మొగలుల కాలంనాటి సంగీత విశేషాలు
వాస్తవానికి ఇస్లాం సంగీతాన్ని అంగీకరించకపోయినప్పటికీ టర్కులు భారతదేశంలో తమ రాజ్యాన్ని ఏర్పర్చే కాలంనాటికి సంగీతం ఒక కళగా అభివృద్ధి చెందింది. ముస్లింలు తమ సంగీత సాంప్రదాయంతోపాటు సారంగి, షహనాయ్, రహాబ్ అనే కొత్త వాయిద్యాలను ప్రవేశపెట్టారు. స్థానిక సంగీత సాంప్రదాయాలతో పాటు వాయిద్యాలైన నాదస్వరం, మృదంగం, ఘటములను గ్రహించారు. ఫలితంగా మిశ్రమ సాంప్రదాయాలతో కూడిన హిందుస్థానీ సంగీతం అభివృద్ధి చెందింది.
– హిందుస్థానీ సంగీతంలో ప్రధాన సంగీత ప్రక్రియలు నాలుగు. అవి..
1. దృవద్ అంటే విషాద సంగీతం
2. ఖయాల్ అంటే ఆశువుగా గీతాన్ని సమకూర్చి ఆలపించడం
3. టుమ్రీ అంటే సంభాషణల రూపంలోని పాటలు
4. టప్పాలు అంటే ఎడారుల్లో ఒంటెలు నడిపేవారు పాడే జానపద గీతాలు
హిందుస్థానీ సంగీతంలో అమీర్ ఖుస్రో గొప్ప విద్వాంసుడు. తనదైన కొత్త రాగాలు సనమ్, గోరా, ఐమన్ ప్రవేశపెట్టాడు. కొత్త వాయిద్యాలైన తబలా, సితార్ భక్తి సంగీతం ఖవాలిని ప్రవేశపెట్టాడు.
ప్రాంతీయ రాజవంశాలైన మాల్వా ఖిల్జీలు, జాన్ షాకీలు హిందుస్థానీ సంగీతాన్ని ఆదరించారు. మాల్వా పాలకుడైన బాజ్ బహదూర్, అతని భార్య రూపమతి సంగీతంలో గొప్ప విద్వాంసులు. జాన్ పాలకులైన హుస్సేన్ షా ఖయాల్ రూపకాన్ని ప్రవేశపెట్టాడు.
మొగలుల కాలంలో హిందుస్థానీ సంగీతం గొప్ప ఆదరణకు నోచుకున్నది. అబుల్ ఫజల్ ప్రకారం అక్బర్ కొలువులో 27 మంది గొప్ప సంగీత విద్వాంసులు ఉండేవారు. వీరిలో ప్రముఖుడు మియాన్ తాన్ దీపక్, దర్బారీ, మేఘ ముల్లార్ రాగాలను ఆలపించడంలో తాన్ నిష్ణాతుడు. ఇలాంటి విద్వాంసుడు గత వందేండ్లలో లేడని, వంద ఏండ్ల తర్వాత కూడా రాబోడని అబుల్ ఫజల్ వ్యాఖ్యానించాడు.
మొగలు చక్రవర్తులు వ్యక్తిగతంగా సంగీతంలో గొప్ప అభిరుచిని కనబరిచారు. అక్బర్ స్వయంగా డ్రమ్స్ వాయించడంలో ప్రవేశం ఉన్నది. జహంగీర్ మొగల్ చక్రవర్తుల్లో కెల్లా ఎక్కువ గీతాలు రచించాడు. షాజాహాన్ గొప్ప సంగీత విద్వాంసుడు. ముఖ్యంగా ద్రుపద్ రాగాన్ని ఆలపించడంలో గొప్ప ప్రవేశం ఉన్నవాడు. ఔరంగజేబు పాలకుడిగా సంగీతాన్ని నిషేధించినప్పటికీ వ్యక్తిగతంగా వీణా వాయిద్యంలో ప్రవేశం ఉన్నది. హిందుస్థానీ సంగీతం మొగలుల అనంతరం స్వదేశీ సంస్థానాదీశుల ఆదరణలో కొనసాగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు