ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలి
దేశంలో ప్రవేశించకముందే ఇస్లాం తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకుంది. దీన్ని గుమ్మటాలు, కమాన్ శైలి అని వ్యవహరించారు. పెద్ద పెద్ద గుమ్మటాలు, కమాన్ ఎటువంటి అలంకరణలేని నిరాడంబరమైన నిర్మాణాలు ఇస్లామిక్ శైలి ఇతర ముఖ్యలక్షణాలు.
భారతదేశంలోకి ప్రవేశించిన అనంతరం ఇస్లాం స్వదేశీ హిందూ శైలిలోని కొన్ని ముఖ్య లక్షణాలను గ్రహించింది. ముఖ్యంగా భవనాలపై కలశాలను ప్రతిష్టించడం, అలంకార ప్రాయమైన పద్మం, స్వస్తిక్ వంటి గుర్తులను వాడటం వంటి లక్షణాలను గ్రహించింది. ఫలితంగా ఇండో-ఇస్లామిక్ అనే మిశ్రమ వాస్తుశైలి అభివృద్ధి చెందింది.
ఇండో-ఇస్లామిక్ వాస్తు శైలి రెండు దశల్లో అభివృద్ధి చెందింది. ముస్లింల ప్రధాన రాజధానులైన ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీలో అభివృద్ధి చెందిన శైలి సామ్రాజ్యవాద శైలిగాను, బెంగాల్, జాన్ మాల్వా, గుజరాత్, బహుమనీ సామ్రాజ్యంలో అభివృద్ధి చెందిన శైలి ప్రాంతీయ శైలిగా అభివృద్ధి చెందింది.
సామ్రాజ్యవాద శైలి ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తుల స్వీయ పరిరక్షణలో వారి అభిరుచులకు తగ్గట్టుగా పరిణితి చెందింది ఢిల్లీ సుల్తాన్లలో తొలి పాలక వంశమైన బానిస వంశం స్వచ్ఛమైన ఇస్లామిక్ శైలిని అనుసరించి నిరాడంబరత్వంతో కూడిన కట్టడాల నిర్మాణాలను చేపట్టారు. కుతుబుద్దీన్ ఐబక్ స్వచ్ఛమైన ఇస్లామిక్ శైలిలో మొదటి మసీదైన కువ్వత్ ఉల్ ఇస్లామ్ ఢిల్లీలో నిర్మించాడు. సుల్తాన్ దర్శనమివ్వడానికి అనువైన ‘అర్హదిన్ కా జోప్రా’ను అజ్మీర్ నిర్మించాడు. దేశంలో ఇస్లాం విజయం సాధించినందుకు గుర్తుగా కుతుబ్ నిర్మాణం చేపట్టాడు. ఇల్ ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి గొప్ప సూఫీ యోగి అయిన కుతుబుద్దీన్ భక్తియార్ ఖాకీకి అంకితమిచ్చాడు.
ఖిల్జీల కాలంలో వాస్తుపరంగా నిరాడంబరత్వం పోయి ఆడంబరత్వం చోటు చేసుకుంది. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ తన ప్రతిష్టకు తగినరీతిలో నిర్మాణాలు చేపట్టాడు. కుతుబ్ మినార్ ప్రవేశద్వారమైన అలయ్ దర్వాజలో ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమైన అలంకరణ, చక్కటి నగిషీ కనిపిస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో సిరి అనే పట్టణ నిర్మాణాన్ని, హౌజ్ ఏ అలయ్, ఖాదనా మసీదుల నిర్మాణాలు చేపట్టాడు.
తుగ్లక్ కాలంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో నాసిరకమైన గోధుమరంగు రాయి విరివిగా వినియోగించారు. మందం ఎక్కువగా ఉన్న ఏటవాలు గోడల నిర్మాణం ప్రారంభమైంది. గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లకాబాద్ పట్టణాన్ని నిర్మించగా, మహ్మద్ బిన్ తుగ్లక్ గంగానది ఒడ్డున స్వర్గ ద్వారమును నిర్మించాడు. గొప్ప నిర్మాతైన ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల, హౌజ్ ఖాస్ నిర్మించాడు. 1200 ఉద్యానవనాలతో ఢిల్లీని అందంగా తీర్చిదిద్దాడు. ఫిరోజ్ ఫతేపూర్, ఫతేబాద్, జాన్ అనే పట్టణాలను నిర్మించాడు.
వాస్తు శైలిలో ముఖ్యమైన లక్షణాలన్నీ లోడీల కాలంలో ప్రవేశపెట్టారు. రెండు గుమ్మటాల నిర్మాణాలు, ఎత్తయిన నిర్మాణాలు, కోణాకృతి, అష్టభుజి నిర్మాణాలు, ఉద్యానవనాల మధ్య నిర్మాణాలు లోడీలతో ప్రారంభమయ్యాయి. సికిందర్ లోడీ ఆగ్రాలో నిర్మించిన జమాత్ ఖానా మసీదు లోడీల శైలికి ప్రధాన నిదర్శనం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు