ఇంజినీరింగ్ ఎంట్రన్స్ 2021
దేశవ్యాప్తంగా పలు జాతీయ, రాష్ట్రీయ స్థాయి ప్రఖ్యాత ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే జాతీయప్రాముఖ్యం కలిగిన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ రెండుసెషన్లు పూర్తయ్యాయి, మరో రెండు సార్లు అంటే ఏప్రిల్, మేలో మెయిన్ ఎగ్జామ్ జరుగనున్నది. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్, బిట్‌శాట్, అమృత, విట్, మణిపాల్, ఎల్పీయూ, ఎస్ఆర్ఎం తదితర ఎంట్రన్స్ ప్రకటనలు విడుదలయ్యాయి. సంక్షిప్తంగా వాటి వివరాలు…..
జేఈఈ మెయిన్
ఎన్ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర నిధులతో నిర్వహించే సంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ ప్రవేశాల కోసం దీన్ని నిర్వహిస్తారు. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్ష కొవిడ్ కారణంగా విద్యార్థుల సౌలభ్యం కోసం నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు నిర్వహించారు. ఏప్రిల్ (సెషన్ 3): ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.మే (సెషన్ 4): మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను మొత్తం ఇంగ్లిష్ కాకుండా 12 స్థానిక భాషాల్లో (తెలుగులో కూడా) నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు సెషన్లను విద్యార్థులు రాయవచ్చు. దేనిలో ఎక్కువ స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీనిలో టాప్-20 విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత కల్పిస్తారు.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://jeemain.nta.nic.in
ఐఐఐటీ హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో డ్యూయల్ డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (యూజీఈఈ)-2021, స్పెషల్ చానెల్ ఆఫ్ ఆడ్మిషన్ (ఎస్‌పీఈసీ) ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఈసీడీ, సీఎస్డీ, సీఎల్డీ, సీఎన్డీ, సీహెచ్‌డీ కోర్సుల్లో (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్) ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో. చివరితేదీ: మే 10
పరీక్షతేదీ: జూన్ 2. వెబ్సైట్: https://ugadmissions.iiit.ac.in
విట్శాట్-2021
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించే విట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (విట్ఈఈఈ)-2021 ప్రకటన విడుదలైంది. దీని ద్వారా వెల్లూర్, చెన్నై, ఏపీ, భోపాల్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
పరీక్ష తేదీలు: జూన్ 18 నుంచి 26 వరకు
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://viteee.vit.ac.in చూడవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్-2021
దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఇది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో వచ్చిన స్కోర్ ఆధారంగా టాప్-20లో ఉన్నవారిని కేటగిరీల వారీగా ఈ పరీక్షకు ఎంపిక చేస్తారు. అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలతోపాటు మరికొన్ని ఇతర సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తుంది. ఈసారి అడ్వాన్స్డ్ పరీక్షను జూలై 3న నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం http://www.jeeadv.ac.in
చూడవచ్చు.
ఎస్ఆర్ఎం
ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ప్రకటన విడుదలైంది. ఎస్ఆర్ఎం ఐఎస్టీ చెన్నై, కట్టన్కుల్లతూర్, వడపళని, రామాపురం, ఎన్సీఆర్, సోన్‌పేట్, ఏపీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 31
ఆన్లైన్ ఎగ్జామ్ తేదీలు: జూన్ 11 నుంచి 16 మధ్య నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://applications.
srmist.edu.in
అమృత విశ్వవిద్యాపీఠం
అమృత విశ్వవిద్యాపీఠం బీటెక్-2021 ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. బీటెక్ ప్రవేశాలను మూడు రకాలుగా చేస్తారు. అమృత విశ్వవిద్యాలయం నిర్వహించే అమృత ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఈఈఈ),జేఈఈ మెయిన్ స్కోర్, సాట్ లేదా పియర్సన్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఏఈఈఈ మొదటి ఫేజ్ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 17, 18, తేదీల్లో నిర్వహిస్తారు. రెండో ఫేజ్ జూన్ 11- 14 మధ్య నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం https://admissions. amrita.edu చూడవచ్చు.
బిట్‌శాట్-2021
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్మిషన్ టెస్ట్-2021 ప్రకటన విడుదలైంది. ఈ ఎంట్రన్స్ ద్వారా బిట్స్ పిలానీ, హైదరాబాద్, గోవా క్యాంపస్‌లలో బీఈ, బీఫార్మ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 29
పరీక్ష తేదీలు: జూన్ 24 నుంచి 30 మధ్య నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://bitsat.cbexams.com
టీఎస్ ఎంసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఎంసెట్-2021 ప్రకటన విడుదలైంది. దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 18
ఇంజినీరింగ్ పరీక్ష తేదీ: జూలై 7, 8, 9
అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష తేదీ: జూలై 5, 6
వివరాల కోసం వెబ్సైట్: https://eamcet.tsche.ac.in
ఇవీ కూడా చదవండి…
502 సూపర్వైజర్, డ్రాప్ట్స్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్
డీడీఎంఎస్‌లో సర్టిఫికెట్ కోర్సులు
నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ వెబ్ కౌన్సెలింగ్
మొబైల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఉచిత శిక్షణ
- Tags
- IIT Hyderabad
- JEE
- JEE Main
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు