డి)
ఎ) రూ.1000 కోట్లు బి) రూ.350 కోట్లు
సి) రూ.200 కోట్లు డి) రూ.750 కోట్లు
వివరణ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో 348 కిలోమీటర్ల మేర ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి రూ.750 కోట్లు కేటాయించారు. దీంతో భూసేకరణకు మార్గం సుగమం అయ్యింది. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు వెళుతుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్ మీదుగా సంగారెడ్డి వరకు వెళుతుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.18 వేల కోట్లు కాగా భూసేకరణకు రూ.12 వేల కోట్లు అవుతుందని అంచనా. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. - ప్రతిపాదన (ఏ): సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనివారికి ఆర్థిక సాయం ఇస్తున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు (బి)
కారణం (ఆర్): సొంత స్థలం లేనివారికి కూడా డబుల్ బెడ్రూం పథకం వర్తిస్తుంది
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏను ఆర్ సరిగ్గా
వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏకు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: డబుల్ బెడ్రూం పథకానికి 2021-22 బడ్జెట్లో రూ.11 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనివారికి ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని త్వరలోనే విడుదల చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు గ్రామాలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిపి 52,456 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.84 లక్షల ఇళ్లు మంజూరు చేయగా వీటిలో 2.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలన అనుమతులు ఇచ్చారు. - సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం కేటాయింపునకు కారణం? (సి)
ఎ) అన్ని రాష్ర్టాలు అమలు చేస్తున్నందుకు
బి) కేంద్రం చేసిన చట్టం అమలుకు
సి) భూ వివాదాలకు శాశ్వత పరిష్కారానికి
డి) ఏదీకాదు
వివరణ: భూముల సమగ్ర సర్వే కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో డిజిటల్ సర్వే ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను అత్యాధునిక పద్ధతుల్లో కొలిచి ప్రతి కమతానికి, ఇంటికి, ఆస్తికి, అక్షాంశ, రేఖాంశాలు కేటాయిస్తారు. వీటిని ఎవరూ మార్చలేరు. కాబట్టి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. భూ రికార్డులు పారదర్శకంగా, డిజిటలైజ్ అయిన చోట జీడీపీ 3-4% మేర పెరుగుతుంది. నేరాలు కూడా తగ్గుతాయి. ధరణి పోర్టల్ నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.47.62 కోట్లు కేటాయించింది. - ఎన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్‌పోర్టులను బడ్జెట్లో ప్రతిపాదించారు? (బి)
ఎ) 3 బి) 6 సి) 9 డి) 12
వివరణ: ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్యలకు రూ.100 కోట్లు ప్రతిపాదించారు. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపలి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌లో పౌర విమానాశ్రయాల ఏర్పాటుపై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. నివేదిక అందగానే పనులు ప్రారంభిస్తారు. - రాష్ట్రంలో సగటు వ్యవసాయ భూమి అధికంగా ఏ జిల్లాలో ఉంది? (డి)
ఎ) వరంగల్ బి) ఖమ్మం
సి) మహబూబ్‌నగర్ డి) ఆదిలాబాద్
వివరణ: రాష్ట్రంలో రైతుల వద్ద సగటు వ్యవసాయ భూమి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉంది. అతి తక్కువగా వరంగల్ రూరల్‌లో ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో రైతు వద్ద సగటున 4.1 ఎకరాల భూమి ఉండగా, వరంగల్ రూరల్ జిల్లాలో 1.6 ఎకరాలు మాత్రమే ఉంది. రాష్ట్ర సగటు 2.5 ఎకరాలు కాగా, దేశ సగటు 2.7 ఎకరాలు. కుమ్రం భీం జిల్లాలో 4 ఎకరాలు, నారాయణపేట జిల్లా లో 3.3 ఎకరాలు ఉంది. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే రైతు సగటు భూమి 3 ఎకరాలకు పైగా ఉండగా మిగతా జిల్లాల్లో 1.6 ఎకరాల నుంచి 2.8 ఎకరాల వరకు ఉంది. - కింది వాటిలో సరైనది? (సి)
- రాష్ట్రంలో ఆర్థిక శాఖను చేపట్టిన రెండో వ్యక్తి హరీష్ రావు
- బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసింది హరీష్ రావు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: దేశంలో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు దేశంలో హరీష్ రావు పేరిట ఉంది. సెప్టెంబర్ 8, 2019న ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014-19 మధ్య ఆయన నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సిద్దిపేట నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలిసారి, 2021-22 అంటే తాజాగా మరోసారి ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన 96 నిమిషాలు ప్రసంగించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చేసిన ఈ ప్రసంగమే సుదీర్ఘమైంది.
- ప్రతిపాదన (ఏ): రూ.25,000 లోపు రుణాలను ఇప్పటికే ప్రభుత్వం మాఫీ చేసింది (బి)
కారణం: రుణమాఫీకి రూ.5225 కోట్లు
కేటాయించింది
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా
వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: రైతు రుణమాఫీకి ప్రభుత్వం రూ.5225 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.25 వేలలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆపై రుణాలను కూడా మాఫీ చేయనుంది. రూ.25 వేలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉంటారన్న గణాంకాలను సేకరించనుంది. రూ.లక్ష లోపు రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. - ప్రతిపాదన (ఏ): శాసనసభ్యులకు ఐప్యాడ్లు అందించారు (ఎ)
కారణం (ఆర్): కాగిత రహిత శాసనసభ దిశగా అడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: తెలంగాణ శాసనసభ త్వరలో కాగిత రహితంగా మారనుంది. శాసనసభ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలన్నీ శాసనసభ్యులకు ఆన్లైన్ ద్వారా పంపనున్నారు. సభ్యులందరికీ ఆపిల్ ఐప్యాడ్లు ఇచ్చారు. అధికారిక సమాచారాన్ని, అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలను ఆన్లైన్ ద్వారానే చేరవేయనున్నారు. ఈసారి బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులను డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు. వివిధ శాఖలకు కేటాయించిన వివరాలు, సోషియో ఎకనామిక్ సర్వే అంశాలను పూర్తిగా పెన్‌డ్రైవ్‌లో సభ్యులకు అందించారు. - పఢ్నా లిఖ్నా అభియాన్‌లో కింది వాటిలో లేని జిల్లా? (సి)
ఎ) ఖమ్మం బి) కుమ్రంభీం
సి) మహబూబ్‌నగర
డి) జయశంకర్ భూపాలపల్లి
వివరణ: వయోజన విద్య పరిధిలో అమలు చేస్తున్న పథకమే పఢ్నా లిఖ్నా అభియాన్. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.6.5 కోట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల్లోని అక్షరాస్యత ప్రకారం తెలంగాణలోని ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో 15 సంవత్సరాలు దాటినవారికి అక్షరాస్యత కార్యక్రమాలను అమలు చేస్తారు.
వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్
9849212411
- Tags
Previous article
ప్రిలిమ్స్‌కు ప్రణాళికతో ప్రిపేరవుదాం
Next article
చేతివృత్తుల గురించి తెలుపుతున్న శాసనం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు