టీజీసెట్ దరఖాస్తు గడువు పెంపు


హైదరాబాద్: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. 2020–21లో నాలుగో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 3 నుంచి 15వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పూర్తి వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 45678కి కాల్చేయాలని సూచించారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేస్తారు.
వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ- 18,560
గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777
బీసీ సంక్షేమ సొసైటీ- 20,800
జనరల్ వెల్ఫేర్ సొసైటీ- 2800
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15
రాతపరీక్ష: మే 30న
వెబ్సైట్: tgcet.cgg.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
థియరీ తర్వాత ప్రాక్టికల్స్
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్‌లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?